14, అక్టోబర్ 2013, సోమవారం

పద్య రచన - 494 (బూడిదలోఁ బోసిన పన్నీరు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“బూడిదలోఁ బోసిన పన్నీరు”

17 కామెంట్‌లు:

  1. నేడొసగు సమస్యలనిక
    నేడే పూరించవలెను నిన్నటి దానిన్
    తోడుగ పూరించినచో
    బూడిద పన్నీరు చందముగనగుననెదన్.

    రిప్లయితొలగించండి
  2. “బూడిదలోఁ బోసిన పన్నీరు”

    మూకకు శ్రావ్యకీర్తనలు పూనికఁ జెప్పుట, నంధజాతికిన్
    లోకసుబంధు దైవఁపు పురోగమనంబును జూపుటల్, మహా
    భీకర యుద్ధరంగమున భీరునిఁ బంపుట, శాస్త్రపాఠముల్
    చాకలి వానికిచ్చుట లసంగతమైనవి, నిష్ఫలంబులౌ.

    రిప్లయితొలగించండి
  3. అడవి కాచిన వెన్నెల యటులవలెను
    సంద్రమందున జేరెడు సలిలమువలె
    బూడిదందలి పన్నీరు కూడ వమ్ము
    లార్య! నిజమిది నమ్ముడు నౌను ననుచు

    రిప్లయితొలగించండి
  4. అమ్మా! లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
    మంచి మాలిని వృత్తమును చెప్పేరు. అభినందనలు. మరి ప్రాసను వేయ లేదు కదా. చూడండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  5. ఘన నాస్తికునకు బోధలు
    కనులేవియులేనివాని కడనద్దము దు
    ర్జనులకు జెప్పెడు సుద్దుల
    నెన్నగ పన్నీరు బూది నిడుటయె గాదా !

    రిప్లయితొలగించండి
  6. దన్నుగ నుండగ వారల
    నెన్నగ, విడదీయు వేళ నిడుముల మిగలన్
    కన్నీరే! బూడిదలో
    పన్నీరగుచు మన 'ఓటు' బాధల నొసగెన్!

    రిప్లయితొలగించండి
  7. బూదిలో పన్నీరు పోసిన చందమే
    ....యగును మూర్ఖతతికి నాత్మబోధ
    చిత్రమౌ గతజల సేతుబంధనమెయౌ
    ....వార్ధక్యమందు వివాహ మనగ
    సామజ వర నదీస్నాన సమానమౌ
    ....నాదృతి లేని పూజాదికములు
    అడవిలో గాచిన యట్టి వెన్నెలలౌను
    ....దోపిడి రాజ్యాన దొరయు నీతి
    అకట భావ వైచిత్రి లేనట్టి కవిత
    లయయు శ్రుతిలేని సంగీత రాగ సరళి
    వ్యర్థమగు గాన సజ్జనులంచితముగ
    సార్థముగ కృత్యము లొనర్తు లనవరతము

    రిప్లయితొలగించండి
  8. అయ్యా,
    ధన్యవాదాలండి.

    స్వరమధురిమలో యాస్వాదనమ్మందు వారై
    కరగు జనుల ముందాగానమే సార్థకమ్మౌ.
    యెఱుగనియెడ గానమ్మింక పన్నీరు తానై
    దొరలి పడిన బూదిన్ దోచు నామానసంబున్.

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమానిగారికి గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

    కుక్కుటము కేమి తెలియును
    మిక్కిలి కాంతుల నొసంగు మేలిమి విలువల్
    అక్కట!చక్కని చుక్కను
    నొక్కనపుంసనకునీయ నుద్వాహమునన్
    అంధునకును జ్యోత్స్న యందమ్ము తెలుపుట
    చెవిటి వానియెదుట చిరుత మ్రోత
    భస్మమందుపోయు పన్నీరు వోలేను
    వ్యర్ధమౌను బ్రతుకు ఫలితమిడక

    రిప్లయితొలగించండి
  10. ఒక్క దినమున నేఁ బోయి, యూరి బయటి
    చెఱువు గట్టున నున్నట్టి చెట్టు పైని
    పండ్లు తొంబది తొమ్మిది వఱకుఁ ద్రెంపి,
    "యొకటి యైన నూ"ఱగు నంచు నుత్సహించి,
    చివరి కొమ్మపై కెక్కంగ, శీఘ్రమె యది
    విఱిగి పోవఁ, గాయల తోడఁ జెఱువు నందుఁ
    బడితిఁ; దొంబది తొమ్మిది పండ్లుఁ బోయె!
    బూదిలోఁ బడ్డ పన్నీరు పోలికాయె!!

    రిప్లయితొలగించండి
  11. నా పద్యమందుఁ జిన్న సవరణము (అవసర మనుకొన్నచో) :- "బూదిలోఁ బడ్డ" యను దానిని "బూదిఁ బడినట్టి" యని చదువుకొనఁగలరు.

    రిప్లయితొలగించండి
  12. తెలుగు వారల కిది తెలిసిన లోకోక్తి
    పనులు వ్యర్థ మయ్యె ననుచు దెలుపు
    కూర్పబడినవి గద కుప్పలు తెప్పలు
    తెలిసికొనగ మనము తెలుగు నందు

    రిప్లయితొలగించండి
  13. గాడిద చాకిరి జేసిన
    చూడరు కష్ట ముల నెవరు శోషిల్ల మదిన్
    జాడను తెలుపరు వేడిన
    బూడీదలో కలసి నట్టి బూది పన్నీరౌ !

    రిప్లయితొలగించండి
  14. మిత్రులారా! ఈ నాటి అంశమునకు అందరూ చక్కని రచనలను చేసి శంకరాభరణమును అలరించినారు. అందరికీ అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి