11, అక్టోబర్ 2016, మంగళవారం

సమస్య - 2168 (విదియ నేఁడు వచ్చె...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"విదియ నేఁడు వచ్చె విజయదశమి"
లేదా...
"విదియ నేఁడు వచ్చెఁ గనుఁడు విజయదశమి పర్వమే"

75 కామెంట్‌లు:

 1. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అమ్మవారి నెంచు నవతారముల యందు
  దాక్షి గౌరి యగుచు దనరు తిధియె
  విదియ, నేడు వచ్చె విజయ దశమి మహి
  షాసురు నడచ శివ షడ్భుజి యయ్యెను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. శంకరాభరణ సోదర సోదరీ మణు లందరికీ విజయదశమి శుభాకాంక్షలు

   తొలగించండి

 2. అందరి కీ విజయ దశమి శుభాకాంక్షల తో !

  రెండవ తిధి నందురే జిలేబి జనులు
  విదియ! నేఁడు వచ్చె విజయదశమి!
  బాల్య కాల చిలిపి పనులను విదియమం
  దురట ! తెలుగు భాష దూకొనమ్మ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాల చిలిపి... దుష్ట సమాసం. బాల్యమందు చిలిపి. .. అనండి.

   తొలగించండి
 3. తిధుల వరుస లోన దివ్యమై వెలుగొందు
  చుండు నెల్లవేళ సుందరమయి
  మెండు శుభము లొసగు రెండవ దయినట్టి
  విదియ, నేడు వచ్చె విజయదశమి.

  ముదము గూర్చు నెల్లగతుల ముఖ్యమైన దౌచు తా
  నెదలలోన, దివ్యజయము లిచ్చుచుండు కార్యముల్
  సదమలంపు భావమూని శ్రధ్ధతోడ జేసినన్
  విదియ, నేడు వచ్చె గనుడు విజయదశమి పర్వమే.
  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 4. P.Satyanarayana
  విడుడు నిద్ర శుక్ల దశిమి విహితముగన నోర్వకన్
  "విదియ నేము వీడ "మనుచు వెగటు బలుకు టేల?యా
  పదల బాపు శాంభవిగన బరగ; సరియ మాటలన్
  విదియ నేడు!వచ్చె గనుడు విజయ దశిమి పర్వమే!
  చాంద్రమానపు తిథి శశి కాంతి విప్పారు
  దశిమి శుక్ల మందు దనరు దసర
  సూర్య గతిని లెక్క జూడగ నిట్లగు
  విదియ నేడు: వచ్చె విజయ దశిమి
  P.Satyanarayana

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. నేను పుట్టిన తిధి నికరమ్ముఁ జూడఁగ
  విదియ,నేడు వచ్చె విజయ దశమి
  యాంగ్ల మాసమైన నక్టోబరందున
  తేది సరిపడంగ మోదమాయె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. "శంకరాభరణం" నిర్వాహకులు, సుప్రసిద్ధకవులు, శ్రీ కంది శంకరయ్య గారికి, పాల్గొనుచున్న సుకవి గణమునకు విజయదశమి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 7. ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
  "విదియ నేఁడు వచ్చె విజయదశమి"
  ****&&&&****
  వీరిచే పోస్ట్ చెయ్యబడింది
  కంది శంకరయ్య వద్ద 10/11/2016 12:02:00 [ఆం]
  పూరణ:
  ఆ.వె.పక్షమందు నేది పాడ్యమి తదుపరి?
  ఏది మంచి కాల మెంచి జూడ?
  వేచి వేచి మనము చూచుచు నుండగ
  విదియ; నేడు; వచ్చె విజయ దశమి

  రిప్లయితొలగించండి
 8. గురువర్యులకు, కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు అందరికీ దసరా శుభాకాంక్షలు.

