5, అక్టోబర్ 2016, బుధవారం

సమస్య - 2163 (కవి యనఁ జులుకనగ నయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కవి యనఁ జులుకనగ నయ్యె కలికాలమునన్"
లేదా...
"కవి యన్నన్ గలికాలమందుఁ గడు చుల్కం జూతురే యెల్లరున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

74 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చవిగొను విధమున పదములు
    ఠవణించక కవితలల్లు డాబుల కవులే
    భువినంతను నల్లుకొనగ
    కవియన జులుకనగ నయ్యె కలికాలమునన్.

    (ఠవణించక = కూర్చక )

    హవణిక నెంచక నిచ్చలు
    పవిదిని వదలిన పదముల పరితాపముతో
    నవనిని కవితలు గూర్చెడి
    కవియన జులుకనగ నయ్యె కలికాలమునన్.

    (పరితాపము = చలనము/కంపము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారూ! నమస్కారములు. నిన్నటి పూరణలలో దొర్లిన దోషాలను నా తెలివి మేరకు సంస్కరించినాను. దయతో పరిశీలించ గలరు.

    ధీరుడు దాపున నుండుచు
    బీరము నొఱపును తెలుపుచు పెంపును జూపన్
    మీరిన తేకువ గూడుచు
    భీరుడు పోరాడె మిగుల భీభత్సముగన్.

    పోరాటమ్మున భీతిజెందు నతనిన్ బూనించంగా దల్చుచున్
    ధీరుండొక్కడు జెంతజేరి కదనోత్సేకంబున్ గల్పించునౌ
    బీరంగూడెడి బల్కులెంచి నొఱపున్ బేర్కొన్నంతన్ విన్ననా
    భీరుండాహవమందు బోరె గదరా భీభత్సమ్ముగొల్పుచున్.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      సంతోషం!
      రెండవ పూరణ మూడు పాదాల్లో గణదోషం. '..బూనించగా... కదనోత్సేకంబు గల్పించు... బేర్కొన్ననే...' అనండి.

      తొలగించండి
    2. గురువుగారూ! నమస్కారములు పొరబాటుగా దొర్లిన తప్పులను సరిజేసినందులకు కృతజ్ణతలు

      తొలగించండి


  3. సువిశాల భావముల నె
    ల్ల వివిధ ఛందస్సులలర లక్షణము గనన్
    కవనపు మధురిమ గాంచెడు
    కవి యనఁ జులుకనగ నయ్యె కలికాలమునన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. కవులు గతమున దేశపు
    భవితను తా తీర్చిదిద్ది బాధ్యత తోడన్
    చవిచూచిరి గౌరవమును
    కవియన చులకనయ్యె కలికాలమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. 'కవులు గతమ్మున దేశపు' అనండి.

      తొలగించండి
  5. P.Satyanarayana
    భువినిన్ సంపదలన్న మోజు జుమి సద్భోగాళియే పూజ స
    త్కవనంబెచ్చట? సంప్రదాయపు కవుల్ గావించు సాహిత్యపుం
    రవముల్ యీ బధిరాళి కెక్కవు చెవిన్ రావింక సద్భావనల్
    కవియన్నన్ గలికాలమందు గడు చుల్కం జూతురే యెల్లరున్
    P.SatyanarYana
    ఛవినెంచని యంధుని వలె
    కవనంబులు వచన గేయ కలితంబవగా
    ఠవ ఠవ గడగిరి గజిబిజి
    కవియన జలుకనగ నయ్యె కలికాలమునన్
    P.Satyanarayana

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సాహిత్యపున్ రవముల్..' అనండి. అక్కడ అనుస్వారం రాదు.

      తొలగించండి
  6. ఆర్యా!
    నిన్నటి సమస్యకు నా పూరణము
    పరిశీలించ ప్రార్ధన.

    ధీరుడు కిరీటి యనియున్

    భీరువుగా మారిపోవ వెన్నుడు గీతా

    సారము బోధించగ గం

    భీరుడు పోరాడె మిగుల భీభత్సముగన్.

