12, అక్టోబర్ 2016, బుధవారం

సమస్య - 2169 (పాలిమ్మని సుతుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్"
లేదా...
"పాలిమ్మంచును భర్త పాలికి సుతున్ బంపెన్ సతీరత్నమే"

79 కామెంట్‌లు:

 1. శ్రీలక్ష్మియను సుమంగళి
  బోలెడు పనిజేసియలసిపోతిన్ మగడా !
  ఆ లోపల పాత్రన్ గల
  పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్ ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలుంగంటిని కార్యభారమున సంపాదించుటన్
   డస్సెద
   న్నాలస్యంబగు నేడు వచ్చునది కర్మాగారమున్ వీడి మీ
   రాలోచింపకఁ జూచి వంటగదిలోనామూలకున్ పాత్రలో
   పాలిమ్మంచును భర్త పాలికి సుతున్ బంపెన్ సతీరత్నమే ||

   తొలగించండి
  2. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 2. ఆలిన్ బిడ్డల గాలికిన్ వదలి నీవా కాంతతో గూడినా
  వేలీలన్ సుతు నేను సాకుదును చేయిన్ చాచలేనెక్కడన్
  జాలిన్ జూపుము పిల్లవాని పయి కాస్తంతైన నీయాస్థిలో
  పాలిమ్మంచును భర్త పాలికి సుతున్ బంపెన్ సతీరత్నమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. కం. ఆలి యొకతె పలికె పతికి
  'నేలా యీ మొండి తనమె?' యీతని వెతల
  న్నాలించియు సంపద సగ
  పాలిమ్మని సుతుని భర్త పాలికి పంపెన్.

  రిప్లయితొలగించండి
 4. ఆలియొకతె "రీతిగ బరి
  పాలి"మ్మని సుతుని భర్త పాలికి బంపెన్
  ఏలికదే బాధ్యత మరి, గో
  పాలకుని దగును జనులును బశులుం జెదరన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 5. లాలించుచు బాటిల్లున
  పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్
  కూలీకి వెడుచు; బేలా!
  హేల నగరజీవనమ్ము యేల జిలేబీ‌!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   బాగున్నది మీ పూరణ. అభినందనలు.
   'కూలీ కేగుచు...' అనండి. 'జీవనమ్ము+ఏల' అన్నపుడు యడాగమం రాదు. 'జీవన మ్మిదేల' అనండి.

   తొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  లీలను గూడక వేశ్యల
  నేలెడి వాని సతి వెతల నెఱుక పఱచుచున్
  చూలికి సంపద లోనన్
  పాలిమ్మని సుతుని భర్త పాలికి పంపెన్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. లీలావతి యొకరోజున
  బాలకులకు వర్ణమాల వ్రాయించుటకై
  చాలవు మరికాసిని బల
  పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గురువుగారూ! నమస్కారములు. నిన్నటి పూరణ నొకసారి పరిశీలించగలరు.

  అమ్మవారి నెంచు నవతారములయందు
  దాక్షి గౌరి యగుచు దనరు తిథియె
  విదియ, నేడు వచ్చె విజయదశమి గాన
  విజయ నోలగించి వెలుగు గొనుడు.

  రిప్లయితొలగించండి
 9. శ్రీలం బంచవు క్షేమముల్ తెలియగా చేరంగ రాకుంటి వా
  శీలాకాంతయె సర్వమంచు సతమున్ సేవించుచున్నా వటన్
  చాలింకన్ భవదీయ నాటకము నీ సంపత్తిలోనుండి మా
  పాలిమ్మంచును భర్తపాలికి సుతుం బంపెన్ సతీరత్నమే.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 10. అలసితిని వంటపనిచే
  తలనొప్పియు బుట్టుచుండె తనయున కిపుడున్
  వలసినయటు ముద్దులు మురి
  పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. ప్రతి పాదంలోని మొదటి అక్షరం గురువు ఉండాలి. పొరబడినట్లున్నారు.

   తొలగించండి
  3. ఆర్యా!
   శాస్త్రిగారూ ధన్యవాదాలు, పొరపాటు జరిగింది. సవరించి వ్రాస్తున్నాను.

   చాలా యలసిన ప్రియసఖి
   బాలుని బహురోదనంబు బాపెడి యట్టుల్
   లాలించుచు ముద్దులు మురి
   పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.

