1, అక్టోబర్ 2016, శనివారం

సమస్య - 2159 (రాఘవుండు మండోదరీ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రాఘవుండు మండోదరీ రమణికిఁ బతి"
లేదా...
"మగఁడై యొప్పును రాముఁ డింపెసఁగ నా మండోదరీభామకున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

85 కామెంట్‌లు: 1. రామ రావణు లెవ్వరు రమణి యడుగ
  తేట తెల్లము యనగాను తెలియ జేసె
  రమణి జానకి పెనిమిటి రాము డు మన
  రాఘవుండు, మండోదరీ రమణికిఁ బతి
  రావణుండు,పౌలస్త్య పౌత్రయను నతడు

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   'తెల్లము+అనగ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'తేట తెల్లము గాగను తెలియజేసె' అనండి. 'పౌలస్త్యు డను నతడు' అనాలి. అంటే యతి తప్పుతుంది. 'పౌలస్త్యపౌ త్రాఖ్యుడతడు' అనవచ్చు.

   తొలగించండి
 2. క్రొవ్విడి వెంకట రాజారావు:

  లంకనేజుట్టి సీత చెఱ దొలఁగించి
  నుద్ధరించిన మహనీయ యోధుడెవరు?
  నాత డడచినట్టి నరసు డాతఁడెవడు?
  రాఘవుండు, మండోదరీ రమణికిబతి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...దొలగించి। యుద్ధరించిన..' అనండి.

   తొలగించండి
 3. సగమై మేనున ప్రీతిపా త్రముగ తాసంతో షమున్ పొందుచున్
  మగఁడై యొప్పును రాముఁ డింపెసఁగ ,నా మండొదరీ భామకున్
  గగనం బంటిన మేరువంటి తనువున్ గంభీరమై నిల్చినన్
  జగమే భీతిగ నోలలాడి వణకున్ చాంపేయమున్ రావణున్

  రిప్లయితొలగించండి
 4. ధనసు విరిచిన రాముని మనసు సీత
  యేక పత్నీ వ్రతుడంట లోక మందు
  రాఘ వుండు, మండోదరీ రమణికిఁ బతి
  లంక కధిపతి రాక్షస రావ ణుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   మొదటి పూరణ పూర్వభాగంలో సీత ప్రస్తావన లేదు. 'సగమై మేనున భూమిజాతకును దా సంతోషమున్ పొందుచున్' అనండి. 'చాంపేయము' ఎందుకు వచ్చింది?

   తొలగించండి
 5. అగజానాథుని వింటి నమ్మిథిలలో నానాడు భంజించి యీ
  జగతిన్ సద్యశమందియున్న ఘనుడౌ సత్త్వాఢ్యు డాసీతకున్
  మగడై యొప్పును రాము డింపెసగ, నా మండోదరీ భామకున్
  తగువా డెందును రాక్షసాధిపతియే తథ్యమ్ము ముమ్మాటికిన్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 6. P.Satyanarayana
  పగలే మోసపు మౌని వేషమున దా బన్నెన్నభూతక్రియన్
  జగమంతా "గొనె జానకిన్ జెనటి తత్చాంచల్యమే లంకనున్
  రగులం జేసెను మాయ సీత"యనిరా రాద్ధాంతమున్ గన్నచో
  మగడై యొప్పును రాముడింపెసగ నా మండోదరీ భామకున్
  P.Satyanarayana
  పూర్వ జన్మ వృత్తాంతముల్ బొసగ జెప్ప
  నదియునొకదివ్య దృష్టియు నౌత్సుకతయె!
  ఎవ్వరెవరికి బతి,సతి యెరుగ గలమె?!
  రాఘవుండు మండోదరీ రమణికి బతి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   తత్+చాంచల్యము = తచ్చాంచల్యము.. అవుతుంది.

   తొలగించండి
 7. సుదతి సీత మదిని దోచె శుభ సరసుడు
  రాఘవుండు! మండోదరి రమణికి పతి
  రావణుండు కామమున పరసతి పైని
  వాంఛ తోడ జీవితమున పతన మొందె!

