2, అక్టోబర్ 2016, ఆదివారం

సమస్య - 2160 (వైరి స్వదేహ మౌట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్"
లేదా....
"తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్"
ఈ సమస్యను పంపిన పిట్టా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.

74 కామెంట్‌లు:

 1. వినుటకు వింతగ నుండును
  తన దేహమె వైరి యగుట తధ్యము ధరణి
  న్నెనలేని భోగమం దున
  కనుగాన నిసంచి తములు కాల క్రమమున్

  రిప్లయితొలగించండి
 2. నూరు వసంతముల్ బ్రతికి నూత్న శకమ్మున కాలు పెట్టితిన్
  భారమె జీవితమ్ము తనువందుననింతయు శక్తి లేమిచే
  దారుణమయ్యె నాస్ధితికదల్చగలేక శరీరమక్కటా
  వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. ఉ. కోరివరింపగన్ తనకు కూడనివౌ యల వాటులన్నియున్
  దారుణ రీతిగన్ ప్రబలి దాడి యొనర్చెడు వ్యాధులన్నియున్
  కారణ మౌనుగా భువిని కాయమునే మరి పాడు చేయగన్
  వైరి స్వదేహమౌట యని వార్యపు శాపము దీర్ఘ జీవికిన్.

  రిప్లయితొలగించండి
 4. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తన మాటయె తనదనుచును
  తన పోడిమి చెఱచు గొనుచు తనరుచు నుండన్
  తనువంతయు చెడిపోవగ
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చెఱచుకొనుచు' అనండి.

   తొలగించండి
 5. సూరికి నైన గాని మరి శూలికి సోకిన వింతగా దటన్
  భూరిగ భక్తిగల్గిన తపోధను డేయగు మౌని వర్యుడౌ
  మీరివ సించబో వగను మిధ్యయ టంచును బల్కురం దరున్
  వైరిస్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘ జీవికిన్

  రిప్లయితొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మూరికి బందియై పరగి మూర్ఖ విచేష్టల సంచరించుచున్
  క్షారితుడై వరాంగనల సన్నిధి గూడుచు నుండు వానికిన్
  మూరితి క్రుళ్లగా దలఁచె ముట్టును వీడిన నాకు నిట్లుగా
  వైరి స్వదేహమౌట యనివార్యపు శాపము దీర్ఘ జీవికిన్.

  (మూరితి = శరీరము; ముట్టు = పధ్ధతి/విధము)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 7. తనదే గద యుదరంబను
  చు నచ్చిన పదార్థములను చూచిన వెనువెం
  టన తినుచున్న, మనుజునికి
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. వినవలె నినకులు కీర్తన
  లనవలెదాశరథినామ మనవరతంబున్
  వినక విశృంఖలు డగుచో
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్"

  రిప్లయితొలగించండి
 9. వారిజనాభుకీర్తన నవారిత రీతిని సేయగా వలెన్
  మీరినభక్తితోడ దనమేనున దార్ఢ్యత గల్గు వేళనే
  నేరక నీశరీరమునె నిత్యమటంచు జరింపనవ్వలన్
  వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్"

  రిప్లయితొలగించండి
 10. మనసున నలమిన కోరిక
  తనువున నలముచు నిరతము తాపము బెంచన్
  వినుమది యబలుని జేయుచు
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్!


  రిప్లయితొలగించండి
 11. తనువు కభయమిడు యోగా
  మనమున కాహ్లాదమగును మానుపు వెతలన్!
  ఘనమగు యోగము వీడిన
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తనువుకు' అనరాదు. తనువునకు.. సరియైన ప్రయోగం. 'తనవున కభయము యోగా..' అనవచ్చు.

   తొలగించండి
  2. గురువు గారికి వందనములు . మీరన్నట్లే సవరిస్తాను. ధన్యవాదములు .

