కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జారుల మాటలన్ వినని జాతి పురోగమనమ్ముఁ జెందునా"
లేదా...
"జారుల మాటలను వినని జాతి నశించున్"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జారుల మాటలన్ వినని జాతి పురోగమనమ్ముఁ జెందునా"
లేదా...
"జారుల మాటలను వినని జాతి నశించున్"
కోరిన వరముల నొసగెడు
రిప్లయితొలగించండిశ్రీరమణున్నిత్యము మది సేవించుచునే
హారతు లిచ్చెడి గుడిపూ
జారుల మాటలను వినని జాతి నశించున్.
ఉ.నేరము లెక్కుడౌ భువిని నేర్పుగ లేశము బాధపెట్టకన్
రిప్లయితొలగించండిమారుపు దెచ్చునట్లుగ సమాజమునందున శాంతి నిల్పగన్
హారతు లిచ్చుచున్నజుని కర్చన నిత్యము జేయుచుండు పూ
జారుల మాటలన్ వినని జాతి పురోగమనమ్ము జెందునా?
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితీరుని గూడిన భక్తిని
సౌరిని పూజించుచు సరి సంవేదములన్
కూరిమితో చెప్పెడి పూ
జారుల మాటలను వినని జాతి నశించున్.
సూరిని నిచ్చలు భక్తిని
ధారుణి నందున చెడుగులు తలగుట కొఱకై
నారాధించ మనెడి పూ
జారుల మాటలను వినని జాతి నశించున్.
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండిఆ రవి గాంచని చోటుల,
వీరవిహారముల జేయు విప్లవ కారుల్,
నేరస్థుల జాడ తెలుపు
జారుల మాటలను వినని జాతి నశించున్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిచారులతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
జిలేబిగారూ! బలే!
తొలగించండిచోరపు బుద్ధిని రావణు
రిప్లయితొలగించండిడారాముని జేత జిక్కి లంకను కూలెన్
ఔరా హితమును జెప్పెడి
జారుల మాటలను వినని జాతి నశించున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పోరఁ గురుక్షేత్రమునన్
రిప్లయితొలగించండిజేరియుఁ గర్తవ్య మెఱుఁగఁ జేసెడి గీతా
సారమ్మగు నర్జున దను
జారుల మాటలను వినని జాతి నశించున్.
(తప్పలేదు... నా కిష్టంలేని అఖండయతిని వేయవలసి వచ్చింది!)
మాస్టరుగారూ! మీ అర్జున దనుజారుల పూరణ అద్భుతం.
తొలగించండిగోలి వారూ,
తొలగించండిధన్యవాదాలు.
గురువుగారి పూరణ చాలాబాగుంది.
తొలగించండిగురువు గారూ మీ పూరణ యద్భుతం....
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
తొలగించండిస్వర సమాగమమున గాని వ్యంజనములకు మనుగడ లేదు. అది సహజమైనా ఆగమమైనా.
యతి మైత్రి స్థానము లో యన్యపు హల్లు తో గాక స్వీయ హల్లు తో గూడి యుండుట శ్రేయస్కరము.
కనుక అఖండ యతి అనింద్యమే.
మంద పీతాంబర్ గారికి, విరించి గారికి, కామేశ్వరరావు గారికి
తొలగించండి......... ధన్యవాదాలు......
చేరికలో గొన రెవ్వరు
రిప్లయితొలగించండిజారుల మాటలను! వినని జాతి నశించున్,
పేరిమితో పరుల వినుచు
భూరిగ యోచించి జనుము, పొందుడు జయముల్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
కాని కొంత అన్వయలోపం ఉన్నట్లు సందేహం.
డా.పిట్టా
రిప్లయితొలగించండికోరిన పదమునకగు నతి
కూరిమిని గణింపపూజకున్ రిపులే పూ
జారులు పూజకులే వ్యా
జారుల మాటలను వినని జాతి నశించున్
అరరే!బంజరు భూముల
నరికట్టుక మేడ గట్టు టన్యాయము మే
లరసిన యాదిమగణ బన్
జారులమాటలను వినని జాతి నశించున్
పారునిదంచు నొక్కొక యుపాయముతో తగవుల్ బిగించుచున్
జారుకొనంగ నౌ తుదకు సత్యమె గెల్చును న్యాయవేదికన్
పోరునటుంచి యాత్మలను పూర్ణముగా నెర నమ్ము నట్టి వ్యా
జారుల మాటలన్ విన ని జాతి పురోగమనమ్ము జేయునా? Dr.Pitta
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిబాగున్నవి మీ పూరణలు. అభినందనలు.
మొదటి, మూడవ పూరణలలో 'వ్యాజారుల'....?
