కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్!"
లేదా...
"భీరుఁడు పోరాడె మిగుల బీభత్సముగన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్!"
లేదా...
"భీరుఁడు పోరాడె మిగుల బీభత్సముగన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిధీరుడు దాపున నుండుచు
బీరము గూర్చెడి పదకము పెంపునఁ బలుకన్
దారిని కనుగొని నడరుచు
భీరుడు పోరాడె మిగుల భీభత్సముగన్
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణలో కొంత అన్వయదోషం ఉన్నట్టుంది. 'కనుగొని యడరుచు' అనండి.
శా. వీరాగ్రేసర శక్తిశాలి యగుచున్ వీరాధి వీరుల్గనన్
రిప్లయితొలగించండిఆరోహించిన భాను తేజుడ గుచున్నానాడు జృంభించుచున్
జేరంవచ్చెడి శత్రు వీర వరులన్ జెండాడ భీష్ముండు, గం
భీరుండావాహవ మందు బోరె గదరా బీభత్సము గొల్పుచున్.
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపోరాటమ్మున భీతిజెందు నతనిన్ బూనించంగా దల్చుచున్
ధీరుండొక్కడు జెంతజేరి కదనోత్సేకంబు గల్పించు నౌ
బీరంగూడెడి బల్కులెంచి పురవున్ పెంపొందించిన్నప్పు డా
భీరుండాహవమందు బోరె గదరా భీభత్సముంగొల్పుచున్.
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదం చివర గణదోషం. 'పురవున్'..?
కౌరవ హతకుల యుక్తులు
రిప్లయితొలగించండిపారగ నొంటిగ వశపడి, పార్ధుని తనయుం
డు, రణోత్సాహుడు రణ
భీరుఁడు పోరాడె మిగుల బీభత్సముగన్
క్షమించండి
రిప్లయితొలగించండికౌరవ హతకుల యుక్తులు
పారగ నొంటిగ వశపడి, పార్ధుని తనయుం
డు, రణోత్సాహుడు రణ గం
భీరుఁడు పోరాడె మిగుల బీభత్సముగన్
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిచోరులు జొచ్చిరి నింటను
వీరులు శూరులు మహిళలు వీరాంగణలున్
పోరిరి, నుత్తేజముగొని
భీరుఁడు పోరాడె మిగుల బీభత్సముగన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వీరాంగనలున్' అనండి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
వేరే దారి లేనప్పుదు పిల్లే పులి యౌను గదా !
01)
_____________________________________
భారీ కాయము,భీకరారవముతో - వ్యాఘ్రంబు ప్రాణంతితో
పారేనీటిని ద్రావబోవ దనపై - ప్రాణాంతమై దూకినన్
వేరే దారది కాన లేని యెడ తా - భీతిల్లకన్ వేగ నా
భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా - బీభత్సముం గొల్పుచున్
_____________________________________
ప్రాణంతి = ఆకలి
ఆభీరుడు = ఆలకాపరి
వసంత కిశోర్ గారూ,
తొలగించండిమళ్ళీ పెక్కు దినాల వ్యవధానం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నట్టు అక్టోబర్ 8 శనివారం నాడు రాజమండ్రిలో తాతా సందీప్ శర్మ గారి పుస్తకావిష్కరణ సభకు వస్తున్నాను. మనం కలుసుకొనే అవకాశం ఉందా? మిస్సన్న గారు కలుస్తానన్నారు.
P.Satyanarayana
రిప్లయితొలగించండిసారంబేమిటొ చర్చ జాలదొ సుమీ!చాటంగ నో హద్దునున్
బోరున్ మానవ జాతి, నాగరికతన్ బూనన్ గనే దెన్నడో?!
జారున్ నా యధికారమన్న భయమే సంధిల్ల వీరత్వమే?
భీరుండావహమందు బోరె గదరా భీభత్సమున్ గొల్పుచున్
P.Satyanarayana
మీరునె దళితుడు దైన్యత
యేరై పారంగ"బాబు"యేలికలో వి
స్తారంబగు దుర్నీతిని
భీరుడు పోరాడె మిగుల భీభత్సముగన్!
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వీరుండైన సురేంద్రసూనుడనుజున్ వేధించి పంపించగా
రిప్లయితొలగించండిపోరాడంగనశక్తుడై ద్యుమణిసత్పుత్రుండు రాజ్యమ్ముకై
శ్రీరాముంగలయంగ మిత్రుడగుచున్ చేయూతనందింపగా
భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్!