   తొలగించండి
 12. కనపడదు కంటికెయ్యది
  వినిపించదు చెప్పుమాట వృద్ధాప్యమునన్
  తనవారె దూఱుచుండగ
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. స్వైరవిహార జీవనము స్వార్థము నిండిన నిత్యకర్మలున్
  కూరిమి లేని పల్కులును కొంతయు నీశ్వర భక్తిలేమి వి
  స్తారపు డాంబికంబులును ధర్మము దప్పుట లున్నచో భువిన్
  వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్.

  అనుచితమగు వర్తనముల
  ననుదినమును గోరినట్టు లతిభోజనముల్
  ఘనుడై చేసెడి జనునకు
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 14. P.Satyanarayana
  సైరణ జేసి బాధలను చప్పుడు జేయక వాని దాటినన్
  స్వైర విహారమట్లు తన స్థైర్యము జూపుచు శత్రు మూకకున్
  భైరవ రూపు దాల్చినను బైపడ నాయువు చేవ జచ్చు నీ
  వైరి స్వదేహమౌట యనివార్యపు శాపము దీర్ఘ జీవికిన్
  P.Satyanarayana
  మనమును యింద్రియ తతియును
  ఘనమగు మద మత్సరములు గనుమవ్వానిన్
  గొన నంతర్యుద్ధమునను
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'బైపడ'...?
   రెండవ పూరణలో 'మనమును నింద్రియతతియును' అనండి.

   తొలగించండి
  2. P.Satyanarayana
   బచపడ.ఈడు ఆయువు,పైన్పడ..పైన పడగా
   చేవ జావగా...

   తొలగించండి
  3. P.Satyanarayana
   బచపడ.ఈడు ఆయువు,పైన్పడ..పైన పడగా
   చేవ జావగా...

   తొలగించండి
  4. P.Satyanarayana
   బచపడ.ఈడు ఆయువు,పైన్పడ..పైన పడగా
   చేవ జావగా...

   తొలగించండి
 15. ధారుణిలోని మానవులు తద్దయు మక్కువఁగొంచు ముల్లెపై
  సారములేని జీతమున సంసారసాగర మందు సాగుచున్
  మూరితిగూర్చి తల్చరుగద! పొంది వికారము కచ్చితమ్ముగా
  వైరి స్వదేహమౌట యని వార్యపు శాపము దీర్ఘ జీవికిన్
  శౌరిభజించుచున్ సతము సాగిన చిక్కును ముక్తి చెచ్చెరన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో 'సంసార' అన్నచోట, మూడవపాదంలో 'తల్చరుగద' అన్నచోట గణదోషాలు. సవరించండి.

   తొలగించండి
  2. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో 'సంసార' అన్నచొట, మూడవ పాదంలో 'తల్చరుగద' అన్నచోట గణదోషం. సవరించండి.

   తొలగించండి
  3. ధారుణిలోని మానవులు తద్దయు మక్కువఁగొంచు ముల్లెపై
   సారములేని జీతమున సంసరణమ్మున మున్గితేలుచున్
   మూరితిగూర్చి కన్గొనరు, పొంది వికారము, నిశ్చయమ్ముగా
   వైరి స్వదేహమౌట యని వార్యపు శాపము దీర్ఘ జీవికిన్
   శౌరిభజించుచున్ సతము సాగిన చిక్కును ముక్తి చెచ్చెరన్

   తొలగించండి
 16. ఆర్యా
  ఈ సారి ,నేనిచ్చిన పద్య పాద పంక్తిని సమస్యగా మలిచి యిచ్చినందులకు కృతజ్ఞతలు ఈ క్రిందివి పొసగునేమో చూడండి p.Satyanarayana
  కాఫీ టీ లవి కాలకూట విషమై గన్పట్టు నిప్పట్టునన్...లేదా
  కాఫియున్ టీ లు మర్యాద కైన గొనము.......p.Satyanarayana

  రిప్లయితొలగించండి
 17. నేటి సమస్యాపూరణం

  అనునిత్యము భోగములను
  అనుభవమున కోరుకొనెడి నాలోచనలో
  కనుగానక వర్తించిన
  తన దేహము వైరి యగుట తథ్యము ధరణిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చేపూరి శ్రీరామారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భోగమ్ముల। ననుభవమున కోరుకొనెడి యాలోచనలో' అనండి.