  కందము:
  అమ్మాయను మా పిలుపున
  కమ్మాయను మాయజేతువమ్మా! మము చే
  కొమ్మా! నీదరి,శంభుని
  కొమ్మా! యిమ్మహి జనులకు కోరినవిమ్మా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   ధన్యవాదాలు.
   పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 9. దసరా శుభాకాంక్షలు
  ==
  బ్లాగు మిత్రుల కిడుదును వంద నములు
  దసర పండుగ కతనన దండి గాను
  అందు కొను డార్య !మీరంద రందుకొనుడు
  నా శు భాకాంక్ష లీ యవి ,వేశ తములు

  రిప్లయితొలగించండి
 10. గురువర్యులకు, బ్లాగ్ ను విఙ్ఞాన దాయకంగా రంజుంప జేస్తున్న సుకవి మిత్రులకు, పెద్దలందరికి హృదయ పూర్వక దసరా శుభాకాంక్షలు.
  వారమొకటి గడువ, వచ్చునదె బహుళ
  విదియ! నేడు వచ్చె విజయ దశమి!
  మదిని గొలిచి దుర్గ మాత దీవనలంద
  విజయ పథము నిన్ను విడువ బొదు!

  రిప్లయితొలగించండి
 11. విజయలక్ష్మి గొనుచు విప్పారు మోముతో
  నరుగు దెంచె భవిత కభయ మొసగ
  వెలుగు పుంత లలరు హృదయ కాంతులకు తా
  విదియ, వచ్చె నేడు విజయదశమి!

  రిప్లయితొలగించండి
 12. శిష్ట్లా శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. విజయ నాడు వచ్చె విజయ దశమి యన
  భావ్యమే శశి కళ !యాశ్వయుజపు
  దశమి నాడు వచ్చు దరదరముల నుండి
  యట్లు గాను వచ్చె నదియ తెలియు

  రిప్లయితొలగించండి
 14. భరత ఖండ మందుఁ బరమ పుణ్యతమము
  విజయ దశమి యిచ్చు విభవము లిల
  పర్వ పర్వములను భవ్య తరములు లే
  విదియ నేఁడు వచ్చె విజయదశమి


  పదిలము మన సంస్కృతి బహు పావనంబు పృధ్వినిన్
  బదపడి మన పర్వము లిల భావ గర్భితమ్ములే
  వదరు మహిమ లెల్ల మాకు భవ్యముగను దెలియ రా
  విదియ నేఁడు వచ్చెఁ గనుఁడు విజయదశమి పర్వమే

  [వదరు = అడరు; రావు+ఇదియ = రావిదియ]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   లేవు/రావు+ఇదియ... అంటూ విలక్షణమైన విరుపులతో మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 15. ఇదిర! రాముడు విజయేందిర జేబట్టె
  నరుడు గోగ్రహణము దిరుగ దెచ్చె
  నరయ జయము లెల్ల దొరగొనుటకు నిర
  విదియ, నేడు వచ్చె విజయదశమి
  ఇరవు+ఇదియ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అశ్వత్థ నారాయణ గారూ,
   ఇరవు+ఇదియ... అంటూ వైవిధ్యమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 16. పండుగ శెలవలను పరిగణించిననాడు
  విదియ, నేఁడు వచ్చె విజయదశమి
  శీఘ్రమే గతించె శెలవలనుచుఁ దల్చి
  యయ్యవారు పొత్తమందుకొనియె.

  పండుగశెలవలను లెక్కపరుప నాడు
  విదియ, నేఁడు వచ్చెఁ గనుఁడు విజయదశమి
  పర్వమే రేపటి మొదలు బడికిఁబోదు
  ననుచు పుస్తకంబులఁబట్టె నయ్యవారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   మీ రెండు పూరణలు (ముఖ్యంగా ఉత్సాహాన్ని తేటగీతిగా మార్చిన రెండవ పూరణ) చాలా బాగున్నవి. అభినందనలు.
   'సెలవు' సాధువు కదా!

