24, జులై 2010, శనివారం

గళ్ళ నుడి కట్టు - 19


అడ్డం
1. మనస్సు. మనలోనుండే ఇంద్రియం (5)
4. సమర్థత (3)
6. మోసం చేసే నక్క. దానిని వంచకండి (3)
8. అర్థం లేకుండా వాగడం. విప్ర విలాపంలో (3)
12. శివుడు. నిలువు 11 యొక్క శత్రువు. నీకంత దర్పపు వైఖరి ఏల? (5)
16. రాత్రి మిగిలిన అన్నం. పెద్దల మాట ఈ మూట (2)
17. చెవి లోపలి భాగం. గుడ్లగూబకు అదిరేది (2)
18. ప్రకాశించినది. రాజ్యం పరాజితం అన్నచో (3)
22. ఇంగ్లీషు ప్రేమతో రాముని కొడుకు తిరగబడ్డాడు (3)
23. సిగ్గెందుకు? ఆదర్శకుటుంబం చిత్రంలో సినారె పాట ".... ఓ చెలి, అడిగె నిన్నే జాబిలి" గుర్తుందా?
(5)
నిలువు
2. దాని నుండి పుట్టినది. శ్రీ తత్సమమైతే,సిరి ...... ? (3)
3. మావటి, సారథి. నియంతకు కావాలి (2)
5. తుమ్మెద. దీనికి మధుపానం పాపం కాదు (3)
7. పిచ్చుక. ఎచట కంటివి? (3)
9. మైకం. లహరి నుండి పుట్టిందా? మాయాబజారులో ఓహో జగమే ఊగెనులే (3)
10. విభక్తి ప్రత్యయం లోపించిన పాము. సమర్పణలో (2)
11. ఐదు బాణాలు కలిగిన మన్మథుడు (5)
13. రావణ వధను సరదాగా చేసుకొనే పండగ (3)
14. వికృతంగా మారింది. అవైనా స్వకృతం (3)
15. వెంకన్నది తిరుమల, మరి అయ్యప్పది ... ? (5)
19. ఒక స్వీటు. గులాబిలా ధ్వనిస్తుంది (3)
20. ఊయల. అందు కలడో అని వెనక్కి చూడు (2)
21. హిందువుల సైతాను. దీనికి చిక్కి పాపాలు చేస్తామట. అమాయకులం కదా!

7 కామెంట్‌లు:

  1. అడ్డము:
    1)....4)సామర్ద్య్హం,6)వంచన,8)ప్రలాపం,12)కందర్పహరి,16)చద్ది,17)గూబ,18)రాజితం,22)డువుల,23)బిడియమేల.
    నిలువు:
    2)...3)లాటీ,5)మధుపం,7)చటకం,9)లాహిరి,10)సర్ప,11)పంచశరుడు,13)దసరా,14)హకృతం,15)శబరిమల,19)జిలేబి,20)యల,21)మాయ.

    రిప్లయితొలగించండి
  2. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    అడ్డం 6, 12, నిలువు 3, 14, 20 మరోసారి ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి
  3. అడ్డం
    1.-- 4. సామర్ధ్యం6.వంచన 8.ప్రలాపం 12.కందర్పవైరి 16.చద్ది 17.గూబ 18.రాజితం 22.డువుల 23.బిడియమేలా

    నిలువు:
    2----3. --5.మధుపం 7.చటకం 9.లాహిరి 10.సర్ప 11. పంచబాణుడు 13.దసరా 14.వైకృతం 15.శబరిమల 19.జిలేబి20.డోల
    నాకు ఈసరి కొన్ని ఆధారాలు రాలేదు. దయచేసి సరి అయిన సమాధానాలు చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  4. అడ్డం
    1.అంతరింద్రియం 4.సామర్థ్యం 6.వంచకం 8.ప్రలాపం 12.కందర్పవైరి 16.చద్ది 17.గూబ 18.రాజితం 22.డువుల 23.బిడియమేలా
    నిలువు
    2.తద్భవం 3.యంత 5.మధుపం 7.చటకం 9. లాహిరి 10. సర్ప
    11.పంచబాణుడు 13.దసరా 14.వైకృతం 15.శబరిమల 19.జిలేబి
    20.డోల 21.మాయ

    రిప్లయితొలగించండి
  5. గళ్ళ నుడి కట్టు - 19 సమాధానాలు.
    అడ్డం -
    1.అంతరింద్రియం; 4.సామర్థ్యం; 6.వంచకం; 8.ప్రలాపం; 12.కందర్పవైరి; 16.చద్ది; 17.గూబ; 18.రాజితం; 22.డువుల; 23.బిడియమేల;
    నిలువు -
    2.తద్భవం; 3.యంత; 5.మధుపం; 7.చటకం; 9.లాహిరి; 10.సర్ప; 11.పంచబాణుడు(శరుడు); 13.దసరా; 14.వైకృతం; 15.శబరిమల; 19.జిలేబి; 20.డోల; 21.మాయ.

    రిప్లయితొలగించండి
  6. శంకరయ్య గారూ, మీరు ‘కీ’ ప్రకటించకముందే నేను సమాధానాలు పంపాను. అవి ఏమైనట్టు? :)

    రిప్లయితొలగించండి