22, అక్టోబర్ 2016, శనివారం

సమస్య - 2177 (సీతను బెండ్లాడి శివుఁడు....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"సీతను బెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్"
లేదా...
"సీతను బెండ్లియాడి శశిశేఖరుఁ డాత్మతనూభవుం గనెన్"

65 కామెంట్‌లు:

  1. ఏ తెరగున జనకుని జా
    మాతాయెను రఘుపతి? యుమ మగడెవ్వడు?భూ
    మాతయె యెవరిని గనియెన్
    సీతను బెండ్లాడి; శివుడు ; శిశువుంగనియెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జామాత+ఆయెను' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ 'జామాత యయెను..' అనండి.

      తొలగించండి
  2. చేతను డనియెడి ఛాత్రుడు
    కాతరుడయి గురువులడుగ గడగడ పలికెన్
    పోతన భారత రచయిత
    సీతను బెండ్లాడి శివుడు శిశువుం గనియెన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. డా.పిట్టా
    "సీత"ను నాగటి చాలును
    ఆతడు శివుడనెడు శశియె ఔషధ గుణపున్
    యూతమునిడ దినుసు లలరె
    సీతను బెండ్లాడి శివుడు శిశువును గనియెన్

    పూతమనస్క బార్వతియె పూచిన వెన్నెల దివ్యకాంతులన్
    వే తపమాచరించగను వీక్షణ జేయని వేళ ఘోరమౌ
    యాతప తీవ్రతన్ బెనగె నంతట రాగను మన్మథార్తి డ
    స్సీ తను బెండ్లియాడి శశి శేఖరుడాత్మతనూభవుం గనెన్. డా.పిట్టా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో కొంత అన్వయదోషం కనిపిస్తున్నది. 'చాలును ఆతడు' అని విసంధిగా వ్రాయరాదు. 'గుణపున్+ఊతపు' అన్నపుడు యడాగమం రాదు.
      రెండవ పూరణలో 'ఘోరమౌ నాతప..' అనండి. 'డస్సి' హ్రస్వాంతమే. డస్సియు అనే అర్థంలో దీర్ఘాంతం చేయరాదు.

      తొలగించండి


  4. సమస్య పూరణ రావటం లేదండీ
    అంటే మా అయ్యరు గారిచ్చిన సీరియస్ వార్నింగ్ :)


    ఏతావు రాముడు వెడలె
    సీతను బెండ్లాడి? శివుడు శిశువుంగనియె
    న్నేతావు జిలేబీ? ని
    న్నాతావుకు నంపెద! నకనక లాడెదవూ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణలోని చమత్కారం అదిరింది. అభినందనలు.
      'నకనక లాండంగన్' అనండి. 'ఆడెదవూ' అనడం గ్రామ్యం.

      తొలగించండి
  5. ప్రీతిన్ శిరమ్ము నుంచెను
    సీతను బెండ్లాడి శివుడు, శిశువును గనియెన్
    నాతిగ మారిన శౌరిని
    మాతంగి మగడు వరించి మదనుని హతితో
    సీతః గంగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రీతి శిరమ్మున నుంచెను' అంటే బాగుంటుంది.

      తొలగించండి
  6. ఆ తారకుని వధింపగ
    చేతస్సును పార్వతిపయిఁ జేర్చెన్ మారుం
    డాతరి వింటివె సఖి ! యో
    సీ ! తను బెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్ ||

    ఆతరి తారకాసురుడు హానిదలంపగ దేవతాళికిన్
    చేతసు గౌరిపై వెడలఁజేసెను మారుడు
    భస్మమౌచు తాన్
    తాతవరంబుకున్ తగినదౌ ఘనకార్యమునాచరింపనో
    సీ ! తను బెండ్లియాడి శశిశేఖరుఁ డాత్మతనూభవుంగనెన్ ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'చేతము గౌరిపై...' అనండి.

      తొలగించండి

    2. ఆర్య! అనేక నమస్కారములు. సందేహనివృత్తిగావించినందులకు ధన్యవాదములు. పద్యాన్ని సవరించి పంపుతున్నాను.

      ఆతరి తారకాసురుడు హానిదలంపగ దేవతాళికిన్
      చేతము గౌరిపై వెడలఁజేసెను మారుడు
      భస్మమౌచు తాన్
      తాతవరంబుకున్ తగినదౌ ఘనకార్యమునాచరింపనో
      సీ ! తను బెండ్లియాడి శశిశేఖరుఁ డాత్మతనూభవుంగనెన్ ||

      తొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు

    బ్రాతగు రామాయణమును
    రీతిగ నేర్వని మొఱకుడు లలి నెంచక దా
    పూతగ బల్కుచు ననియెన్
    సీతను బెండ్లాడి శివుడు శిశువుం గనియెన్.

