10, అక్టోబర్ 2016, సోమవారం

సమస్య - 2167 (కరి సింహము నెక్కి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్" 
లేదా...
"కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా"

80 కామెంట్‌లు:

 1. కరుణా కటాక్ష వీక్షణి
  పరమేశ్వరు ధర్మ పత్ని పర్వత సుతయౌ
  నరివీర భయంకరి శం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్

  రిప్లయితొలగించండి


 2. హరి భక్తజన విభుండై
  కరి రక్షణకై మకరిని కట్టడి జేసెన్ !
  హరి సోదరియౌ నా శాం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. దురితము లనుతొల గించగ
  కరివర దునిభగిని గాన కాత్యాయని యౌ
  కరుణను కదలెను శివశం
  కరి సింహము నెక్కి దైత్య గణముం జంపెన్

  రిప్లయితొలగించండి
 4. సురసంఘంబుల గావగ
  నురుతరకరుణాలవాల యుమ సకలద యా
  గిరిరాజ నందన శుభం
  కరి సింహము నెక్కి దైత్య గణముం జంపెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. ధరనసురసంఘమమితపు
  దురితంబులనాచరించి దుఃఖపరుపగన్
  త్వరితగతిఁ దుర్గ చని శాం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్ ||

  నిరతమ్మున్ తపమాచరింపనసురుల్ నిశ్చేష్టుడై బ్రహ్మ య
  చ్చెరువైనట్టి వరంబునిచ్చెనపుడాజిన్ రక్తబీజాది దు
  శ్చరితుల్ దుర్గను లక్ష్యపెట్టక మనశ్శాంతిన్ హరింపంగ శాం
  కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 6. సురసంఘంబుల సన్నుతుల్ గొనుచు నా శుద్ధాఘసంపూర్ణులన్
  ధరణీజాతుల కిష్టకామ్యద సమస్తంబైన లోకంబునం
  దురువాత్సల్యము చూపునట్టి శివ సర్వోపాస్య సద్యశ్శివం
  కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునం గూల్చెరా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కరుణయె గూడిన దృక్కుల
  ధరణిని మనుజుల నఱిమెడి దనుజుల గనుచున్
  కెరలుచు భువి నడరిన శం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. దురిత నివారణి యీశ్వరి
  వరదాయినిగ సుఖములిడు భక్తుల కెల్ల
  న్నరి చయముల నడచగ శాం
  కరి సింహము నెక్కి దైత్య గణముం జంపెన్

  రిప్లయితొలగించండి
 9. కం. నరులను పలు బాధలకున్
  గురి చేయుచు వెతలు వెట్టు కుటిలుల నణచన్
  గిరిరాజ సుత యగు శుభం
  కరి సింహము నెక్కి దైత్య గణముం జంపెన్.

  రిప్లయితొలగించండి
 10. వరగర్వమ్మున బెట్టుచుండిరిగదా బాధల్ మమున్ రాక్షసుల్
  సరిలేరెవ్వరు నీకికన్ కదలిమా సంరక్షణన్ జేయుమా!
  పరమేష్ఠీ! యని మ్రొక్కుచున్ యమరులే ప్రార్థించగా, వేగ శాం
  కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మ్రొక్కుచున్+అమరులే' అన్నప్పుడు యడాగమం రాదు. 'మ్రొక్కుచు న్నమరులే' అనండి.

   తొలగించండి
 11. వర గర్వోన్నతి విఱ్ఱవీగెడి కరంభాద్యుగ్ర యజ్ఞారులన్
  పరిమార్చన్ దిగి రాగదంచదితి గర్భాద్యుండు ప్రార్ధించినన్
  కరుణాసింధు తరంగ, శంభుసతి, లోకారాధ్య, విద్యద్వశం
  కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణి కుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రాగదంచదితి'....?

   తొలగించండి
  2. గురువుగారూ నమస్సులు. దిగి రాగదంచు అదితి అని నా భావన.

   తొలగించండి
  3. ఫణి కుమార్ గారు
   ఇఁకాదులకుఁ దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు.
   పైసూత్రము చే (అంచున్ దృతప్రకృతికము) అంచున్ +అదితి = “అంచునదితి” యవుతుంది.
   అంచు+అదితి లోని యుత్వ సంధికి భంగమగును. .

