30, డిసెంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 206

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. కనలేమిది మాయ జగతి
    వినుటకు నేముంది గనుక వింతగు చింతల్ !
    కని విని తినగను నించుక
    యను మానపు తెరలు పొరల మాటలు కరువై !

    రిప్లయితొలగించండి
  2. కళ్ళు లేవు చట్టానికి కాంచలేదు
    న్యాయమును ; వినికిడి శక్తి నాస్తి ప్రభుత
    కు మఱి ప్రజల గోడు వినగ ; కూరుచుండు
    రాజు బెల్లము కొట్టిన రాయి రీతి

    రిప్లయితొలగించండి
  3. చట్టము కనబోదెన్నడు
    బిట్టరచిననైన ప్రభుత వినబోవదిలన్
    గట్టిగ నోటిని మూసుక
    నట్టేటను ముంచు ప్రజను నాయకుడెపుడున్.

    రిప్లయితొలగించండి
  4. ఆహా! ఏమి పద్యాలు - శ్రీమతి రాజేశ్వరి గారు, శ్రీ రవీందర్ గారు మరియు శ్రీ మూర్తి గారు అద్భుతమైన రీతిలో వ్రాసేరు. అందరికీ శుభాశీస్సులు - అభినందనలు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  5. చట్టము గ్రుడ్డిదై జనుల చావగ మోదుచు నుండ నింత వి-
    న్పట్టక పౌరఘోష తన బాటను సాగు ప్రభుత్వ మందునన్
    పట్టియు పట్టనట్లు తన వాణిని చాటక మూగ జీవియౌ
    వట్టి ప్రధాన మంత్రి! మన భారత జాతి యదృష్ట మేమొకో!

    రిప్లయితొలగించండి
  6. కనలేమీ నరజాతి దుష్కృతము లిక్కాలంబులో ఘోరముల్
    వినలేమీ విపరీత ఘోషణములన్ బెంబేలగున్ మానసం
    బనలే మెవ్వరినేని నిర్భయముగా హా! రామచంద్ర ప్రభూ!
    కనులున్ వీనులు నోరు మూయునపుడే కల్గున్ గదా భద్రముల్

    రిప్లయితొలగించండి
  7. కనకు,వినకు,యనకు కలుషమ్ములను దాని
    మంచి కన్వయించి మాన్యులెల్ల
    పొరబడినను వారె పురపాలకులునౌర!
    వేద భూమికదియె పిడుగు పాటు!

    రిప్లయితొలగించండి
  8. కన్నులు గల్గి యుండి నిను గానదు చట్టము నీదుజోలి మా
    కెన్నడు వద్దు నీ కథల నింతయు పల్కననున్ ప్రభుత్వమున్
    నిన్ను గురించి దెల్సినను నిమ్మకు నీరగునట్లు మూగయౌ
    నెన్నడు మా ప్రధాని యిక నీకెదు రేమిటి నల్ల విత్తమా!

    రిప్లయితొలగించండి
  9. రాముని దప్ప నేను కనరాదు మరెవ్వరినేని నెన్నడున్
    రాముని గాథ తప్ప వినరాదు మరెవ్వరి లీలలేనియున్
    రాముని దప్ప నే బలుకరాదు మరెవ్వరి గూర్చియేనియున్
    రాముడె దైవమంచు మది రాముని గొల్చెద రా కపుల్ బళా!

    రిప్లయితొలగించండి
  10. చెడును కనకు కనులు తెరచి
    చెడు లేశమ్మైన వినకు, చెవి నొగ్గకుమా !
    చెడు నన కెప్పుడును , వెరసి
    చెడు కనకు వినకు పలుకకు చెడునే విడుమా !

    రిప్లయితొలగించండి

  11. మంత్రి చెప్పలేడు మన ప్రభుత వినదు
    చట్టమేమొ కనదు సగటు మనిషి
    గోడదెట్లు తీరు చూడకను, వినక
    అనక, మంచి చేయ నసలు తరమె.

    రిప్లయితొలగించండి
  12. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, డిసెంబర్ 30, 2012 11:37:00 PM

    చట్ట మంధకార మయము సగటు జనుల
    బధిర ప్రభుతకు బాధ్యత పట్ట దాయె
    మాట మరొకరి దగుటచె మాట లేని
    మూగ జీవిగ రాజుండె వేగ లేక.

    రిప్లయితొలగించండి
  13. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, డిసెంబర్ 30, 2012 11:37:00 PM

    చట్ట మంధకార మయము సగటు జనుల
    బధిర ప్రభుతకు బాధ్యత పట్ట దాయె
    మాట మరొకరి దగుటచె మాట లేని
    మూగ జీవిగ రాజుండె వేగ లేక.

    రిప్లయితొలగించండి
  14. మూడు కోతుల చిత్రాన్ని చూసి స్పందించి చక్కని పద్యాలను వ్రాసిన కవిమిత్రులు.....
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    మిస్సన్న గారికి,
    పండిత నేమాని వారికి,
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  15. చెడు జూడక నెల్లప్పుడు
    చెడు వినకయె యుండవలెను చేటుల ద్రోలన్
    చెడు మాటాడకయే తమ
    నడవడికను మార్చు కొనుట నరులకు మేలౌ.

    రిప్లయితొలగించండి