30, ఏప్రిల్ 2014, బుధవారం

సమస్యాపూరణం - 1398 (వనరుహగర్భునకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
వనరుహగర్భునకు భార్య పార్వతియె కదా.

18 కామెంట్‌లు:

  1. ఘనమగు రజతా చలమున
    నను నిత్యము హరుని చెంత నారాయణి యై
    వినగను హరిహరు లొకటని
    వనరుహ గర్భునకు భార్య పార్వతి యెకదా

    రిప్లయితొలగించండి
  2. ధనలక్ష్మి భార్యయౌ కద
    వనరుహ గర్భునకు,భార్య పార్వతియెకదా
    మన శంకరునకు మరియా
    వనజాసను భార్య వాణి వరుసలు సరియా?

    రిప్లయితొలగించండి
  3. వినమే సిరియే సతియని
    వనరుహ గర్భునకు ;భార్య పార్వతియెగదా
    ఘనుడగు కైలాస పతికి
    వనజ భవుని ధర్మ పత్ని వాణియె గాదా !!!

    రిప్లయితొలగించండి
  4. అనయము సిరులొసగునమల
    వనరుహ గర్భునకు భార్య, పార్వతి యెకదా
    మినుసిగదేవర సహచరి
    వనజభవునిసతి భగవతి వందన మనరే!


    రిప్లయితొలగించండి
  5. ఘనమగు లక్ష్మీ దేవియె
    వనరుహ గర్భునకు భార్య, పార్వతి యెగదా
    యని నా మహిషుదునిమి తా
    జనులను కాపాడి సుఖము సంతస మిచ్చెన్


    రిప్లయితొలగించండి
  6. ధన దేవత నారాయణి
    వనరుహ గర్భునకు భార్య ;పార్వతియె కదా
    యనలాంబుని సతి, వీరికి
    యనుదిన పూజలను జేతు రాత్మీయతతో

    రిప్లయితొలగించండి
  7. పరమేశ్వరుడు తన అనుచరగణములతో అంటునట్లుగా....

    అనివార్యమైన తీరున
    తనకున్ సతివిరహమనుట తథ్యముగాగన్
    ఘన శాపంబొసగినదిట
    వనరుహగర్భునకు, భార్య పార్వతియె గదా.

    ఘన శాపము అని వాడినాను... ఎందుకంటే ఆ శాపమూలంగానే కదా రవణసంహారము జరిగినది.

    రిప్లయితొలగించండి
  8. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    వరుసలు సరిపోయయి. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘అనలాంబుని’ అన్నచోట ‘అనలంబకు సతి...’ అనండి.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
    మీ సవరణకు ధన్యవాదములు
    కాని అనల +అంబకు = అనలాంబకు అవుతుంది కదా యని నసందేహము

    రిప్లయితొలగించండి

  10. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    ధనములు సంపదనిడు సిరి
    వనరుహ గర్భునకు భార్య. పార్వతియెగదా
    పెనుజోగి బేసికంటి శి
    వుని సతి యని దనరె సకల భువనము లందున్

    రిప్లయితొలగించండి
  11. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    నేను అనలాంబకు అనే టైప్ చేశాననుకున్నా... అది టైపాటు. ధన్యవాదాలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. వినుమా చదువుల దల్లియె
    వనరుహ గర్భునకు భార్య, పార్వతి యెగదా
    యనుగుం బుత్రిక హిమవం
    తునకు న్నని జెప్పె గదర ధూర్జటి మనకున్

    రిప్లయితొలగించండి
  13. మును గురువర్యులు బలికిరి
    వనరుహ గర్భునికి భార్య వసుధ యొకతెయౌ
    గన నేటి గురువు లనెదరు
    వనరుహగర్భునకు భార్య పార్వతియె కదా!

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గారికి శుభాశీస్సులు.
    వనరుహగర్భుడు అంటే ఏ అర్థములో మీరు ప్రయోగించినారు? ఆంధ్రభారతి నిఘంటువులో ఈ పదమూ ఈయలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గారు: శుభాశీస్సులు.
    వనరుహ గర్భుడు (బ్రహ్మ) అనే అర్థములో ప్రయోగించితే పెద్దలు ఒప్పుకొనలేదు.
    వనరుహ నాభుడు - అంటే విష్ణువు.
    వనరుహాసనుడు అంటే బ్రహ్మ.
    వనరుహము అంటే అగ్ని అనే అర్థములో వనరుహ గర్భుడు అంటే సూర్యనారాయణ మూర్తి అన వచ్చునేమో?
    కొంచెము వివరించ గలరు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. ధనమిడు లక్ష్మీ దేవియె
    వనరుహగర్భునకు భార్య:...పార్వతియె కదా
    మనమును పూర్తిగ జవురుచు
    తనువును చీల్చెను సగముగ తాండవ ప్రియునిన్

    రిప్లయితొలగించండి