20, అక్టోబర్ 2016, గురువారం

చమత్కార పద్యాలు – 216/29


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

29వ అర్థము విశ్వకర్మ స్మరణ     
                                                                          
భూరి జఠర గురుఁడు = కనకగర్భుని వంటి జగద్గురుడైనవాఁడును,
నీరజాంబక భూతి = అనలాక్షుని వంటి పుట్టువు గలవాఁడు (పంచముఖుఁడు),
మహిత కరుఁడు = అధికమైన (పది) చేతులు గలవాఁడు,
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన మణిభూషలు గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి సాధు గణములకు అధ్యక్షుఁడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = తొలిపల్కులకు (వేదములకు) అధీశుఁడైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు విశ్వకర్మ),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

1 కామెంట్‌:

  1. నీరజాo బక భూతుడు నిర్మలుండు
    ఘనతర మణి భూషణములు గలుగు నతడు
    న గ్ర గోపుడు మహితుడు నాది గుణము
    లుగల విశ్వకర్మ మనలదగు వి ధము గ
    కాచు గావుత నిరతము గరుణ తోడ

    రిప్లయితొలగించండి