   తొలగించండి
  2. ఆర్య! అనేక నమస్కారములు. మీరు తెలియజేసిన విషయమున సందేహముండినది. ఇప్పుడు తీసినది. సవరించిన పద్యాన్ని పంపుతున్నాను.

   పండుగసెలవలను లెక్కపరుప నాడు
   విదియ, నేఁడు వచ్చెఁ గనుఁడు విజయదశమి
   పర్వమే రేపటి మొదలు బడికిఁబోదు
   ననుచు పుస్తకంబులఁబట్టె నయ్యవారు.

   తొలగించండి
  3. పండుగ సెలవలను పరిగణించిననాడు
   విదియ, నేఁడు వచ్చె విజయదశమి
   శీఘ్రమే గతించె సెలవలనుచుఁ దల్చి
   యయ్యవారు పొత్తమందుకొనియె.

   తొలగించండి
 17. గడచినతిథి యదియ కామేశ మిత్రమా
  విదియ, నేడు వచ్చె గనుడు విజయదశమి
  విజయ పథము నందు విశ్వంబునడిపింప
  భక్తజనులకెపుడు భద్రమీయ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో గణదోషం. అందులో 'గనుడు' తొలగిస్తే సరి!

   తొలగించండి
  2. పొరబాటండి శంకరయ్యగారు. సూచించిన మీకు ధన్యవాదాలు.

   తొలగించండి
  3. పొరబాటండి శంకరయ్యగారు. సూచించిన మీకు ధన్యవాదాలు.

   తొలగించండి
 18. ముదము తోడ కలము బట్టి మ్రొక్కి పలుకు లమ్మకున్
  పదను బెట్టి భావములకు పద్య రూప మీయగా
  కదన మందు దూకు డయ్య కైత లూరు తా
  విదియ నేఁడు వచ్చెఁ గనుఁడు విజయదశమి పర్వమే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   వాహ్! 'కైత లూరు తా విదియ...' అద్భుతం! చక్కని పూరణ. అభినందనలు.
   శంకరాభరణం బ్లాగుకు 'కైత లూరు తావు' అన్న కితాబు ఇచ్చినందుకు ధన్యవాదాలు!

   తొలగించండి
 19. అన్నితిధులకంటెనరయగమేల్చేయు
  విదియ,నేడువచ్చెవిజయదశమి
  సకలశుభములీయజనులకువిరివిగ
  నాశ్వయుజపుదశమియహముగాన

  రిప్లయితొలగించండి
 20. ఆశ్వయుజపు మొదటి అహము గడచెను నిన్న
  విదియ వచ్చె నేడు,విజయ దశమి
  నాడు దుర్నయులకు నాశము ప్రాప్తించి
  శుభములొసగు నంబ సుజనులకును

  రిప్లయితొలగించండి
 21. నాదుజన్మదినమునరయనాగరాజ!శుధ్ధమౌ
  విదియ,నేడువచ్చెగనుమువిజయదశమిపర్వమే
  యాశ్వయుజపుశుధ్ధదశమియనబడీదినమ్మునే
  సకలజనులశుభముకోరిసాకవారలన్సుమా

  రిప్లయితొలగించండి
 22. విదియ వెన్నెలలను విస్తరింపగ జేయు
  విత్తనంబు వేయ?వెలుగులేని
  విదియ|నేడువచ్చె విజయదశమిశక్తి
  దశ విధాలశోభ దసరయనగ|
  2.పదుగు రెంతురకట శుక్లపాడ్య సోమవారమే
  విదియ|నేడువచ్చెగనుడు విజయ దశమి పర్వమే
  పదిదినాల పండుగౌను భక్తి ,శ్రద్దలుంచగా
  మదిని హాయి బంచు గాదె?మర్మమదియె దసరయౌ|
  3. క్రమాలంకారం
  అదురు,బెదురులేనివాడె నాజి జేరె నెప్పుడో? {విదియ}
  చెదురు,మదురుఘట్టమందు చేటుగల్గ జేయగా? {నేడువచ్చె గనుడు}
  మదము మాన్పి మహిషు జంపె|మాతశక్తినందుకే? {విజయదశమిపర్వమే.}

  రిప్లయితొలగించండి
 23. పండుగకు పుట్టినిళ్ళకు చేరిన స్నేహితురాండ్ర సంభాషణ....

