8, అక్టోబర్ 2016, శనివారం

సమస్య - 2165 (మొయిలు రక్తమ్ముఁ గురిపించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన"
లేదా...
"మొయిలు తటాలునన్ గురిసె భూమిపయిన్ రుధిరం బుదగ్రతన్"

68 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మబ్బులందున దాగుండి మాయ తోడ
    తాటకేయ సుబాహులు తపసి లెంచు
    క్రతువు లందొంచు రక్తమ్ము గనగ దోచె
    మొయిలు రక్తమ్ము గురిపించె భూమి పైన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దాగి + ఉన్నది' అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. సుబాహువు కూడ తాటకేయుడే కదా... తాటకేయ సుబాహులు అనడం ఒప్పదు. వంచును ఒంచు అన్నారు.

      తొలగించండి
  2. ఇంద్ర ధనువంటి రంగులు మంద్రము గను
    గగన మంతట నిండెను జేగు రించి
    గుండె పగిలిన హృదయమ్ము గొల్లు మనిన
    మొయిలి రక్తమ్ముఁ గురిపించె భూమి పైన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      ధనువు వంటి.. అనవలసిన చోట ధనువంటి అన్నారు. రెండవ పాదంలో ప్రాసయతి తప్పింది.

      తొలగించండి
    2. వేల్పు దొరవిల్లు రంగులు మాల్పు నటుల
      జేగు రించిన గగనమ్ము దిగులు చెందె
      గుండె పగిలిన హృదయమ్ము గొల్లు మనెను
      మొయిలి రక్తమ్ముఁ గురిపించె భూమి పైన

      తొలగించండి
    3. అక్కయ్యా,
      సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
      మొయిలు టైపాటు వల్ల మొయిలి అయింది.

      తొలగించండి
  3. ఋషులు తపమాచరింపంగ శ్రీహరికని
    రక్తఘటములఁ గొనిపోయి రాక్షసులట
    పారబోయంగ పైనుండి వారిఁ గలసి
    మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన.


    వారి = నీరు

    నియతతపోవరిష్ఠులు వనిన్ నిరతమ్ము హరిందలంచుచున్
    నయముఁ దపమ్ము జేయగ వినాశమొనర్చ వియత్తలమ్ముపై
    రయముగఁ జేరి రాక్షసులు రక్తఘటమ్ములు కూల్చినంతనే
    మొయిలు తటాలునన్ గురిసె భూమిపయిన్ రుధిరం బుదగ్రతన్ ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అతడల విఠలాచార్యుండునద్వితీయ
      దర్శకేంద్రుడతనిదౌ విదగ్ధమందు
      వెండి తెరమీద మాయ సంప్రీతిఁగూర్చ
      మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన.

      నయనసముచ్చయమ్మునకు నాటకమట్టిది దుష్కరంబునై
      ప్రియముగఁ జూడ వెండితెరఁ బ్రీతిని గూర్చగ దర్శకేంద్రుడున్
      భయదవియచ్చరుల్ నటులు భండనమాడగనద్భుతమ్ముగా
      మొయిలు తటాలునన్ గురిసె భూమిపయిన్ రుధిరంబుదగ్రతన్ ||

      తొలగించండి
    2. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ పూరణ లన్నీ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి


    3. మాడుగులవారి యనిలకు
      మారుని పద్యములయందు మధురిమ గనుమా
      పాడుట కనుకూలముగా
      సారము నొప్పుచు జిలేబి చక్కగ నుండెన్


      జిలేబి

      తొలగించండి
  4. హొయలు లొలుకుచు సొగసున పయన మవగ
    సూర్య కిరణారుణ ప్రభా శోభ లందు
    రాగ ధారల వర్షించు రాజి నరయ
    మొయిలు రక్తమ్ము గురిపించె భూమిపైన!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      హొయలు నిత్యబహువచనం. మళ్ళీ దానికి లు ప్రత్యయం అవసరం లేదు. కనుక 'హొయల నొలుకుచు' అనండి.

