కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఆతఁడు నా మగండు పతియౌ నితఁ డూరికిఁ బోయె భర్తయే"
లేదా...
"అతఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఆతఁడు నా మగండు పతియౌ నితఁ డూరికిఁ బోయె భర్తయే"
లేదా...
"అతఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు"
జోతలనందుచున్ ప్రజల క్షోభను దీర్చెడు నేతయొక్కడున్
రిప్లయితొలగించండికూతురు పెండ్లిజేయగ సఖుల్ తమ భర్తలతోడ వచ్చియు
న్నాతురతన్ గనన్ పరిచయమ్ముననివ్విధి పల్కరించిరే
ఆతఁడు నా మగండు పతియౌ నితఁ డూరికిఁ బోయె భర్తయే ||
గొప్ప రాజకీయపునేత కూతురిదగు
పెండ్లిజేయంగ సఖురాండ్రు విభునితోడ
జేరి పరిచయమివ్విధిఁ జేసుకొనిరి
అతఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు.
సీతగబుట్టిలక్ష్మి నృపసింహుడు రాముడునార్తరక్షణన్
తొలగించండిపాతకులన్ వధింపఁజన పల్లవకోమలి పూర్వజన్మ చి
త్రేతరముల్ లభింపఁ స్పృశియించుచు వానిఁదలంచెనిట్లుగా
ఆతఁడు నా మగండు పతియౌ నితఁ డూరికిఁ బోయె భర్తయే ||
నేమమార్తులఁ బ్రోవ శ్రీరాముడేగ
సీత గతజన్మ చిత్రముల్ చేతబట్టి
వాటినెల్లఁ ద్రాకుచుఁ దల్చె వరుసనిట్లు
నతఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు.
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
తొలగించండిరెండు విధాలుగా వ్రాసిన మీ నాల్గు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
వీరెవరనుచు నడిగిన వెలది కనియె
రిప్లయితొలగించండిచారు లోచన యగునొక చక్కనమ్మ
"అతడు నాపతి; మరి మగడౌనితండు
ఆయన సహోదరి యగునీ యబ్జముఖికి"
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..ఇతండు ఆయన..' అని విసంధిగా వ్రాశారు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితెఱగు గూడిన గుణముల దీటు గొనుచు
వెలుగులీను నిరువురందు వృద్ధుడైన
అతడు నాపతి మఱి మగడౌ నితండు
పుడమి నేలెడి రాజని బోల్చె నామె.
గురువుగారూ! నమస్కారములు. తమరి సూచనలతో నిన్నటి పూరణ పద్యాన్ని సంస్కరించి తిరిగి వ్రాసినాను. దయతో పరిశీలించగలరు.
మబ్బు లందున మఱుపడి మాయ దోడ
తాటకేయులు పైనుండి తపసి లెంచు
క్రతువు లందు గార్చు నసృక్కు గనగ దోచె
మొయిలు రక్తమ్ము గురిపించె భూమి పైన.
(అశృక్కు= రక్తము)
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'రాజని పోల్చె..' అనండి.
'అసృక్కు'ను 'అశృక్కు' అన్నారు.
అతఁడు నాపతి ,మఱి మగఁ డౌ నితండు
రిప్లయితొలగించండినాదు స్నేహితు రాలికి నచ్చె గాన
నిశ్చి తార్ధమ్ము జరుపగ నిచట నుండె
పాణి గ్రహణమ్ము రేపటి పగలు పదికి
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిప్రస్తుత జమానా లో భర్త యెవరు భార్య యెవతె అని అడిగితే తంటాయే అర్థమవడానికి :)
అతఁడు నా పతి, మఱి మగఁ డౌ నితండు
మునుపటి దినముల జిలేబి! ముద్దు కొమరు
లుగన నితనికిరువురు నలుగురతనికి
కలసి యిరువురుకియొకతె గనుడు లెక్క !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిపద్యం బాగుంది. కాని భావం గందరగోళంగా ఉంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిద్రౌపది ఆక్రందన:
తొలగించండిఓడె జూదాన నన్నొడ్డి యొడలు మరచి
యతఁడు నా పతి, మరి మగఁడౌ నితండు
గదకు తలనాన్చి శిలవలె మెదలకుండె
నన్న యానతికై వేచిరన్యపతులు
నీవె రక్షించు గోవింద నీరజాక్ష
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఉత్తమా౦గము నెక్కిన యువిద గ౦గ
యర్ధకాయము గైకొన్న యతివ గౌరి
" యతడు నాపతి - మరి మగడౌ నిత౦ " డ
ట౦చు వాదు లాడగ , సిక య౦దున గల
శీతకరు డది గా౦చి హసి౦చె | యేమి
యెరుగ నటులు౦డె నప్పరమేశ్వరు౦డు ! !