   తొలగించండి
 11. శిలలంజెక్కెడి నాధుని
  యలసట గమనించినంత నాత్మీయతతోన్
  చాలిక, చెక్కిన యాశి
  ల్పాలిమ్మని సుతుని భర్తపాలికిబంపెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. ప్రతి పాదంలోని మొదటి అక్షరం గురువు ఉండాలి. పొరబడినట్లున్నారు.

   తొలగించండి
  3. మిత్రులు హనుమచ్ఛాస్త్రి గారికి నమస్సులు, పొరబాటును సూచించినందులకు ధన్యవాదాలు.
   మరొక పద్యం.....
   రాలంజెక్కెడు నాథుని
   తా లీలం బొంచిచూచి దప్పిగనుంటన్
   చాలిక చెక్కిన యా శి
   ల్పాలిమ్మని సుతుని భర్తపాలికి బంపెన్.

   తొలగించండి
 12. Dr.P.Satyanarayana
  కాలమ్మీగతి ,న్యాయ నిర్ణయమునన్ గాసిల్లు నో పౌత్రుడే
  జాలున్నాస్తిని బొంద వారసునిగా స్వాభావికంబిద్ధరిన్
  వ్రాలున్ జొప్పడపుత్రుడాస్తి గనునో వ్యాజ్యంబునన్ భూమిలో
  పాలి......................................
  పాలనపై విరుచుకపడ
  పాలితు రణబాణ విద్య బడసి యువతి తా
  చాలిన యమ్ముల గని చా
  పాలిమ్మని పుత్రు మగని..సుతుని భర్త..పాలికి బంపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 13. కాలమ్మీతీరు నడిచె
  నాలికి భర్తకు సుతులకు నాస్తుల గొడవల్
  మేలుగ నీవాటాసగ
  పాలిమ్మని సుతునిభర్త పాలికి బంపెన్

  రిప్లయితొలగించండి
 14. ఆలన పాలన మరచుచు
  నాలిని బిడ్డల నరయక నౌచితి లేకన్
  గాలికి దిరుగగ తమదౌ
  పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్!

  రిప్లయితొలగించండి
 15. మేలుగ నీరే పారగ
  కాలువనేతీయ తండ్రి గబగబ వెడలెన్
  వీలగు వస్తువులివి గున
  పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   గునపాలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. కలుషమతితోడ నిత్యముఁ
  బలువిధముల బాధనిడుచు పతివేఱుపడన్
  విలువైన యాస్తిలో సగ
  పాలిమ్మని సుతుని భర్తపాలికి పంపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. ఆలిని, తనయుని జేరిన
  లీలాపతిని బిగి కౌగిలింతల ముంచె
  న్నా లీల! ముద్దులును మురి
  పాలిమ్మని సుతుని భర్త పాలికి పంపెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మురిపాలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. ఆలుం బిడ్డల వదలితి
  రేలా ?యిక మా బ్రదుకుల నేమందు రొకో
  బాలక ! యడుగుము మఱి సగ
  పాలిమ్మని సుతుని భర్త పాలికి పంపెన్

  రిప్లయితొలగించండి
 19. పాలింతున్నిను జీవితాంతమనుచున్బ్రాజ్ఞుల్విలోకింపగన్
  దాళింగట్టితిరార్య బంధుతతులే తా సంతసంబందగా
  నేలీలన్ననువీడిపోవుటకటా యేహ్యంబు, కాదన్న నా
  పాలిమ్మంచును భర్తపాలికి సుతున్ బంపెన్ సతీరత్నమే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 20. వాలిన భక్తి వరానన
  శైలాత్మజ పూజ సల్పి సంపూర్ణముగన్
  మేలుగ నివేదనకు న
  ప్పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్

  [అప్పములు / ఆ పాలు]


  మేలౌ నొక్కని కొక్క దార బరువే మీనాక్షి యుగ్మం బిలన్
  గాలం బెప్పుడు నొక్క తీరుగను జక్కన్ సాగునే చెప్పుమా
  బేలల్ గారిభయాన లెల్లరు గనం బిత్రార్జితం బైన యా
  పాలిమ్మంచును భర్త పాలికి సుతున్ బంపెన్ సతీరత్నమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   అర్థవైవిధ్యంతో అప్పాలను ప్రయోగించిన మీ మొదటి పూరణ అద్భుతంగా ఉంది. రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 21. వేళకు తలనీలాలిడ
  నాలయ కళ్యాణకట్ట కరుగుమటంచు
  న్నాలియె వెంకన్నకు జుల
  పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   తల నీలాలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 22. బాలశశాంకునిదాల్చిన
  శూలధరుని దురితహరుని సుస్మితవదనున్
  హాలాహలగళునితడుప
  పాలిమ్మని సుతుని భర్త పాలికిఁబంపెన్!!!