    రిప్లయితొలగించండి
  7. ఛవినొసగు రచన లున్నను
    కవనంబనగా నదియొక కాలక్షేపం
    బవుగాదె నేటి జగమున
    కవి యన జులకనగ నయ్యె కలి కాలమునన్!

    రిప్లయితొలగించండి
  8. కం.అవగాహన లేకున్నను
    కవితల నల్లంగ బూను గడుసు కుకవులే
    భువిలో నెక్కుడు కాగా
    కవియన జులుకనగ నయ్యె కలికాలమునన్.

    రిప్లయితొలగించండి
  9. ఎవరది చెప్పిన తప్పే
    కవియన జులుకనగ నయ్యె కలికాలమునన్
    నవ భావనల సమాజము
    కవి వ్రాతల మేలుబొంద గౌరవ మొందున్

    రిప్లయితొలగించండి
  10. కవితలు జదువగ మరిమన
    కవి యించుక మదినిజేరి యర్థముగావే
    కవి 'తల ' నొప్పెందుకనుచు
    కవి యనఁ జులుకనగ నయ్యె కలికాలమునన్.

    రిప్లయితొలగించండి
  11. నవభావంబులు సుంతలేక గణముల్నానార్థముల్జూడకే
    కవనంబంచును జ్ఞాన శూన్యుడయి ధిక్కారంపు తత్త్వంబుతో
    రవియన్మిత్రుడు సంచరింపగను విభ్రాంతితోనూగుచున్నా
    కవియన్నంగలికాలమందు గడుచుల్కంజూతురే యెల్లరున్.

    చవిలేని పదములుంచుచు
    నవరస సద్భావశైలి నాణెములేకం
    గవనముజేయు విరసుడే
    కవియన జులుకనగ నయ్యె కలికాలమునన్..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. 'విభ్రాంతిన్ జరింపంగ నా। కవి యన్నం..' అందామా?

      తొలగించండి
    2. నమస్కారములు. మీ సూచనకు ధన్యవాదములు.

      తొలగించండి
    3. నమస్కారములు. మీ సూచనకు ధన్యవాదములు.

      తొలగించండి
  12. మ.అవలోకింపగ నెన్నడైన గవులే యజ్ఞాత మైయుండి యీ
    భువిలో జక్కని శాసనమ్ములను బల్పుట్టించగా నేర్పరుల్
    అవివేకుల్ చెలరేగి పోయి కవితల్లల్లంగ బూనంగనే
    "కవి యన్నన్ గలికాలమందుఁ గడు చుల్కం జూతురే యెల్లరున్"
    "Poets are unofficial legislators"-Philosophrs"
    (కవులనధికార శాసన కర్తలు" {తత్వవేత్తలు}
    అన్న నానుడి ఆధారంగా.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కవితల్+అల్లంగ=కవిత లల్లంగ' అనే అవుతుంది. అక్కడ 'కవనం బల్లంగ...' అనండి.

      తొలగించండి
  13. భువిఁ దనశిష్యునిఁ బ్రోచెడు
    యవసరమున కన్నుబోయెనాచార్యునకు
    న్నవహేళనఁ గావింతురు
    కవి యనఁ జులుకనగ నయ్యె కలికాలమునన్ ||

    స్తవనీయుండగు వామనుండు బలితో దానమ్ము యాచింపగం
    బ్రవహింపంగ కమండలోదకము దానంబిచ్చె దైత్యేంద్రుడు
    న్నవరోధించగఁ గన్నుపోవు తడవన్నాచార్యుడేకాక్షియౌ
    కవి యన్నన్ గలికాలమందుఁ గడు చుల్కం జూతురే యెల్లరున్ ||

    కవి = శుక్రాచార్యుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      శుక్రాచార్యుని వృత్తాంతంతో మీ రెండు పూరణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.

