త్రింశదర్థ పద్యరత్నము – పోకూరి కాశీపతి
ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.
10వ అర్థము
– వాయుదేవ స్మరణ
భూరి జఠర = పెద్ద కడుపు గల భీమునకు
గురుఁడు = తండ్రి యైనవాఁడు,
నీరజ అంబక =అగ్గికంటి అయిన శివునకు
భూతి = పుట్టినవాఁడును,
మహిత కరుఁడు = ఆధిక్యత గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = అతిశయమే రత్నభూషణముగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = ప్రాణాయామ మొనర్చు వాయుభక్షకులగు
సాధువుల కధీశ్వరుఁ డైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ?
మహామర్త్యసింహుఁడు = గొప్ప దేవతా శ్రేష్ఠుఁ
డైనవాఁడును (అగు వాయుదేవుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
వాయు దేవుడ !రక్షించు భరణి నెపుడు
రిప్లయితొలగించండినీవు లేనిచో జీవించ రెవరు భువిని
కూడు గుడ్డల గంటెను గూడ నీవు
ముఖ్యుడవుగాన వినుముర మొరను నాది
ఘనవృకోదరుతండ్రి ముక్కంటి భూతి
రిప్లయితొలగించండిమహిమ గలవాడు ఘనతర మణి విభూషు
డతిశయమ్ముగ దిక్కులనన్ని దిరుగు
వాయుదేవుండు మనల కాపాడుగాక.