పోరాడి వాలిఁ జంపగ
చేరెన్ సుగ్రీవుడపుడు శ్రీరామునితో
కారణమై చేదోడది
భీరుఁడు పోరాడె మిగుల బీభత్సముగన్ ||
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నేటి సమస్యా పూరణం
రిప్లయితొలగించండివీరునిగా నిలిచి విజయ
తీరాలకు పాండవులను తీసుకు పోగన్
పోరున నభిమన్యుడు గం
భీరుడు పోరాడె మిగుల భీభత్సముగన్
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
బారుల్ దీర్చుచు సైనికావళి ,
………… ధనుర్బాణమ్ముల౦ బూను చా
వీరాగ్రేసరు , లెల్లరున్ నిలువగా :--
…………… భీభత్సు , డత్య౦త గ౦
భీరు౦ డాహవ మ౦దు బోరె గదరా
………… భీభత్సమున్ గొల్పుచున్ |
సారథ్యా౦చితుడై రహి౦చు హరి ,
…………… ప్రా౦చత్ కేత నారోహకు౦
డై రాజిల్లెడు వాయున౦దనుడు
……………… నిత్య౦ బాతని౦ గాచగన్
{ కేతనము = గురతు టెక్కము పతాకము
ఆరోహకుడు = అధిష్టి౦చినవాడు }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీరుడు యోధుడు భీముడు
రిప్లయితొలగించండిశూర సుయోధను తెగబడి సొక్కగ, ప్రతినన్
దీరుచు నుద్రేకమున గ
భీరుఁడు పోరాడె మిగుల బీభత్సముగన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(1)
రిప్లయితొలగించండిబారుల్ దీరిన సైన్యమున్ రణకళాప్రాజ్ఞుల్ గృపాదుల్ మహా
వీరుల్ ముందఱఁ గానుపించ భయమున్ బొందెన్ వడంకెన్ పురిం
జేరం బోయిన యుత్తరుం డటఁ గురుక్షేత్రమ్మునన్ శౌర్య గం
భీరుం డాహవమందుఁ బోరె గదరా భీభత్సమున్ గొల్పుచున్.
(ఉత్తరుడు కురుక్షేత్రంలో వీరోచితంగా పోరాడి శల్యుని చేతిలో మరణించాడు)
(2)
ఘోరారణ్యములోనన్
జోరులు సెలరేగి సతుల క్షోభింపంగన్
నారీ రక్షణకై కడు
భీరుఁడు పోరాడె మిగుల భీభత్సముగన్.
సుకవి మిత్రులు శంకరయ్య గారికి నమస్సులు!
తొలగించండిమీ రెండు పూరణలు అత్యద్భుతముగ నున్నవి. అభినందనలు!
మధుసూదన్ గారూ,
తొలగించండిధన్యవాదాలు!
శంకరార్యా! అభినందనలు!
తొలగించండిఇంతకీ మీ ఉత్తరుడు వీరుడా ? భీరువా ?
వసంత కిశోర్ గారూ,
తొలగించండిఉత్తరగోగ్రహణం సమయంలో భీరువు. అయినా ఆ సమయంలో సమర్థంగా అర్జునునకు సారథ్యం చేసిన విషయాన్ని మరిచిపోవద్దు. కురుక్షేత్ర సంగ్రామం సమయంలో వీరుడే కాకుంటే తానే చెప్పుకున్నట్లు అకృతాస్త్రుడు. అందుకే యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే యుద్ధహతుడయ్యాడు.
పోరఁగ లేనను నరుఁడిని
రిప్లయితొలగించండిసారథి శ్రీకృష్ణు 'గీత' సబలుని జేయన్
పూరించి దేవదత్తము
భీరుఁడు పోరాడె మిగుల భీభత్సముగన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని అర్జునుడు సహజంగానే వీరుడు. అక్కడ తాత్కాలిక నిర్వేదానికి గురయ్యాడు కాని భీరుడు కాలేదు. "పూరించి శంఖమును గం।భీరుడు...' అందామా?
గురుదేవులకు ధన్యవాదములు. తాత్కాలిక నిర్వేదానికి గురయ్యాడను భావంతోనే మొదటి పాదంలో, యుద్ధము చేయలేనను నరుడని వ్రాశాను.సరిపడదన్న సవరించగలవాడను.
తొలగించండిమీ భావం సమర్థనీయమే.. కాని అక్కడ నేను సూచించిన సవరణమే యుక్తం. ఆపై మీ యిష్టం!
