20, జులై 2010, మంగళవారం

సమస్యా పూరణం - 43

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
వేళ కాని వేళఁ బిలువఁ దగునె?

వారాంతపు సమస్యా పూరణం - 1
రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.

23 కామెంట్‌లు:

  1. పని దినములందు, పని వేళ, ఒత్తిడి
    బోవ తొంగి చూడ , పూరించ నూరించు
    శంకరార్య! చతుర సమస్య నిచ్చి
    వేళ కాని వేళఁ బిలువఁ దగునె?

    రిప్లయితొలగించండి
  2. ఆఫీస్ లో ఎవరూ చూడకుండ పరిగెత్తుకొస్తున్న తొందర లో ఆటవెలది పాదాలు తడబడ్డాయి - ఇది పరిశీలించండి :

    పని దినములందు, పని వేళ, ఒత్తిడి
    బోవ తొంగి చూడ , పూరింపమని
    శంకరార్య! యిచ్చి చతుర సమస్యలన్
    వేళ కాని వేళఁ బిలువఁ దగునె?

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాతగారూ,
    సమస్య ఎంత చతురంగా ఉందో మీ పూరణ అంత చమత్కార౦గానూ ఉంది.
    శంకరయ్యగారూ,
    ఎంత పనివత్తిడి ఉన్నప్పటికీ మీ బ్లాగు కట్టిపడేస్తు౦ది అనడానికి ఇదే నిదర్శన౦.

    రిప్లయితొలగించండి
  4. రెండో పాదం లో దోషాన్ని సవరిస్తూ ముచ్చటగా మూడో సారి

    పని దినములందు, పని వేళ, ఒత్తిడి
    బోవ తొంగి చూడ , పూరణకును
    శంకరార్య! యిచ్చి చతుర సమస్యలన్
    వేళ కాని వేళఁ బిలువఁ దగునె?

    రిప్లయితొలగించండి
  5. బాసు పిలిచె నంత బలిమిగా నిశరాత్రి
    భార్య వళ్ళు మండి బీగ మేసె
    తిరిగి ఇంటికేగ తెరువదు తలుపెంత
    వేళ గాని వేళ పిలువ దగునె ?

    రిప్లయితొలగించండి
  6. అజ్ఞాత గారూ,
    మీ మొదటి పూరణ కాస్త ఆలస్యంగా చూసాను. కాస్త తీరిక చేసుకొని సవరిద్దామని కూర్చునే సరికి మీ మిగతా రెండు పూరణలు కనిపించాయి. సవరించాల్సిన అవసరం లేకుండా మీ మూడవ పూరణ అన్ని విధాల బాగున్నది. అభినందనలు. ఏమయితేనేం? చివరికి నన్నే "టార్గెట్" చేశారు పూరణలో. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. బాసు పిలిచె నంత బలిమిగా నిశిరాత్రి
    వళ్ళు మండి భార్య బీగ మేసె
    తిరిగి ఇంటి కేగ తెరువదు తలుపెంత
    వేళ కాని వేళ బిలువ దగునె

    రిప్లయితొలగించండి
  8. రాజేశ్వరి గారు,
    >>వళ్ళు మండి భార్య బీగ మేసె
    వ - బీ కు హల్ సామ్యము కుదిరింది, అచ్ సామ్యము కుదరలేదు. ఈ సూచన గమనించండి.

    - వళ్ళు మండి భార్య గొళ్ళె మేసె.

    రిప్లయితొలగించండి
  9. నేదునూరి రాజేశ్వరి గారూ,
    పద్యం చమత్కారంతో అలరించింది. రెండవ పాదంలో యతి తప్పింది. మీరు సవరిస్తారా? నన్నే సవరణ చేయమంటారా?

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. భార్య ఊరి కేగె పండుగని ఒకఁడు
    పనిమనిషినిఁ బిలిచి పైట లాగ
    ఆమె మగఁడు వచ్చి అంటువోసె. పనికి
    వేళ కాని వేళఁ బిలువఁ దగునె?