    (బ్రాతి = గొప్పది; పూత = అసత్యము; మొఱకుడు = శుంఠ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. "సీత" అనే ప్రేయసిని, శివుడనేవాడు పెండ్లాడిన విధము:

    ఆతత ప్రేమను జేకొని
    రీతిని తన కేలుబట్ట లే జవరాలిన్
    ఖ్యాతిం బదుగురు మెచ్చగ
    "సీత"ను బెండ్లాడి "శివుడు" శిశువుం గనియెన్!

    రిప్లయితొలగించండి
  9. ఓ దేవత దాసితో..

    నీతిగఁ బంచగ సురలకు
    చేత నమృత కలశమందు సింగారి హరిన్
    బ్రీతిన్ గొనికౌగిట నో
    సీ! తను బెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. శివకళ్యాణం గురించి శ్రీరాముడు సీతకు తెలుపునట్లుగా నూహించి

    సీతా! భువిలోన భయో
    త్పాతము సృష్టించు చున్న తారకుడనె యా
    పాతకుని వధింపగ నో
    సీ! తను పెండ్లాడి శివుడు శిశువున్ గనియెన్

    రిప్లయితొలగించండి
  11. ప్రీతిని సేవ జేసినను పెద్ద తపమ్మొనరించి మించినన్
    నాతిని చూడడాయె మరి నాకులు దైత్యుని క్రూరచేష్టలన్
    భీతిల తారకాసురుని పీచమడంచుటకే గదా వినో
    సీ!తను బెండ్లియాడి శశిశేఖరుఁ డాత్మతనూభవుం గనెన్.

    రిప్లయితొలగించండి
  12. నా తమ్ముడి పేరు శివుడు.
    ఆతడు పెండ్లాడెవరిని? ఆమేంజేసెన్?
    ఈతడవన్వయ లోపము. సీతను బెండ్లాడి శివుఁడు. శిశువుం గనియెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జి.పి. శాస్త్రి గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది.
      'శివుడు+ఆతడు' అన్నపుడు విసంధిగా వ్రాయరాదు. 'శివుం డాతడు..' అనండి. మీ పద్యానికి నా సవరణ.......

      నా తమ్ముని పేరు శివుం
      డాతడు పెండ్లాడె నెవరి నాయమతో నే
      రీతిగ తండ్రిగ మారెను?
      సీతను బెండ్లాడి శివుడు శివుడు శిశువుం గనియెన్.

      తొలగించండి
    2. అద్భుతమైన సవరణ. శతకోటి ధన్యవాదాలు!

      తొలగించండి
  13. మిత్రుల పూరణలు బాగున్నవి. కాని గతంలో నేను ఇలా గే ' సీ! తను " అని చేసిన పూరణలో డా. విష్ణు నందన్ గారు ..తా, తాన్, తాను, అని తప్ప 'తను ' అను పదము వాడకూడదని సూచించినట్లు గుర్తు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి వారూ,
      నిజమే! పైన రెండు పూరణల వద్ద సందేహం వఛ్చి ఆంధ్రభారతిలో వెదికితే శ్రీహరి నిఘంటువు తను తాను పర్యాయ పదాలుగా చెప్పింది. శ్రీహరి నిఘంటువు జనవ్యవహారంలో ఉన్న పదాలకూ అర్థం చెప్పింది కాని దాని గ్రాంధిక భాషకు ప్రామాణికంగా తీసుకోరాదు.
      ఏమైనా ఇది సమస్యాపూరణం కనుక చూసీ చూడనట్టు వదిలేద్దాం!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారు, హనుమచ్ఛాస్త్రి గారు వందనములు.
      తనుబెండ్లి: తనుపు పెండ్లి: తృప్తికరపుపెండ్లి సమాసము సాధువని తలచెదను. పరిశీలించండి.

      తొలగించండి
    3. తను (వృత్తియందు తనుపు శబ్దమునకు మీఁది వర్ణము లోపింపఁగా మిగిలిన రూపము) ఉదంత స్త్రీసమము కాబట్టి నుగాగమము తనుఁ బెండ్లి; సమాసమున ద్రుతమునకు స్వత్వము లేదు కాబట్టి తనుబెండ్లి.

      తొలగించండి
  14. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    గీతను పె౦డ్లాడె | నొసటి

    గీత సరిగ లేక , చనియె |


    నా తరువాత మధులత

    నాతడు మనువాడె | కాని , ి

    యా తరుణి c బరీక్ష సేయ

    నామె వ౦ధ్య యట౦చు దేలె |

    సీతను పె౦డ్లాడి , శివుడు

    శిశువును గనియెన్ , త దు ప రి !


