కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
ముంచినట్టివాఁడె పూజ్యుఁడయ్య!
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
ముంచినట్టివాఁడె పూజ్యుఁడయ్య!
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.
అంధకారమందు నజ్ఞానమందున్న
రిప్లయితొలగించండిప్రజలమేలుగోరి రాత్రి పగలు
విద్యనేర్పుచు మరి విజ్ఞానమందున
ముంచినట్టివాడె పూజ్యుడయ్య
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమంచి పనులు జేసి మాధవుని సేవించి
రిప్లయితొలగించండిధర్మ నిరతి గాను తనరు చుండి
పరుల హితము గోరి పరమేశు భక్తిని
ముంచి నట్టి వాఁడె పూజ్యుఁ డయ్య
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగురువు రాశి మార గోదావరికి జేరు
పావనంబులైన జీవ నదులు
పుష్కర సమయమున పుణ్య తీర్థము నందు
ముంచినట్టివాడె పూజ్యుడయ్య
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
శివుణ్ణి అభిషేక జలంలో ముంచే పూజారి పూజ్యుడే గదా !
01)
____________________________
ముచ్చటగను పూజ - ముక్కంటికే జేయ
ముంత తోడ నీరు - ముంచి దెచ్చి
ముందు హరుని దలచి - ముదముగా తోయంబు
ముంచి నట్టివాడె - పూజ్యుడయ్య !
____________________________
ముద్దుల్లో ముంచెత్తే భర్త భార్యకు పరమ పూజ్యుడు గదా !
రిప్లయితొలగించండి02)
____________________________
ముద్దు లొలుకు పత్ని - మురిపెములను జూచి
ముదిత వెనుక జేరి - యదిమి పట్టి
ముద్దు మీద ముద్దు - ముదమార ముద్రించి
ముంచి నట్టివాడె - పూజ్యుడయ్య !
____________________________
మురిపెము = నడకయందలి కులుకు
దాహార్తి దీర్చగా చెరువులో ముంచే మావటి యేనుగులకు పూజ్యుడు గదా :
రిప్లయితొలగించండి03)
____________________________
దప్పి తోడ మసలు - దంతావళంబుల
దారి జూపి చెఱువు - దరికి జేర్చి
దురద,దప్పి దీర్చ - దొరువున పడదోసి
ముంచి నట్టివాడె - పూజ్యుడయ్య !
____________________________
పూజ్య గురువుగారికి ప్రణమిల్లుతూ....
రిప్లయితొలగించండిపరుల మేలును గోరెడి పట్టుగొమ్మ
పామ రులజేత పద్యము వ్రాయ జేసి
ప్రాస యతులను నేర్పియు పద్యజలధి
ముంచి నట్టి వాడె పూజ్యుడయ్య
రిప్లయితొలగించండిధర సమస్య బాపు దైవంబునే చేరి
రోజు కొక సమస్య యాజి యగుచు
శంకరయ్య కోరె. శంభునిపై భార
ముంచినట్టి వాఁడె పూజ్యుఁడయ్య!
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘మాధవుని సేవించి’ అన్నచోట గణదోషం. ‘మాధవు సేవించి’ అంటే సరి.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
శైలజ గారూ,
సమస్య ఆటవెలది అయితే మీరు తేటగీతిని వ్రాశారు. అయినా మంచి భావంతో విలసిల్లుతున్నది. అభినందనలు.
మీ తేటగీతిని ఆటవెలదిగా నేను చేసిన మార్పు.......
పరుల మేలు గోరు పట్టుగొమ్మగ పామ
రాళిఁ బద్యములను వ్రాయ జేసి
ప్రాస యతుల నేర్పి పద్యజలధియందు
ముంచి నట్టి వాడె పూజ్యుడయ్య
*
చింతా రామ కృష్ణా రావు గారూ,
నా ‘సమస్య’ను సహృదయంతో అర్థం చేసుకుని పూరణ రూపంలో ధైర్యాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
పూజ్య గురువుగారికి ప్రణమిల్లుతూ...ముందు పొరపాటున తేటగీతి వ్రాసి ..తిరిగి ఆటవెలదిని సరిదిద్దాను..
