11, అక్టోబర్ 2016, మంగళవారం

చమత్కార పద్యాలు – 216/20


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

20వ అర్థము గరుడ స్మరణ        
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాఁడును (బ్రహ్మ సంతతి యగు కశ్యపుని కొడుకు),
నీరజాంబక భూతి = కమలాక్షుఁడే యైశ్వర్యముగా గలవాఁడును (విష్ణుభక్తుఁడు),
మహిత కరుఁడు = ఘనతరమైన హస్తములు గలవాఁడును (ఇంద్రు నోడించి అమృతమును దెచ్చిన దోర్బలశాలి),
అహీన మణి కలాపుఁడు = సర్పరాజముల మణిసముదాయము గలవాఁడును (నాగుల పడగలు చప్పరించి యుమ్మివేసిన రత్నములు తన యింటినిండ ఉండును),
అలఘు సద్గణేశుఁడు = గొప్ప యొప్పులకుప్ప యగు ప్రభువైనవాఁడు (ఖగేశ్వరుఁడును),
అగ్ర గోపుఁడు = పైభాగమున భూభర్త యగు విష్ణువు గలవాఁడు (విష్ణువునకు వాహనము),
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు గరుడుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

2 కామెంట్‌లు:



  1. దసరా శుభాకాంక్షలు
    బ్లాగు మిత్రుల కిడుదును వంద నములు
    దసర పండుగ కతనన దండి గాను
    అందు కొను డార్య !మీరంద రందుకొనుడు
    నా శు భాకాంక్ష లీ యవి ,వేశ తములు

    రిప్లయితొలగించండి
  2. కశ్యపునియొక్కకొమరుడ!గరుడ!పక్షి
    రాాజ!విష్ణువాాహన!సర్పరాాజ!కాావు
    మాానిరతమునుమమ్ములమాాననీయ!
    వ0దన0బులుసేతునుభక్తితోడ

    రిప్లయితొలగించండి