ి
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవలలౌ వారలిర్వురు కవలలైన
రిప్లయితొలగించండియన్న దమ్ముల పరిణయ మాడగాను
హితులకున్ చేసె పరిచయ మివ్విధముగ
నతడు నా పతి; మఱి మగడౌ నితండు
నాదు సోదరికి యనుచు నక్క పలికె.
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతడు నాపతి మఱి మగఁడౌ నితండు
రిప్లయితొలగించండినా సహోదరికి నిజము నమ్ముడయ్య
వెడలు చున్నాము బంధువు పెండ్లికొరకు
ఇక్క తెలియక నిక్కట్ల చిక్కినాము
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆతత మిత్ర భావ విభవైక మనోహర మీ నరత్రయం
తొలగించండిబాతఁడు నా మగండు, పతియౌ నితఁ డూరికిఁ, బోయె భర్త యే
రీతి సహించు నీ లలన లీలలు వైష్ణవ మాయ లిద్ధర
న్నేతఱి నేది సంభవమొ యేరికి నెంచఁ దరంబు సెప్పుమా
అతఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు
మాదు సోదరి కింపుగ మమత లెల్లఁ
జూపు మంచి మనిషి మనసు గన వెన్న
తోటి యల్లుండ్రు స్నేహంబు తోడ నుండ్రు
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిమన్మధునిబోలు సుందర మాటకారి
రిప్లయితొలగించండియతడు నా పతి,మఱిమగడౌనితండు
నాదు పెనిమిటికి సఖుడై నచ్చియుంట
చెల్లి హృదయంబు నాతడు కొల్లగొంట.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రక్కనిద్దరుపురుషులు బరగ నిలువ
రిప్లయితొలగించండిటీవి సీర్యలు నటిజెప్పె ఠీవిగాను
మందమతియను నాటకమందు జూడ
నతఁడు నా పతి, మఱి మగఁ డౌ నితండు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
P.Satyanarayana
రిప్లయితొలగించండినాతిని స్వేచ్ఛ నెర్గ నటు నాకొనరించ వివాహ బంధ మా
కూతిని తల్లిదండ్రులిటు గూర్చిరి పెళ్ళి వరాగ్రజుండు నో
మూతిని మీసమున్నను నపుంసకుడో కొసరంచటందువో
ఆతడు నా మగండు , పతియౌ నత డూరికి బోయె భర్త యే
P.S.N
ధర్మకర్త యనాథల దరికి జేర్చి
ఇంటి వారల జేసియు నిళ్లు నడుపు
నతడునా,బతి, మరి మగడౌ నితండు
భరము నోర్చని వారలే భర్త లెటులొ?!
P.Satyanarayana
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పంచి చొక్కాను ధరియించి బయట నుండు
రిప్లయితొలగించండినతడు నాపతి మఱి మగడౌ నితండు
నాదు సోదరి లక్ష్మికి ,నగర మందు
చేయు చుండెను నౌకరి శెట్టి యొద్ద
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పంచెను పంచి అన్నారు.
సంతస మొప్పగా త్రివిధ సాంఘిక చిత్రములందుజూచిన
రిప్లయితొలగించండిన్నాతడు నామగండు,పతియౌనితడూరికిబోయె, భర్తయే
సీతమ ధారవోయిమరచెన్నను నాదగు కష్టనష్టముల్
ప్రీతిని దీర్చగాగలుగు పెన్నిధి లేడనె నారిగొల్లునన్.
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేటి సమస్యా పూరణం
రిప్లయితొలగించండిజానకి పలికెను పిలిచి త్రిజటను రాము
డతడునా పతి,మరి మగడేనితండు
నొకమగువకును ,దురభి మానోపహతుడు
రాముశరవరదన చచ్చు రావణుండు
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శర వరద' అని సమాసం చేయరాదు కదా! 'రామ శర పరంపర జచ్చు...' అనండి.