  చవతినాఁడు వచ్చుఁ జారుమతి, నవమి
  నాఁడు వచ్చునంట నళిని, రేపు
  విదియ, వచ్చె నేఁడు విజయ, దశమినాఁడు
  కలసికొందము శశికళ గృహమున.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యన్యానూహ్య పురాతన సంప్రదాయ సంస్మరణోచిత భావప్రకటన మత్యంత ప్రశంసనీయము. శతాధిక వందనములు.

   తొలగించండి
  2. గురువుగారూ ఊహాతీతమైన పూరణ నిచ్చారు.

   తొలగించండి
 24. సహదేవుడు గారికి, అశ్వత్థ నారాయణ మూర్తి గారికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 25. పాడ్యమి తరువాత వచ్చుతిథి నదియు
  విదియ,నేడు వచ్చె విజయ దశమి
  సంబరములు జరిపి సరదాగ గడపంగ
  రండు మిత్రులార రహముతోడ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తిథి యదియు' అనండి.

   తొలగించండి
 26. నేటితోడ తీరు నింక నజ్ఞాతంబు
  కష్టకాలమంత గడచిపోయె
  గోగ్రహణమునందు కుపితంబు చూపతా
  విదియ నేఁడు వచ్చె విజయదశమి

  గురువులు పూజ్యులు పెద్దలు మిత్రులు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 27. తొమ్మిదవరోజు ఊరికి వెళ్తానంటున్న కూతురుతో తల్లి.

  వినుమ వెడల రాదు వెనుక వచ్చిన యూరు
  తొమ్మిదవదినమ్ము తొందరేల
  నేనుచెప్పుచుంటి, నీవువచ్చినరోజు
  విదియ,నేడు వచ్చె విజయ దశమి.

  రిప్లయితొలగించండి
 28. పక్ష మేది యైన వచ్చు రెండవ తిధి

  విదియ; నేడు విజయ దశమి

  పనులు మొదలు పెట్టు భవ్యమైన దినము

  సర్వ లోకములకు పర్వ దినము.

  రిప్లయితొలగించండి
 29. భక్త జనులు గొలువ బ్రహ్మాండ నాయకి
  శ్వేత వస్త్రము గొని చిద్విలాసి
  "బ్రహ్మచారిణి" యయి ప్రకటిత మగు తిథి
  విదియ ; నేఁడు వచ్చె విజయదశమి

  రిప్లయితొలగించండి
 30. ( సవరణ తో )

  పక్ష మేది యైన వచ్చు రెండవ తిధి

  విదియ; నేడు వచ్చె విజయ దశమి

  పనులు మొదలు పెట్ట భవ్యమైన దినము

  సర్వ లోకములకు పర్వ దినము.

  రిప్లయితొలగించండి
 31. పూజ్య గురువులు శ్రీ శంకరయ్య గారికి, సహకవిమిత్రు లందరకూ విజయదశమి శుభాకాంక్షలు...శైలజ

  రిప్లయితొలగించండి
 32. పాడ్యమి తరువాత ప్రతి పక్షమున వచ్చు
  విదియ, నేడు వచ్చె విజయ దశమి
  పావనమగు రోజు భారత ప్రజలకు
  పనిని మొదలుబెట్ట ఫలితమొసగు

  రిప్లయితొలగించండి
 33. గడచినతిథి యదియ కామేశ మిత్రమా
  విదియ, నేడు వచ్చె గనుడు విజయదశమి
  విజయ పథము నందు విశ్వంబునడిపింప
  భక్తజనులకెపుడు భద్రమీయ.

  రిప్లయితొలగించండి