3, అక్టోబర్ 2016, సోమవారం

సమస్య - 2161 (కారము గన్నులం బడిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్"
(ఆకాశవాణి వారి సమస్య)
లేదా...
"కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్"

113 కామెంట్‌లు:

 1. కోరిక మీరగన్ గవులు గొప్పగ దేనిచె పూని కావ్యమున్
  శ్రీరమణున్ మదిన్ దలచి చెప్ప జనాళికి వ్రాయ జూతురో
  ఆ రమణీయమౌ మిగుల యద్భుత మొప్పెడు గొప్పదైన శ్రీ
  కారము గన్నులం బడిన గల్గదె మోదము మానవాళికిన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనారన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దానిచె' అని చే ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. 'దానిని పూని...' అనవచ్చు కదా!

   తొలగించండి
  2. సూచన బాగున్నది.ధన్య వాదాలు. అలాగే సవరిస్తాను.

   తొలగించండి
 2. సాధారణంగా కృతులను శ్రీకారం తో మొదలు పెట్టుట ఆనవాయితీ గద !

  రిప్లయితొలగించండి
 3. పారెడు ప్రేమ త్యాగముల వాహిని రాముని దివ్య సుందరా
  కారము; సత్యధర్మములె కానగ వీలుగ పొందినట్టియా
  కారము; మోహబంధములఁగాల్చుచు మోక్షమునిచ్చు మోహనా
  కారము కన్నులంబడినఁగల్గదె మోదము మానవాళికిన్ ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గూడ రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రేమ త్యాగముల' అన్నపుడు మ గురువై గణదోషం. 'పారెడు త్యాగ ప్రేమముల..' అందాము. రేఫ సంయుక్తాక్షరం ఉత్తర పదాద్యక్షరం అయితే పూర్వపదాంతాక్షర అవసరాన్ని బట్టి లఘువు కావచ్చు, గురువు కావచ్చు.

   తొలగించండి

 4. కారణమౌను కార్యముఁ బ్రకారము, దుష్టుల తూలనాడ ఛీ
  త్కారము, సద్యశమ్ము నిరతమ్మునొసంగెడు కావ్యమున్ చమ
  త్కారము, పండితోత్తములఁ ధన్యులఁ జేయ సభాంతరంబు స
  త్కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్ ||

  ధారుణిఁ సరసాన్వితడై
  పేరెన్నికనొందినట్టి విబుధేశ్వరుడౌ
  ధీరునికై చేసిన స
  త్కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్ ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Print mistake adjustment

   ధారుణిఁ సరసాన్వితుడై
   పేరెన్నికనొందినట్టి విబుధేశ్వరుడౌ
   ధీరునికై చేసిన స
   త్కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్ ||

   తొలగించండి
  2. హారము దేవతాళికి, ప్రహారము నీచునికైన, కన్యకా
   కారము,పోరుసల్పనురుకన్నరివర్గబలమ్మునందు న్య
   క్కారము, పూర్వపుణ్యమున కావ్యముఁగూర్చుటనేర్చినన్ నమ
   స్కారము శ్రీ సరస్వతికి, సంఘమునందు చరింపనెంచ సం
   స్కారము, పేదసాదలకు సాయమొనర్చిన వారికిన్ పుర
   స్కారము, వేదపాఠమును సస్వరమున్ గొని వల్లెవేయనోం
   కారము, దానముల్ సలుపగా మురిపించు పొగడ్తలన్ తిర
   స్కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్ ||

   తొలగించండి
  3. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   కారముల ప్రాకారమునే కట్టారు. మీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. భూరివటంబు క్రింద పరిపూజితవృద్ధముముక్షుఛాత్రయై
  సారవిహీనవిశ్వవిలసద్భయమోహవిలోలమాయనే
  మారని జ్ఞానబోధనలఁ మౌనపువ్యాఖ్యలఁజేయు యవ్వనా
  కారము కన్నులంబడినఁగల్గదె మోదము మానవాళికిన్।।

  రిప్లయితొలగించండి


 6. భారమగు జీవితము గల
  వారలకు దయయును జూప వారికి యీ సం
  సారము నీదుట కగు సహ
  కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. వారము జేసుకు భుజించి
  నేరము లెంచక బ్రతుకుచు నీమము తోడన్
  భారము నెరిగిన నొకయుప
  కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదం చివర (బేసిగణంగా) జగణం వచ్చింది. 'వారమ్ములు జేసి తినుచు..' అనండి.