రెండవ పూరణలో సమస్య పాదం గురువుతో ప్రారంభమైతే మీరు పై మూడు పాదాలను లఘువుతో ప్రారంభించారు.
ఆర్యా. డా.పిట్టా నుండి
తొలగించండిజారులు . బిందు పూర్వకం ఐతే చారులు ఔతుంది.పూజారి,శబ్దం శబ్ద ర. లో లేదు.వ్యాజము అంటే కపటం.అరి కలిస్తే .కపటానికిశతృవు.నిష్కపటి.పూజ సం.అరిసం.పదాలు.పూజారి పూజకు శతృవుకాదు.గ్రామ్యాదిశబ్దాలవాడుక వద్దు.అందుకని వ్యాజారి వాడితిని.కందంలో అన్ని గణాలు సరిచూచాను.హ్రస్వాన్ని మొదట ఉపయోగించ కూడదన్న నియమం ఏ గ్రంధంలోనిదో తెలియదు.వివరించండి సమయమున్నప్పుడు.
చారుతరాగ్రభావనలు సల్పు నిరంతర పుణ్యవర్తనుల్
రిప్లయితొలగించండిచేరి సమస్తలోకులకు సేమమొసంగగ దైవసన్నిధిన్
కోరితదేకమర్థనము, గుప్తదరిద్రమునొందుచుంద్రు, పూ
జారుల మాటలన్ వినని జాతి పురోగమనమ్ముఁ జెందునా ?
చారుతరభావనమ్మున
కోరుచు సర్వుల సుఖమును గుప్తదరిద్రం
బే రుచిఁ జూచుచుఁ గల పూ
జారుల మాటలను వినని జాతి నశించున్ ||
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కూరల నారల ధరలును
రిప్లయితొలగించండిచీరల కారుల షరాబు చక్కెరవెల బం
గారును వెండియు షేరుబ
జారుల మాటలను వినని జాతి నశించున్!
జి. పి. శాస్త్రి గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
యతి ఎగిరింది సార్!
తొలగించండి
తొలగించండిజీపీయెస్ వారి మొదటి పద్య మన్న మాట :)
రావటం రావటం షేరు బాజారు తో మొదలెట్టేరు.
నాటికి నిఫ్టీ ఇండెక్సు - 8600+
నేటికి ఇండెక్సు - 10000 + :)
చీర్స్
జిలేబి
__/\__
తొలగించండివారలు నెల్లవేళలను వారీజనాభుని భక్తి మార్గ సం
రిప్లయితొలగించండిచారులు సద్గుణాశ్రయులు సంతతశౌరి పదార్చనారతుల్
సారమతీంద్రు లట్టిశృతి శాస్త్రులునాస్తికభావవాగుదా
జారుల మాటలన్ వినని జాతి పురోగమనమ్ముఁ జెందునా
వాక్ ఉదాజ అరులు
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధీరులగుచు దేశపు సం
రిప్లయితొలగించండిచారు లగుచు నహరహంబు చాతురి తోడన్
తీరున భావము దెలుపం
జారుల మాటలను వినని జాతి నశించున్!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేరకు లేమిని బంధుల,
రిప్లయితొలగించండిదూఱకు మనుచితఁపు చోటు,దుష్టుల చెలిమిన్
కోరకు, కూడకు తగదను
జారుల, మాటలను వినని జాతి నశించున్
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘోరమగు నేరములతో
రిప్లయితొలగించండిచూఱాడుచుప్రజల సొమ్ము చూప నరకమున్
చోరుల కనిపెట్టుటకున్
జారుల మాటలను వినని జాతి నశించున్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కారడవులలో మృగసం
రిప్లయితొలగించండిచారముగల గిరులదరిన సాహసులై సం
సారముసాగించెడు బం
జారుల మాటలను వినని జాతి నశించున్!!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘోర ప్రవృత్తి తోడుతను క్రూరమృగమ్ముల రీతి సాగుచున్
రిప్లయితొలగించండిచోరులు జారులై ప్రజల స్రుక్కగ జేయు నకార్యశీలురన్
ధీరముగా నడంచగను తీరగు పద్ధతిఁ బోవు వేళలన్
జారుల మాటలన్ వినని జాతి పురోగమనమ్ము జెందునా
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భూరిగ భాగ్యము లొందును
రిప్లయితొలగించండిజారుల మాటలను వినని జాతి, నశించు
న్జా రుల వశమగు మనుజులు
వారలు గోల్పోయి ధనము దద్దయు పుడమిన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వారిలలో సదా పరమపావన మూర్తులు త్యాగమూర్తులై
రిప్లయితొలగించండికోరిన కోర్కెలన్ని సమ కూర్చెడు దేవుని సన్నిధానమున్
జేరి మహాతపస్సుగను సేవల జేసి తరించునట్టి పూ