      తొలగించండి
  14. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    నవసెన్ సాహితి | శూన్యమయ్యె జన

    …………… స౦ఘ౦ బ౦దునన్ బద్య స

    త్కవనాసక్తియె | లేదు పాఠ్యముల

    ……………… నా౦ధ్ర౦బే - కళాశాలలన్ |

    అవురా ! యా౦ధ్ర మదెల్ల గ్రా మ్య ప ద

    ……… ధూ ళ్యా చ్ఛా ది త౦ బయ్యె పో !

    చవుకన్ బారె పురాణ గ్ర౦ధ పఠనోత్సాహ౦బు |

    ……………………… హా ! దుర్విధీ !

    కవి యన్నన్ గలికాల మ౦దు గడు చుల్క౦

    ………… జూతురే యెల్లరున్ ! !

    { చవుక = అగ్గువ , అనాదర భావము ;

    చవుక పడు = చవుక బారు = సన్నగిల్లు ; }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో (న-ంఘ) యతి తప్పింది. 'జనబృందం బందునన్...' అనండి.

      తొలగించండి
  15. కవనంబెప్పుడు సాంఘికంపు ఘనసంస్కారంబు గోరన్వలెం
    గవనంబెప్పుడు ఖడ్గమైమెరసి దుఃఖార్తున్ మనోధైర్యమున్
    భువనంబందున నిల్పగాదగును సమ్మోదంబది యీని యా
    కవియన్నంగలికాలమందు గడుజుల్కంజూతురే యెల్లరున్.




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. 'సమ్మోదంబు గానట్టి యా' అందామా?

      తొలగించండి
    2. నమస్కారములు. మీ సూచనకు ధన్యవాదములు.

      తొలగించండి
  16. సూర్యనారాయణ గారూ,
    ధన్యవాదాలు. ఆ పూరణను తొలగించాను.

    రిప్లయితొలగించండి
  17. కవితా మాధురినారగించ ప్రభువుల్ కావ్యమ్ము లబ్బెన్ భువిన్
    భవితన్ తీర్చిరి పండితోత్తములు సత్భావమ్ముతో పూర్వమున్
    నవనేతల్ కడ దాశ్యమున్ సలుపుచున్ నాణ్యమ్ము లోపించుటన్
    కవియన్నన్ గలికాలమందుఁ గడు చుల్కం జూతురే యెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సద్భావంబు, దాస్యమున్..' టైపాట్లు..

      తొలగించండి
  18. రిప్లయిలు
    1. సంతోషకరమైన పని చేశారు. దానివల్లనే కదా నా తప్పు తెలుసుకున్నాను. క్షమించమని అడగవలసిన పనే లేదు. ఎవరికైనా పొరపాట్లు సహజం!

      తొలగించండి
  19. చవులూరని పదములతో
    సవురగు భావమ్ములేక స్పష్టత గరువై
    కవనపు నియమము దెలియని
    కవియన జులుకనగ నయ్యె కలికాలమునన్!!!

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. భువి నుతి కెక్కిన కవి పుం
      గవు లెల్లరు మెచ్చి నట్టి ఘనపుఁ దెనుగు తే
      ట పలుకు తేనియలు జనుల
      కవి యనఁ జులుకనగ నయ్యె కలికాలమునన్

      [జనులకు+అవి = జనులకవి]


      అవినీతీతర కార్య నిర్వహణ సాహాయ్యేద్ధ వృత్తమ్మునున్
      దివిజారాధన ధర్మవర్తనము సందేహమ్ము వర్జింపు మె
      ట్టి విపత్కాలము నందు నైన నవి పాటింపంగ రాకున్న వీ
      కవియన్నం గలికాలమందుఁ గడుఁ జుల్కం జూతురే యెల్లరున్

      [వీకు+అవియు+అన్నన్ = వీకవియన్నన్; వీకు = ఉన్నతి; అవియు = చెడు, నశించు]