   తొలగించండి
  2. వారమ్ములు జేసి తినుచు
   నేరము లెంచక బ్రతుకుచు నీమము తోడన్
   భారము నెరిగిన నొకయుప
   కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్
   ------------------------------------
   క్షమించాలి అసలు గమనించలేదు

   తొలగించండి
 8. శ్రీరఘు రామచంద్రుడు వశీకృత భూమిసుతాంతరంగుడా
  వైరిగణాంతకుండును నవాంబుజనేత్రుడు ధర్మవిగ్రహుం
  డారణభీముడాశ్రితజనాప్తుడు దాశరథీశుఁ సుందరా
  "కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూర్తిగారూ, అత్యద్భుతంగా ఉంది. గోపరాజుగారి పద్యం చదువుతున్నట్లు ఉంది.

   తొలగించండి
  2. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
   మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
  3. ఫణికుమార్ తాతా గారు, అభినందనలకు కృతజ్ఞతలు.
   గురువుగారు ధన్యోస్మి, కృతజ్ఞతలు

   తొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తీరగు సహకారముతో
  మూరుచు నొక్కని కొకరుగ మురిపెము తోడన్
  కూరిమి నగువారలమమ
  కారము నేత్రములఁ బడిన గడు మోదమగున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. చేరెనొకండు చెరఁగొనఁగ
  వీరవనితనొంటరిఁగని; బీరములనుచున్।
  వారింపకచల్లబడిన
  కారము నేత్రములఁబడిన గడుమోదమగున్।

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గూడ రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు. కొంత అన్వయక్లేశం ఉన్నట్టుంది.

   తొలగించండి
 11. P.Satyanarayana
  ధారణ ధ్యాన యోగపు విధాన మెరింగిన రాజ యోగమే
  పార నరణ్య వాసమున బారగనేల,విశుద్ధ జీవనా
  ధార విచార ధారయె సదాయుపకారియ నాదబ్రహ్మ యా
  కారము గన్నులం బడిన గల్గదె మోదము మానవాళికిన్
  PSN
  ఘోర తపంబులలో నోం
  కారము జపియించు వరుస గానని నరుకున్
  యూరక హరిహరి యన నా
  కారము నేత్రముల బడిన కడు మోదంబౌ
  P.Satyanarayana

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'నరుకున్+ఊరక' అన్నపుడు యడాగమం రాదు. 'నరుకు। న్నూరక..' అనండి.

   తొలగించండి
 12. తోరం బయినప్రేమ య
  పారంబైనమమతయునుఁ ప్రణవమునకు సా
  కారమగుమాతృ శ్రీయా
  కారము నేత్రములఁ బడిన గడుమోదంబగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. 'తోరంబు నయిన ప్రేమ య..' అనండి. అలాగే 'సా।కారపు మాతృశ్రీ యా।కారము...' అనండి.

   తొలగించండి
 13. కారము నుప్పుయు పెరుగ వి
  కారము కనరాని తీపి కైతల వెదుకన్
  కోరిన తేనె తెలుగు నుడి
  కారము నేత్రముల బడిన కడు మోదమగున్!

  రిప్లయితొలగించండి
 14. గురువు గారికి వందనములు> మరింతగా అన్వయం కుదరాలంటే రెండవ పాదంలో 'కనరాని ' బదులు 'చేకొనని ' బాగుంటుందేమో! తెలుప గలరు. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 15. ధీరుండార్త జనావన
  శూరుండయి జగమునందు శోభిల్లు శుభా
  కారుండగు స్వామి మహా
  కారము నేత్రముల బడిన గడు మోదమగున్!