జారుల మాటలన్ వినని జాతి పురోగమనమ్ముఁ జెందునా
చేరిపరమాత్ము సన్నిధి
భారమ్మనకనిరతమ్ము పావన మూర్తిన్
భూరిగ సేవించెడు పూ
జారుల మాటలను వినని జాతి నశించున్
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
జారుల మాటల న్వినని జాతి పురోగమనమ్ము జెందునా
రిప్లయితొలగించండియా రయ యేల వచ్చె ననుమానము మీకిది తప్పకుండగా
వారము వారము న్గనుడు భవ్యము గాయది వృద్ది జెందునే
జారుల మాటల న్వినిన జాతి తి రోగమనమ్ము జెందు గా
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కూరిమి జూపబోరు | తమ కుక్షిని " డబ్బుల "
………… తోడ ని౦పగా
నేరములే ఘటి౦చెదరు | ని౦దల కొగ్గరు |
……………… నేత ల౦దు - పి౦
జారుల మాటలన్ వినని జాతి >
…… పురోగమనమ్ము చె౦దు | నా (ఆ)
వారల నెల్ల " ఓటనెడు " వజ్రము తో
…………… బరిమార్చు సోదరా !
{ పి౦జారి = దూదేకు కులపు వాడు ,
పి౦జారి = దిక్కు మాలిన పనికి రాని వె ధ వ ;
నేత ల౦దు పి౦జారులు = రాజకీయనాయకుల
య౦దు పనికి మాలిన వె ధ వ లు }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధారుణి రాజు లెల్లరు ప్రధానుల మంత్ర విశేష రీతులన్
రిప్లయితొలగించండిభారపు రాజ్యపాలన నవంధ్యము సేసినఁ జాల దెన్నగన్
ధీరులు శూరు లున్నను స్వదేశ సుశాంతికి చిత్త శుద్దినిం
జారుల మాటలన్ వినని జాతి పురోగమనమ్ముఁ జెందునా
[చారులు = వేగులు]
నారాయణ పదపద్మ స
మారాధన తత్పరక్రియా విలసిత దే
హోరు గుణాధికు లా దను
జారుల మాటలను వినని జాతి నశించున్
[దనుజారులు = దేవతలు; మాటలు = సూక్తులు]
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్కృష్టంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిమీరక నీరములను దే
రిప్లయితొలగించండివేరుల పూజించు శాస్త్ర విజ్ఞాానముతో
కూరిమి మెలంగు గుడి పూ
జారుల మాటలను వినని జాతి నశించున్.
పిన్నక నాగేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు
మీరక నీరములను దే
రిప్లయితొలగించండివేరుల పూజించు శాస్త్ర విజ్ఞాానముతో
కూరిమి మెలంగు గుడి పూ
జారుల మాటలను వినని జాతి నశించున్.
మొదటి పాదంలో నీమములను అని
తొలగించండిచదువ గలరు.
పిన్నక నాగేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శౌరిని దలచుచు నిత్యము
రిప్లయితొలగించండికూరిమితో జేరు జనుల కోర్కెలు దీరన్
తీరుగ నర్చించెడు పూ
జారుల మాటలను వినని జాతినశించున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీరక నీమములను దే
రిప్లయితొలగించండివేరుల పూజించు శాస్త్ర విజ్ఞాానముతో
కూరిమి మెలంగు గుడి పూ
జారుల మాటలను వినని జాతి నశించున్.
తప్పు దొర్లినందువలన మరల పోస్ట్ చేశాను.
రిప్లయితొలగించండిఆరని యాశలన్ దవుల నాతడు జారును చింత లోయలో
రిప్లయితొలగించండితీరని మోహమున్ మునుగ తిన్నగ జారును కోపకూప మం
దూరెడు వాంఛలన్ పొసగ నూగుచు జారును దుఃఖ వార్థి నా
'జారు'ల మాటలన్ వినని జాతి పురోగమనమ్ముఁ జెందునా.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వారాంగన సంగమమున
రిప్లయితొలగించండినారోగ్యము సెడిన కామి ఆవేదించెన్
జారత్వమువలదను పూ
జారుల మాటలను వినని జాతి నశించున్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సారధియుద్దరంగమున సాయములేక వృధాప్రయాసయే
రిప్లయితొలగించండిధారణ వీడ కష్ట మవధానము జేయుట| “మంచిమార్గమున్
మారుసమాజ పద్దతులమాయను మాన్పగ భక్తినింపు పూ
జారుల మాటలన్ వినని జాతి పురోగమనమ్ము జెందునా”?