  రిప్లయితొలగించండి
 8. (1)
  కపుల సైన్యము వెంటరాఁ గడలిపైన
  వారధిం గట్టి లంకకు వచ్చినట్టి
  రాఘవుండు మండోదరీ రమణికిఁ బతి
  యగు దశాననుఁ బరిమార్చె నవనిజ కయి.
  (2)
  నగజాతేశ్వర పాదపంకజముల న్సంధించి చిత్తంబునన్
  ఖగరాడ్గామికి మ్రొక్కి చెప్పెద నిదే కళ్యాణి భూజాతకున్
  మగఁడై యొప్పును రాముఁ డింపెసఁగ; నా మండోదరీ భామకున్
  దగఁ బౌలస్త్యుఁడు రావణుండు పతియౌఁ దథ్యంబు తథ్యంబిదే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పూరణలు నిర్ద్వంద్వముగా నద్భుతము గా నున్నవి.

   తొలగించండి
  2. మిత్రులు శంకరయ్య గారూ...నమస్సులు! మీ పూరణములు మనోహరముగా నున్నవి. అభినందనలు!

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ, మధుసూదన్ గారూ,
   ధన్యవాదాలు!

   తొలగించండి
 9. తప్పు జేసెను భర్త పతనము దప్ప
  దనక పతిభిక్ష గోరగదనుజ సతియె
  రాఘవుండు మండోదరీ రమణికి బతి
  భిక్ష ధర్మము గాదని వేటు వేసె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చేపూరి శ్రీరామారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రాముణ్ణి మండోదరి పతిభిక్ష కోరిందన్న కథ నాకు తెలియదు.

   తొలగించండి
 10. పడతిసీతమ్మ గన పతివ్రతయెగాద
  అట్టి వనితల కట్టులే యమరియుండు
  కప్పబోలెడు నట్టిదౌ కడుపు, నిజమె
  రాఘవుండు మండోదరీ రమణికి బతి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ చదవడానికి బాగుంది. కాని అర్థం కాలేదు. దయచేసి వివరించండి.

   తొలగించండి
  2. మాస్టరుగారూ! నమస్సులు. పతివ్రతల సాముద్రిక లక్షణంలో కప్పవంటి కడుపు ఉంటుంది అనిఊహించాను(నాకు తెలీదు)...మండోదరి కూడా పతివ్రతయే కదా...అలాగే ఈ మండూకమువంటి పొట్ట గల రమణి సీత రాముని భార్య అని నాభావం....

   తొలగించండి
  3. ఆంజనేయుడు లంకలో సీతమ్మ కొరకు వెతుకుతూ మండోదరిని చూసి సీతమ్మేనేమో అనుకొని ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడని చెబుతారు....ఆ సందర్భం ఈ పూరణకు ప్రేరణ ఇచ్చింది.

   తొలగించండి
  4. శాస్త్రి గారు రూపయౌవన సంపదచేత మండోదరిని జూచి సీత యనుకొని భ్రమపడ్డాడు ముందు. కానీ వెంటనే సీత కావడానికి వీల్లేదని నిశ్చయించుకున్నాడామె సుఖనిద్ర జూచి.

   స తాం దృష్ట్వా మహాబాహుర్భూషితాం మారుతాత్మజః
   తర్కయామాస సీతేతి రూపయౌవనసమ్పదా৷৷5.10.53. .

   న రామేణ వియుక్తా సా స్వప్తుమర్హతి భామినీ
   న భోక్తుం వాప్యలఙ్కర్తుం న పానముపసేవితుమ్৷৷5.11.2৷৷

   తొలగించండి
 11. పూత చరితగల వనిత సీత భర్త
  రాఘవుండు; మండోదరీ రమణికి బతి
  రావణుడు, బొందగాజూచె రామ సతిని
  తుదకు సమసెను రణమున దురిత మడఁగ!

  రిప్లయితొలగించండి
 12. మిత్రులందఱకు నమస్సులు!

  [నాటకమున మండోదరీ పాత్రకుం దగినవాఁడు రాముఁడే యని పలికిన దర్శకుని మాటకు నటకులందఱును వంతపాడిన సందర్భము]

  (1)
  "తగఁ డెవ్వండు మగండుగా నటనచే ’మండోదరీ వేష్య’కున్
  దగు నీ ’రాముఁడు’ చూడ నాటకమునన్ దర్పమ్ముచే రావణుం
  డగుచో బాగుగ నుండు" నంచుఁ బలుకన్, దర్జించి రప్డందఱున్

  "మగఁడై యొప్పును రాముఁ డింపెసఁగ నా మండోదరీ భామకున్!"

  (2)
  విషమనేత్రుని విల్ ద్రుంచు వీరుఁ డెవఁడు?
  రావణుం డెవ్వతెకుఁ బ్రియ రమణుఁ డయ్యె?
  నిందిరకు మధుసూదనుం డేమి యగును?

