16, అక్టోబర్ 2016, ఆదివారం

సమస్య - 2172 (రంభాపతి రాముఁ డయ్యె..)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రంభాపతి రాముఁ డయ్యె రాజస మొప్పన్"
లేదా...
"రంభావల్లభుఁ డయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడై"

56 కామెంట్‌లు:

 1. దంభము బలుకగ నొకకవి
  సంభావన పొంద గోరి సంతసమందున్
  శంభుని గొలిచెను భక్తిగ
  రంభాపతి రాముఁ డయ్యె రాజస మొప్పన్

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. కం. ఉంభిత సంబర మనమున
   అంభోరుహ పత్ర నేత్ర యదరంగను సం
   రంభింపకయే తా సం
   రంభాపతి రాముడయ్యె రాజస మొప్పన్.
   సంరంభ =తొట్రుపడుచున్న(సీత); తత్తర పడుచున్న(సీత)

   తొలగించండి
 3. కం. శంభుని విలు భేదించియు
  అంభోరుహ పత్ర నేత్ర యదరంగను సం
  రంభింపకయే తా సం
  రంభాపతి రాముడయ్యె రాజస మొప్పన్.
  ***()()***
  సంరంభ =తొట్రుపడుచున్న(సీత); తత్తర పడుచున్న(సీత)

  రిప్లయితొలగించండి
 4. జంభారి పలికె నిటు "సం
  రంభంబున నరుఁడుగా ధరన్ బుట్టి సమా
  రంభాసుర హరుఁ డా హరి
  రంభాపతి! రాముఁ డయ్యె రాజస మొప్పన్"

  రిప్లయితొలగించండి
 5. డంబరమున కౌసల్యా
  డింభకుడా హరధనువును ఠేవన్ గూల్చన్
  కుంభిని సుత సిగ్గులనల
  రం(న్)భాపతి రాముడయ్యె రాజస మొప్పన్

  రిప్లయితొలగించండి


 6. అంబరముల జేరిన యా
  సంబరములజూచినడుగ సఖియే యనియెన్
  బింబానన యా సీతకు
  రంభా, పతి రాముడయ్యె రాజస మొప్పన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. శంభు సుతుడు రాముడు వి
  స్కంభము దాటగ యరటిని సతిగా గొనియెన్!
  శంభోదరు కీడు తొలగె!
  రంభాపతి రాముడయ్యె రాజసమొప్పన్!
  (మొదటి భార్య చని పోతుందన్న గ్రహ యోగపు ఫలితాన్ని ఇబ్బంది కలిగించని విధంగా మార్చుకునేందుకు ఆ శంభుని కొడుకు రాముడు అరటి చెట్టుతో చేసుకున్నాడు. దానితో అతనికి గల కీడు తొలగిందన్నది నా భావం. ధన్యవాదములు).

  రిప్లయితొలగించండి
 8. చిన్ననాటి సినిమాల స్మృతులలో సరదాగా రాస్తున్నాను...క్షమించవలె...


  శ్రీ పింగళి కవితలలో
  డింభక డింగరి పదములు ఢమరులు మ్రోగన్
  కంబళి గింబళి కాగా
  రంభాపతి రాముఁ డయ్యె రాజస మొప్పన్

  రిప్లయితొలగించండి
 9. జృంభణమున విల్లు విరచి
  యంభోరుహ పత్ర నేత్రు డవనిజ తోడన్
  సంభారం బందగ సం
  రంభాపతి రాముడయ్యె రాజసమొప్పన్!

  రిప్లయితొలగించండి
 10. రాయబారం సందర్భంగా చివరిగా శ్రీకృష్ణుడు దుర్యోధనునితో అన్న మాటలుగా నిన్నటి దత్తపదిని ఒక కందంలో కూడా పూరించడానికి ప్రయత్నించాను అన్వయం, అర్ధాలు కుదిరాయా ? పరిశీలించి సవరణలు సూచింప గోరుతాను. - ధన్యవాదములు.
  దోసము నెఱుగని ఙ్ఞాతుల
  మోసముతో గెలువ బూని మురిసిన నాడే
  యాశలడగారె! దారులు
  మూసిరి సంధికి! వడకుచు పూరి గఱతువా!