పోలిక గల కవలలె మా పురుషులైరి!
రిప్లయితొలగించండియతడె నాపతి మఱి మగడౌ నితండు
నాదు చెల్లికి! నాథులె కాదు ప్రేమ
మూర్తు లగు వీరి తలపుల మురియు చుందు
దుర్గా దేవిని స్తుతిస్తూ వ్రాసిన మొన్నటి దత్త పదిని కూడా దయచేసి చూడగోరుతాను. ధన్యవాదములు.
వనము, వహ్ని, వాయు వవనియు నీవె, జీ
వనము పొంగు నీ భువనము నీవ!
వనము నందు జిక్కు జనులను బ్రోచి పా
వనము చేయు దుర్గ! వందనమిదె!
నాల్గవ పాదంలో " మూర్తు లన వీరని తలచి మురియుచుందు".
తొలగించండిశ్రీధర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ముఖ్యంగా మీ దుర్గాస్తుతి మనోహరంగా ఉంది.
గురువు గారికి ధన్యవాదములు.
తొలగించండిచేతల జూడ జాతికిల చేసిన మేలు యొకింతయైన లే
రిప్లయితొలగించండిదే, తనకోటునిమ్మనుచు దేశము లోగల ప్రాంతముల్ గన
న్నాతఁడు నా మగండు, పతియౌ నితఁ డూరికిఁ బోయె, భర్తయే
నేతగ మారినంత నిక నిత్యము దోపిడి నిక్కమే కదా!
గొడ్డురాలను నేనంచు కుమతి యైన
పెనిమిటియె నను దూషించి పిన్నిసుతను
పెండ్లి యాడదలచినట్టి విధము గాంచ
నతఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు
నాదుసోదరి కనుచును బాధ కలిగె
నిన్నటి నా పూరణలు
వ్యయమును లెక్కజేయకనె బాలుర చిత్రము తీసె గాంక్షతో
ప్రియతమ దర్శకుండొకడు పిల్లలు మెచ్చెడు విధమ్ము నందులో
హయములు సంచరించు గగనాంతరమందున గాంచ వింతగా
మొయిలు తటాలునన్ గురిసె భూమిపయిన్ రుధిరం బుదగ్రతన్
మునిగణములు జేసెడు యజ్ఞములకు విఘ్న
ములను కలిగింపగ దనుజ మూక లచట
విహగ వీధిన తిరుగగన్
వికృతముగను
మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన
విరించి గారూ,
తొలగించండిమీ అన్ని పూరణలు బాగున్నవి. అభినందనలు.
'వ్యయమును...' పద్యంలో 'మెచ్చు విధంబు...' అనండి. లేకుంటే గణదోషం.
తాతను జేయి పట్టుకొని దానడిపించుకు వచ్చె చూడుమా
రిప్లయితొలగించండినా తడు నామగండుపతియూ నితడూ రికి బోయె భర్తయే
పాతది యైన యాగృహము బాడుగ కిచ్చుట కోసమే గదా
రాతిరి రాత్రికే వెడలె రయ్యన వచ్చుట కింటికి న్సుమా
సుబ్బారావు గారూ,
తొలగించండిపద్యం బాగుంది. కాని పూరణ భావం కొంత సందిగ్ధంగా ఉంది.
సుందరాంగుల నిద్దరి జూచి సఖియ
రిప్లయితొలగించండిలిద్ద రిట్లాడు కొనుచుండి రింపుమీర
నతడు నాపతి మఱి మగడౌనితండు
నీకు బలుకరింతము పద నిక్కువముగ
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతడు నాపతి మరిమగడౌ నితండు
రిప్లయితొలగించండినాసహోదరి లక్ష్మికి నయము గాను
మాయిరువురి వివాహముల్ మా జనకుడు
యన్నదమ్ములకు నొసంగి యాచరించె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జనకుడు+అన్న..' అన్నపుడు యడాగమం రాదు. 'జనకుడె యన్న...' అనండి.
ఆతడు నామగండు, పతియౌ నిత, డూరికి బోయె భర్త, యే
రిప్లయితొలగించండిమాతని భార్యసోయగము, హర్షిణి నందన కెంతయందమో!