      తొలగించండి
  5. జయుడను వానికొక్కనికి స్వప్నమునందగుపించె సూర్యుడే
    రయమున దాకె చంద్రుని దురమ్మున నాకసమందు గావునన్
    భయమును గొల్పురీతిని శుభంకర సాధుజలప్రదాత యా
    మొయిలు తటాలునన్ గురిసె భూమిపయిన్ రుధిరం బుదగ్రతన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  6. వానను కురిపించ గలదు వసుధ నందు
    మొయిలని యనుకొంటిని నేను, మోసము గని
    మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన
    నిదుర గను సైనికుల చంప నిర్దయగను

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. ఆకసమునుండి యా రాక్షసాధములట
    రామ రావణ యుద్ధాన రభస జేయ
    రామ భాణమ్ము ఛేదించి రంగరించ
    మొయిలు రక్తమ్ముఁ గురిపించు భూమి పైన

    రిప్లయితొలగించండి
  8. హేమకశ్యప హేమాక్షులిర్వురసురు
    లు దితి కడుపున నూపిరులు గొనుచుండ
    మొరిగె భైరవ ఫేరవ ములట భువిని
    మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన"

    రిప్లయితొలగించండి
  9. వేయి కాలుష్య నాగులు విషము చిమ్మి
    ధరణి దారుణమైనట్టి దాడి జరిగి
    ప్రగతి గతితప్పి విషమంత పైకి వెడలి
    మొయిలు రక్తమ్ము గురిపించె భూమి పైన

    రిప్లయితొలగించండి
  10. వెన్నుపోటును బొడిచిన దన్నులేని
    ద్రోహులను గాంచి దురపిల్లి దోష దలచె
    మొయిలు రక్తమ్ము గురిపించె భూమిపైన
    నమరు లయ్యెను బారత సమర సేన!!!

    రిప్లయితొలగించండి
  11. వారిదమునకు మరియొక బేరు యేమి?
    తపసి యజము నాశమొనర్ప తాటకి సుతు
    లేమి జేసె ?పరామృతమెచట బడును?
    మొయిలు, రక్తము గురిపించె, భూమిపైన!!!

    పరావృతము =వర్షము


    కుంభవృష్టిగ వర్షమ్ము గురియ జేసె
    మొయిలు, రక్తమ్ము గురిపించె భూమిపైన
    పోరు నీతిని వీడుచు భీరులల్లె
    దారుణమునకు బాల్పడె దాయతతులు!!!



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'దోష దలచె'...?
      రెండవ పూరణలో 'పేరు+ఏమి' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'పేరదేమి' అనండి. 'సుతులు... ఏమి చేసిరి? జనవాన యెచట బడును' అనండి.

      తొలగించండి
  12. కర్షకున కేది భువిలోన హర్ష మిడును ?
    ఉగ్ర భీముడే మొనరించె యుద్ధ మందు?
    నృపుని దృష్టియె దేనిపై నిత్య ముండు?
    మొయిలు;రక్తమ్ము గురిపించె;భూమిపైన.
    ****&&&&****
    మొయిలు రక్తమ్ము గురిపించె భూమి పైన
    ననగ భీముడు చెలరేగె నాల మందు
    చేత జిక్కు శత్రువులను,సేన లోని
    ఏనుగుల గుఱ్ఱములను పైకెగుర వైచి.

    రిప్లయితొలగించండి
  13. అయిదుగురన్నదమ్ములట అంతకుమించినవీరులెందరో
    పయిననువెన్నడుండెనట పావనిపాపనిధాటికందరున్
    నయముగనోర్వకుంటిరి వినాశముతాండవమాడెఁజూడగాఁ
    మొయిలు తటాలునన్ గురిసె భూమిపయిన్ రుధిరంబుదగ్రతన్||

    రిప్లయితొలగించండి
  14. మేఘనాధుడు దాగగా మేఘమందు
    గురినిజూచుచు సౌమిత్రి చురుకుగాను
    శిరముద్రుంచగ శరముతో, జివ్వుమనుచు
    మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన.