రిప్లయితొలగించండిపామ రులకు తెల్పె పద్యము వ్రాయుట
పరుల మేలు గోరు పరమ గురువు
ప్రాస యతులు తోడ పద్యాలజలధిన
ముంచి నట్టి వాడె పూజ్యుడయ్య
సెప్టెంబర్ 30, 2013 8:22 AM
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ సవరణ నా సవరణ కంటే బాగున్నది. ధన్యవాదాలు.
వాక్పటుత్వముండి వైభవోపేతమౌ
రిప్లయితొలగించండిహరికథామృతంబు నందరకును
పంచుచుండి సతము భక్తిసాగరమందు
ముంచునట్టివాడె పూజ్యుడయ్య.
మరుగున పడుచుండె మానవ బంధాలు
రిప్లయితొలగించండినైతిక విలువలిల నలిగిపోయె
చక్క దిద్ద జనుల సంస్కార జలధిలో
ముంచి నట్టి వాడె పూజ్యుడగును
సార హీనమైన సంసార జలరాసి
రిప్లయితొలగించండినుండి రక్షఁజేసి మెండుగాను
భక్తినౌకనిచ్చి వైరాగ్య గంగలో
ముంచినట్టి వాఁడె పూజ్యుఁడయ్య.
హరుని దినము దినము నభిషేకజలమున
రిప్లయితొలగించండిముంచినట్టివాడె పూజ్యుడయ్య!
వాని దరిజేర్చు పార్వతీ నాధుడు
సత్య మిదియ నమ్ము శంకరార్య!
భాగవతము వ్రాసె భక్తిచేఁ బోతన్న;
రిప్లయితొలగించండిదాశరథిని రామదాసు పాడె;
భక్తిఁ దేలి జనుల భక్తి రసమ్మున
ముంచినట్టి వాఁడె పూజ్యుఁ డయ్య!
రాజ పదవి నంది రాజ్యంబు నేలుచు
రిప్లయితొలగించండిప్రభువు లన్న వారు ప్రజలఁ గలసి
మెలగు యైకమత్య తలపు లందు
ముంచి నట్టి వాడె పూజ్యుడయ్య
చక్కని పూణముంచిన ప్రతి కవిమిత్రునకూ అభినందనలు.
రిప్లయితొలగించండినా పూరణ...
నల్లనైన వాడు, నడి చెర్వు నీటిపై
పడగ లేపి యున్న పాముపైన
నదిమి నాట్యమాడ నల్లదే తనపాద
ముంచి నట్టి వాడె పూజ్యుడయ్య.
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులపై నా మొదటి పద్యము జూచి నన్ను ప్రోత్సహించిన వారు పూజ్యులనుచు....
======*=========
చిన్ని తప్పు దొర్లె శిష్యుడా! నీ పద్య
మందు ననుచు కనుల విందు జేయు
కవుల కమ్మని పద కవితా వనము నందు
ముంచు నట్టి వాడె పూజ్యుడయ్య!
శ్రీ నేమాని గురుదేవులపై నా పద్యముల వాడి పెంచుటకు సూచనలిచ్చిన వారు పూజ్యులనుచు...
మంచి వృత్తములలో వేదసారమును దెలుపు నేమాని గురుదేవులు పూజ్యులనుచు...
======*======
గట్టి శిలకు రుద్ది కరవాలపు పదును
పెంచు రీతి వన్నె బెంచు నట్టి
వృత్త తతుల యందు వేదసారమునందు
ముంచు నట్టి వాడె పూజ్యుడయ్య!
మంచి మంచి రామ కీర్తనలు వ్రాసి, జనులను భక్తి భావమున ముంచిన శ్రీ రామదాసు పూజ్యులనుచు...
రిప్లయితొలగించండి======*===========
రామ జోగి మందు రమ్య మైనదనుచు
పామరులకు ముక్తి పధము జూపు
పరమ పురుషుని పద భావసంద్రము నందు
ముంచునట్టివాడె పూజ్యుడయ్య.
పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండినీట ముంచిన వాడు నీతిమంతుడు కాడు
పాలముంచినవాడు పాపిగాడు
నీరు పాలుగాక నిర్మల ప్రేమలో
ముంచినట్టివాడెపూజ్యుడయ్య
ముదిమి వయసు నందు ముదమార పెద్దల
రిప్లయితొలగించండికు పరిచర్య జేసి కొఱత లేని
యట్లు వారల దన యనురాగ వార్ధిలో
ముంచినట్టివాఁడె పూజ్యుఁడయ్య!
మంచి మంచి రామ కీర్తనలు పాడి జనులను భక్తి భావమున ముంచిన శ్రీ త్యాగయ్య పూజ్యులనుచు...
రిప్లయితొలగించండి==========*==========
రాగ తాళములకు రామ రసము బూసి
నామ రుచిని బంచె ప్రేమ తోడ
సకల జనుల నెల్ల సంగీత కడలిని
ముంచునట్టివాడె పూజ్యుడయ్య.
శ్రీ తిమ్మాజిరావు గారు మీ పద్యము మొదటి పాదము నందు ఒక లఘువు ఎక్కువైనది.
రిప్లయితొలగించండిఅందినంత దోచి యవినీతి మార్గాన
రిప్లయితొలగించండిమంది సొమ్ము, దేశమాత పుట్టి
ముంచినట్టివాడె పూజ్యుడయ్య యనెడు
భజనపరుల గనిన పాపమంటు.
పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండినీట ముంచు వాడు నీతిమంతుడు కాడు
పాల ముంచు వాడు పాపి గాడు
నీరు పాలుగాక నిర్మల ప్రేమలో
ముంచినట్టివాడెపూజ్యుడయ్య
వరప్రసాద్ గారిక్ ధన్యవాదములు
మీసూచన మేరకు పద్యమునుసవరించితిని
రిప్లయితొలగించండిహరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘రాశి’ని ‘రాసి’ టైపాటు వలన అన్నారు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘దరి జేర్చు’ అన్నచోట గణదోషం. ‘దరికి జేర్చు’ అంటే సరి!
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. ‘ఐకమత్య తలపు’ అని సమాసం చేయరాదు కదా! ‘మెలగి యైకమత్యమే గల తలపుల’ అనండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘పాము శిరము/ నదిమి...’ అంటే బాగుంటుందేమో?
*
వరప్రసాద్ గారూ,
ధన్యవాదాలు. పూరణల రూపంలో ఉన్న మా ప్రశంసా పద్యాలు బాగున్నవి.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘భావ సంద్రము’ అని సమాసం చేయరాదు కదా! ‘భావ సాగరమందు’ అనండి.
అలాగే ‘సంగీత కడలి’. దానిని ‘సంగీత వార్ధిని’ అనండి.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మాస్టరుగారూ .. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ సవరణ బాగుంది...
పాము విప్పియున్న పడగ పైన ...అంటే
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ సవరణ ఇంకా బాగుంది. సంతోషం.
అజ్ఞానమును కలిగి యకతాయి తనముతో
రిప్లయితొలగించండితిరుగుచుండు వాన్ని తీర్చి దిద్ద
విద్యనేర్పి వాన్ని విజ్ఞాన రసములో
ముంచినట్టివాడె పూజ్యుడయ్య
పండిత నేమాని, శంకరయ్య గురువులకు వందనములు.
రిప్లయితొలగించండిసారహీనమైన సంసారమందున
మనసు నిలుపలేక మథన పడగ
జ్ఙానబోధ చేసి ధ్యాన జలధినందు
ముంచినట్టివాడె పూజ్యుడయ్య.
రిప్లయితొలగించండికష్టమైన,సుఖము గానిమ్ము,వెరవక ,
విమల చిత్తమందు విష్ణుదేవు
పాదములను గొలిచి ,పరమభక్తిని భార
ముంచినట్టివాడె పూజ్యుడౌను.
కుసుమ సుదర్శన్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
మొదటి పాదంలో ‘అజ్ఞానము’ అన్నచోట గణదోషం. అలాగే ‘వాన్ని’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
నా సవరణ.....
అజ్ఞుఁడైన మూఢుఁ డాకతాయిగ నుండి
తిరుగుచుండు నతనిఁ దీర్చి దిద్ద
విద్య లెన్నొ నేర్పి విజ్ఞాన రసములో
ముంచినట్టివాడె పూజ్యుడయ్య
*
ప్రభల రామలక్ష్మి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కమనీయం గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
గురువర్యులకు పాదాభివందనములు..
రిప్లయితొలగించండిసవరించి ,ప్రోత్సహించినందులకు ధన్యవాదములు