త్రింశదర్థ పద్యరత్నము – పోకూరి కాశీపతి
ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.
13వ అర్థము
–నవగ్రహ స్మరణ
భూరి జఠర గురుఁడు = మిక్కిలి కఠినులగు వారికి
(రాక్షసులకు) గురువైన శుక్రుఁడును,
నీరజ అంబక భూతి = విష్ణుజన్ముఁడైన యంగారకుఁడును,
మహిత కరుఁడు = ఘనతరమైన కిరణములుగల సూర్యుఁడును,
అహి = రాహుయుక్తమైన
ఇనమణి = రాజసర్ప విశేషమగు కేతువును (రాహుకేతువులును),
కలాపుఁడు = విద్యల కధిపతియగు బుధుఁడును,
అలఘు సద్గణేశుఁడు = విస్తారమైన నక్షత్ర చయమున
కధీశుఁడగు చంద్రుఁడును,
అగ్ర గోపుఁడు = ప్రధాన గీష్పతియగు బృహస్పతియును,
మహామర్త్యసింహుఁడు = గొప్పయగు దేవతలలో సింహప్రాయుఁడైన
శనియును,
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
సూర్య చంద్రులు గురుడును నార్య !మఱియు
రిప్లయితొలగించండిశుక్రు డం గార కుండును సురుచురు లిల
రాహు కేతులు శనియును రమ్య మలరి
యేలు గావుత మనలను నిమ్ము గాను