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
తొలగించండిపోరఁగ లేనను నరుఁడిని
సారథి శ్రీకృష్ణు 'గీత' సబలుని జేయన్
పూరించి శంఖమును గం
భీరుఁడు పోరాడె మిగుల భీభత్సముగన్
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
తొలగించండిపోరఁగ లేనను నరుఁడిని
సారథి శ్రీకృష్ణు 'గీత' సబలుని జేయన్
పూరించి శంఖమును గం
భీరుఁడు పోరాడె మిగుల భీభత్సముగన్
ధీరుడు వీరుడు ధర్మవి
రిప్లయితొలగించండిచారుడు శ్రీరాముడు గుణసాంద్రుడు దైత్యుం
జీరగ లంకకుజని గం
భీరుడు పోరాడె మిగుల బీభత్సమునన్ !!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీరుండాతడమోఘరీతి తన ప్రావీణ్యంబుఁదా జూపుచు
రిప్లయితొలగించండిన్నారాటంబున చెంతచేరు కురు సేనాశ్రేణినింగూల్చినన్
మారాటంబున విల్లు ద్రుంచ ధరణిన్ మార్తాండునిన్ వోలె గం
భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్
గురువుగారూ దయచేసి నేను వ్రాసిన వేరొక సమస్యా సంబంధంలేని పద్యాన్ని సమీక్షింప మనవి.
తొలగించండిదివ్యాలంకృత స్వామి మాల శిరమున్ దీక్షాధృతిందాల్చి క
ర్తవ్యంబంచును స్వామినిష్టపడు గోదాదేవి యాఖ్యానమున్
కావ్యంబొప్పగ కృష్ణరాజవిభుడే కాలానఁదా వ్రాయగా
కావ్యాలన్నిట రాజసాన వెలసెంగా విష్ణుచిత్తీయమై
తాతా ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ, విష్ణుచిత్తీయంపై పద్యం రెండూ బాగున్నవి. అభినందనలు.
'దివ్యాలంకృత స్వామి' అన్నపుడు 'త' గురువై గణదోషం కదా! అక్కడ 'శౌరి మాల, చక్రి మాల..' ఇలా అనవచ్చా?
గురువుగారూ మీ సవరణకి ధన్యవాదములు.
తొలగించండినిన్నటి పూరణ కూడా సమీక్షింప మనవి.
శ్రీ రమణీలలామ సరసీరుహ నేత్ర సముద్ర పుత్రికన్
తీరున బెండ్లియాడియు హృదిన్నివసింపగ స్థానమిచ్చిన
వ్వారిజ నేత్రితోడ ఘన పాలసముద్రము నుండు మోహనా
కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ మోహనంగా ఉంది. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదములు.
తొలగించండిఈ రణము వలదు, జంపను
రిప్లయితొలగించండివీరల ననుచున్ శరములు వీడిన కిరీటి
సారథి మాటల కడఱె! న
భీరుడు పోరాడె మిగుల బీభత్సమునన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం చివర గణదోషం. 'వీడి నరుం డా। సారథి...' అందామా?
గురువు గారికి నమస్సులు. గమనించ లేదు, పొరబడ్డాను. శరములు విడి విజయుండా / సారథి అని అనుకొని ప్రచురింపబోయే ముందు మార్చి , పొరబాటు ను చూడ లేదు. మన్నించండి. మీ సవరణ చాలా బాగుంది. సవరణకు ధన్యవాదములు.
తొలగించండి“పక్వారము” విషయమున కవి పుంగవులు మధుసూదన్ గారి నసంతృప్తులుగ నుంచ నోపక సవరించిన పూరణ:
రిప్లయితొలగించండిభార నతోరుపల్లవ విభాసిత భవ్య ఫలాకరమ్మిలం
గీర సమూహ మోదితము గ్రీష్మ సుకాల విరాజమానమున్
జారగ వృక్ష మూలమున స్వర్ణ నికాశ సువర్ణ భాసితై
కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్
[భాసిత+ఏక+ఆరము= భాసితైకారము; ఆరము= తియ్యమామిడి; పల్లవము= చిగిరించిన కొమ్మ]
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిగుండు వారి అభ్యంతరాన్ని పరిగణించి సవరించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిచాలా బాగున్నదండీ మీ సవరించిన పూరణము! మిమ్మల్ని విసిగించినందులకు మన్నించండి. శిల్పము అందంగా రావాలంటే ఎన్నో ఉలి దెబ్బలు తప్పవు గదా! శుభాభినందనలతో...
తొలగించండిభవదీయుడు
గుండు మధుసూదన్
కవి పుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు.
తొలగించండికం. భారత యుద్ధము నందున
రిప్లయితొలగించండివీరాధి వీరుల నడుమ వెలుగులు జిమ్మన్
ధీరుడు ద్రోణుడు రణగం
భీరుడు పోరాడె మిగుల బీభత్సముగన్.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో 'వీరాధివీరుల' అన్నచోట గణదోషం. 'వీరులు కౌరవుల నడుమ..' అందామా?