  రాఘవుండు, మండోదరీ రమణికిఁ, బతి!

  స్వస్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   వేష్యా శబ్ద ప్రయోగం మీ భాషానైపుణ్యాన్ని తెలియజేస్తున్నది.

   తొలగించండి
 13. శోకమందుండి శ్లోకమ్ము నాకృతిగొన
  వెలుగు రామాయణమ్మున వెలసినట్టి
  నాయక ప్రతినాయకులన నలుగురెఱుఁగు
  రాఘవుండు, మండోదరి రమణికి పతి

  గురుదేవులకు ప్రణామములు.
  మొదటి పాదంలో ప్రాస సరిపోతుందంటారా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీ ప్రశ్న నన్ను కాసేపు గందరగోళంలో పడవేసింది. 'ప్రాస సరిపోతుందా?' అని అడిగేసరికి ఇంతవరకు వచ్చిన వృత్త పూరణలను నా పద్యంతో సహా ఒకటికి రెండుసార్లు పరిశీలించాను. ఎక్కడా దోషం లేదు. ఎందుకలా అడిగారా అనుకున్నాను. తీరా చూస్తే మీ పద్యం మొదటి పాదంలోని 'ప్రాసయతి' గురించి అన్నది బోధపడింది. మీరు కేవల ప్రాస అనడంతో తికమక పడ్డాను.
   ఆ పాదంలోని ప్రాసయతి సరియైనదే!

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. మిమ్మల్ని గందరగోళములో పడవేసినందులకు మన్నించండి.

   తొలగించండి
 14. శివ ధనువును సభికులు వీక్షించుచుండ

  విరిచి జనకరాజు సుతను పెండ్లియాడె

  రాఘవుండు; మండోదరీ రమణికి బతి

  లంక రాజ్యము నేలిన రావణుండు.

  రిప్లయితొలగించండి
 15. (3)
  తపసి యాగముఁ గాఁచిన దండియు నగు
  రాఘవుండు, మండోదరీ రమణికిఁ బతి
  యైన రావణుఁ దునుమాడె; నాతని సతి
  సీతకును దుఃఖ మిడెనను హేతువునను!


  స్వస్తి

  రిప్లయితొలగించండి
 16. తెలుగు వారికతి ప్రియ దేవుడెవరు ?
  ఎవరికి మగడు రావణు డెంచిజూడ?
  మానవతికి రక్షకుడుగ మనున దెవరు?
  రాఘవుండు;మండోదరీ రమణికి; బతి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. రిప్లయిలు
  1. ఒక అవధానంలో అవధాని"మొల్క" అనే పదం వాడటాన్ని పృఛ్ఛకు డాక్షేపించినాడు. "చిలుక చిల్క అయినపుడు మొలక మొల్క యెందుకు కారాదని అవధాని అన్నాడు. పృఛ్ఛకుడొప్పుకో లేదు. చిలుక మధ్యాక్షరంలో ఉకారముంది. మొలక మధ్యాక్షరంలో ఉకారం లేనందున ఇది సరి కాదన్నాడు.ఇరువురూ తమపట్టు వీడనే లేదు.

   తొలగించండి
  2. 'మొల్క' సాధువే. శబ్దరత్నాకరం దీనిని పేర్కొని 'మొలక' యొక్క రూపాంతరమని కళాపూర్ణోదయం 4వ ఆశ్వాసం లోని 'మగమొల్క' అన్న ఉదాహరణను చూపింది. చూడండి.. ఆంధ్రభారతి నిఘంటు శోధన.

   తొలగించండి
  3. ఆచ్చికంబులం బద మధ్యంబుల నలడర ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగా నగు.
   ఈ సూత్రము ప్రకరము ఆచ్చికములూ , పదమధ్యమమూ, ఉత్వమూ ఉన్న న, ల, డ, ర లకు మాత్రమే ఉత్వ లోపమై
   కిన్క, కాన్క, చిల్క, కాల్వ, మొదలగు రూపములగును.
   కానీ “బహుళంబుగ” ననుటచే తళ్కు, మిణ్గురు మొదలైనవి యన్యకార్యముగా సాధువులు.
   అట్లే మొలక లో లకి ఉత్వము లేకపోయిన బహుళము లోని యన్య కార్యముగానూ, “ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు” సూత్రము ననుసరించి “మొల్క” సాధువని నా యభిప్రాయము.
   అదియును గాక “మొలచు”, మొలుచు” రెండు క్రియయలు సాధువులు. మొలుచు పై సూత్రము ప్రకారము “మొల్చు” అయినది.
   కవర్ణకం బలుగ్వాదులకగు సూత్రము ప్రకారము మొలక, మొలుక రెండు కృదంతములు సాధువులు.
   మొలుక లో ల కుత్వముంది కాబట్టి “మొల్క” సాధువే గదా!

