16, అక్టోబర్ 2016, ఆదివారం

చమత్కార పద్యాలు – 216/25


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

25వ అర్థము కుమారస్వామి స్మరణ       
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే మామగా గలవాఁడును (గంగ, బ్రహ్మ విష్ణువునకు జనించినందున గాంగేయుఁడగు కుమారస్వామికి బ్రహ్మ మాయ యగును),
నీరజాంబక భూతి = (రాక్షస సంహారమందు) విష్ణుని వంటి సత్తా గలవాఁడును,
మహిత కరుఁడు =
అహీన మణి కలాపుఁడు =
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి బలము గల దేవతాసైన్యమున కధ్యక్షుఁడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన శక్తి బాణమున కధీశుఁడైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు కుమారస్వామి),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

2 కామెంట్‌లు:

  1. బ్రహ్మ దేవుడు మామగా బరగు నతడు
    మహిత కరుడును దేవతా మాన్యుల కధి
    పతియు నగు కుమారస్వామి వదల కుండ
    మమ్ముల నుగాచు నిరతము నిమ్ము గాను

    రిప్లయితొలగించండి
  2. Sankaraiah Garu...am a silent follower of your blog. You didn't write meanings for two words in the poem. If you can please update it, it would be helpful for us. Thanks in advance

    రిప్లయితొలగించండి