1, మే 2014, గురువారం

పద్య రచన – 583

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. బవసాగ రమీదు టకని
    నవ దంపతులకు పూజ నవవిధ భక్తిన్
    హవనుని సాక్షిగ నెలకొని
    పవనాత్మ జువంటి శక్తి భాసుర మొప్పన్

    రిప్లయితొలగించండి
  2. పెద్ద వారల మాటలు చద్ది మూట
    లనుచు మదితల్చి యువతులు నగ్ని సాక్షి
    పరిణయమునకు మొగ్గుచు భవ్య జీవి
    తమ్ము నకు బాట లేయుచు తనియు చుండ్రి

    రిప్లయితొలగించండి
  3. అగ్నిన్ సాక్షిగజేసినారు కద కళ్యాణాహవంబందు నీ
    లగ్నంబే తమ జీవితాశయములన్ లక్ష్యంబులన్ జూపులే,
    భగ్నంబాయెను నేటితో బిడియముల్ వర్ధిల్లె వాత్సల్యముల్
    ప్రాగ్నిర్దేశిత భావజాలముల లోపంబెందునన్ జూడకన్.

    రిప్లయితొలగించండి
  4. మనసుల మంత్రాలు కలుప
    ననలపు సాక్షిగ , తనువులు నవ శోభలతో
    తనరగ, లాస్యము విరియన్
    జనకులు మోదమున పెళ్లి జరిపింతురయా!

    రిప్లయితొలగించండి
  5. హిందూ వివాహ వేడుక
    సుందరమైయొప్పుగాదె సురలే మెచ్చున్
    విందగు జూచిన వారికి
    సందేహములేల గనుడు జరిగే పెండ్లిన్

    రిప్లయితొలగించండి
  6. సంపత్కుమార్ శాస్త్రి గారూ మీ పద్యం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  7. క్రొత్త దంపతు లక్కడ కుతుక మొప్ప
    నొకరు నొకరిని జూచుచు నుక్క డించు
    కొనుచు నవ్వులు చిందించు కొనగ జూడ
    నంద మొలికించె నాజంట యిందు వదన !

    రిప్లయితొలగించండి
  8. శ్రీమిస్సన్న గారు,

    ధన్యవాదములండీ. మీవంటివారి అభినందనలందుకొన్నందుకు చాలా సంతోషంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  9. సాక్షిగ జాతవేదునికి సన్మతి హోమము జేయుచుండి ప
    ద్మాక్షులు మానసాబ్జముల నద్భుత భావము లుప్పతిల్లగా
    జక్షులలోన భాసిలగ సార ప్రమోద వికాస చంద్రికల్
    దీక్షను బూను నీ కవ క్షితిన్ వెలుగొందుత భద్రమూర్తులై

    రిప్లయితొలగించండి
  10. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    వాత్సల్యము అనగా పిల్లల యెడ ప్రేమ - దానికి బదులుగా ప్రేమోన్నతుల్ అందామా?
    చివరలో జూడకన్ అన్నారు - వ్యతిరేక అర్థములో చివర ద్రుతము రాదు కదా - జూడకే అందామా? స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులు మన్నించాలి. నిన్నకూడా రోజంతా నేను బ్లాగుకు అందుబాటులో లేను.
    మంచి పద్యాలను అందించిన మిత్రులు....
    రాజేశ్వరి అక్కయ్యకు,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    సహదేవుడు గారికి,
    శైలజ గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    పండిత నేమాని వారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    మిత్రుల పద్యాలను సమీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు.

    అన్నపరెడ్డివారూ,
    మీ మొదటి పాదాన్ని ‘చక్కనౌవాడు చేపట్టి సత్యవతిని’ అందామా?

    రిప్లయితొలగించండి
  12. శ్రీ పండితనేమాని గురువర్యులకు,

    మీ సవరణలు సర్వదా శిరోధార్యములే. జూడకన్ లో ధ్రుతము మీద వ్యతిరేకార్థము వస్తుందని అనుకొంటూనే పొరపాటున అదే పదము వేశాను. సవరించినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి