కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మునికిన్ గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్"
లేదా...
"మునికిఁ గోపమె కద భూషణంబు"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మునికిన్ గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్"
లేదా...
"మునికిఁ గోపమె కద భూషణంబు"
ఆ.వె. బాహు బలము గలిగి బవర మందున వేగ
రిప్లయితొలగించండిశూరుల నతి సులువు బార ద్రోలు
వైరి వర్గ యముడు వాయు సుతుడగు భీ
మునికి గోపమె కద భూషణంబు.
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమూర్తి యందు ప్రాణ ముండిన వేళలో
తోడి వారి నంత తూరుపెత్తి
చని తన జగ మొచ్చు చెనటులనంగ య
మునికి గోపమె కద భూషణంబు.
(మూర్తి = శరీరము ; తూరుపెత్తు = బాధించు)
క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వచ్చును ఒచ్చు అనడం దోషం. 'చని తన కడ జేరు' అనండి.
రిప్లయితొలగించండిశాంత మెల్ల వేళ సౌఖ్యము నిచ్చును
మునికిఁ ,గోపమె కద భూషణంబు
రాజు కు ఋజు మార్గ రాజ్యము నెలకొల్ప!
జనహితమ్మగునది చక్క గాను
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తపము జేసు కొనెడి తాపసుల కెపుడు
రిప్లయితొలగించండిశాప మిడగ వరము జంకు లేక
యతివ జేర నింద్ర యహల్య పైగౌత
మునికిఁ గోపమె కద భూష ణంబు
అక్కయ్యా,
తొలగించండికొంత అన్వయలోపం ఉన్నా పూరణ బాగుంది.
'యహల్య' అన్నచోట గణభంగం. సవరించండి.
తపము జేసు కొనెడి తాపసుల కెపుడు
తొలగించండిశాప మిడగ వరము జంకు లేక
సతిని జేర నింద్ర మతిబోవ ఋషిగౌత
మునికిఁ గోపమె కద భూష ణంబు
మల్లె పూలు జుట్టి విల్లున సంధించి
రిప్లయితొలగించండిమారు మూలనున్న మరుని గాంచి
మండి పడుచు జూసి దండించు శంకర
మునికిఁ గోపమె కద భూషణంబు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిదనుజుల్ మాదిరి నీచపోకడలతో దౌష్ట్యమ్ములే జేయుచున్
ననువున్ గూడిన దోడి వారలకు నానందమ్ము నేనాడు జూ
పని వారల్ చని నంతకాలయము బోవంగా నటన్ దండయా
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.
(అంతకాలయము = నరకము/యమలోకము;దండయాముడు = యముడు)
రాజారావు గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
తనుహీనుండట పంచబాణుడతడుందాకంగ చాలున్ మునుల్
రిప్లయితొలగించండితనువెల్లంబులకించిపోవ తరుణీ ధ్యానమ్మునన్ మగ్నులై
చనసంసారముఁజేయ పామరజనుల్ సాధింప శక్యమ్మె? కా
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లఁగన్ ||
ఎంతటిమునులైన చింతలనింతిపై
చనగఁజేయు పంచసాయకుండు
పామరులెదిరింప తామెంతఁదలచ, కా
మునికిఁ గోపమె కద భూషణంబు.
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితనలోనర్ధముగా వసించు సతి సీతాదేవి పైకామమున్
తొలగించండిదననే దైవముగాదలంచు నిజభక్తానీక
మున్బ్రేమయున్
అనిశంబున్ పరపీడకుల్దనుజ లోకానీకమున్గూల్చ రా
మునికిన్ గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్"
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గండ్రగొడ్డలిఁ గొని క్షాత్రసంహారమ్ముఁ
రిప్లయితొలగించండిజేయువేళ, పూత శివధనువును
విఱుచు రాముఁ దెగడువేళను పరశురా
మునికిఁ గోపమె కద భూషణంబు.
Respected Sir:
తొలగించండిI was thinking of a suitable English phrase for: "Samasya Puranam".
Maybe it could be:
"Paradox Resolution"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిCan we say this?