   తొలగించండి
  4. అయితే సత్యనారాయణ రెడ్డి గారు ప్రయోగించిన (చూచుచున్ +ఉండ) చూచుచుండ విషయములో మీకు సందేహము రావచ్చు. ఇక్కడ “చూచుచుండ”, “చూచుచునుండ” రెండును సాధువులు.
   “ప్రథమేతరవిభక్తి శత్రర్థచువర్ణంబులందున్నయుకారమునకు సంధి వైకల్పికముగా నగును”.
   పై సూత్రము చే రెండు రూపములు సాధువులు.

   తొలగించండి
  5. పూజ్యులు కామేశ్వరరావు గారికి అభివాదములు. సవరించాను.

   వర గర్వోన్నతి విఱ్ఱవీగెడి కరంభాద్యుగ్ర యజ్ఞారులన్
   పరిమార్చన్ గదటంచు పార్వతిని జంభారాదులర్థింపగన్
   కరుణాసింధు తరంగ, శంభుసతి, లోకాతీత విద్యద్వశం
   కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా

   తొలగించండి
  6. ఫణి కుమార్ గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  7. ఫణి కుమార్ గారు సవరించినందులకు సంతోషము.
   “బరిమార్చన్ గరుణించి”, “జంభారాతియర్థింపగన్”, “విద్వద్వశంకరి” అనండి.

   తొలగించండి
  8. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు.
   పరిమార్చన్ గరుణించి పార్వతిని జంభారాతియర్థింపగన్ అని వ్రాసినచో ఇంద్రుడు పార్వతిని కరుణించి అర్థించాడు అనే అర్థం స్ఫురిస్తుందేమోనని అనుమానంగా ఉన్నది. దయచేసి పరిశీలించ ప్రార్థన.

   తొలగించండి
  9. ఫణి కుమార్ గారు దసరా శుభాకాంక్షలు. “గదటంచు” అంత బాగాలేదని కరుణించి పదము బాగుంటుందని సూచించితిని. “జంభారాదులు” పదము తప్పు. జంభుడొక రాక్షసుడు కదా. “జంభాదులు” అనవలసి వస్తుంది. అది యిక్కడ కుదరదు కద. విద్యత్ పదము లేదు. విద్వత్ పదమున్నది. అందుకే విద్వద్వశంకరి సూచించితిని.
   ఈ పద విభాగము చూడండి.
   జంభారాతి పార్వతిని, కరుణించి యజ్ఞారులన్ పరిమార్చన్, అర్థింపగన్
   ఇంకా మీకనుమానముగా నున్న యీ సవరణ పరిశీలించండి.
   పరిమార్చన్న వలీలఁ బార్వతిని

   తొలగించండి
  10. కామేశ్వరరావు గారూ నమస్సులు. మీ సూచనలకు ధన్యవాదములు. మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. మన్నించండి, ఇంకా ఒక సందేహం మిగిలే ఉంది. జంభారి అంటే ఇంద్రుడు. జంభారాదులు అంటే ఇంద్రాదులు అనగా దేవతలు అవుతుంది కదా.

   తొలగించండి
  11. జంభారి + ఆదులు = జంభార్యాదులు (యణాదేశ సంధి)

   తొలగించండి
 12. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  సుర లెల్ల శరణు వేడగ

  నరసమ్మున గావగ :- నభయ౦కరి , పరమే

  శ్వరి , విజయ౦కరి , శవశ౦

  కరి సి౦హము నెక్కి దైత్య గణమును జ౦పెన్

  { అ ర స ము . త . వి. = హర్షము }

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   శివశంకరి... శవశంకరి అని టైపు చేశారు.

   తొలగించండి
 13. కరియే మన మనమనుచును
  మరి సింహాలింద్రియములుమన దురితములే
  నరయగ దైత్యగణములై
  కరి సింహమునెక్కి దైత్యగణముల జంపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చేపూరి శ్రీరామారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యరయగ..' అనండి.