   తొలగించండి
 18. సమస్యాపూరణం
  "కవియేగా మఱిచేటు దెచ్చునిలలోగాఠిన్యమే చిందుచున్"
  కవితాప్రాకట భావనా సృజన ధీ గమ్యంబు ప్రేమైక మానవతావాదము,విశ్వశ్రేయములు మేనాలెక్కగా వ్రాయకన్
  నవసాహిత్తమటంచు చీలికలతో నానా ఇజాలొప్పునా
  కవియేగా మఱిజేటుదెచ్చు నిలలో గాఠిన్యమే చిందుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   బాగుంది మీ పూరణ. అభినందనలు.
   'నవసాహిత్త/ నవసాహిత్య' టైపాటు..

   తొలగించండి
 19. చేరును పూర్వజన్మమునఁజేసిన కర్మఫలమ్ము దేహినే
  తీరును మార్చకన్ మరల దేహి చరించెడు పాపకృత్యముల్
  పేరుకుపోయి రోగముల పేరున బాధలఁ బెట్టుచుండగా
  వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్ ||

  జననమ్ము మొదలు పాపము
  పనిగట్టుకు వెంటఁ దగిలి వడియగనొడలున్
  పెనురోగమంటినప్పుడు
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్ ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 20. ఆర్యా
  గాంధీజీ ప్రవేశపెట్టిన ప్రకృతి చికిత్స స్మృతి చిహ్నంగా ఆ సూచన జేయ సాహసించితిని.నేను ఆరోగ్య సాధనము అను మాస పత్రికకు సంపాదకుడనని సవినయంగా మీ సంతోషం కో‌సం మనవి చేస్తున్నాను.అసందర్భ ప్రలాప మౌతుందనే అనుమానంతో. మీp.Satyanarayana

  రిప్లయితొలగించండి
 21. కవిమిత్రులకు నమస్సులు!
  నిన్నటి నుండి అస్వస్థత.. అయినా తప్పనిసరిగా మా అక్కయ్య వాళ్ళ ఊరు వెళ్ళవలసిన పని!.. అక్కడ నెట్‍వర్క్ సరిగా ఉండదు. అందువల్ల ఈరోజు పూరణల పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 22. వినిపించక పలుకొలుకక
  కనిపించక మంచమందు కదలకనుండన్
  జనమంత రోయు నరునకు
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్.

  రిప్లయితొలగించండి
 23. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. అనునిత్యము జిరుతిండ్లను
  ఘనముగ భుజియించ లావు గలుగగ భువిలో
  పనిజేయుట నరకంబయి
  తన దేహమె వైరి యగుట తధ్యము ధరణిన్!!!

  రిప్లయితొలగించండి
 25. జనియించిన ప్రతివారికి
  పనిగట్టుకు వచ్చి వాలు వార్ధక్యమునన్
  ఘనుడైనను కృశియించుచు
  తనదేహమె వైరి యగుట తధ్యము ధరణిన్!!!

  రిప్లయితొలగించండి
 26. మిత్రులందఱకు నమస్సులు!

  వైరిగఁ గామ క్రోధ మద వర్గము దేహము నందు నాఱునున్
  జేరినచో మహాత్మత విశీర్ణముఁ జెందును; మంచి నెప్పుడున్
  గోరఁగఁ బోవఁ; డింతయునుఁ గూర్మినిఁ బంచఁడు; గాన నిక్క మీ

  వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్!

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 27. అనిశము నశనము మెండుగ
  దిని తొంగుని పాటు పడక దీర్ఘపు రోగ
  మ్మును దెచ్చు గొనగ నతనికి
  తనదేహమె వైరి యగుట తధ్యము ధరణిన్!!!

  రిప్లయితొలగించండి
 28. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  గు రు వు గా రి కి మరియు క వి మి త్రు ల కు

  పా ద న మ స్కా ర ము లు .