తొలగించండి"Literary lined puzzle completion"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిUnriddling or Riddle Solution
తొలగించండినేటి సమస్య
రిప్లయితొలగించండిమునికి గోపమె కద భూషణంబు
పూరణ:
పాలి వారి పైన పగ బట్టి వంచించి
ద్రౌపది చెరబట్టె దైత్యు డతడు
కాని పనులు జేయు కౌరవ సార్వభౌ
మునికి గోపమె కద భూషణంబు
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనుమానం బొకయింత లేదు భువిలో నత్యంత దౌష్ట్యంబుతో
రిప్లయితొలగించండిననిశం బత్యవినీతులై మనుచు దేశాభ్యున్నతిం గూల్చుచున్
ధనదాహంబున సంచరించు ఘనులన్ దండించగా బూను న
మ్మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.
ధర్మయుక్త మైన కర్మంబులం గూల్చి
సాధుజనుల నెపుడు బాధపెట్టి
సంచరించు జనుల శపియించగా బూను
మునికి గోపమె కద భూషణంబు.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మంగళములఁ గూర్చు లింగని మోమున
రిప్లయితొలగించండిసిగను శశిని మించు నగయె నగవు
శిష్ట జనులఁ గాచి దుష్టుల దునుము సో
మునికిఁ గోపమె కద భూషణంబు.
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అల్లరెరుగనట్టి యందాల రామయ్య
రిప్లయితొలగించండిఅమ్మను మురిపించ యలుక జూపి
చందమామ గోరు చల్లని వేళరా
మునికి గోపమె కద భూషణంబు
శ్రీవల్లీ రాధిక గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అల్లరి+ఎరుగ' అన్నపుడు సంధి లేదు. 'అల్లరే యురుగని యందాల...' అనండి. అలాగే 'మురిపించ నలుక జూపి' అనండి.
వనజాతాక్షిని యేకవస్త్రను దయాభావప్రయుక్తంబుగా
రిప్లయితొలగించండిగొని వస్త్రాహరణంబు జేయగ,మహత్క్రోధాగ్ని నేత్రుండుగా
ఘనదుర్వార బలప్రవర్ధనమునన్ గర్హించుచున్ లేచు భీ
మునికిన్ గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్
సంపత్ కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
క్షత్రియ నరపాలక వదన ఖ౦డనా
వ్రతుడు , మరియు , చ౦డ పరుశు ధరుడు ,
నాగ్ర హారు ణాక్షు డౌ భార్గవా౦శ రా
మునికి గోపమె గద భూషణ౦బు
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మనసే మార్దవమై ముదంబునిడు ప్రేమంబందు సౌహార్దమున్
రిప్లయితొలగించండిగనుచున్నెప్పుడు వ్యష్టిజీవనము సంఘంబందు రంజిల్లంగన్
గనువాడై పరమార్థ మెంచుచును లోకంబంతటన్ దిర్గు స
న్మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రంజిల్లగన్.....అని చదువగలరు.... టైపాటును మన్నించండి.
తొలగించండినిన్నటి సమస్యకు నా పూరణము:
రిప్లయితొలగించండిప్రాకటముగ నని నిలచుచు
వేకువలో నశువుబాయ విస్మయ మందన్
శోకముతో చిందిలునీ
రై, కనువిప్పి, కలిసినది రణ నిహతు బతిన్!
శర్మ గారూ,
తొలగించండిబాగుంది ఈ పూరణ. అభినందనలు.
వినయ మెరుగనట్తి విద్వాంసమణికి,జా
రిప్లయితొలగించండిఘనిని త్రొక్క భుజగమునకు,సి0హ
బలుడు ద్రుపదపుత్రి పడకకు బిల్వ భీ
మునికి,కోపమె కద భూషణమ్ము.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనులే చూడగ మౌనమున్ విడరుగా క్రౌర్యంబు వీక్షించుచున్
రిప్లయితొలగించండివినబోరెవ్వరు ద్రౌపదీవ్యధను రావే దాసి రారమ్మనన్
అనిలో దున్మెద కౌరవాధముల నాకడ్డంబు నెవ్వాడు, భీ
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజా మోదంబు సంధిల్లగన్ !!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంత అన్వయలోపం ఉంది.