    { చను = మరణి౦చు ; చనియె = మరణి౦చె ;

    వ౦ధ్య = గొడ్రాలు , స౦తతి కయోగ్యు రాలు

    రిప్లయితొలగించండి
  15. ప్రీతిగ నుండెను రాముడు
    సీతను బెండ్లాడి, శివుడు శిశువును గనియె
    న్మాత గు పార్వతి జేసిన
    ప్రతిమది గణపతి రూపపు పార్థివ మేనన్

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారికి నమస్సులు. చివరి పాదం ప్రకారం గంగకు శివునకు సుతుడు జన్మించాడా? తెలియజేయ ప్రార్థన.

      తొలగించండి
    2. సత్యనారాయణ రెడ్డి గారు కుమారస్వామిని గాంగేయుడనే చెబుతారు.

      తొలగించండి
    3. పార్వతీ దేవికి శివుని ద్వారా పుత్త్రులున్నట్లు లేరు.

      తొలగించండి
    4. ఆతత నభోంతర ఘన ని
      పాత సుర నదీ మతల్లి పావన గంగా
      ధౌతోర్మి శౌచ జిత తుల
      సీ తనుబెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్

      [తనుబెండ్లి: తనుపు పెండ్లి: తృప్తికరపుపెండ్లి]


      సీతననంత దున్ని నర శేఖరు డాత్మజఁ బొందె నిమ్ముగన్
      సీతను బెండ్లియాడి రఘుశేఖరుఁ డాత్మజు లిద్దరిం గనెన్
      సీతను దస్క రించి దశ శీర్షుడు నాశము జేసె వంశమున్
      సీతను బెండ్లియాడి శశిశేఖరుఁ డాత్మతనూభవుం గనెన్

      [సీత = నాఁగటిచాలు, జానకి, గంగ; అనంత = భూమి]

      తొలగించండి
  17. సీతకు భర్తగ నెటు లగు?
    సీతను బెండ్లాడి. శివుడు శిశువు౦ గనియెన్
    ప్రీతి జగన్మోహిని యౌ
    నా తామరకంటి గూడి నయ్యప్ప నిలన్

    రిప్లయితొలగించండి
  18. ప్రీతిగ ప్రేమించి శివుని
    నాతియె నగరాజపుత్రి నానావిధముల్
    రీతిగ జపతపములచే
    సీ,తను బెండ్లాడి శివుడు శిశువునుగనియెన్

    రిప్లయితొలగించండి
  19. శ్రీవల్లి రాధిక గారి పూరణ.....

    లాతి లతాంగనామణిని లక్ష్యము జేయక రాముడుం డెరా
    సీతను బెండ్లియాడి, శశిశేఖరుఁ డాత్మతనూభవుం గనెన్
    మాత శివాని గర్భమున, మచ్చలు లేవను మేటిదంపతీ
    నీతికి వారెరా యెపుడు నిక్కపు టద్దము లెంచిజూడగన్

    రిప్లయితొలగించండి
  20. సీతకు జెప్పెనీ విధము శ్రీరఘు రాముడు, ధాత్రిలో భయో
    త్పాతము గల్గజేయు ఖలు తారకుడన్ దునుమాడగన్ సురుల్
    బూతిధరుండ గోర, గిరి పుత్రిని చేగొన సిద్ధమయ్యె నో
    సీ! తను బెండ్లియాడి శశిశేఖరుఁ డాత్మతనూభవుం గనెన్

    రిప్లయితొలగించండి
  21. ఖ్యాతి గడించిన నటుడౌ
    నాతని ప్రీతిగ శివుడని యారాధింపన్
    చేతులు కలుపుచు ప్రియసఖి
    సీతను బెండ్లాడి శివుడు శిశువుం గనియెన్!

    రిప్లయితొలగించండి
  22. భూతల మునకున్ పంపుచు
    సీతను బెండ్లాడి శివుడు శిశువుం గనియెన్
    మాతగు పార్వతి ఒడిలో
    నీతులు వినియెడి గణేశు నిమురుచు ప్రేమన్

    రిప్లయితొలగించండి
  23. సీతా శివకళ్యాణపు
    జాతకమే సరిపడదని జాప్యము జేయన్
    తాతకదే యిష్టంబన
    సీతను బెండ్లాడి శివుడు శశువున్ గనియెన్.

    రిప్లయితొలగించండి
  24. సీతయె మా సోదరికిన్

    గూతురు,శివుడన్న కొడుకు,కూర్మి నిరువురున్

    ప్రీతిగ మెలగుచునుండన్

    సీతను బెండ్లాడి శివుడు శిశువుంగనియెన్.

    రిప్లయితొలగించండి
  25. సీతా స్వయంవరమ్మున
    నా తాపసి క్రతువు శివమొనర్చియు వరుడై
    చేతన్ శివ ధనువెత్తుచు
    సీతను బెండ్లాడి శివుఁడు శిశువుం(ల) గనియెన్

    శివుడు = శుభము గూర్చెడు వాడు.