    రిప్లయితొలగించండి
  15. చూప బోవు ఘటనలకు సూచి వోలె
    చాట నెంచిరి నెత్తుటి జల్లు చలన
    చిత్ర మందు! కృత్రిమముగ చేసినట్టి
    మొయిలు రక్తమ్ము గురిపించె భూమి పైన!

    రిప్లయితొలగించండి
  16. విషరసాయన గాలు లావిరిగ మారి
    చేరుచుండ మేఘములలో ఘోరముగను
    ప్రకృతి కలుషితమైనట్టి ఫలితముగను
    మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. ఛాందస మత భావమ్ములు సంద డింపఁ
      గుందు చుందురు మానవు లెందు నున్న
      దిట్ట కవి శేఖరుడు వ్రాసి నట్టి ఫలిత
      మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన

      [ఫలితము+ఒయిలు= ఫలితమొయిలు; ఒయిలు = పుస్తకము]


      పయనము భావి భూజనుల పద్మదళాక్షు డెఱుంగు నింక నె
      మ్మెయిఁ గృషి సల్పనేర మది మేదినిఁ గాదని విత్త బద్ధమౌ
      చెయువులు పిక్కటిల్లగ విచిత్ర రసాయన సంచయాత్తమై
      మొయిలు తటాలునన్ గురిసె భూమిపయిన్ రుధిరం బుదగ్రతన్

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
      నా చిన్నతనాన పుస్తకాన్ని గ్రామీణులు వ(ఒ)య్యిలు, వ(ఒ)యిలు అనడం గుర్తున్నది.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  18. మునులయా గమునకు భగ్న మొనర జేయు
    కొఱకు రక్త వర్షమ్ము నట గురి పించ
    రక్కసులగు మారీచు డ రయ సు బాహు
    లిరువురు మనకు దోచెను నిట్లు గాను
    మొయిలు రక్తమ్ము గురిపించె భూమి పైన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది.

      తొలగించండి
  19. వర్షమును గోరు రైతుకు హర్ష మేది?

    రక్త స్రావమౌ రోగికి రక్ష యేది?

    నల్ల మబ్బులు నీటిని జల్లబరచి...

    మొయిలు, రక్తమ్ము, గురిపించె భూమిపైన.

    రిప్లయితొలగించండి
  20. వాయుకాలుష్య మందున వసుధనిలువ?
    వేడివాడిగ మారుచుదాడిజేయ?
    నీరు నిర్మలతత్వంబు నిలుపు కోక
    మేఘమాలిక లన్నియు మెఱుపు మాన?
    మొయిలురక్తమ్ము గురిపించె భూమిపైన|
    2.జయమునుగోరు మాంత్రికులు జాతి విరోధులరీతి వంచనా
    మయమగు మాయలందె యనుమానము లేకను తంత్ర విద్యచే
    భయమగు సన్నివేశముల భావనలుంచెడి మార్పు చేర్పునన్
    మొయిలు తటాలునన్ గురిసె| భూమిపయిన్ రుధిరం బుదగ్రతన్.

    రిప్లయితొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    సకల జ౦తు జాలమును పోషణ మొనర్ప

    కరుణ తోడుత జలమును కురియ జేసి ,

    మొయిలు రక్తమ్ము గురిపి౦చె భూమి పైన |

    రక్త మనగ నర్థ౦ బనురాగము గద !
    ి

    రిప్లయితొలగించండి
  22. మిత్రులందఱకు నమస్సులు!


    [దేవదానవ యుద్ధమున రక్తము లేఱులై పాఱఁగా నాకసము కంపింౘుౘు వర్షించిన సందర్భము]


    రయమున దేవదానవులు గ్రక్కున నంబర వీథిఁ జేరియున్
    భయమును లేక యుద్ధమునుఁ బన్నుగఁ జేయఁగ నభ్రమే యసృ
    ఙ్మయమయి రక్త వర్ణయుత కాంతి సెలంగుౘు భీతిఁ గొల్పఁగన్

    మొయిలు తటాలునం గురిసె భూమిపయిన్ రుధిరం బుదగ్రతన్!