   తొలగించండి
 14. కరివరదజ్యేష్ఠుడు శ్రీ
  కర రక్షితు డసుర వైరి ఖదిరుం డా భీ
  కర దేవాసుర రణమున
  కరిసింహము నెక్కి దైత్యగణముం జంపెన్

  [కరిసింహము = గజశ్రేష్ఠము, ఐరావతము]


  వరదానాది గుణవ్రజాభినుత సంభా వ్యార్థి లోకార్త సం
  తరణాసక్త దయా విలోకనయె విధ్వంసంబు నెట్లోర్చునో
  పరమార్థంబు నెరుంగ శక్యమె, ధరాభారుల్, నిలిం పాభయం
  కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి.
   శ్రేష్ఠతావాచకంగా సింహ శబ్దాన్ని స్వీకరించడం బాగుంది.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 15. మిత్రులందఱకు నమస్సులు!

  కరికోఁతన్ దొలఁగింప నెంచి, మిగులన్ గర్జించుచున్ దా భయం
  కరియై, దివ్య విశుద్ధ శక్తి యుతయై, గర్వాతిరేకోత్క ము
  ష్కర సంహార వినాశకాయుధకర ప్రాంచన్మహా నాక స

  త్కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా!

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 16. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  వర గర్వా౦ధత స౦చరి౦చి దనుజుల్ బాధి౦ప ,

  …………… నాదిత్యు లె

  ల్లరు స౦స్తోత్ర మొనర్చుచున్ శరణు వేడన్

  ………… మహోద్రేక యై ,

  వర శస్త్రాయుధ హస్తయై , యరి భయో

  ……………… త్పాద స్వరూపాన , శా౦

  కరి హర్యక్షము నెక్కి దైత్యులను

  ………… స౦గ్రామ౦బున౦ గూల్చె గా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 17. సురలున్ వేడగ నసురుల

  దురితమ్ముల బారి నుంచి దూరము చేయ

  న్నరి వీర భయంకర శాం

  కరి సింహము నెక్కి దైత్య గణముంజంపెన్.

  రిప్లయితొలగించండి
 18. సురలెల్లరు వినుతించగ
  వరదాయిని సేమమొసఁగి భయవిహ్వలురన్
  దరిజేర్చగ,దుష్ట భయం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 19. వరము బలముచే మహిషా
  సురుండు విక్రమము జూపి చుల్లలు వెట్టన్
  సురలను గాచుటకై శం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్.

  సురలను కావగ యా య
  సురులను జంపగ దలచుచు సుముఖత జూపన్
  కరిముఖుని తల్లి యాశం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్.

  కరుణామయి యా శివశం
  కరియసురుల పాలిటి భయకరియై తోచన్
  సురలను కావగ యాశుభ
  కరిసింహము నెక్కి దైత్యగణముం జంపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. "సురలను కాచుట కొరకు య...' అనండి.

   తొలగించండి
 20. వరగర్వోన్నతులై చెఱంగసురులే బాధింపగా లోకమున్
  కరుణా లోచని జేరి దేవతలు సాక్షాత్కారమున్ గోరుచున్
  శరణమ్మంచును వేడగా భువిని తా స్థాపింప శాంతి శ్రీ
  కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా

  సురగణమే వేడగ నా
  కరుణాలోచని శివసతి కదిలెన్ శాంతిన్
  ధరణిన నిలుప దలచి శాం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   చెఱంగసురులే...? మూడవ పాదం చివర గణదోషం. 'స్థాపింప శాంతిన్ శుభం। కరి..." అనండి.

   తొలగించండి
 21. ధరనేలు జగజ్జననిగ
  వరమై మానవుల కిచట ఫలమై పరమై
  నిరుపమ సద్గుణ భోగం
  కరి సింహమునెక్కి దైత్య గణముం జంపెన్!

  రిప్లయితొలగించండి
 22. దురితమ్ముల్ నిరతమ్ము సల్పుచు, సదా ద్రుళ్ళింతలన్ క్లేశముల్
  ధరపై పౌరుల కున్ ఘటించుచును విస్తారమ్ముగా వర్తిలన్,
  సురలున్ వజ్రియు భక్తితో తెలుప, నీసున్ బొంది యీశాని శాం
  కరి, హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునం గూల్చెరా

  రిప్లయితొలగించండి
 23. నిరతము భువిపై ప్రజలకు
  నరకము చూపించు చుండ నరహంతకులై
  గిరిరాజు కొమారిత శాం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 24. సురలకు విరోధు లగుచు, న
  సురులొసగెడి దుష్కృతముల జూచి భవానీ
  యరివీర భయంకరి శాం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్

  తే 07/10/2007 దీన '' సప్తగిరి దూరదర్శన్ '' వారు
  నేటి సమస్యను '' కరి సింగము పైని నెక్కి ఖలులన్ గూల్చెన్ ''
  అని యిచ్చి , వచ్చిన పురాణములను ప్రసారం చేసారు . ఆ
  రోజున నా పూరణము ప్రసార మైంది

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో భవానీ అని దీర్ఘాంతంగా వ్రాసారు.
   నేనీ సమస్యను గరికిపాటి వారి పుస్తకం నుండి గ్రహించాను.