  రిప్లయితొలగించండి
 23. ఆలికి సగ పాలిడె శివు
  డాలములో భాగమొసగె నతివకు కృష్ణుం
  డేలగ నీ యాస్తిని సగ
  పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 24. (1)
  పాలిమ్మని దాయాదుల
  నేల యడువ వింతకాల మెట్లాగితివో?
  క్రోలి చని నేనె యడిగెదఁ
  బాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్.
  (2)
  ధీలావణ్యసమేత కాంత శివరాత్రిన్ బూజ సేయంగఁ దా
  నే లింగమ్మున కొప్పఁ జేయఁ దలఁచెన్ క్షీరాభిషేకమ్ము "నా
  మూలం బెట్టిన దుత్తలో నుదయమే పోసెన్ గదా యత్త యా
  పాలి"మ్మంచును భర్త పాలికి సుతున్ బంపెన్ సతీరత్నమే.

  రిప్లయితొలగించండి
 25. తాలింపు వేయు తల్లిని

  బాలుండు బడికి వెడలుచు బలపములడుగన్

  వీలుండక తల్లికి బల

  పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.

  (ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ఇచ్చిన సమస్యకు
  నేను పంపిన పూరణము.)

  రిప్లయితొలగించండి
 26. జాలిన్ దల్చక నాలుబిడ్డలను దుష్టమ్మైన బుద్ధిన్ విడన్
  కాలున్ బోలెడు వల్లబుండు, వగతో కన్గొంచు దీనమ్ముగా
  మేలున్ కాంచగనెంచి నాత్మ జులకుం పిత్రార్జితమ్మందునన్
  పాలిమ్మంచును భర్తపాలికి సుతుం బంపెన్ సతీరత్నమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   'తల్చక' అన్నది కళ. కనుక 'జాలిం దల్చక యాలుబిడ్డలను...' అనండి.

   తొలగించండి
 27. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  పాలన్ జూషణ సేయగా కుచ పటుత్వ౦ బి౦త

  ……………… క్షీణి౦చు న౦

  చాలోచి౦చుచు , పాల క౦దునకు

  …… స్తన్య౦ బీక , మాన్పి౦చుచున్

  బాలన్ , సు౦దరి చేసె వాని కిక

  …… డబ్బా పాల నభ్యాస | " మీ

  వేళన్ వచ్చును చక్కనైన యొక

  …………… టీ.వీ. సీరియల్ , కావునన్


  పా లిమ్మ౦చును " భర్తపాలికి సుతున్

  …………… బ౦పెన్ సతీ రత్నమే

  రిప్లయితొలగించండి
 28. మిత్రులందఱకు నమస్సులు!

  (1)
  బాలకులు పాఠశాలకు
  గోలలు సేయుచునుఁ బోవ గొబ్బునఁ దానున్
  ద్రోలఁగ మఱి పలకా బల

  పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్!

  (2)
  పా లయిపోవఁగ భర్తనుఁ
  బాలనుఁ దెమ్మనఁగఁ, దెచ్చి, ప్యాకెటు ఫ్రిజ్‍లో
  కూలుగ నుంచఁగ, భార్యయె

  పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్!

  (3)
  చాలఁగఁ దగవులు కాఁగాఁ
  గాలజ్ఞానమ్ము లేని కాంతయె మగనిన్
  గాలుప నిఁక ముద్దులు మురి

  పా లిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్!

  (4)
  ఆలుమగలకుం గొడవయె
  నేలకొ? సుతుఁడేడ్చుచుండె నెలతుక కసితో
  "నేలొకొ నేనిత్తు?" ననుచుఁ

  బాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   మీ నాలుగు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి


  2. గుండు వారు అద్భుతః !


   ముద్దుమురిపాల లోనన్
   విద్దెగ బలపాలలోను విధవిధ పాలన్
   పద్దెముల బేర్చిరిగదా
   నద్దరి గుండుమధుసూధనార్యుల్ఘటికుల్ !

   జిలేబి

   తొలగించండి
  3. ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!

   ధన్యవాదాలండీ జిలేబీ గారూ! మీ పద్యం అదురహో!