   తొలగించండి
  4. “లాంతియచ్చునకు సహిత మొకానొకచో నుడి నడుమ లోపంబు గానంబడియెడి” పొలఁతి-పొల్తి, కలికి-కల్కి, ములికి-ముల్కి, బుడిపి-బుడ్పి. “కానంబడియెడి” అనుటచే కవి ప్రయోగములున్నచో నని యర్థము.

   తొలగించండి
 18. జనకజ నపహరించగ గినుక బూని
  రాఘవుండు, మండోదరి రమణికి పతి
  రావణాసురు హతమార్చె రంగ మందు .
  మునిజనమ్ములు వేల్పులు వినుతి సేయ

  రిప్లయితొలగించండి
 19. దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు అను మిస్సన్న గారికి జన్మదిన శుభాకంక్షలు!

  రిప్లయితొలగించండి
 20. రావణా సురుజంపెను రణము నందు
  రాఘవుండు ,మండోదరీ రమణి కి బతి
  రాక్షసులకు బ్రభువగు నా రావణుండు
  సబబె యిట్లుగ బలుకుట సాధ్వి నకట

  రిప్లయితొలగించండి
 21. మిస్సన్న గారికి జన్మదిన శుభాకంక్షలు!

  రిప్లయితొలగించండి
 22. బ్రహ్మ కుల సంభవుండును జిహ్మ వర్త
  నుండు వర బల గర్వి సూనుండు విశ్ర
  వసునకును రావణాఖ్యుండు వంచిత వర
  రాఘవుండు మండోదరీ రమణికిఁ బతి


  ఖగ రాజేశ్వర వాహనుండు ఖర సంఘాతఘ్న ధౌరేయుడున్
  విగతద్వేష్య వితాన తోషణుడు భూవిఖ్యాత ధానుష్కుఁడున్
  జగదారాధ్యుడు జానకీపతి తలంచన్ సోదరాంతర్యుడౌ
  మగఁడై యొప్పును రాముఁ డింపెసఁగ నా మండోదరీభామకున్

  [మగడు = పురుషుడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   వంచిత రాఘవుండు అన్న మొదటి పూరణ, రాముడు మండోదరికి సోదర సమానుడన్న రెండవ పూరణ బాగున్నవి. ముఖ్యంగా రెండవ పూరణలోని శబ్దప్రయోగ చాతురి అద్భుతం. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 23. అసుర సంహార మొనరించ నవనిఁబుట్టె
  రాఘవుండు, మండోదరి రమణికిఁ బతి
  లంకపాలకు డైనట్టి రావణుండు
  పరసతినిచెర బట్టి తాఁ బతనమయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 24. త్ర్యంబకునివిలు విరిచి సీతనువరించె
  రాఘవుండు,మండోదరీ రమణికిఁబతి
  ధర్మవాహను మెప్పించ దపము జేసి
  యాత్మలింగమ్ము బొందిన హరునిబంటు
  లంక పరిపాలకుండగు రావణుండు!!!  హనుమ యెదలోన గొలువున్న ఘనుడెవండు
  మానమందిరుండెవరికి మగడు జెపుమ?
  ప్రాణనాథుని కింకొక ప్రవరమేమి?
  రాఘవుండు, మండోదరీ రమణికి, బతి!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారు,
   వైవిధ్యంగా వ్రాసిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 25. సుగుణమ్ముల్ గల రాచబిడ్డడు మనచ్చోరుండు వైదేహికిన్
  మగఁడై యొప్పును రాముఁ డింపెసఁగ, నా మండోదరీ భామకున్
  నగచాపున్ కడు భక్తితో గొలుచు కీనాశుండు లంకేశుడే
  తగునంచున్ తలపోసి యట్లు విధియే తావ్రాసె ఫాలమ్ముపై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మనః+చోరుండు = మనశ్చోరుండు అవుతుంది.