  రిప్లయితొలగించండి
 11. శంభుని మఱి యొక నామము
  రంభాపతి, రాముడయ్యె రాజస మొప్ప
  న్దo భము జూపుచు రణమున
  దంభపు రక్కసుల జంపి దానుగ నిలలోన్

  రిప్లయితొలగించండి
 12. శంభుని విల్లెత్తగనే
  భంభమ్మని విరుగగానె భాస్కర కులజున్
  కుంభినిసుత మెచ్చెన్ గద
  రంభా! పతి రాముఁ డయ్యె రాజస మొప్పన్.

  రిప్లయితొలగించండి
 13. జంభారి పలికె నిటు "సం
  రంభంబున నరుఁడుగా ధరన్ బుట్టి సమా
  రంభాసుర హరుఁ డా హరి
  రంభాపతి! రాముఁ డయ్యె రాజస మొప్పన్"

  రిప్లయితొలగించండి
 14. మిత్రులందఱకు నమస్సులు!

  [ఆకసముననుండి శివధనుర్భంగమును వీక్షించుచున్న రంభతో నామె చెలికత్తె పలుకుచున్న సందర్భము]

  "సంభావించి ధనువును వి
  జృంభించియుఁ ద్రుంపఁ, బతిగఁ జేసికొనన్ సం
  రంభించిన సీతకు, నో

  రంభా! పతి రాముఁ డయ్యె రాజస మొప్పన్!"

  రిప్లయితొలగించండి
 15. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { శి వ ధ ను ర్బ ౦ గ ము త దు ప రి ,

  సీ త తో , చె ౦ త ను న్న చె లి య లు

  ప లు కు మా ట లు }


  శ౦భు విలు విరిచె , శౌర్యా

  ర౦భకు డైన రఘుపతి | ధరణిజ ! వలదు స౦

  ర౦భము | ఓ నవమోహా

  ర౦భా ! పతి రాము డయ్యె రాజస మొప్పన్ !

  రిప్లయితొలగించండి
 16. రంభంగాంచియు నారదుండు తెలిపెన్ రామావ తారాసుధల్
  గంభీరుండును లోకబాంధవుడునౌ కారుణ్య రూపుండె యా
  యంభస్సారము గేలిసేయు ముఖియౌ భూపుత్రి పూబోడికిన్
  రంభా ! వల్లభుడయ్యె రాజసమునన్ రాముండు సఛ్ఛీలుడై.

  రిప్లయితొలగించండి
 17. శంభుసఖుని సుతుడెవ్వడు ?
  శాంభవికెవ్వని గుఱించి శర్వుడుజెప్పెన్ ?
  రంభకు మగడెట్లుండును ?
  రంభాపతి రాముఁ డయ్యె రాజసమొప్పన్ ||

  కంభోజాననుడైన దాశరథి లంకంజేరి దైత్యేంద్రునిన్
  శుంభద్విక్రమమున్ వధించి సురులున్ స్తోత్రంబుగావింప సం
  రంభంబున్ నగరమ్ముజేరి ముదమున్ రాజ్యాఖ్య సీమంతినీ
  రంభావల్లభుఁడయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడై ||

  రంభా = అందమైన స్త్రీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆర్య! గుండు మధుసూదన్ గారూ! అనేక నమస్కారములు. ఈరోజు చాలా పనిభారంతో ఉండి గమనించలేదు. నా ఆధ్వర్యవమున రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి అవధానం జరుగుతున్నది.

   తొలగించండి
  2. నా దోషం తెలియజేసినందుకు ధన్యవాదాలు. సవరించి పంపుతున్నాను.

   గంభీరాననుడైన దాశరథి లంకంజేరి దైత్యేంద్రునిన్
   శుంభద్విక్రమమున్ వధించి సురులున్ స్తోత్రంబుగావింప సం
   రంభంబున్ నగరమ్ముజేరి ముదమున్ రాజ్యాఖ్య సీమంతినీ
   రంభావల్లభుఁడయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడై ||

   తొలగించండి
  3. సుకవి మిత్రులు అనిల్ గారూ...నమస్సులు! సవరించిన మీ పూరణ చాలా బాగున్నది. మీరు రాంభట్లవారి అవధానానికి ఆధ్వర్యం వహించినందులకు శుభాభినందనలు!