చూతము రండురండనుచు సుందర రూపలు కాంతలందరుం
జేతము లుల్లసిల్లు నటు చేరి రొకానొక విందు కోసమై.
హ.వేం.స.నా.మూర్తి.
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తరుణి బలికెను యెవ్వరీ పురుషులనిన
రిప్లయితొలగించండి''నతడు నా పతి మఱి మగఁ డౌ నితండు
నా సహోదరి , కపరాత్రి నతఁడె మాకు
'బండముండ 'ను రైలెక్క బండి తోలె''
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కట్నమాశకుపెళ్లాడ పట్నమందు
రిప్లయితొలగించండిపల్లెజీవనసారంబువల్లెయనుచు
తగువిడాకులు గొని వేరతనిని జేరి
అతడు నాపతి మఱి మగడౌనితండు
ననుచు బలికెను స్నేహితుల్నడుమ నొకతె|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్యాపూరణం:
రిప్లయితొలగించండిపంతులు కోరగా తెలుగు పాఠము చెప్పుచు, ముగ్గురాంగనల్
వంతులవారిగా వినుచు వ్యాకరణాంశములాదిగా మదిన్
"ఆతడు నా మగండు,పతియౌనిత డూరికి పోయె,భర్తయే
నేతగమారెనో"యనుచు నిక్కము వ్రాసిరి సొంత వాక్యముల్
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. రెండుపాదములలో బిందుపూర్వక ప్రాస ఉన్నది. మిగిలిన రేండు పాదములలో మామూలు ప్రాస. అలాఉండ వచ్చా. దయతో తెలియ జేయ ప్రార్థన.
తొలగించండిరెడ్డి గారూ,
తొలగించండిఅలా ఉండరాదు. నేను గమనించలేదు. దోషాన్ని గుర్తించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.
******
శ్రీరామ్ గారూ,
మొదటి రెండు పాదాల ప్రాసను సవరిస్తూ మరో పద్యం వ్రాయండి.
వ్రాతలు మార్చివేసి బహు భార్యలు,భర్తల మార్పుచేర్పునన్
రిప్లయితొలగించండికోతులకంటె హీనమయి కోర్కెల మార్కులబెంచు నోసభన్
ఆతడు నామగండు,పతియౌ నితడూరికి బోయె భర్తయే
“జాతికి దెల్పుఖర్మ మనజాలని సంస్కృతి నేటి భారతం”
ఆతురతోడ బల్కె నొక ఆడదిఆల్బము నుంచి జూపుచున్|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భారతం। బాతురతన్ వచించె..' అనండి.
శ్రీతిమ్మాజీరావుగారి పూరణ
రిప్లయితొలగించండినాగపట్టియు తిరుమణి నామధేయు
డతడునాపతి| మరి మగడౌనితండు
మజ్జిగణపతి డుంటి నాసజ్జనుండు
పేర్లు చిన్నవి జేసి నావింతగదర|
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండివైవిధ్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినమస్తే అన్నయ్యగారూ.నిన్నటి పద్యమోసారి చూడండి అన్నయ్యగారూ.
గగనమందున యగుపించు కప్పు యేది
రణము నందున భీముడు రౌద్రమునను
పడ వైచెనేమి యెచట తాను పగతురనట
మొయిలు,రక్తము కురిపించె,భూమి పైన.
ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిచూచి స్పందించాను.
మాతనువుల్ చలించెకని మాధవి! యామరు రూపు, డెవ్వరే?
రిప్లయితొలగించండిసీతకు ప్రక్కనుండి కడు చెన్నుగ వర్తిలు యీత డెవ్వరే?
గీత దవుండెటన్ గలడు?కేతువు నెత్తిన దెవ్వరో పురిన్?
ఆతఁడు నామగండు, పతియౌనితఁ,డూరికిఁబోయె,భర్తయే
పార్టీలో: 👇
రిప్లయితొలగించండికోతలు కోయుచున్ విరివి గోతులు త్రవ్వెడి నేత యచ్చట...
న్నాతఁడు నా మగండు:...పతియౌ నితఁ డూరికిఁ బోయె భర్త,...యే
రాతిరి వచ్చెనో గనను రైలున గార్డుగ జాబుచేయు,...నా
కూతురి నిచ్చినానుగద కోరిక తీరగ బాపనోడికిన్