తండ్రి యాన తోడ తల్లిని పరిమార్చి
రిప్లయితొలగించండియర్థ పతులపైన నాగ్రహించి
కువలయమును చుట్టి గూల్చిన పరశురా
మునికిఁ గోపమె కద భూషణంబు
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జన కల్యాణ సమావలంబన మిలన్ సౌశీల్య శ్రీరామ సం
రిప్లయితొలగించండిజననం బెంతయుఁ బ్రీతి పాత్రమును సఛ్చారిత్ర్యమున్ వార్ధి ర
త్న నిధిన్ దాటగ దారిఁ జూపుమనఁ దాత్సారంబు సేయంగ రా
మునికిం గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్
శాంతి దయ దమములు సుంతయు నేర్వక
భోగ లాల సుండు భూతి రతుడు
జప తప నెపములఁ బ్రజలఁ గలచు కపట
మునికిఁ గోపమె కద భూషణంబు
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు విశిష్టంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండినిన్నటి సమస్యకు నా పూరణము:
రిప్లయితొలగించండివేకువజాముచీకటిన వీరుల దున్మగ దొంగ చాటుగా
భీకరమైన శస్త్రములు భీతిని గొల్ప జవానులన్ను రీ *
పాకన జంపగా తనువు బాసిన ధీరుని జూడ గుండె నీ
రై, కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణ నాథునిన్ !!!
* జమ్మూకాశ్మీరు ఉరీ గుడారము(సైనిక స్థావరం)
మంద పీతాంబర్ గారూ,
తొలగించండినిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మునికి గోప మెకద భూషణంబనగను
రిప్లయితొలగించండిన్యాయ మగునె నార్య !నరునకు వలె
గోప ముండ రాదు కొంచె మైన మునికి
మౌనమే యతనికి నాభరణము
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అగునె యార్య' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాళ్ళు చేతులడచి గంగను బడదోసి
రిప్లయితొలగించండియింట నుంచి చంప మంట బెట్టి
కాంతను చెఱబట్ట, గండూపదమ్మె ? భీ
మునికిఁ గోపమె కద భూషణంబు
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనిశమ్మున్ నరలోకమందు మనుజుల్ హ్లాదమ్ము తోవర్తిలన్,
రిప్లయితొలగించండితనకర్తవ్యము మానసమ్మునసదా ధ్యానించుచున్ శుద్ధిగా,
కను దుర్మార్గులు భీతిలన్ సతతమున్ కాంతారమున్ నిల్చుఆ
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
సత్యనారాయణ రెడ్డి గారు "రామునికిన్" అనా లేక ఆ ముని కనియా మీ యుద్ధేశ్యము? మునికయితే నిల్చునా మునికిన్ అనండి.
తొలగించండిఆ గుట్టు రెడ్డి గారే విప్పాలి!
తొలగించండిమునికి న్గో పమె భూషణంబగు బ్రజా మోదంబు సంధిల్లగ
రిప్లయితొలగించండిన్ననగాన్యాయమె యార్య మీకదియయా హా యెంతగా బల్కిరో
మునికిన్ శాంతమె భూషణంబగును నే ప్రొద్దున్గదా నేర్వుమా
యనిశంబాతడు మానసంబు నిల నాదైవంబు నేగొల్చుగా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వనవాసమ్మును జేయువేళ నట సంప్రాప్తించు ముప్పున్ గన
రిప్లయితొలగించండిన్ననునిత్యమ్మును జాగరూకుడయి తా నాత్మీయులన్ బ్రోవుచు
న్ననిలో సింగము వోలె శత్రువుల సంహారమ్ము నే జేయు భీ
మునికిన్ గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్
దొరల మంచు తాము ధరణినేలెడు వార
మనుచు మదము తోడ మసలు నృపుల
కావరమును ద్రుంచె కల్పాన పరశు రా
మునికిఁ గోపమె కద భూషణంబు
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
విరించి గారు చక్కటి పూరణలు. “కను అన్నను” లో స్వరము పరమైనది కాబట్టి మధ్యమ పురుష ము వర్ణకమునకు లోపముండదు. “కనుమన్నను” సాధువు.
తొలగించండి“ముప్పున్ గనం
గనునిత్యమ్మును జాగరూకుడయి తాఁ గావంగ నాత్మీయుల” అన్న బాగుండును.