నారీలోక పుమధ్యమందు నగరాంతస్థాన సద్మంబు నన్
రిప్లయితొలగించండిఆరాణీపువుబోండ్లకున్ నరుడు నాట్యాచార్యుడై దిర్గుచున్
వీరత్వంబది లేక పేడిగ విరాడ్వీటన్ పశుక్షేమమై
భీరండాహవమందు బోరే గదరా భీభత్సముంగొల్పుచున్
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆరాణీ' అని దీర్ఘాంతం, దాని వెన్నంటి పువుబోండ్లకున్ అనడం యుక్తంగా లేదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినారీలోక విమోహ కారకుడు నా నందాత్మ జాఖ్యాతియున్
తొలగించండిధీరోదాత్తుడు శక్ర సోదరుడు ధాత్రీసూను ఖండింపగన్
పారావార పరీత పట్టణ సుఖావాసుండు జిష్ణుండు నా
భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్!
[ఆభీరుడు=గొల్లవాడు]
పౌరవ కులాబ్ధి చంద్రుడు
వీరుడు సౌభద్రుడు విలు విద్యాధికుడున్
భారత రణమున రణ గం
భీరుఁడు పోరాడె మిగుల బీభత్సముగన్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండివీరుండాతడె? మేటి యౌనె? పరునిన్ వేనోళ్ళ శ్లాఘింపగా
రిప్లయితొలగించండిచోరుండై చనుదెంచి రేయి తమిలో సోలంగ మా సైనికుల్
క్రూరుండై దహియించె వాసతతులన్ కొండాడ నీకే తగున్
భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్!
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[శిఖండి భీష్మునితోఁ బోరాడిన ఘట్టము]
వీరగ్రామణులందు శ్రేష్ఠతముఁడౌ భీష్ముండు పోరాడఁగన్
బోరున్ మాన్ప శిఖండినుంప, నతఁ డాస్ఫోటింప భీష్మున్ దెసన్
నారాచమ్ముల ధారగా విడుచుచున్ నారీమణీ వేష్యుఁడౌ
భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిపోరాటమ్మును జేసి కౌరవుల యా వ్యూహమ్ము ఛేదింపగ
రిప్లయితొలగించండిన్నారాటమ్మును జూపుచున్ కొదమ సింహమ్మై యనిన్ జేరె నే
భీరుం డా ? హవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్
వీరుండౌ యభిమన్యు డర్జున సుతున్ విశ్వమ్మె కీర్తించెనే
**గంభీర్ అను క్రికెట్ క్రీడాకారుడు అద్భుతంగా ఆడాడని ఊహించి
భారత క్రికెట్టు జట్టుకు
ప్రారంభమునుండె విజయ పథమును జూపన్
జోరుగ నడిపింపగ గం
భీరుఁడు పోరాడె మిగుల బీభత్సముగన్
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పూరణలన్నీ బాగున్నవి. ఆభినందనలు !
రిప్లయితొలగించండివీరుండగు నభిమన్య కు
రిప్లయితొలగించండిమారుం డొంటరిగ పవర మందున వైరుల్
వీరగతిని జెందగ గం
భీరుడు పోరాడె మిగుల్ల భీభత్సముగన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధీరత గోల్పోవును నిల
రిప్లయితొలగించండిభీరుడు,పోరాడె మిగుల భీభత్సముగ
న్వీరావేశము తో డన
భారత కుల భూషణుండు పార్ధుడు సుతుడున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పార్థుని సుతుడున్' అని కదా!
ధీరత్వమ్మును జూప గోవులను స్వాధీనంబు గావించి కాం
రిప్లయితొలగించండితారమ్మున్ జని కాయుచుండ నట తత్కాలంబు శార్దూల మే
కారుణ్యమ్మును జూపకుండ పసులన్ కాంక్షించి చంపంగ నా
భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్!
బొడ్డు శంకరయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సారోదంచితధీనిధై బరగి బల్ సంరంభమేపారగా
రిప్లయితొలగించండివీరాగ్రేసరుడౌచునేగె నభిమన్యుండంత తానొంటరై
కౌరవ్యుల్ దరిజేరువేళ రవియై కాలుండునై వెల్గు గం
భీరుండాహవరంగమందు బోరె గదరా బీభత్సముంగొల్పుచున్.
రారమ్మని యభిమన్యుడు
వీరత్వముబొంగి కౌరవేశ్వరుబిలువన్
కౌరవ సేనలు రాన్గం
భీరుడు పోరాడె మిగుల బీభత్సముగన్.
పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శ్రీ సూర్యనారాయణ గారి శార్దూల పద్యం లోని చివరి పాదం (సమస్యా పాదం)లో రెండక్షరా లెక్కువైనాయి. "రంగ" అనే దాన్ని తొలగిస్తే సరిపోతుంది.
తొలగించండిపూరణ బాగున్నది.
ధన్యవాదాలు జనార్దనరావుగారు. పొరబాటున , ఆహవము రాగానే రంగ పదం ఆవేశంతో నాప్రమేయం లేకుండానే దూకింది. సూచించిన మీకు ధన్యవాదాలు.
తొలగించండిజనార్దన రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు! ఎలాగూ అది సమస్యాపాదమే కదా అని నేను చూడలేదు.
భీరుండా హవమందు బోరె గదరా భీభ త్సమున్ గొల్పుచున్
రిప్లయితొలగించండిభీముండా హవరంగమందు నయయో భీభ త్సమున్ గొల్పుట న్
వీరుండే యగుగాని గాడు కనగా భీరుండు నా డెప్పుడు
న్నౌరా యేమని బల్కి రిప్పుడు వినగా నోపంగ లేమియ్యెడన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీరు దాదాపుగా అన్ని సమస్యలనూ "ఏమంటిరి? ఇట్లనడం తగునా? ఇది అసత్యం కదా!" అన్న పద్ధతులలోనే పూర్తిస్తున్నారు. కాస్త వైవిధ్యంగా పూరించే ప్రయత్నం చేయండి.
చివరి పాదంలో గణదోషం. '...బల్కి రిప్డు వినగా...' అనండి.
సమస్యాపూరణ పద్దతులలో మీరు పాటించేదీ ఒకటి. దోషం లేదు. కాని వైవిధ్యంగా ఆలోచించి పూరణలు చేస్తే బాగుంటుందని నా సూచన!
తొలగించండిసారస నేత్ర విదర్భజ
రిప్లయితొలగించండిపారుని తోడ కబురంప పంకజనాభుం
డా రుక్మినెదుర్కొని గం
భీరుడు పోరాడె మిగుల భీభత్సముగన్
శూరుండౌ యసురుండు సీతను గొనన్ స్రుక్కంగ స్వాంతమ్ము గం
రిప్లయితొలగించండిభీరుండాహవమందుఁ బోరెఁ గదరా భీభత్సమున్ గొల్పుచున్
పోరున్ చచ్చెను రావణుండు కపు లుప్పోంగన్ ముదమ్మొందుచున్
బోరున్ జల్లగ సేస దేవగణ మంభోజాక్షుపై ప్రీతితో
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'పోరన్ జచ్చెను..' అనండి.
పోరి ఘటోత్కచు డనిలో
రిప్లయితొలగించండిశూరుని కర్ణుని వధింప జూచి విఫలుడై
దారుణముగ గూలెను ; గం
భీరుఁడు పోరాడె మిగుల బీభత్సముగన్
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీరుడు రాయలు కవితా
రిప్లయితొలగించండిశూరుడు|ఆదర్శరాజు|శోధించుటలో
ప్రేరణ శత్రువుగన? గం
భీరుడు|పోరాడె మిగులబీభత్సముగన్.
2.ప్రారంభించగ శౌర్యడౌనుగద శ్రీరాముండు లంకంతటన్
ధీరోతత్వమునందు నందిరిగి నుద్వేగానగన్పించు|గం
భీరుండాహవమందు బోరెగదరా| బీభత్సముంగొల్పుచున్
క్రూరత్వంబును గూల్చె గాదె|దశకంఠు కోలాహలంబునన్.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమొదటి పూరణ అన్ని విధాల బాగున్నది.
రెండవ పూరణలో అన్వయం లోపించింది. 'ధీరోతత్వము'..? చివరిపాదంలో గణదోషం. సవరించండి.
వీరుండా యభిమణ్యు డొక్కడె కదా వీరోన్నతిన్ క్రుద్ధుడై
రిప్లయితొలగించండిపోరాడెన్ కురుపాండవేయుల మహా పోరాట మందున్ బళీ !
వేరొక్కండునుతమ్మిమొగ్గరమునున్ వీక్షించు చునే! మేరు గం
భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్
రిప్లయితొలగించండిగుజరాతులో రాహుల్ :
ఆరాటమ్మున దేవళంబులను తా నార్భాటముం జేరుచున్
వారూవీరని లేక స్వాములవియౌ పాదలకున్ మ్రొక్కుచున్
పోరాటమ్మున పారిపోక భళిగా మోడీని నిందుంచుచున్
భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్!