26, ఫిబ్రవరి 2013, మంగళవారం

పద్య రచన – 264 (ఏకం సత్...)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"ఏకం సత్..."

26 కామెంట్‌లు:

  1. ఉన్నది యొక్కటే యనుట యొప్పగు సత్యము జ్ఞానయోగ సం
    పన్నులు నిర్గుణంబనుచు భావన సేయుదు రాదరమ్మునన్
    జెన్నగు నామ రూపముల జేర్చినచో సగుణాత్మ యౌను వి
    ద్వన్నుత! స్వస్వరూపమును ధ్యానమొనర్పుము నెమ్మనమ్మునన్

    రిప్లయితొలగించండి
  2. ఒకటే యున్నది సత్యము
    ఒకటే మరి లేకనిన్ని యొనగూరుటెటో
    ఒకటే మిగులును చివరకు
    ఒకటన్నిట జూడ పరమ యోగుండతడే !

    రిప్లయితొలగించండి
  3. ఏకం సతు నన నర్ధము
    ఏకమె గద యాత్మ లందు రిహముంబరలోన్
    ఏకము పరమాత్ముండును
    ఏకమె మఱి జీ వు డం ద ఱి హృదయ ములలోన్

    రిప్లయితొలగించండి
  4. ఒక్కడు నొక్కరుండు మరి యొక్కడు గాకయు తాను నొక్కడే
    మక్కువ నన్ను నొక్కడిని మానక చిత్తము దన్ను నొక్కనిన్
    బెక్కువ యొక్క మారులను బెచ్చగు భక్తిని మ్రొక్కు వానినిన్
    నిక్కము బ్రోచు నిక్కముల నెట్టును గ్రక్కున స్రుక్కనీయడున్

    రిప్లయితొలగించండి
  5. సాగరమ్మున నున్న నీరము చట్టిముంతలు నిండగా
    వేగిరమ్మునఁ బట్టి యుంచిన వేరుకాదది నీరమే!
    దాగి యున్నదిదొక్క సత్యము దక్క దక్కినవన్నియున్
    వీగిపోవును కాల చక్రము విశ్వరూపముఁ జూపగన్.

    రిప్లయితొలగించండి
  6. ఒకటి యొకటని నుడువుట యొప్పి పొసగు
    నొకటి యంతట గాంచుట నొకని తరమ ?
    తారతమ్యము లెంచక తన్ను దెలియ
    తారు తలపుయు దక్కునె ధరణి లోన ?

    రిప్లయితొలగించండి
  7. ప్రజ్ఞానమే పరబ్రహ్మమ్ము జ్ఞానమ్ము
    ....లన్నింటికిని మూల మాత్మమొకటె
    ఆ బ్రహ్మమే నీవటంచు సద్గురువులు
    ....కావించుచుందురు జ్ఞానబోధ
    కన్పట్టుచుండు సకల చరాచరతతి
    ....యందాత్మయే వెలుగొందుచుండు
    నేను పరబ్రహ్మ మేనను సత్యమ్ము
    ....ననుభవమ్మున పొందు నాత్మవిదుడు
    నేను దేహేంద్రియాదులు కాను కాను
    ఆత్మనే నేను నాత్మనే యని సతతము
    నాత్మరతులు జీవన్ముక్తులై దనరుచు
    నుందు రదె సాధనములందు నుత్తమంబు

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్యగురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు, పెద్దలకు వినమ్రవందనములు
    =======*========
    ఉన్నది యొక్క భూమి మనకున్నది యొక్కటె భూమి మిత్రమా,
    కొన్నవి కూడు బెట్టవుగ,గూరిమి నొందుము నొక్క భార్యతో
    విన్నవి కావు సత్యములు వేగిర బడ్డ ముగింపు బల్కురా
    సన్నని బుద్ది వీడి నొక సద్గురు సాయము నొంది జూడరా ।


    రిప్లయితొలగించండి
  9. ఈవాటి పద్యరచనా శీర్షికకు మనోహరమైన పద్యాలను రచించిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    గన్నవరపు నరసింహమూర్తి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    వరప్రసాద్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. సుబ్బారావు గారూ,
    మీ పద్యం చివరి పాదంలో యతి తప్పింది.
    "ఏకమె మఱి జీవు డెల్ల హృదయములందున్" అందాం.
    *
    గన్నపువరపు వారూ,
    మీ రెండవ పద్యంలో "కాంచుట నొకని - కాంచుట యొకని.... తలపుయు దక్కునె - తలపును దక్కునె" అని నా సవరణలు.
    *
    వరప్రసాద్ గారూ,
    "వీడి యొక" అనండి.

    రిప్లయితొలగించండి
  11. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము 2వ పాదములో "కూరిమి నొందుము నొక్క భార్యతో" అని నుగాగమమును చూపించేరు. అక్కడ నుగాగమము రాదు. అందుచేత "కూరిమి నొందుమ యొక్క భార్యతో" అందామా? స్వస్తి

    రిప్లయితొలగించండి
  12. గురువు గారూ నమస్సులు, ధన్యవాదములు. ఏం చెప్పేది, ఆత్మ సందర్శనానికి ప్రయత్నిస్తున్న నాకింకా యడాగమమునకు నుగాగమమునకు తారతమ్యము తెలియడము లేదు !

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్యగురుదేవులకు, శ్రీ నేమాని పండితవర్యులకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి


  14. ఎన్ని రూపముల వెలయ నేమి ,సర్వ
    జగము లన్ని పాలించెడి శక్తి యొకటె
    సత్త్వమొకటె 'ఏకంసత్తు 'చాటిచెప్పు
    నుపనిషత్తుల సారాంశ మొప్ప నిదియె.

    రిప్లయితొలగించండి




  15. ఎన్ని రూపముల వెలయ నేమి ,సర్వ
    జగము లన్ని పాలించెడి శక్తి యొకటె
    సత్త్వమొకటె 'ఏకంసత్తు 'చాటిచెప్పు
    నుపనిషత్తుల సారాంశ మొప్ప నిదియె.

    రిప్లయితొలగించండి


  16. ఎన్ని రూపముల వెలయ నేమి ,సర్వ
    జగము లన్ని పాలించెడి శక్తి యొకటె
    సత్త్వమొకటె 'ఏకంసత్తు 'చాటిచెప్పు
    నుపనిషత్తుల సారాంశ మొప్ప నిదియె.

    రిప్లయితొలగించండి
  17. భూనభోనంతరాల మొత్తమ్ము చూచినన్
    ప్రాణమున్నదైన లేని దైన
    పంచ భూత సహిత బ్రహ్మపదార్థమ్మె
    యున్నదొకటె కనుల కన్ననొకటె!

    రిప్లయితొలగించండి
  18. రాజేశ్వరి నేదునూరి గారి పద్యము......

    ఉన్నది యొక్క పదార్ధం
    బన్నది నిజమన్న మాట నాత్మల యందున్ !
    మిన్నను రాజును పేదయు
    మన్నున కలియంగ నొకటె మహిలో కనగన్ !

    రిప్లయితొలగించండి
  19. కమనీయం గారూ,
    సహదేవుడు గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. పరమ సత్యమనగ పరమాత్మయనగను
    దివ్య కాంతి యనగ దేవుడనగ
    కనుగొనంగలేము కర్మేంద్రియంబుల
    ఆత్మ జ్ఞానమంది సత్తు గనుము.

    రిప్లయితొలగించండి
  21. తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగున్నది. ఆఖరి పాదమును ఇలా వ్రాసేరు కదా:

    "ఆత్మ జ్ఞానమంది సత్తు గనుము"
    ఆత్మ జ్ఞానము అనేది ఒకే సమాసము అయి - త్మ గురువు అగును కదా. అలాగే యతి కూడా మైత్రి లేదు కదా. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. పూజ్య శ్రీ పండితునేమాని గురువులకు నమస్సులు. గణ యతి దోషమని తలచి మరొకవిధముగా వ్రాసికుని కార్యాలయ శ్రమాధిక్యతవలన టైపు చేయుసమయాన వదలివేసిన పాదమునే ఉంచినాను. శిష్య వాత్సల్యముతో దోషము తెల్పినందులకు ప్రణామములు. సవరణానంతరము
    పరమ సత్యమనగ పరమాత్మయనగను
    దివ్య కాంతి యనగ దేవుడనగ
    కనుగొనంగలేము కర్మేంద్రియంబుల
    ఆత్మ మర్మ మెరిగి యందు గనుము.

    రిప్లయితొలగించండి