  " చ ౦ ద్ర క ళా వృ త్త ము " ను గూ ర్చి

  నే ని పు డు తె లి య జే య ద ల చి తి ని .

  ఇది సరసముగా చక్కని నడకతో సాగి పోగల
  వృత్తము . రగణ , సగణ , భగణముల తో
  పాటు , ఒక యగణము ఒక
  మగణము ఒక తగణము కూడా పొ౦ది౦చు కొనగల వసతి ఈ వృత్తము లో మనకు లభి౦చ గలదు .
  …………………………………

  గ ణ ము లు =

  ర. స. స. త .జ .జ . గ యతి 11

  …………………………………………………………

  ధోరణి నిలుచుట కై నేను రె౦డు పాదములను
  వ్రాస్తున్నాను .

  ………………………………………………………

  శ ౦ క రా శి వ శ ౦ క ర దే వా

  చ ౦ ద్ర క ళా ధ ర ఈ శ్వ రా

  …………………………………………………

  స ౦ క ట ౦ బు ల బా పు ము త ౦ డ్రీ

  చ ౦ ద్ర క ళా ధ ర బ్రో వు మా

  ……………………………………………………

  న మ స్తే :--  ి

  రిప్లయితొలగించండి
 29. భారతమాతదేహమును పాక్తల ముష్కరులుగ్రవాదులన్
  బేరునజేరి కీటకము వేరునుదొల్చెడి రీతినుండగన్
  వారికినూతమిచ్చుమన వారలు బుద్ధివిహీనులౌతరిన్
  వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్"

  రిప్లయితొలగించండి
 30. మీరిన విత్త వేదనల మ్లేచ్ఛుల చేరి భజింప రాని చో
  దారి యొకింత కానక వృథాశ్రమ జీవన యాత్ర సేయగం
  బార మెరుంగ నేరకయు వ్యాధుల బారి పడంగఁ గుందగన్
  వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్


  ఘనమగు జల సంపద భూ
  జనులకు నీయ నది సంతసమయిన నేరుం
  గన నేరని వరదల చే
  త నదేహమె వైరి యగుట తథ్యము ధరణిన్

  [నద+ఇహము = నదేహము : ఇహలోకపు నదము]

  రిప్లయితొలగించండి
 31. వినకను నెవ్వరి మాటలు
  గనినన్నియు దినినన యెడల కనుగొన లోపే
  కనరాని నొప్పు లుండుచు
  తన దేహమె వైరి యగుట తధ్యము ధరణిన్

  రిప్లయితొలగించండి
 32. ఊరక,నిద్రలో మునిగి యుండెడి ద్రౌపది పుత్రు లందరిన్
  నేరక జంపె ద్రౌణి తన నేరముకై తగు శిక్ష పొందగన్
  కోరిన, చావు రాదు నిక కొందల బెట్టును దుష్ట వ్యాధులున్
  వైరి స్వ దేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘ జీవికిన్

  రిప్లయితొలగించండి
 33. (2)
  తన హితులును తన బంధులు
  తన కొఱకయి యెంతఁ జెప్పఁ దలఁపక మదిలోన్
  దనివిం దిరిగియుఁ జెడుచోఁ

  దన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్!

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 34. వెనుకటి చెడు యలవాటులె

  పెను జీకటి సృష్టిజేయ వృద్ధాప్యమునన్

  కనబడని రాగములతో

  తన దేహమె వైరి యగుట తధ్యము ధరణిన్.

  రిప్లయితొలగించండి
 35. 3వ పాదం....
  కనబడని రోగములతో... అని చదువ ప్రార్ధన.

  రిప్లయితొలగించండి
 36. 3వ పాదం....
  కనబడని రోగములతో... అని చదువ ప్రార్ధన.

  రిప్లయితొలగించండి
 37. కోరిక లన్ని తీరు నవకోమల జీవన శైలి గోరి శా
  రీరక కష్టమేమియును లేక జనమ్ములు హాయినొందగా
  దేరగ నన్ని సౌఖ్యములు దేహము కెప్పుడు నంద జేసినన్
  వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘ జీవికిన్​​​​!

