త్రింశదర్థ పద్యరత్నము – పోకూరి కాశీపతి
ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.
21వ అర్థము
–గజేంద్ర స్మరణ
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గలవారిలో గొప్పవాఁడును
(ఏనుఁగులకు పెద్ద కడుపుండుట సహజము),
నీరజాంబక భూతి = కమలాక్షుఁడే యైశ్వర్యముగా గలవాఁడును
(విష్ణుభక్తుఁ డనుట),
మహిత కరుఁడు = గొప్ప తొండము గలవాఁడు,
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన మణిసముదాయము గలవాఁడును
(ముది యేనుఁగుల కుంభస్థలములలో ముత్యము లుండుట సహజము),
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి సాధుచయాధ్యక్షుఁ
డైనవాఁడును,
అగ్ర గోపుఁడు = లెస్సయైన వాక్కు (ఘీంకారము)
గలవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును
(అగు గజేంద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
చేటవోలెనుచినచిన్నచెవులుగలిగి
రిప్లయితొలగించండిస్తంభములబోలుగుండ్రనిచరణములుగ
లిగినగజరాజ!నతులివెతగువిధముగ
గావుమామమ్మునిరతముగరుణతోడ