13, జులై 2010, మంగళవారం

గళ్ళ నుడి కట్టు - 8


అడ్డం -
1. నాగరాజు - శేషుని సోదరుడు (3)
3. పనోళ్ళతో సరసాలు వద్దు. ఫ్రూట్ జ్యూస్ (5)
7. పోరాటం - అడ్డం 11లో చివరి సున్నా తీసేసి తిరగేయండి (3)
9. అట్నుంచి భూమి. చెప్పలేరా? ధారుణం! (3)
11. విష్ణు దేవుని ఖడ్గం - ఇదే అన్నమయ్యగా అవతరించిందట! (3)
13. దీని కడపట తిరుపతి ఉందట! అందుకే దీనికా పేరు. శయ్యను తిరగెయ్యండి (3)
14. కుక్క కదా! అస్తవ్యస్త మయింది. అయినా చిలక ఉంది (3)
16. రవిక లేదా చొక్కా. కంచుతో చేసిందా? (3)
18. దాశరథి గారి కావ్యం. చీకటితో యుద్ధమా? (7)
నిలువు -
2. కోపం - వానికి కనుక ఫరవా లేదు (3)
4. అందమైన స్త్రీ. కరుణశ్రీ గారి "అది యొక ...... పుష్పవన"మనే పద్యాన్ని గుర్తుకు తెచ్చుకోడి (3)
5. నటించే వాళ్ళు పాత్రధారులు. మరి డబ్బింగ్ చెప్పే వాళ్ళు? వీళ్ళు తెరపై కనిపించరు కనుక తలక్రిందు లయ్యారు (5)
6. గణేశ చతుర్థి (7)
8. పైనుంచి చూసినా, క్రిందినుంచి చూసినా ఒకటే .. ఇంద్రుని ఉద్యాన వనం (3)
10. పసరం - తిరగబడింది (3)
12. ఎటునుంచైనా గుచ్చుకుంటుంది. ముల్లు (3)
15. చాతక పక్షి. తోకకంటే ఈకకందట! అందుకే తలక్రిందయింది (3)
17. గొయ్యి. ఎటునుంచి పడితేనేం?

8 కామెంట్‌లు:

  1. గళ్ళ నుడి కట్టు -8 లో నిలువు 6 లో 9 సంఖ్య పొరపాటున అధికంగా వచ్చింది. దయచేసి దానిని పట్టించుకోకండి.

    రిప్లయితొలగించండి
  2. అడ్డం
    1.వాసుకి,23.పళ్ళరసాలు,7.కదనం,9.ణిరుధా,11.నందకం,13.కడప,14.శునకం,
    16.కంచుకం,18.తిమిరంతో సమరం.

    నిలువు
    2.కినుక,4.రమణి,5.లురుధాత్రగా,6.వినాయకచవితి,8.నందనం.10.వుపశు,
    12.కంఠకం,15.తోఇకం,17.గోతి.

    రిప్లయితొలగించండి
  3. కృష్ణుడు గారూ,
    అడ్డం 14, నిలువు 10,12,15,17 తప్ప మిగిలిన సమాధానాలు సరైనవే. మళ్ళీ ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి
  4. అడ్డం
    1.వాసుకి 3.పళ్ళరసాలు 7.కదనం 9.ణిరుధా 11.నందకం13.కడప 14. శుకన 16కంచుకం 18.తిమిరంతోసమరం
    నిలువు
    2.కినుక 4.రమణి 5.లురుధాత్రగా 6.వినాయకచవితి 8.నందనం 10. వుపశు 12.కంటకం 15. కచతో 17.కందకం
    ఒక సందేహం సార్: 18 అడ్డం తిమిరంతో సమరం సరి ఐనదిగానే అనిపిస్తోంది. కానీ ఇది దాశరధిగారు రాసినది కదా. దయచేసి నా ఆలోచన సరి ఐనదేనా చెప్పండి.

    రిప్లయితొలగించండి
  5. ప్రసీద గారూ,
    మీరు చెప్పింది నిజమే. అది దాశరథి గారి రచనే. సినారె రచనగా ఎలా రాసానో నాకే ఆశ్చర్యం వేస్తున్నది. నా తప్పును సవరించినందుకు (ముందే చెప్పి నా పరువు కాపాడినందుకు) ధన్యవాదాలు. సవరించాను.
    ఇక మీ సమాధానాలలో అడ్డం 14 కరెక్టే. కాని పదం పూర్తి కావడానికి ము ప్రత్యయమో, అనుస్వారమో ఉండాలి కదా. ఇక నిలువు 15 ఆధారంలో మొదటి మూడక్షరాలు.

    రిప్లయితొలగించండి
  6. అడ్డం 1.వాసుకి 3.పళ్ళరసాలు 7.కదనం 9.ధారణి 11.నందకం 13.కడప 14. కముశు 16.కంచుకం 18.తిమిరంతో సమరం


    నిలువు 2. కినుక 4.రమణి 5.గాత్రధారులు 6.వినాయక చవితి 8. నందనం 10.కపచ్చి 12.కంటకం 15.ముకతో 17.కందకం

    రిప్లయితొలగించండి
  7. అడ్డం:1.తక్షకి,3.పళ్ళరసాలు,7.కదనం,9.ణిరుధా,11.నందకం,13.కడప, 14.శుకం న, 16.కంచుకం, 18.తిమిరంతోసమరం
    నిలువు:2.కినుక,4.రమణి,5.లురుధాత్రగా,6.వినాయకచవితి,8.నందనం, 10.వుపశు,12.కంటకం,15.కంకతో?, 17.కందకం
    -విజయ జ్యోతి.

    రిప్లయితొలగించండి
  8. గళ్ళ నుడి కట్టు - 8
    ఈ సారి గడిని అందరూ ఒకటి, రెండు తప్పులతో పూరించారు.
    కృష్ణుడు, ప్రసీద, భమిడిపాటి సూర్యలక్ష్మి, విజయజ్యోతి ... ఈ నలుగురే గడిని పూరించారు. అందరికి అభినందనలు.

    సమాధానాలు -
    అడ్డం - 1.వాసుకి, 3.పళ్ళరసాలు, 7.కదనం, 9.ణిరుధా, 11.నందకం, 13.కడప, 14.శుకంన, 16.కంచుకం, 18.తిమిరంతో సమరం.
    నిలువు - 2.కినుక, 4.రమణి, 5.లురుధాత్రగా, 6.వినాయకచవితి, 8.నందనం, 10.వుశుప, 13.కంటకం, 15.కంకతో, 17.కందకం.

    రిప్లయితొలగించండి