కామేశ్వర రావు గారూ,
తొలగించండినేను అర్థం చేసుకున్నంత వరకు అది 'కనన్+అనునిత్యమ్ము = కన న్ననునిత్యము'. ఇలాంటి ప్రయోగాలు భాగవతంలో విస్తారం.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నాదే పొరపాటు. నేనా యనునిత్యమన్న దిశలో నాలోచించ లేదు. ధన్యవాదములు.
తొలగించండిసత్యధర్మములకు సంకటస్థితిగల్గి
రిప్లయితొలగించండిదీనజనుల కిలను హానిజరుగ
దుష్టులమదమడచి దుర్నీతినణచ రా
మునికి గోపమె కద భూషణంబు !!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తపము నడ్డుకొనగ తలబోయు వారలు
రిప్లయితొలగించండిశాపములకు మదిని జడియు చుంద్రు!
ధ్యానము సమకూరి తాపము తొలుగగ
మునికి గోపమె కద భూషణంబు!
మునులు ధర్మ రతులు మోక్ష మార్గచరులు
రిప్లయితొలగించండిపరహితార్థ మతులు బ్రహ్మ విదులు
ధర్మయుతులకూత దుర్మతులయెడల
మునికిఁ గోపమె కద భూషణంబు"
శాంత గుణము రామచంద్రమూర్తికి భూష
రిప్లయితొలగించండిణమ్ము, ధర్మరాజునకును ధర్మ
గుణము మరియు సౌమ్య గుణమండ్రు ; దూర్వాస
మునికి గోపమె గద భూషణంబు.
మ. ధనసంపాదనె లక్ష్యమై చెలగుచున్ ధర్మమ్ము నొక్కింంతయున్
రిప్లయితొలగించండిమనమందెన్నడు చింత లేని పలు దుర్మార్గంపు విద్రోహులన్
దునుమాడన్ వెనుదీయ బోని బుధుడున్ దోషమ్ము లేలేని స
న్మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
జ్వరం ఎక్కువయింది. తలనొప్పి, మెడనొప్పి భరించలేక పోతున్నాను. ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చాను. ప్రస్తుతం బ్లాగును పరిశీలించలేను. మన్నించండి.
రిప్లయితొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. దయచేసి పూర్తి విశ్రాంతి తీసుకోండి
తొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండిమనికిన్ దుష్టపు నీతి గోప్యమె సుమీ మావారనన్ గొందరిన్
యునికిన్ నిల్పి దళంబు బెంచుకొనునీ యుర్విన్ జయోత్సాహ కా
మునికిన్ వోటుల సంఖ్యకై భయమునే ముమ్మారు బోషించు ధ
ర్మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
కరుడుగట్టిన కోపికి హరుడునైన
వెరచు విష్ణువు దుర్వాసు వెతనబడియు
గరచిపాదాల సేవల గరుపనెంచె
మునికి గోపమె కద మంచి భూషణంబు
వలచిన చెలినచట పరిణయమాడంగ
రిప్లయితొలగించండికోరి వచ్చి నట్టి గోప సుతుకు
మునిజన ప్రియునకును మురహరి యైన శ్యా
మునికి గోపమె గద భూషణమ్ము.
అతివను సభలోన నవమాన పరచిన
దుస్స సేను నచట దురమునందు
చంప బోయెడి బలశాలి యైనట్టి భీ
మునికి గోపమె గద భూషణమ్ము.
గాది సుతుడు చేయు క్రతువున కాటంక
ము,కలిగించునట్టి ముష్కరులగు
మారిచాదుల పరి మార్చగ నెంచు రా
మునికి గోపము గద భూషణమ్ము.
వనము నందు తాను వాసిగా నొంటిగా
తపము చేయుచుండ తరుణి యొకతె
భంగమొనర చేయ భరమున నాసంయ
మునికి గోపమె గద భూషణమ్ము.
(చివరిపద్యం మనుచరిత్ర ఆధారంగా మనోరమ కథతో పూరించాను.)