2.వారలె భక్తి తత్పరత వారధి గట్టుచు దారిజూపు పూ
జారుల మాటలన్ వినని జాతిపురో గమనమ్ము జెందునా?
ప్రేరణ నింపి మానవత వేదన మాన్పగమార్గగామిగా
చేరిన మధ్యవర్తి మనచెంతన దైవపు పొంతనందునన్|
3.హారతి వంటిది చదువని
కారణ మౌ కాంత “కలిమి”గమనించంగా?
ప్రేరణ తల్లే గద?పూ
జారుల మాటలను వినని జాతి నసించున్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆరాముని చరణమ్ముల
రిప్లయితొలగించండినారాధన చేయువారు నర్చకు లగుచున్,
కూరిమి బంచెడి యాపూ
జారుల మాటలను వినని జాతి నశించున్.
కవిశ్రీ సత్తిబాబు గారూ,
తొలగించండిబహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పేరుకె యర్చకు లయ్యును
రిప్లయితొలగించండిచేరి శివుని కొలుచుకొనుచు చిత్తము లందున్
వేఱగు ధ్యాస గనని పూ
జారుల మాటలను వినని జాతి నశించున్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పంచాక్షరి మంత్రమ్మిది
రిప్లయితొలగించండిసంచలనపు సృష్టి కర్త సాహిత్యమునన్
నుంచెను కాశీపతియే
పంచెనులే త్రింశ దర్థ పద్యంబొకటే| {శ్రీకంది శంకరయ్య గురువర్యులకు వందనాలతోనాభావనఆటవెలది మూడు పదుల దేవతలముందుప్రార్థనాపద్యముపంచాక్షరీమంత్రమే|ప్రతిదినమునుంచుటచేధన్యవాదములు.}
5.పౌరాణికాంశ ప్రతిభకు
సారాంశము బంచిపెట్టు|సద్భక్తి సదా
జేరగ దెలిపెడి మనపూ
జారుల మాటలను వినని జాతి నశించున్.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిత్రింశదర్థ పద్య ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ధన్యవాదాలు.
జారులు '' చింతామణి ''కయి
రిప్లయితొలగించండినారీమణి నగలనిచ్చి నాశన మగుచున్
బోరున యేడ్చిరి, మరి యా
జారుల మాటలను వినని జాతి నశించున్
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దూరము పెట్టమనందురు
రిప్లయితొలగించండికోరుచు సత్పురుషులెల్ల, ఘోరమొనర్చే
కౄరుల,జూదరులను మరి
జారుల, మాటలను వినని జాతి నశించున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అని+అందురు' అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ "దూరముగ బెట్టమందురు" అనండి.
ధారుణి జనులకు శుభమును
రిప్లయితొలగించండికోరుచు సదమల మనమున కువలయమందున్
శ్రీరాముని కొలిచెడి పూ
జారుల మాటలను వినని జాతి నశించున్.
చోరులు దొంగతనమ్మును
జోరుగ చేయుచుండ వసుధను ప్రీతిన్
వారణమొనరించెడి పూ
జారుల మాటవినని జాతి నశించున్.
శ్రీరామచంద్ర మూర్తిని
యారాధనచేయుమనుచు ననవరతంబున్
కూరిమితో చెప్పెడి పూ
జారుల మాట వినని జాతి నశించున్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పారే యని పిలిచిన మన
రిప్లయితొలగించండిసారా కష్టములు మాపి సకల హితంబుల్
కూరిమి జెప్పెదరా దను
జారుల మాటలను వినని జాతి నశించున్
నితీశ్ చంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పారే'....?
శంకరయ్య గారు, 'పారే' ని 'కాపాడ రా' అనే అర్థంలో విన్నట్టు గుర్తు. ఇది సాధువు కాకపోతే తెలుపగలరు.
తొలగించండిమారణ హోమము ను తరచు
రిప్లయితొలగించండిపోరుచు మానవుల ఉసురు పోగొను వారిన్
దారుణ కార్యము వద్దను
జారుల మాటలను వినని జాతి నశించున్
వడ్డూరి రామకృష్ణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిMall Culture:
రిప్లయితొలగించండికారులు బైకులున్ చికెను కమ్మని కూరలు పంచదార బం
గారము వెండియున్ పసుపు గంధము రత్నము పుష్యరాగమున్
చీరలు బ్లౌసులున్ మటను చెన్నుగ భూములు స్టాకుషేరు బా
జారుల మాటలన్ వినని జాతి పురోగమనమ్ముఁ జెందునా?