  ధారుణి విద్యల నిచ్చుచు
  తీరున మానవుల బ్రోచి తిమిరము ద్రోలే
  భారతి యా దేవి శుభా
  కారము నేత్రముల బడిన గడు మోదమగున్!


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   '..ద్రోలే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'తిమిరాంతకియౌ' అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురువుగారూ సవరిస్తాను.

   తొలగించండి
 16. బారులు దీరి నిల్చి భగవంతుని దర్శన భాగ్యమంద; వే

  సారక రాత్రియంతయును జాగరణంబును జేసి;దాటుచున్

  ద్వారము లెన్నియో,చివరి ద్వారము లోపలి దేవదేవు నా

  కారము గన్నులంబడగ కల్గదె మోదము మానవాళికిన్.

  ( ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ఇచ్చిన సమస్యకు నేను పంపిన పూరణము.)

  రిప్లయితొలగించండి
 17. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  ఆరయ చిత్రకారు డొక డద్భత మైనటు వ౦టి

  ………… చిత్రమున్

  దా రచియి౦చె మెచ్చెడు విధ౦బున ,

  ………… దానిని గా౦చి న౦తనే |

  ______________________________________  " సారస పత్ర నేత్ర్ర ! మనజాల నినున్ విడి !

  ………………… చె౦త జేరుమా !

  కోరిక దీర్చుమా ! " యనుచు గోపిక

  …………… వేడగ , గౌగిలి౦చు చే

  పారిన గుబ్బ బ౦తులను హత్తి , కపోలము

  …………… ముద్దు వెట్టి , పు౦

  స్కారము తోడ నామె మది c గామము

  ……………… రేపెడు గోప బాలు నా

  కారము కన్నుల౦ బడిన కల్గదె మోదము

  ……………… మానవాళికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మనోజ్ఞమైన పూరణ నందించారు. అభినందనలు.

   తొలగించండి
 18. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  గు రు వు గా రి కి మరియు క వి మి త్రు ల కు

  పా ద న మ స్కా ర ము లు .

  " చ ౦ ద్ర క ళా వృ త్త ము " ను గూ ర్చి

  నే ని పు డు తె లి య జే య ద ల చి తి ని .

  ఇది సరసముగా చక్కని నడకతో సాగి పోగల
  వృత్తము . రగణ , సగణ , భగణముల తో
  పాటు , ఒక యగణము ఒక
  మగణము ఒక తగణము కూడా పొ౦ది౦చు కొనగల వసతి ఈ వృత్తము లో మనకు లభి౦చ గలదు .
  …………………………………

  గ ణ ము లు =

  ర. స. స. త .జ .జ . గ యతి 11

  …………………………………………………………

  ధోరణి నిలుచుట కై నేను రె౦డు పాదములను
  వ్రాస్తున్నాను .

  ………………………………………………………

  శ ౦ క రా శి వ శ ౦ క ర దే వా

  చ ౦ ద్ర క ళా ధ ర ఈ శ్వ రా

  …………………………………………………

  స ౦ క ట ౦ బు ల బా పు ము త ౦ డ్రీ

  చ ౦ ద్ర క ళా ధ ర బ్రో వు మా

  ……………………………………………………

  న మ స్తే :--

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గు రు మూ ర్తి ఆ చా రి గారు నమస్సులు. చ ౦ ద్ర క ళా వృ త్త ము పై చక్కని వివరణ నిచ్చారు. నిన్ననే చూచితిని. చ ౦ ద్ర క ళా ధ ర ఈ శ్వ రా అని విసంధి గా వ్రాసినారు. సంబోధనయైనను "ధరా" యని దీర్ఘమున్న తప్ప సంధి చేయ వలసినదియే గదా. దీర్ఘమున్న యడాగమము.

   తొలగించండి
  2. గురుమూర్తి గారూ,
   ధన్యవాదాలు.
   ******
   కామేశ్వర రావు గారూ,
   దీర్ఘము లేకున్నా చంద్రకళాధర! సంబోధన కావచ్చు. తరువాత యడాగమం తప్పని సరి!

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు

   తొలగించండి
 19. భార నతోరు శాఖ చయ భాసిత భవ్య ఫలాకరమ్మిలం
  గీర సమూహ మోదితము గ్రీష్మ సుకాల విరాజమానమున్
  జారగ వృక్ష శాఖముల స్వర్ణ నికాశ సువర్ణ భాస ప
  క్వారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్

  [పక్వ+ఆరము=పక్వారము; ఆరము= తియ్యమామిడి]


  నేరము పచ్చని చెట్లను
  దూరము స్వచ్చపు టనిలము దోరపు నగరిన్
  వారపుఁ జివరం జన మన
  కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్

  [మనకు+ఆరము=మనకారము; ఆరము= ఉద్యానవనము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   ఆహ్లాదకమైన సుందర దృశ్యాన్ని కళ్ళముందుంచారు మీ పూరణలతో. అత్యద్భుతం. అభినందనలు.

   తొలగించండి
  2. రసపూర్ణ పద్యరచనా కుశలురైన పోచిరాజు కామేశ్వరరావు గారికి నమశ్శతములు. మీపద్యములు మధురమనోజ్ఞములు. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   సూర్యనారాయణ రావు గారు మీ యభిమానమునకు, నభినందనలకు శతాధిక వందనములు. మీ వంటి పెద్దల ప్రోత్సాహము లభిలషణీయములు.

   తొలగించండి
  4. కామేశ్వర రావు గారికి నమస్సులు. మీ పూరణములు అద్ఫుంతంగా వున్నాయి. అయితే ఒక అనుమానం. సమస్యలోని పదం "కారము" గదా...సంధివలన యేర్పడిన "క్వారము" యొప్పునా....

   తొలగించండి
  5. సుకవి మిత్రులు పోచిరాజు వారూ...నమస్సులు! మీ రెండు పూరణములును అద్భుతముగ నున్నవి. అభినందనలు!

   మొదటి పూరణమున..శాఖ...దీర్ఘాంతము కావలెననుకొందును. పరిశీలింపుఁడు.

   శాఖ...మువర్ణాంతము [శాఖము] కాకపోవచ్చునని సందేహము.

   తృతీయ పాదాంత, చతుర్థ పాదాది యందు...పక్వారము....పక్వ...ఆరము...దీనిలో ’కారము’ లేదుగదా! పరిశీలింపఁగలరు.

   తమ యందలి గౌరవ భావముచే నిట్లడుగ సాహసించితిని. అన్యధా భావింపవలదని మనవి.

   తొలగించండి
  6. శర్మగారు ధన్యవాదములు. మీ సంశయము ఇదివరలో నొకసారి వచ్చింది. పెద్దల లాచేయడ మామోదము మరియు నొక చమత్కార కళ యని నిర్ధారించారు. కారము లో “కా” పోకుండా యే యక్షరమునైనా సంయుక్తము చేయ వచ్చు. “సత్కారము, తిరస్కారము, పురస్కారము, ధిక్కారము” ఇత్యాదులు. అట్లే పక్వారమును.

   తొలగించండి
  7. కవి పుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. శాఖ పొరపాటున “అ” కారాంతముగా తలచి సమాసము చేసితిని. చక్కగా గుర్తు చేసారు. సవరించెదను.
   క్వారము లో “కా” శబ్దానికి లోపములేదు కద. సమస్యకు భంగము లేదని భావిస్తాను.

   తొలగించండి
  8. భార నతోరుపల్లవ విభాసిత భవ్య ఫలాకరమ్మిలం
   గీర సమూహ మోదితము గ్రీష్మ సుకాల విరాజమానమున్
   జారగ వృక్ష శాఖముల స్వర్ణ నికాశ సువర్ణ భాస ప
   క్వారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్

   [పల్లవము= చిగిరించిన కొమ్మ]

   తొలగించండి
  9. శాఖము...దీని యర్థము బోధపడకున్నది. శాఖ యనిన కొమ్మ యని తెలియును. శాఖము... అనిన?
   మూడవపాదాన...శాఖ నిల...అన్నచో? శాఖము...బాధ తొలగవచ్చుననుకొందును.

   పక్వారము...పక్+వారము...అని యగుచున్నది. ఇందులో కారము ధ్వనించుటలేదు...వారము తప్ప! పవ్ + కారము అని మీరు భావించినటులున్నది. మరోమారు పరిశీలింపుఁడు.

   తొలగించండి
  10. పూరణ సవరించితిని. శాఖ పదమును మార్చితిని.
   కాదండి. కా హల్లు కు వ సంయుక్తమయ్యింది. కా అక్షరము లోపించలేదు. కారము అర్థ మవసరము లేదని నా భావన.

   తొలగించండి
  11. “పక్వారము” విషయమున కవి పుంగవులు మధుసూదన్ గారి నసంతృప్తులుగ నుంచ నోపక సవరించిన పూరణ:

   భార నతోరుపల్లవ విభాసిత భవ్య ఫలాకరమ్మిలం
   గీర సమూహ మోదితము గ్రీష్మ సుకాల విరాజమానమున్
   జారగ వృక్ష మూలమున స్వర్ణ నికాశ సువర్ణ భాసితై
   కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్

   [భాసిత+ఏక+ఆరము= భాసితైకారము; ఆరము= తియ్యమామిడి; పల్లవము= చిగిరించిన కొమ్మ]

   తొలగించండి
  12. చాలా బాగున్నదండీ మీ సవరించిన పూరణము! మిమ్మల్ని విసిగించినందులకు మన్నించండి. శిల్పము అందంగా రావాలంటే ఎన్నో ఉలి దెబ్బలు తప్పవు గదా! శుభాభినందనలతో...
   భవదీయుడు
   గుండు మధుసూదన్

   తొలగించండి
 20. కోరినకోర్కెలంబరమ కూరిమిదీర్చుచు నెల్లవేళలన్
  భూరిమనోజ్ఞ సప్తగిరి పూజిత దివ్యవిభూషణుండునై
  నేరములెంచకుండ మహనీయత సర్వుల బ్రోచు శ్యామలా
  కారము గన్నులంబడిన గల్గదె మోదము మానవాళికిన్.

  దోరవయోభూషణములు
  తారక మీరంగ గలుగు తళుకులుబెళుకుల్
  సారపుబల్కుల దివ్యా
  కారము నేత్రములబడిన గడు మోదమగున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 21. కారము గన్నులంబడిన గల్గదె మోదము మానవాళికిన్
  బీరును ద్రాగువాని వలె వేరుగ మాటలు బల్కుచుంటి రే
  కారము గన్నులంబడిన కన్నులు మంటలు బుట్టునున్గదా
  యారయ మోదమె ట్లగును నార్యులు సెప్పిన మానవాళికిన్

  రిప్లయితొలగించండి
 22. చీరెలు కొన తనపతి సహ
  కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్
  దారకు, నిశ్చయముగ శ్రీ
  వారికి తగుసమయమందు ఫలితము దక్కున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారు, సునిశితనిగూఢ శృంగారరసాత్మక భావాన్ని వెలువరించారు. పూరణమనోజ్ఞము.

   తొలగించండి
  2. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   సరసమైన పూరణ మీది. అభినందనలు.

   తొలగించండి
  3. పెద్దలు సూర్యనారాయణ రావు గారికి, గురువర్యులకు ధన్యవాదములు.

   తొలగించండి
 23. ఆర్యా!నిజమా యియ్యది
  కారము నేత్రములబడిన గడు మోదమగున్
  వారల మాటలు వినకుము
  కారము మోదంబు గాదు కనులకు నెపుడున్

  రిప్లయితొలగించండి
 24. వేరొక దిక్కు లేదు నిను వేడెద దర్శన మిమ్ము రాఘవా
  చేరగ లేను భద్రగిరి చేదుకొనంగదె యంచు నేగుచో
  శ్రీరఘురామ ధామ మది చేరువయయ్యెడి వేళలోన ప్రా
  కారము కన్నులం బడిన గల్గదె మోదము మానవాళికి నే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   రామ మందిర ప్రాకార దర్శనం చేయించిన మీ పూరణ ప్రశస్తం. అభినందనలు.

   తొలగించండి
 25. తోరంబునయినప్రేమ య
  పారంబైనమమతయునుఁ ప్రణవమునకు సా
  కారపుమాతృ శ్రీయా
  కారము నేత్రములఁ బడిన గడుమోదంబగున్

  రిప్లయితొలగించండి
 26. గురువుగారు మీ చెప్పిన విధంగా దోషం,సవరించినాను. కృతజఞతలు

  రిప్లయితొలగించండి
 27. తీరును దప్పినట్టి పరదేశపు సైన్యము రెచ్చగొట్ట వి
  స్తార పరాక్రముల్ భరత సైనికు లెల్లరు సేయు నా తిర
  స్కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్
  సారపు సంస్కృతిం గఱపు జక్కని భారత పౌరకోటికిన్.

  రిప్లయితొలగించండి
 28. చేరెను రై తంగడికి న
  పారమ్మగు నాశతోడ వడ్లమ్ముటకున్
  కోరిన ధరతో నచ్చా
  కారము నేత్రములఁ బడిన గడుమోద మగున్.
  (అచ్చాకారము = క్రయవిక్రయాల నిశ్చయార్థం ముందుగా ఇచ్చే ధనం)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కాలోచిత పరాక్రమోపేత భారత సైనిక బృంద ప్రశంస తో మీ మొదటి పూరణ, ఘాటు కారమును తీపి యచ్చాకారముగా (కొత్త పదము) జేసిన మీ రెండవ పూరణ ప్రశస్తముగా నున్నవి.

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   ధన్యవాదాలు.
   నిజానికి 'అచ్చాకారము' నాకూ క్రొత్త పదమే. అందరూ రకరకాల కారాలను ప్రయోగిస్తూ ఉంటే నేను ఏదైనా విలక్షణమైన కారాన్ని ప్రయోగించాలను ప్రయత్నించాను. 'ఆంధ్రభారతి'లో శోధనలో 'కారము' టైప్ చేసి ప్రక్కన ఉన్న suffix ను ఎన్నుకొని వెదికితే కారముతో అంతమయ్యే ఎన్నోపదాలు కనిపిస్తాయి. అలా దొరికిందే ఈ 'అచ్చాకారము'.

   తొలగించండి
  3. సుకవి మిత్రులు శంకరయ్య గారూ...నమస్సులు! మీ పూరణములు రెండును చాలా బాగున్నవి. అభినందనలు!

   ముఖ్యముగా...మీ రెండవ పూరణమందలి అచ్చాకారము...బహుత్ అచ్ఛాహై!

   తొలగించండి
 29. దారను కాంచలేక పరి తాపము జెందెడు వేళ భక్తితో
  నా రఘు రామ కార్యమున నంబుధి దాటుచు వేగలంకనే
  జేరిన వాయుపుత్రుడట సీతకు జూపిన భీమవానరా
  కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్

  రారా! భద్రాచలమును
  జేరి భజించినను చాలు శ్రీకర మొసగున్
  శ్రీరఘు రాముని దివ్యా
  కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్

  నిన్నటి నా పూరణలు

  చేరును వ్యాధులెన్నియొ నశించు గదా జవ సత్త్వముల్ వయో
  భారము చేరినంతనిల వంశపరంపరమైనవై మితిన్
  మీరిన పత్యముండునిక మ్రింగక తప్పని యౌషధమ్ములున్
  భూరి యజీర్ణమంచు దిన బోయిన వేళన యాంక్షలుండగన్
  వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్

  కనుచూపు మంద గించును
  తనువున బిగువులు సడలును దంతము లూడున్
  వినికిడి తగ్గును ముదిమిన
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణలన్నీ నేటివి, నిన్నటివి బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 30. సారెకు సారెకున్ మిగుల సన్మతి తోడను నిత్యమున్ని రా
  కారుని పూజ జేయు ప్రజ గాంచిగ నద్భుత విశ్వ మోహనా
  కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్
  మారక పోవునా దురిత మార్గము నుండియు శాశ్వతంబుగా

  రిప్లయితొలగించండి
 31. రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'మగని+ఆకారము = మగని యాకారము' అవుతుంది కదా! 'ప్రేరణ గొలుప మగని యా।కారము...' అనవచ్చు కదా!

   తొలగించండి
 32. [10/3, 5:42 PM] sreeramaraochepuri: కారుణ్యమ్మును చూపగ
  చేరినఒడిలోననాధశిశువును చూడన్
  పారిన మాతృత్వపు మమ
  కారము నేత్రముల బడిన కడు మోదమగున్
  [10/3, 5:46 PM] sreeramaraochepuri: ఓరీ చిన్నా కన్నా
  రారాఈ బువ్వ తినగ రమ్మని పిలువన్
  నేరానను బాలుని యధి
  కారము నేత్రములబడిన గడు మోదమగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చేపూరి శ్రీరామారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 33. శ్రీరమణుని దర్శించగ
  నారితితో నడచి, వరుస నా తిరుమలలోన్
  మూరితి ఘన విభవాలం
  కారము నేత్రములఁ బడగఁ గడు మోదమగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఆరీతితో' అంటే గణదోషం. 'ఆరీతితొ' అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'ఆ రీతిని నడచి...' అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. ఆర్తి, ఆరితి అనే భావముతో వ్రాశాను. పరిశీలించ ప్రార్థన.

   తొలగించండి
  3. నిజమే! నాకు 'ఆరితి'... 'ఆరీతి' అని కనిపించి పొరబడ్డాను. మన్నించండి.
   మీ పూరణ అన్ని విధాల బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 34. పేరోలగమున కృష్ణుని
  ధీరోదాత్తవిమలయశ తేజో పారా
  వార విజయ గంభీరా
  కారమునేత్రముల బడిన గడు మోదమగున్

  రిప్లయితొలగించండి
 35. 3,10.16శ్రీగురువుగారైన కందిశంకరయ్యగారికివందనాలతోసవరించినపద్యముదయతోచూడగలరనిమనవి
  .కోరికలన్నిదీర్చ?ననుకొన్నవిధంబునచూడ నెంచి యే
  మారని భక్తి భావమున మానవు లెందరొ కొండలంచులన్
  జేరియు వేంకటేశు గని చేతులురెండును యెత్తి దైవమా
  కారము గన్నులంబడిన?గల్గదె మోదము మానవాళికిన్.
  2.హారమువేయుచు వధువే
  జేరగ ?తలదించసిగ్గు |చింతను బెంచన్
  ప్రేరణ గొలుపమగనియా
  కారము నేత్రముల బడిన? గడుమోదమగున్

  రిప్లయితొలగించండి
 36. ఊరక ప్రవచనములిడక
  నోరిమి ప్రేముడిని జూపి యుపకారగుణం
  బే రమణీయమనెడి మమ
  కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్

  రిప్లయితొలగించండి
 37. ​దూరము నుంచి వచ్చియు నితోధిక కానుక​ లందజేయుచున్
  కోరిన కోర్కులన్ని సమకూర్చుమటంచును మ్రొక్కుచున్ నిరా
  ధారులు కోరుకొన్నవి ప్రదానము జేసెడు వేంకటేశు నా
  కారము గన్నులంబడిన గల్గదె మోదము మానవాళికిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బొడ్డు శంకరయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దూరము నుండి...' అనండి.