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  23. వన వినాశము నాపగన్ వారి విషము
    దేశ దేశాంతరాత్పరిదేవనమున
    వెలయు యంత్రాల పొగ సెగన్ విలువ గట్టి
    మొయిలు రక్తమ్ము గురిపించె భూమి పైన
    P.Satyanarayana
    హొయల నణూద్వహంబుగన హోరుగ పోరులు సాగె నింగిలో
    భయమదె యుద్ధ కారణము బాంబుల మ్రోతలు పెక్కటిల్ల న
    వ్యయమగు స్ఫోటముల్ యిల నవారితమౌ ప్రళయంబు నా కలన్
    మొయిలు తటాలునన్ గురిసె భూమి పయిన్ రుధిరంబుదగ్రతన్
    P.Satyanarayana

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. యతులు హోమములను జేయ నసురగణము
    భంగమును జేయగా పలు భంగు లంత
    రిక్షమున కేగి యజ్ఞముల్ రిత్త వోవ
    మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన

    రిప్లయితొలగించండి
  25. భయమునశించి మానవులు భావ్యముగాని వికార చేతలన్
    రయముగజేసి యంత్రముల రాశులు నభ్యుదయంబు పేరుతో
    ప్రియమునుపొంద,భూతలము వేడిని పెంచగ నామ్ల వర్షముల్
    మొయిలు తటాలునం గురిసె భూమి పయిన్రుధిరంబుదగ్రతన్

    రిప్లయితొలగించండి
  26. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “మిత్త్ర” పదము సాధువని భారత భాగవత ప్రయోగముల నుండి తెలియుచున్నది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      ఈ ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.ఇదివరలో మీరు పుత్త్ర, పుత్ర, మిత్త్ర, మిత్ర పదాలు సాధువులని మరలా మిత్త్ర పదము లేదనుకున్నారు కదా. భారతములో ఈ పదమును చూచి ప్రస్తావించితినిప్పుడు.

      తొలగించండి
  27. గగనమందున యగుపించు కప్పు యేది
    రణము నందున భీముడు రౌద్రమునను
    పడ వైచెనేమి యెచట తాను పగతురనట
    మొయిలు,రక్తము కురిపించె,భూమి పైన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గగనమందున నగుపించు కప్పదేది' అనండి.

      తొలగించండి
  28. నియమముల న్ త్యజియించుచు నీతిని వీడి రసాయనమ్ములన్
    బయటి స్థలములన్ విడి చి స్వార్థపరు ల్ చరియించు చుండగా
    రయమున నాశమయ్యెను సరమ్ము జలమ్ములు నాకత న్ దివిన్
    మొయిలు తటాలు నన్ గురిసె భూమిపయిన్ రుధిరంబు ద గ్రత న్

    రిప్లయితొలగించండి
  29. సుయుధులు నుగ్గు జేసి రట చోద్యము భారత శౌర్య మెంచగా
    మొయిళులె కాని నీరమును మోసుకు రాగల శక్తి లేనివై
    పయిన చరించు శ్వేతజలవాహము లంచు దలంచ వైరు లా
    మొయిలు తటాలునన్ గురిసె భూమిపయిన్ రుధిరం బుదగ్రతన్.

    రిప్లయితొలగించండి
  30. కవి మిత్రులకు విన్నపం ! "శంకరాభరణం' హోం పేజీ లోని "వర్గాలు" శీర్షిక క్రింద " నా కవిత" అనే ఉప శీర్షిక క్రింద శ్రీ కంది శంకరయ్య గారు రచించిన పద్య కవితలు చదవమని మనవి. చక్కగా ఆస్వాదించుటకు అనువైనవే గాక పద్య రచన చేయు వారికి బాగా ఉపయుక్తమని నా భావన.
    --గుఱ్ఱం జనార్దన రావు.

    రిప్లయితొలగించండి