   తొలగించండి
 25. P.Satyanarayana
  వర రిపు దైత్య గుణంబుల
  కరయంగా నింద్రియ తతి ఘన సింహంబౌ
  కరియ యహింసా యోగము,
  కరి సింహము నెక్కి దైత్య గణముల జంపెన్

  నెర సామ్రాజ్య విధాన పాలన గన న్నేరంగ మ్లేచ్ఛాళి నీ
  ధర నొంచన్ గరి "గాంధి",వాహనమనన్ దా సింహమే యా "బ్రిటన్"
  శరముల్ సత్య మహింసలా ధగధగల్ శౌర్యంబులన్నూడ్చె బో!
  కరమర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా!!
  P.Satyanarayana

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   కరమర్యక్షము....?

   తొలగించండి
  2. P.Satyanarayana
   Sir,plz correct the typo.error కరి హర్యక్షము నెక్కి ..Age factor,sorry!
   PSN

   తొలగించండి
 26. వరమున్ బొందియు దానవుల్ మిగుల గర్వాంధంబు తోడన్ సదా
  సురలన్ మానవ సాదు సత్పురుషులన్ క్షోభింప జేయన్ మహా
  దురమున్ జేసియు దుఃఖ బాధితులకున్ తోషంబు గావించ శాం
  కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా

  రిప్లయితొలగించండి
 27. పరులన్జంపుచు పాపకార్యమున సంపాదించు భోగాలతో
  వరముల్ బొందియు గర్వమున్ వరలి సర్వస్వంబు నేనన్న కా
  వరమున్ ద్రుంచగ రక్తబీజు గని జంపన్ బూని రౌద్రానశాం
  కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా|
  2.వరదాయిణి|కాశ్మీరున
  పరులను హింసించు నసుర పాక్ దుశ్చర్యల్
  పెరుగక ద్రుంచెనుగద|శాం
  కరి|సింహము నెక్కి దైత్య గణముంజంపెన్ {నవరాత్రియందు కొలువైయున్నకాశ్మీరు శక్తి సైనికుల ఆసక్తిగామార్చివారి హృదయాన చేరినదని భావన}

  రిప్లయితొలగించండి
 28. సురలన్ మునులన్ బాధల
  గురిచేయు మురారి భండా సురాది దాన
  వరిపుల్ బరిమార్చగ శాం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వడ్డూరి రామకృష్ణ గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం.
   రెండవ పాదంలో గణదోషం. అంతేకాకుండా పాదం చివర తప్పక గురువుండాలి.

   తొలగించండి
 29. కరకంకణరావమ్ముల
  చరణోజ్వల నూపురఝణఝణంకృతులన్
  అరుణారుణ నేత్ర భయం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "నూపుర ఝణఝణఝంకృతులన్" అందామా?

   తొలగించండి
  2. కరకంకణరావమ్ముల
   చరణోజ్వల నూపురఝణఝణఝంకృతులన్
   అరుణారుణ నేత్ర భయం
   కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్
   మీసూచనలమేరకు గణదోషం సవరించాను. చిత్తగించమనవి

   తొలగించండి
 30. కరకంకణరావమ్ముల
  చరణోజ్వల నూపురఝణఝణఝంకృతులన్
  అరుణారుణ నేత్ర భయం
  కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్

  మీసూచనలమేరకు గణదోషం సవరించాను.చిత్తగించ మనవి

  రిప్లయితొలగించండి
 31. అరెవో చూడర! భాజపా విఖరులే హంగామనున్ జేయుచున్
  కరవం బోవగ దీది భక్తులనటన్,...గయ్యాళి గంపన్ వలెన్
  పరువుల్ బెట్టుచు దుర్గమాయి యదిగో! బంగారు రంగౌ శుభం
  కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా!

  రిప్లయితొలగించండి