    రిప్లయితొలగించండి
  26. సీతకు రాముడెటుల పతి?
    నాతిని గన తపమొనర్చెనన నెవ్వండౌ?
    మాతయెననసూయ యెటుల?
    సీతను బెండ్లాడి,శివుఁడు, శిశువుం గనియెన్

    రిప్లయితొలగించండి
  27. మిత్రులందఱకు నమస్సులు!

    [’తన మనోహరుఁడైన శివుఁడు, మోహిని వలలోఁ దగుల్కొని, బిడ్డనుఁ గనె’ నని తన చెలికత్తెలకుఁ దెలుపుచుఁ బార్వతి వాపోయిన సందర్భము]

    "చేతను "పేత్వ" ముండఁగను, స్నిగ్ధతఁ జూపుచు, దైత్య దేవతా
    జాతము తన్నుఁ జూడఁగను, సౌరులఁ జిమ్మెడు ధూర్త, మన్మనో
    నేతను వంచనానఁ దన నెమ్మినిఁ జిక్కఁగఁజేయ, నప్పు డి

    స్సీ! తను బెండ్లియాడి, శశిశేఖరుఁ డాత్మతనూభవుం గనెన్!"

    రిప్లయితొలగించండి
  28. గీతావిద్యాలయమున
    సీతారత్నము గణపతి శివుడును లతయున్
    ప్రీతిగ చదివిరి తదుపరి
    సీతను బెండ్లాడి శివుడు శిశువుంగనియెన్!!!

    రిప్లయితొలగించండి
  29. డా.పిట్టా
    "సీత"ను నాగటి చాలును
    ఆతడు శివుడనెడు శశియె ఔషధ గుణపున్
    యూతమునిడ దినుసు లలరె
    సీతను బెండ్లాడి శివుడు శిశువును గనియెన్

    పూతమనస్క బార్వతియె పూచిన వెన్నెల దివ్యకాంతులన్
    వే తపమాచరించగను వీక్షణ జేయని వేళ ఘోరమౌ
    యాతప తీవ్రతన్ బెనగె నంతట రాగను మన్మథార్తి డ
    స్సీ తను బెండ్లియాడి శశి శేఖరుడాత్మతనూభవుం గనెన్. డా.పిట్టా

    రిప్లయితొలగించండి
  30. భీతిల రక్కసాధముల భీకర చేష్టలతో మునీశ్వరుల్
    ఘాతక దైత్యులన్ దునిమి క్రన్నన,రాముడయోధ్యకున్ జనెన్
    సీతను బెండ్లియాడి, శశి శేఖరుడాత్మతనూభవుం గనెన్
    నాతిగ మార శ్రీపతి, యనంగుని భాణతతిన్ వరించి తా

    రిప్లయితొలగించండి
  31. సవరణ......డా.పిట్టా
    మూడవ పాదం.
    యాతనలెన్నొ గల్గినవి య య్యవిబో(పో)ల్చగ సీత కష్టముల్
    సీతను బెండ్లి...........గా చదువ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  32. కోతలరాయుడు జెప్పెను
    ప్రీతిగ నేభాగవతము పిప్పిని జేస్తిన్
    తాతా !వినుమాయందున
    సీతను బెండ్లాడిశి వుఁడు శిశువుం గనియెన్.

    రిప్లయితొలగించండి
  33. శీతాద్రిన వసియించెడు
    శీతాచల పుత్రి జేయు సేవలు గనుచున్
    ప్రీతిగ కాలిక యౌ తొల
    సీ తను బెండ్లాడి శివుడు శిశువుం గనియెన్!!!


    ఖ్యాతిని బొందెను రాముడు
    సీతను బెండ్లాడి, శివుడు శిశువుం గనియెన్
    ప్రీతిగ నగజను చేకొని
    యాతారకుని వధియించు నాత్మజు బొందెన్!!!



    రిప్లయితొలగించండి
  34. చః దురమున రావణుండుకడు దోర్బలమున్ ప్రకటించి వచ్చితా
    సరసకు రామనిల్వుమని సాయకముల్ వడి నేయ నుగ్రుడై
    సురుముగచేసె దాశరథి శూరుడు చండ పరాక్రమమ్ముతో
    మరణమునొంద రావణుడు మారె రణస్థలి రుద్రభూమిగా

    రిప్లయితొలగించండి
  35. రాతిని నాతిగా మలచి రాముడ యోధ్యను చేరినాడయా
    సీతను బెండ్లియాడి;...శశిశేఖరుఁ డాత్మతనూభవుం గనెన్
    ప్రీతిని చూపగా గిరిజ పేరిమి తోడను షణ్ముఖుండనున్...
    చేతను కాదయా నికను చేయగ పూరణ నింతకన్ననున్

    రిప్లయితొలగించండి