   తొలగించండి
  4. ఆర్య! అవధానం విజయవంతంగా ముగిసినది. ధన్యవాదాలు.

   తొలగించండి
 18. శంభుని ఘనమగు వింటిని
  గంభీరమ్ముగను ద్రుంఛి కాకుత్స్థుడు సం
  రంభాలోకన సీతకు
  రంభా! పతి రాముఁ డయ్యె రాజస మొప్పన్


  అంభోరాశి విలగ్న నిర్మితము సంస్త్యాయాగ్రణీ ద్వారకన్
  గంభీరాజప శేఖరుండు ఘనుడుం గంసారి సోదర్యుఁడు
  న్నంభారావము లుప్పతిల్లగ సుకన్యా రేవతీ ధిక్కృతా
  రంభా వల్లభుఁ డయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడై

  రిప్లయితొలగించండి
 19. శంభుడు తన సతిని బిలచి
  రంభా! పతి రాముడయ్యె రాజసమొప్పన్
  కుంభిని బుత్రిక సీతకు
  జృంభణముగ వారి ప్రేమ క్షితిలో నిలచున్!!!

  కుంభిని= భూమి
  రంభ = పార్వతి

  రిప్లయితొలగించండి
 20. జంభారి పలికె నిటు "సం
  రంభంబున నరుఁడుగా ధరన్ బుట్టి సమా
  రంభాసుర హరుఁ డా హరి
  రంభాపతి! రాముఁ డయ్యె రాజస మొప్పన్"

  రిప్లయితొలగించండి
 21. జంభారి పలికె నిటు "సం
  రంభంబున నరుఁడుగా ధరన్ బుట్టి సమా
  రంభాసుర హరుఁ డా హరి
  రంభాపతి! రాముఁ డయ్యె రాజస మొప్పన్"

  రిప్లయితొలగించండి
 22. (2)

  [ఆకసముననుండి శివధనుర్భంగమును వీక్షించుచున్న రంభతో నామె చెలికత్తె పలుకుచున్న సందర్భము]

  అంభోజానన మోదమందఁగనుఁ దా నా శర్వు చాపమ్ము ను
  జ్జృంభింపంగఁ దరస్వి క్రొమ్మెఱుఁగు నోజం దాని మోపెట్టఁగన్
  స్తంభోద్భేదిత భాతి ఖండితమయెన్; దా నప్పుడా సీత కో

  రంభా! వల్లభుఁ డయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడై!

  రిప్లయితొలగించండి
 23. శంభుని విలుగొను పాత్రకు
  రంభను బెండ్లాడినట్టి రాజిత నట స
  రంభుని నెంచగ ముదమున
  రంభాపతి రాముఁడయ్యె రాజసమొప్పన్

  రిప్లయితొలగించండి
 24. శంభు సఖుని తనయుండే
  రంభాపతి. రాముడయ్యె రాజస మొప్పన్
  కుంభిని సుత సీత పతిగ
  శంభుని విలు విరిచి సురలు సన్నుతి సేయన్

  రిప్లయితొలగించండి
 25. రంభాపతి”అభినయనము
  సంభరమును సాకుచుండు సర్వులు మెచ్చే
  డంభము విడి నాటకమున
  “రంభాపతి”రాముడయ్యె రాజస మొప్పన్|
  2.డంభంబేమియు లేనిరాఘవుడటన్ ఢాంయన్నరావంబుతో
  శంభుండుంచిన విల్లు ద్రుంచెగద? విశ్వాసమ్ము సీతమ్మదై
  సంభోదించగ సీతయందమట విశ్వంబందు విఖ్యాతియౌ
  రంభా| వల్లభుడయ్యె రాజసమునన్ రాముండు సచ్చీలుడై

  రిప్లయితొలగించండి
 26. డా.పిట్టా
  రంభన్గన సరినరునకు
  సంభావింపంగనెన్ని సంకటతతులో
  గంభీర ధరణి జనకజ
  రంభా, పతి రొముడయ్యె రాజసమొప్పన్

  దంభాలెన్నొ వివాహ బ్రక్రియలలో దారంభనున్ యెంచి వే
  గంభీరంబుగ బ్రోచుకొందు ననుచున్ గైకొన్న హస్తంపు సం
  రంభంబప్పటి దాయె భీరునియెడన్ రాజిల్లెనే యాన? భూ
  రంభావల్లభుడయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుడై

  రిప్లయితొలగించండి
 27. శంభుని విలు బట్టగ జని
  గంభీరుడు రావణుండు కనుమరుగవగా
  శాంభవి బలికెను దివినో
  రంభా!పతి రాముఁ డయ్యె రాజస మొప్పన్

  రిప్లయితొలగించండి
 28. గంభీరుండు సమస్తధర్మగుణ విఖ్యాతప్రభాసుండు సం
  రంభప్రేరితుఁడై మహేశ్వరు ధనుర్భగంబు గావించి యా
  శుంభత్కాంచన దేహ జానకి మనశ్శోభావిహారేఛ్ఛనా
  రంభావల్లభుఁ డయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడై

  రిప్లయితొలగించండి
 29. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  నిన్న కర్నూలు వెళ్లి అష్టావధాని మద్దూరి రామమూర్తి గారిని, డా అనంత్ మూగి గారిని కలిసి, ఈరోజు ప్రొద్దుటూరు వెళ్లి గుండా సహదేవుడు గారిని, చిత్ర కవితా ప్రపంచం బ్లాగు నిర్వాహకులు రమణ రాజు గారిని కలిసి తిరుగు ప్రయాణంలో ఉన్నాను. మీ పూరణలను రేపు సమీక్షిస్తాను.
  మన్నించండి.

  రిప్లయితొలగించండి
 30. శంభున్ చాపమునెత్తి ద్రుంచెగద సు క్షత్రీయుడౌ ధీరుడే
  రంభన్ మించిన యందచందములతో రాజిల్లు సీతమ్మనే
  గంభీరుండగు సూర్యవంశ విభుడే కళ్యాణమాడన్ మనో
  రంభావల్లభుఁ డయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడై

  రిప్లయితొలగించండి
 31. నలకూబరుడు రంభతో మాటాడుతున్నట్టుగా నూహించి

  శంభుని చాపమ్మువిరిచి
  యంభోరుహనేత్రుడైన హరియే నరుడై
  కుంభిని సుతయౌ సీతకె
  రంభా! పతి రాముఁ డయ్యె రాజస మొప్పన్

  రిప్లయితొలగించండి
 32. శంభుని విలుగొను పాత్రకు
  రంభను బెండ్లాడినట్టి రాజిత నట స
  రంభుని నెంచగ ముదమున
  రంభాపతి రాముఁడయ్యె రాజసమొప్పన్

  రిప్లయితొలగించండి
 33. శంభుడు ముదమున పలుకుచు
  రంభాసుత విను దెలిపెద రామాయణమున్
  కుంభిని సుతకును నో,హే
  రంభా,పతి రాముడయ్యె రాజస మొప్పన్.

  రిప్లయితొలగించండి
 34. శంభుడు ముదమున పలుకుచు
  రంభాసుత విను దెలిపెద రామాయణమున్
  కుంభిని సుతకును నో,హే
  రంభా,పతి రాముడయ్యె రాజస మొప్పన్.

  రిప్లయితొలగించండి
 35. పుంభావ సరస్వతి మరి
  జంభారి యగు నరభుజునిఁ జంపుతలంపున్
  శాంభవి యన్న వికుంఠపు
  రంభాపతి రాముఁ డయ్యె రాజస మొప్పన్

  రిప్లయితొలగించండి
 36. క్రొవ్విడి వెంకట రాజారావు

  కుంభిని వెలిగిన బుధులను
  దంభముతో బట్టి యణచు దనుజుల జంపన్
  సంభవ మొందిన శివుడా
  రంభాపతి రాముడయ్యె రాజసమొప్ప

  (రంభాపతి= పార్వతి భర్త)

  రిప్లయితొలగించండి
 37. జంభంబందున తోటరాము డొకచో సంశోధనన్ జేయుచున్
  స్తంభం వోలెడి రంభ నొక్కటిని తా స్థాపించగా తోటలో
  గంభీరంబగు ప్రేమతోడ నతడా కార్యంబులో మగ్నుడై
  రంభావల్లభుఁ డయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడై :)

  రంభ = అరటి చెట్టు

  రిప్లయితొలగించండి