త్రింశదర్థ పద్యరత్నము – పోకూరి కాశీపతి
ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.
18వ అర్థము
– హిమవన్నగేశ్వర స్మరణ
భూరి జఠర గురుఁడు = లంబోదరుఁడగు గణపతికి తాత
యైనవాఁడును,
నీరజాంబక భూతి = అనలాక్షుఁడగు శివునివంటి యైశ్వర్యము
గలవాఁడును,
మహిత కరుఁడు = గొప్ప (మంచుకొండ) కాంతి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = అధికతరమైన మణిసముదాయము
గలవాఁడును (పర్వత సానువులందు మణు లుండును),
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి సాధుమున కధీశ్వరుఁడైనవాఁడును
(తాపసోత్తముల కునికిపట్టయినవాఁడు),
అగ్ర గోపుఁడు = పై భాగమున దిక్పతులు గలవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మృతి లేనివారిలో మిక్కిలి
శ్రేష్ఠుడైనవాఁడును (అగు హిమవంతుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
రత్న మణిమయ జిలుగుల రాజితుండు
రిప్లయితొలగించండిపార్వతీ మాత తండ్రిగా బరగు నతడు
మంచు కొండకు రాజైన మహితు డతడు
వాని రక్షణ గోరుదు బ గలు రేయి