    రిప్లయితొలగించండి
  12. పడకటింటగూడ ప్రాజెక్టు పనులాయె
    తెల్లవారుదాక తీరదాయె
    ఝాము పొద్దు కాగ జవరాలు నీవంటు
    వేళ కాని వేళ బిలువ దగునె

    రిప్లయితొలగించండి
  13. ఆదివారమందు అపరాహ్న వేళలో
    బాసు ఫోను చేసి పనికి పిలిచె!
    వళ్ళు మండి నేను వార్నింగు నిస్తినీ
    వేళ కాని వేళఁ బిలువఁ దగునె?

    రిప్లయితొలగించండి
  14. ఇంత మంది ఒకే విషయం మీద పూరించారు. ఈ సమస్య అందరిది అన్నమాట . కాబట్టి ఇప్పటి నా పరిస్థితి కొనసాగితే పెళ్లి అయ్యాక ఇలాంటి కష్టాలు నాకు కూడా తప్పవేమో. :)

    రిప్లయితొలగించండి
  15. సరస భావమొంది చక్రి లక్ష్మినిఁగూడ
    పాహి పాహి యనుచు పలికె హస్తి
    కొంగుఁబట్టి కదిలె, భంగమయ్యె ముదము
    వేళ కాని వేళఁ బిలువఁ దగునె?

    రిప్లయితొలగించండి
  16. నేదునూరి రాజేశ్వరి గారూ,
    రవి గారు మీ పద్యంలోని యతిదోషాన్ని సవరించి నాకు శ్రమ తగ్గించారు. చూశారు కదా!

    రవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు. అయితే మూడవ పాదంలో "అంటువేసి" ప్రయోగం అర్థం కాలేదు.

    హరి దోర్నాల గారూ,
    మంచి పూరణ నందించారు. ధన్యవాదాలు.

    నచికేత్ గారూ,
    బాసుకు వార్నింగిచ్చిన మీ పూరణ అదిరింది. అభినందనలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    గజేంద్ర మోక్షాన్ని ప్రస్తావిస్తూ మీరు చేసిన పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. జిగురు సత్యనారాయణ గారి పూరణ బావుంది. నేను ఎంత ఆలోచించినా నాకు అలాంటిది తట్టలేదు.

    అంటు పోయడం అంటే తిట్లు లంకించుకోవడమని సీమ మాండలికం. ఏమైనా అంతు చూసె అని మార్చాను.

    భార్య ఊరి కేగె పండుగని ఒకఁడు
    పనిమనిషినిఁ బిలిచి పైట లాగ
    ఆమె మగఁడు వచ్చి అంతుఁ జూసె. పనికి
    వేళ కాని వేళఁ బిలువఁ దగునె?

    రిప్లయితొలగించండి
  18. రాత్రి వేళ చేస్తి మిత్రుని కొకఫోను
    "వేళ కాని వేళఁ బిలువఁ దగునె?"
    అనెడి రింగుటోను వినుచు చకితుడైతి
    చెలుల మించి పోయె సెల్లు లౌర!

    రిప్లయితొలగించండి
  19. చదువరి గారూ,
    నిజమే. అలాంటి రింగ్ టోన్ ఆలోచన బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    _____________________________________

    కొత్త భార్య గూడ - కూర్మితో బిలచెను
    బంధు మిత్రు లుండ - పగటి వేళ !
    అత్త ,మామ ,లయ్యొ - యనువు గాదనె యామె !
    వేళ కాని వేళఁ - బిలువఁ దగునె?
    _____________________________________

    రిప్లయితొలగించండి
  21. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ సరసంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. తోయమునిచ్చి స్నానమున దోసెడు పువ్వులు కోసిపెట్టుచున్
    కాయలు కూరలన్ తరిగి కమ్మగ వంటను జేసిపెట్టుచున్
    తీయని మాటలన్ నుడివి తీరుగ నందము మెచ్చువానినిన్
    రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో

    రిప్లయితొలగించండి