   తొలగించండి
 29. మూలమ్మంతయు.గన?వెల
  యాలికి సంతుగలుగ ?మరియాదగ కలిమిన్
  ఆలికి,వెలయాలికి సగ
  పాలిమ్మనిసుతుని-భార్తపాలికి బంపెన్.
  2.మూలమ్మెంచక భార్యలిద్దరితొ సమ్మోహాన జీవించుటా?
  కాలమ్మన్నది కల్పనాగతుల సంకల్పాన నూగించగా?
  వేలమ్మట్లుగ బంచి రాస్తులను నిర్వేదంబు జూపించి సో
  పాలిమ్మంచును భర్త పాలికి సుతున్ బంపెన్ సతీరత్నమే|

  రిప్లయితొలగించండి
 30. ఆలస్యంబయ్యె ననుచు
  నాలలనామణి సుతుడు నాపక యేడ్వన్
  బాలున కిపుడే సీసా
  పాలిమ్మని సుతుని భర్త పాలికి పంపెన్.

  పాలిమ్మటంచు నేడ్చుచు
  బాలుడు రాగా పలికెను భామామణియున్
  బాలా నాన్న నడుగుమని
  పాలిమ్మని సుతునిభర్త పాలికి పంపెన్.

  కాలితొ తన్నుచు తిట్టుచు
  చాలా కష్టములిడ పతి సత్తువ తగ్గన్
  గోలిక వలదు సగంబౌ
  పాలిమ్మని సుతుని భర్త పాలికి పంపెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   చివరి పద్యంలో కాలితొ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. గోల+ఇక.. అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "కాలన్ దన్నుచు.... గోల యిక వలదు సగమౌ" అనండి.

   తొలగించండి
  2. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   చివరి పద్యంలో కాలితొ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. గోల+ఇక.. అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "కాలన్ దన్నుచు.... గోల యిక వలదు సగమౌ" అనండి.

   తొలగించండి
 31. వేలుపురివారి కావ్యము
  మేలిరకపుసాహితీసమీకరణంబున్
  మాలిని యాపొత్త'మమర
  పాలి'మ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్"

  వేల్పూరి కామేశ్వరరావుగారి సాహిత్యాకాడమీ బహుమతి రచన ఆమ్రపాలి.
  గణముల అమరిక కొరకు 'అమరపాలి'గామార్చాను
  పెద్ద చదువరి కానందువల్ల మాలిని అమర అని పలికిందని సమర్థన

  రిప్లయితొలగించండి
 32. చాలు న్నేరుప మంచు నాన్న నిదిగో సాధించబో కాయనే
  కాలుం జేతులు నాడబోక పనితో కంగారుగా నుండగా
  నేలా నీకిపు డింత శ్రద్ధ పనిపై యీ ఫ్లాస్కుతో వారికా
  పాలిమ్మంచును భర్త పాలికి సుతున్ బంపెన్ సతీరత్నమే.

  రిప్లయితొలగించండి
 33. ( నా రెండవ పూరణము )

  పాలే ప్రతిరోజు గొనెడు

  బాలుడు పాలడుగ తల్లి పనిమీదుండన్

  మూలన లోటాలో గల

  పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 34. కాలాతీతము కాకముందుగను సత్కాలాన సంధ్యావిధిన్
  సాలగ్రామ గణేశ సూర్య లలితా సంయుక్త లింగంబు న్స
  చ్ఛీలుండై విధిపూజసేయనవనిన్ శ్రీఘ్రంబు సౌరభ్య పు
  ష్పాలిమ్మంచును భర్త పాలికి సుతున్ బంపెన్ సతీరత్నమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణికుమార్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
   రెండవ పాదం చివర గణదోషం. 'లింగంబు స।చ్ఛీలుండై..' అంటే సరి!

   తొలగించండి
  2. గురువుగారూ ధన్యవాదములు. గగణ దోషాన్నిగమనించలేదు. మన్నించండి. సవరణకి ధన్యవాదములు.

   తొలగించండి
 35. పాల దుకాణం భర్తకు:

  పాలన్ గోవుల పాలు జూచితినిరా పాడాయె వేసంగిలో
  పాలన్ గేదెల పాలు జూచితినిరా పాడాయె వర్షాలలో...
  కాలం మారెను చంద్రుడిచ్చు హెరిటేజ్ కంపెన్ని ప్యాకెట్టు వౌ
  పాలిమ్మంచును భర్త పాలికి సుతున్ బంపెన్ సతీరత్నమే!

  రిప్లయితొలగించండి