   తొలగించండి
 26. రావణుండెత్తుకొనిపోవ రత్నగర్భ
  ప్రియతనూజనుఁ గోపించి విల్లుఁబట్టి
  రాఘవుండు మండోదరీ రమణికిఁ బతి
  యగు దశాననున్ వధియించెనాజియందు.


  జగదుద్ధారకుడైన విష్ణువవనిన్ జన్మించె కౌసల్యదౌ
  సొగసున్ బెంచెడు పుత్రుడై, శివధనుస్సున్ ద్రుంచుచున్ సీతకున్
  మగఁడై యొప్పును రాముఁ డింపెసఁగ, నా మండోదరీభామకున్
  తగుభర్తన్ దశకంఠుఁ జంపుటకునార్తత్రాణపారీణతన్ ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 27. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { మ౦డోదరి దృష్టిలో రాముడు పరాక్రమ వ౦తు డైన పురుషుడు . మగడు = భర్త ,
  ధీరుడగు పురుషుడు }

  తగునే నాధ మహా పవిత్ర చరితన్

  ………… ధాత్రీసుతన్ ల౦క కి

  ప్పగిదిన్ దెచ్చుచు నా యశోక వనిలో

  ……………… బ౦ధి౦ప ? శ్రీరాము ధ

  ర్మ గుణాకారు పరాక్రవ౦తు సమయి౦పన్

  ……………… శక్యమే ? యుత్తమ౦

  బగు సాకేతపురాధిపున్ శరణమున్ ప్రార్థి౦ప |

  ………… పొమ్మ౦చు ప

  ల్కగ మ౦డోదరి , రావణాసురు

  ……… డలక్ష్య౦ బూనె | నూహి౦పగా

  మగడై యొప్పును రాము డి౦పెసగ

  ………… నా మ౦డోదరీ భామకున్ !


  { మ గ డు = భర్త , ధీరు డగు
  పురుషుడు ]

  రిప్లయితొలగించండి
 28. శివుని ధనువును విరిచిన సీతమగడు
  రాఘవుండు|”మండోదరీ రమణికి పతి
  లంకనేలిన దశకంఠ|బింకమందు
  వరము,కావరమందుభీకరుడ సురుడు|”
  2.సిగపూలన్నియు నవ్వుచుండ సభలో సీత స్వయంభూవరా
  న గతాధ్యుండుగ నెత్తెగా ధనువు విన్యాసాన విశ్వాసమున్
  మగడై యొప్పెను రాము డింపెసగ|”నామండోదరీ భామకున్
  దిగులున్ దీర్చెడి రావణాసురుడు,సంధేయుండు లంకేశుడే”. | {గతాధ్యుండు=సంశయములేనివాడు}సంధేయుడు=ఒడంబడిక చేసుకో దగినవాడు.|

  రిప్లయితొలగించండి
 29. సగమౌ దేహము తోడయా సుదతి ,యాసాధ్వీమ కేగా నిలన్
  మగడై యొప్పును రాముడిం పెసగ నామండోదరీ భామకున్
  గగనంబంతటి దీర్ఘ దేహుడును దాగామారి భక్తుండును
  న్నగునా రావణుడే కదానికను నా యా భా మకున్భ ర్త గా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం. 'తోడ నా సుదతి' అనాలి కదా! 'సాధ్వీమ కేగా నిలన్, దాగా మారి...కదానికను'..?
   మధ్యాహ్నం నుండి విపరీతమైన తలనొప్పి... అందుకే సవరణలను సూచించలేకపోతున్నాను.

   తొలగించండి
  2. మా అన్నగారి పూరణకు నా సవరణ:

   సగమౌ దేహ మనంగ నొప్పు నవనీ సంజాత వైదేహికిన్
   మగడై యొప్పును రాముడిం పెసగ నా మండోదరీ భామకున్
   గగనంబంతటి దీర్ఘ దేహుడును లంకా రాజ్య నాథుండును
   న్నగునా రావణుడే కదా ధవుడు దైత్యాగ్రేశు డత్యుగ్రుడున్

   తొలగించండి
 30. జగముల్గాచెడు విష్ణువే మనుజుడై జన్మించె! సీతమ్మకున్
  మగడై యొప్పును రాముడింపొసగ! నా మండోదరీ భామకున్
  గగనంబంత పరాక్రమంబలరు లంకా నాథుడే ధాత్రిలో
  మగడౌ! నీతడె నేల కూలెనట కామంబున్నియంత్రించకన్!