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      వైవిధ్యమైన మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'అవియు+అన్నన్= అవియు నన్నన్' అవుతుందేమో అని సందేహం.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      “అవియును” లో దృతము లోపింపగా నుత్వ సంధిగా తలచితిని. చాలా సేపాలోచించాను వ్రాసే ముందు. కానీ పలుకుట యిబ్బందిగానే యున్నది.
      అవియు తద్ధర్మార్థమే కానీ ఇక్కడ విశేషణము కాదు కదా. అన్నన్ "అనిన" యర్థములో క్రియాపదమునకు కూడా విశేషణము గాదు కద ను గాగమమగుటకు.
      “నెట్టిన చక్రము కదులనిన”, “నెట్టిన చక్రము కదులుననిన”, వీటిని యుదాహరణముగా తీసుకొన వీలగునేమో పరిశీలించగోర్తాను.

      తొలగించండి
    4. శ్రీ కామేశ్వర రావు గారి కంద పద్యము మూడవ పాదంలో ప్రాస సరి జూస్తారా?

      తొలగించండి
    5. జనార్దన రావు గారు ధన్యవాదములు. రెండవ సారి ప్రచురించినపుడు పొరపాటు జరిగింది.
      భువి నుతి కెక్కిన కవి పుం
      గవు లెల్లరు మెచ్చి నట్టి ఘనపుఁ దెనుగు తే
      ట వలుకు తేనియలు జనుల
      కవి యనఁ జులుకనగ నయ్యె కలికాలమునన్

      తొలగించండి
    6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సవరించిన పూరణ తిలకించ గోర్తాను.
      ఇఁకాదులకుఁ దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు. అవియున్ ద్రుతప్రకృతికమగుటచే సంధిరాక “అవియు నన్నన్” సాధువని సవరించితిని.

      అవినీతీతర కార్య నిర్వహణ సాహాయ్యేద్ధ వృత్తమ్మునున్
      దివిజారాధన ధర్మవర్తనము సందేహమ్ము వర్జింపు మె
      ట్టి విపత్కాలము నందు నైన నవి పాటింపంగ మేలౌను నీ
      కవియన్నం గలికాలమందుఁ గడుఁ జుల్కం జూతురే యెల్లరున్

      తొలగించండి
  21. నవరస భరితపు కావ్యము
    లవలీలగ వ్రాయు చుండ నార్యులు మెచ్చ
    న్నవ మానించుట కొందఱు
    కవియన జులకన గనయ్యె కలికాలమునన్

    రిప్లయితొలగించండి
  22. కలికాలమునన్
    పూరణ:కవులకు,యవధానులకు వి
    భవ మొప్పగ సభలలోన బసదనము లిడన్
    ప్రవచించుట పాడి గాదు
    కవి యన జులుకనగ నయ్యె కలికాలమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కవులకు నవధానులకు' అనండి. మూడవ పాదం మూడవ గణం జగణ మయింది. 'పాడి యగునె' అనండి.

      తొలగించండి
  23. కువలయమందున కొందరు
    కవియనజులక నయ్యె కలికాలమున
    న్నెవరికి నర్థము కావీ
    వివరములనుచుంద్రు గాదె విజ్ఞత లేకన్.

    భువనమునందున కుకవులు
    కవితలు చదవంగనేర కన్యాయముగా
    సవరణల దెల్పుచు నందురు
    కవియన జులకనగ నయ్యె కలికాలమునన్.

    నవరసభరితము కావ్యము
    భువనము నందున యనుచును బుధులును మెత్తుర్
    కవనమెరుగక యందురు
    కవి యనజులకనగ నయ్యె కలికాలమునన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణములో 'కువలయమున కొందరకును..' అంటే అన్వయం కుదురుతుంది.
      రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం. 'సవరణల దెల్పుచుందురు' అనండి. (ఈ పద్యం నన్ను గురించి కాదు కదా!)
      మూడవ పూరణలో 'భువనమునందున ననుచును' అనండి.