వలచిన చెలినచట పరిణయమాడంగ
రిప్లయితొలగించండికోరి వచ్చి నట్టి గోప సుతుకు
మునిజన ప్రియునకును మురహరి యైన శ్యా
మునికి గోపమె గద భూషణమ్ము.
అతివను సభలోన నవమాన పరచిన
దుస్స సేను నచట దురమునందు
చంప బోయెడి బలశాలి యైనట్టి భీ
మునికి గోపమె గద భూషణమ్ము.
గాది సుతుడు చేయు క్రతువున కాటంక
ము,కలిగించునట్టి ముష్కరులగు
మారిచాదుల పరి మార్చగ నెంచు రా
మునికి గోపము గద భూషణమ్ము.
వనము నందు తాను వాసిగా నొంటిగా
తపము చేయుచుండ తరుణి యొకతె
భంగమొనర చేయ భరమున నాసంయ
మునికి గోపమె గద భూషణమ్ము.
(చివరిపద్యం మనుచరిత్ర ఆధారంగా మనోరమ కథతో పూరించాను.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికార్తవీర్యు డొచ్చి కాల్దువ్వ రణముకై
రిప్లయితొలగించండిశాంతి నుడుగులెల్ల చాలనపుడు
పరశురాము డణచ బహురోసముప్పొంగ
మునికి గోపమె కద భూషణంబు
1. దారి నిడగ వేడ దయజూపి లంకకున్
రిప్లయితొలగించండినీటి వామి రామ మాట వినదె,
అలుక బూని శరము నంకించ పూను ,రా
మునికి గోపమె కద భూషణంబు.....
2. సానుకూలమవక సైరంధ్రి హితవాక్కు
కీడు చేయ దలచ కీచకుండు
పత్ని కష్టమెరిగి పతితుని జంపు ,భీ
మునికి గోపమె కద భూషణంబు.....
పూల కారునందు పూజల పేర్జెప్పి
రిప్లయితొలగించండిభర్త నేడిపించు భార్య నెంచి
వలపురేపు పంచ బాణ సంధాన కా
మునికి గోపమె కద భూషణంబు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాగజ్యోతి గారూ,
రిప్లయితొలగించండిఅస్వస్థత వల్ల ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.
వరుసగా మీరు పంపిన పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
'కార్తవీర్యు డొచ్చి...' పూరణలో 'వచ్చి'ని 'ఒచ్చి' అన్నారు. అక్కడ 'కార్తవీర్యు డలిగి...' అనండి. అలాగే 'బహు రోష ముప్పొంగ' అనండి.
'పూలకారులందు...' పూరణ మనోహరం!
'అత్తరంబుతోడ...' పూరణలోను ఒచ్చి అన్నాడు. 'అత్తరంబుతోడ నంతకారియె వచ్చి...' అనండి.
dhanyavaadalandee maarustaanu.... mee arogyam tondaragaa kuduta padaalani korukuntunnaanu
రిప్లయితొలగించండిఅత్తరంబుతోడ నంతకారియె వచ్చి
రిప్లయితొలగించండిపత్ని చేరువేళ పాపడొకడు
అడ్డగించ చూడ నతిశయమ్మవగ, సో
మునికి గోపమె కద భూషణంబు
కార్తవీర్యుడలిగి కాల్దువ్వ రణముకై
రిప్లయితొలగించండిశాంతి నుడుగులెల్ల చాలనపుడు
పరశురాము డణచ బహురోసముప్పొంగ
మునికి గోపమె కద భూషణంబు
కార్తవీర్యుడలిగి కాల్దువ్వ రణముకై
తొలగించండిశాంతి నుడుగులెల్ల చాలనపుడు
పరశురాము డణచ బహురోషముప్పొంగ
మునికి గోపమె కద భూషణంబు
కనుడీ హైదరబాదునన్ మురికివౌ కాల్వల్ న దుర్గంధమున్
రిప్లయితొలగించండివినుడీ కుక్కల మూకలన్ మొరుగు గంభీరంపు పోట్లాటలున్
చనగా నిచ్చటకున్ రమారమణుడౌ చంద్రున్ కుమారుండు...రా
మునికిన్ గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్
(in praise of Sri Kalvakuntla Taraka Rama Rao, Minister for Municipal Administration and Urban Development and Brand Hyderabad)