10, అక్టోబర్ 2016, సోమవారం

చమత్కార పద్యాలు – 216/19


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

19వ అర్థము ఆదిశేష స్మరణ       
                                                                          
భూరి జఠర గురుఁడు = గొప్ప కడుపు గలవారిలో దొడ్డవాఁడును (తల, తోక తప్ప తక్కిన భాగమంతయు కడుపు),
నీరజాంబక భూతి = చేపకన్నులవంటి నేత్రసంపద గలవాఁడును (రెండువేల కన్ను లనుట),
మహిత కరుఁడు = (తన శరీరమునే కరముగా చేసుకొని దేనినైనను పట్టుకొనుట చేత) గొప్ప చేయి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన మణిసముదాయము గలవాఁడును (శేషాహి పడగలయందున మాణిక్యము లుండు ననుట ప్రసిద్ధము),
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి సాధువుల కధీశ్వరుఁడైనవాఁడును (నాగపూజ లాచరించువారి కనుట),
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన భాష గలవాఁడును (భాషాచాతుర్యము గలవానిని భాషయం దపరశేషుఁడనియు, భాషాశేషుఁ డనియు వర్ణించుట కవి సమయము),
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు ఆదిశేషుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

1 కామెంట్‌:

  1. ఎప్పు డైనను నీపట్ల తప్పు జేయ
    సదయతను గావుమా నను సర్ప రాజ !
    నీర జాం బక ! మహితుడ !భూరి జఠ ర !
    యాది శేషుడ ! మమ్ముల నాదు కొనుము

    రిప్లయితొలగించండి