  రిప్లయితొలగించండి
 31. గాదిసుతుని యొక్క మఖము కావ చనియె
  రాఘవుండు,మండోదరీ రమణికి బతి
  యయ్యె జగతిని ప్రేమతో నసురవరుడు
  జానకి నపహరించి తా జచ్చె కడకు.

  విల్లు విరిచి వైదేహిని పరిణయంబు
  నాడి నట్టి వీర కుమారు డవని నెవరు?
  రాఘవుండు,మండోదరీ రమణికి బతి
  దశ శిరస్కుడై నట్టి యా దానవుండు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 32. సిగపూ వాడక దూషణాదులను నిశ్శేషమ్ముగావించుచున్,
  వగ బాపంగను వాలి జంపె నతనిన్ భావింపగా మిత్తికే
  మగడై యొప్పును రాముడింపెసగ.నా మండోదరీ భామకున్
  మిగిలెన్ భతృవిహీన శోకము,విధిన్ మీరంగ లేరెవ్వరున్.

  రిప్లయితొలగించండి
 33. తగఁ భూజాతకు చిద్విలాసినికి కోదండప్రకాశుండు మి
  న్నగు వంశాంకురమై మనోజనిభుఁడై యానంద సౌశీల్యుఁడై
  మగఁడై యొప్పెను రాముఁడింపెసఁగ, నా మండోదరీ భామకున్
  పగ వాఁడై దనుజేంద్ర సంఘములఁ బ్రాణంబుల్ హరించెన్ భళీ.

  శ్రీ మిస్సన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 34. సుకవులు మిస్సన్న గారికి జన్మ దిన శుభాకాంక్షలు! శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షవీక్షణములు వారిపై ప్రసరించు గావుతన్.

  రిప్లయితొలగించండి
 35. ​సీతకు పతియై నొప్పెను శివధనుస్సు
  విరిచి దశరతాత్మజుడు వివేకశీలి
  రాఘవుండు;మండోదరీ రమణికిఁ బతి
  ​రావణుం​డొప్పె రాక్షస రాజుగాను​!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బొడ్డు శంకరయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పతియై యొప్పును..' అనండి.

   తొలగించండి
 36. భూమిజను గావ నరునిగా బుట్టె నెవడు
  రావణుడు పతి యయ్యె నే రామ కపుడు
  సగము సుకృతము సతి కిడి సాగు నెవడు
  రాఘవుండు మండోదరీ రమణికిఁ బతి

  రిప్లయితొలగించండి
 37. రఘు కులోత్తముం డెవ్వడు? రావణు నకు
  పట్టమహిషి యెవతి యంటి? పరిణయమున
  నెవరికిన్ దాళి కట్టెద రెవరుతెలుపు
  రాఘవుండు మండోదరీ రమణికిఁ బతి

  సుగుణమ్మే తన భూషణమ్మయిన స్త్రీ చూడామణీ సీతకే
  జగమున్ బ్రోచెడు దీక్షతో ఇలను తా జన్మించె శ్రీనాథుడే
  మగఁడై యొప్పును రాముఁ డింపెసఁగ నా మండోదరీభామకున్
  సిగలో చంద్రుని దాల్చినట్టి శివుడిన్ సేవించు లంకేశుడే.

  నిన్నటి పూరణలు

  పెద్దలు చెప్పిరీవిధము పిన్నల క్షేమము గోరుచున్ సదా
  సుద్దులు, వచ్చెవానలను జోరుగ దెచ్చెడు కాలమే కదా
  వద్దిక ఛత్రముల్ గొనుట, వర్షము వచ్చిన గుండపోతగా
  నొద్దిక గాను తా నిలువ నొప్పదు , మేలగు రైనుకోటులే

  వినుమిది చిరుజల్లుకురియువేళ లోన
  యవనిన జననేస్తమ్మయి యాదుకొనును
  వడవడవణకుచు చిరుగు వాన పెరుగ
  పెనుతుఫానుగ మారిన భీకరమగు
  కుండపోతవర్షమ్మున గొడుగులేల

  రిప్లయితొలగించండి
 38. తగవుల్ వచ్చును నిట్టిమాటలన రాద్ధాంతమ్ము నీకేలరా:👇
  "మగఁడై యొప్పును రాముఁ డింపెసఁగ నా మండోదరీభామకున్";...
  మగడై యొప్పును రావణుండిలను నా మండోదరీ భామకున్!
  పొగరున్ మానుము పృచ్ఛకుండికను పోపోపోరపోపోరపో!!!

  రిప్లయితొలగించండి