  రిప్లయితొలగించండి
 38. సవరించిన నా మొదటి పద్యము :
  తనువున కభయము ‘యోగా’
  మనమున కాహ్లాదమగును మానుపు వెతలన్!
  ఘనమగు యోగము వీడిన
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్!

  రెండవ పద్యము:
  తన యోగమె తన కభయము
  తన ధ్యానంబు విడిచి జన తప్పవు బాధల్
  తన యుల్లము మాట వినదు
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్!

  రిప్లయితొలగించండి
 39. వారము వారము న్మధువు బానము జేయుచు నుండుచో మరి
  న్నోరును ముక్కునున్ జెవులు నొప్పులు బెట్టుచు బాధపె ట్టగా
  వైరి స్వదేహ మౌట యని వార్యపు శాపము దీర్ఘ జీవికి
  న్నారయ దేహమే యగును వైరిగ జీవికి శాపమెప్పుడున్

  రిప్లయితొలగించండి
 40. కారణ జన్ములైన,కనకంబును గల్గిన,సౌఖ్య సంపదల్
  కోరిన వన్నియున్న,తగు కోర్కెలు దీర్చు వరాల మోజులో
  ధీరత గల్గినా,తగిన ధీక్షవహించిన?మార్పు చేర్పుచే
  వైరి స్వదేహమౌట యనివార్యపు శాపము దీర్ఘ జీవికిన్.
  2.తనదేహము తనదనుచును
  తనవారిని దలచుచున్న తత్వము నందున్
  మనసును మలచిన?చివరకు
  తనదేహము వైరి యగుట తథ్యము ధరణిన్.
  3.కారణమేది యేని మనకాలము దీరగనుండశక్యమా?
  దారియుజూపువెళ్ళుటకు దాగిన జీవముమార్పు గొరగా?
  హారతి కప్పురంబుగనె ఆరుట దప్పదు|చూడ వింతగా
  వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘ జీవికిన్

  రిప్లయితొలగించండి
 41. తినగూడని వెన్నొ దినుచు
  పనియన్నను బద్ధకించు బహు సోమరికిన్
  తనువున వార్ధక్యమొదవ
  తన దేహమె వైరియగుట తధ్యము ధరణినిన్

  రిప్లయితొలగించండి
 42. అనయము మద్యము త్రాగిన
  తనదేహమె వైరియగుట తథ్యము ధరలో
  ననుచును నెరుగుచు సతతము
  మనుజుడు మసిలిన శుభమగు మహిలో /మనసుకు గనుమా!

  ఘనతపెరుగుననుచు సతము
  ధనమునువెచ్చమొనర్చగ తాపంబొదవున్
  తనువును,మనసుయు చివరకు
  తన దేహమె వైరియగుట తథ్యము ధరలో.

  రిప్లయితొలగించండి
 43. మారిన వ్యావసాయమున మారము వాడెడి పెస్టిసైడ్స్ కదా
  మారినపంటలన్ తినుటమానము కావున దీర్ఘ కాల వ్యా
  ధీరిపు వర్గమే కనుక ధీవరు లారమరేవిధాన మే
  వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్

  మన ఆరోగ్యము మన చే
  తన యున్న దిగా వునమన తగుఆహారము
  మన దేహముకు సరిపడనిచో
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్

  రిప్లయితొలగించండి
 44. తన కోర్కెల నణగార్చుచు
  తృణధాన్యములను తినుచునె తిరుగుచు నున్నన్
  గన, వార్ధక్యపు దినముల
  తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్

  రిప్లయితొలగించండి
 45. వారము వర్జ్యమున్ గనక పండుగ జేయుచు సొంతయింటిలో
  కారము తీపియున్ విడక కమ్మగ కుమ్ముచు నాల్గుపూటలున్
  భూరిగ హెచ్చు పింఛనున భూతల నాథుని మించగా నెటుల్
  వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్?

  రిప్లయితొలగించండి