7, అక్టోబర్ 2016, శుక్రవారం

చమత్కార పద్యాలు – 216/16


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

16వ అర్థము సముద్ర స్మరణ       
                                                                          
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గలవారలలో గొప్పవాఁడు (సర్వ నదులను భరించు కడుపు గలవాఁడు),
నీరజాంబక భూతి = చేపలే నేత్రసంపదగా గలవాఁడును,
మహిత కరుఁడు = అతిశయమైనవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప రత్న సముదాయము గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = ఘనమైన సాధుగణాధ్యక్షుఁ డైనవాఁడును (సముద్రస్నాన ఫలాపేక్షితుల కనుట),
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన జలాధిపతి యైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = నాశనము లేనివారిలో మిక్కిలి శ్రేష్ఠుఁడైనవాఁడును (అగు సముద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

1 కామెంట్‌:

  1. రత్న గ ర్భుడు మత్స్య నేత్ర ములు నేత్ర
    ములుగ గలవాడు జలధి నా ముడును నైన
    సంద్ర ఱేనికి నతులను సాదరముగ
    నిత్తు ననిశము పుణ్యము నీయు కొఱకు

    రిప్లయితొలగించండి