      తొలగించండి
  24. సవతుల పోరుగ సెల్ ఫోన్,
    అవసరమగు టీవి మధ్య అలోచనలో
    వివరణలే విసుగించగ?
    కవియనగ జులకనగనయ్యె కలికాలమునన్.
    2. నవనీతంబునవాసనల్ నిలువ నాజూకందు రానట్లుగా
    కవితా శిల్పుల కల్పనా గతులసంకల్పంబులూహింతురా?
    భవితవ్యంబుకు గానుపించదది|లోపంబేది లేకున్న?యా
    కవియన్నన్ గలికాలమందు గడు చుల్కంజూతురే యెల్లరున్.

    రిప్లయితొలగించండి
  25. మిత్రులందఱకు నమస్సులు!

    చవి లేని వాక్యములచే
    భవితను భ్రష్టమ్ము సేయు వచన కవులకున్
    జవు లిడు పద్యము వ్రాసెడి

    కవి యనఁ జులకనగ నయ్యెఁ గలికాలమునన్!

    రిప్లయితొలగించండి
  26. (2)
    భవితన్ దిద్దెడి నీతిపద్యములచే భద్రమ్ముగా బాలలన్;
    సువిశాలమ్మగు భారతోర్వరను సంశోభాంచితోత్కీర్ణనున్;
    జవులొల్కన్ దనియించు పద్య మెసఁగన్ సంధించి మెప్పించు స

    త్కవి యన్నన్ గలికాలమందుఁ గడుఁ జుల్కం జూతురే యెల్లరున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  27. కవివరులు తెనుగు పద్దెము
    ల వఱద పారించి రిచట, లయ సాధనతో!
    కవనపు రుచి నెఱుగని మీ
    కవి యన జులకనగ నయ్యె కలికాలమునన్!
    (లయ సాధనతో అంటే ఛందో బద్ధంగా అని భావించాను)
    (మీకు +అవి = మీకవి)

    రిప్లయితొలగించండి
  28. చవిగొన జాలక కవనము
    కవులెల్లరు పనియె లేని గజ సోమరుల
    న్నవివేకపు తలపులతో
    కవి యనఁ జులుకనగ నయ్యె కలికాలమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  29. సువిశాలంబగు దేశమందు నభమున్ చుంభించు లంచంబులన్,

    భువిలో నిత్యము జర్గుచున్నఘనమౌ భూకుంభ కోణంబులన్,

    పవలే చేసెడి క్రూర హింస గవి తా పర్కించియున్ వ్రాయు నా

    కవి యన్నన్ గలికాలమందుఁ గడు చుల్కం జూతురే యెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పర్కించి'..?

      తొలగించండి
  30. నవ చైతన్యముతో వై
    భవమొన గూర్చు కవితలను ప్రజకందీయ
    న్నవగతము గాక నగుదురు
    కవి యనఁ జులుకనగ నయ్యె కలికాలమునన్

    రిప్లయితొలగించండి
  31. భువిలో మేటి కవీంద్రులమ్మనుచునే పుంఖానుపుంఖాలుగా
    కవనమ్ముల్ రచియించినన్ గనగ సత్కావ్యమ్ములే శూన్యమై
    జవసత్త్వమ్ములు లేని కావ్యములతో జాగర్యమొందింపనీ
    కవి యన్నన్ గలికాలమందుఁ గడు చుల్కం జూతురే యెల్లరున్

    నవతర మంచును జాతిని
    యవమానించెడు కవితల నల్లెడు వారి
    న్నవని జనులు మన్నింపరు
    కవి యనఁ జులుకనగ నయ్యె కలికాలమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'జాతిని। నవమానించెడు...' అనండి.

      తొలగించండి
  32. కవితల్ దెచ్చునె మైక్రొసాఫ్టునను బంగారంటి యుద్యోగమున్?
    కవితల్ దెచ్చునె రాజకీయమున కూకట్ పల్లి టిక్కెట్టునున్?
    చవటల్ వ్రాయరె కావ్యముల్ విరివి వాచాలత్వ మొప్పారగా!
    కవి యన్నన్ గలికాలమందుఁ గడు చుల్కం జూతురే యెల్లరున్.

    రిప్లయితొలగించండి