   తొలగించండి
 38. దారుణముగ మండునుగద
  కారము నేత్రములబడిన, గడుమోదమగున్
  దీరుగ కలలన్నియు సా
  కారపు రూపమును దాల్చి గన్పించంగా!!!


  నారాయణుదరిసించగ
  సారంబగు గిరులు దాటి సన్నుతులిడుచున్
  చేరగ దేవాలయ ప్రా
  కారము నేత్రముల బడిన గడు మోదమగున్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'స+ఆకారము' అని మళ్ళీ రూపము అనడం పునరుక్తి కదా!

   తొలగించండి
 39. శ్రీ రమణీలలామ సరసీరుహ నేత్ర సముద్ర పుత్రికన్
  తీరున బెండ్లియాడియు హృదిన్నివసింపగ స్థానమిచ్చిన
  వ్వారిజ నేత్రితోడ ఘన పాలసముద్రము నుండు మోహనా
  కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్

  రిప్లయితొలగించండి
 40. మిత్రులందఱకు నమస్సులు!

  చేరియుఁ గాళియ హ్రదముఁ జివ్వునఁ గాళియుతోడ యుద్ధమున్
  గోరియు వాని గర్వమును గొబ్బున ఖర్వ మొనర్చి భోగమం
  దా రమణీయ భంగిమముఁ దాల్చియు నర్తిలు చిన్ని కృష్ణు మోహనా

  కారము గన్నులంబడినఁ గల్గదె మోదము మానవాళికిన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారికి అభివాదములు.

   దా రమణీయ భంగిమముఁ దాల్చియు నర్తిలు కృష్ణు మోహనా

   అని మీరు వ్రాయనెంచి యుండవచ్చునని అనుకుంటున్నాను. పరిశీలించ మనవి .

   తొలగించండి
  2. అవునండీ ఫణికుమార్ తాతా గారూ! ధన్యవాదములు!ఇందులో నేరుగా టైపు చేయుటచేతను, వెనుదిరిగి చూచుకొనకపోవుటచేతను "చిన్ని" అదనముగ వచ్చినది. దానిని తొలగించుచున్నాను.

   చేరియుఁ గాళియ హ్రదముఁ జివ్వునఁ గాళియుతోడ యుద్ధమున్
   గోరియు వాని గర్వమును గొబ్బున ఖర్వ మొనర్చి భోగమం
   దా రమణీయ భంగిమముఁ దాల్చియు నర్తిలు కృష్ణు మోహనా
   కారము గన్నులంబడినఁ గల్గదె మోదము మానవాళికిన్?

   తొలగించండి
 41. భారమటంచు తల్చకను భక్తిగ నెక్కితి మేడుకొండలన్
  తీరునటంచుకోర్కులట తిన్నగ దేవుని దర్శనమ్ముతో
  దారముఖమ్మురంజిలెను, తద్దయు దీప్తిని వేంకటేశు నా
  కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్

  రిప్లయితొలగించండి
 42. క్షమించండి.

  బీరము జూపగ మనపై
  పోరు సలుపెడు రిపులెల్ల భోరున నేడ్వన్
  భారతసేనఁ ఘన ప్రతీ
  కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్

  రిప్లయితొలగించండి
 43. క్షమించండి.

  బీరము జూపగ మనపై
  పోరు సలుపెడు రిపులెల్ల భోరున నేడ్వన్
  భారతసేనఁ ఘన ప్రతీ
  కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్

  రిప్లయితొలగించండి
 44. క్షమించండి.

  బీరము జూపగ మనపై
  పోరు సలుపెడు రిపులెల్ల భోరున నేడ్వన్
  భారతసేనఁ ఘన ప్రతీ
  కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్

  రిప్లయితొలగించండి
 45. కోరిక మీరగా సతులు కొట్టిన మామిడి ముక్కలందునన్
  తీరుగ నావపిండి నిడి దీటుగ ఘాటుగ నూనెపోయెగా
  పైరుల నుండి తెచ్చినది పచ్చిది యెర్రది ముద్దుముచ్చటౌ
  కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్

  రిప్లయితొలగించండి