2, మే 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1400 (రాత్రి పవలయ్యె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె.
(ఆశాకవాణి వారి సమస్య)

23 కామెంట్‌లు:

 1. అమెరికావారి తోడ నాద్యంత రహిత
  చర్చలకు నలవాటైన సాఫ్టువేరు
  ఇంజనీరు బాధపడినా డిటుల కడకు
  రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె.

  రిప్లయితొలగించండి
 2. పశ్చి మాద్రిని క్రుంగిన భాను డనగ
  చంద మామను బంపెను చల్ల గాను
  సూర్య చంద్రుల భమణమ్ము చోద్య మనుచు
  రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె

  రిప్లయితొలగించండి
 3. అత్రి పత్నియౌ అనసూయ అమ్మయైన
  సృష్టి స్థితి లయములకు ద్రష్ట లైన
  నాది పురుషులే పసికూనలైన వేళ
  రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె!!!

  రిప్లయితొలగించండి
 4. రామకృష్ణ గారూ,
  మీ సాఫ్టువేరు ఇంజనీరు పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  టైపాటు వల్ల భ్రమణమ్ము బ్రమణమ్ము అయినట్టుంది.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  సృష్టిస్థితి అన్నప్పుడు ష్టి గురువై గణభంగం. ఆ పాదాన్ని “సృష్టికిని స్థితిలయలకు ద్రష్టలైన” అందామా?

  రిప్లయితొలగించండి
 5. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. రాయపూరున దోమలు రాక్షసులయి
  రాత్రి బాధింప పగలుగా రాత్రిగడిపి
  నిదుర లేమిని పగలెల్ల నిదురబోవ
  రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె.

  (ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన సమస్యాపూరణ కార్యక్రమంలోతే31/03/1974దీన అప్పటి మధ్యప్రదేశ్ ( నేటి ఛత్తిస్గర్హ్ )లో ఉద్యోగ
  రీత్యా నేనున్న రాయపూర్ స్థితిని వర్నిస్తూ చేసిన పూరణ పైన ఇచ్చితిని )
  నేటి పూరణ :--
  రామ కళ్యాణ మును జూచి రాత్రి యంత
  రామకధ విన పగలుగా రాత్రి దోచె
  పగలు నిదురింప పాన్పుపై పడిన నాకు
  రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె.

  రిప్లయితొలగించండి
 7. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి.
  ఎప్పుడో 1974లో చేసిన పూరణ ఇంకా జ్ఞాపకమున్నదంటే ఆశ్చర్యమే! అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 8. కాలు(ల్) సెంటరు లందున మేలుగాను
  చేయ వలయును కొలువును రేయియందు
  తారుమారగు ప్రతిరోజు వారి కచట
  రేయి పవలయ్యె పవలెల్ల రేయి యయ్యె

  రిప్లయితొలగించండి
 9. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. పెండ్లిమంటప మారాత్రి వెలుగులీనె
  వధువు వెడలెను తలిదండ్రి వదలివైచి
  వరుని తోడను చూడగా వారికపుడు
  రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె.

  రిప్లయితొలగించండి
 11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. బాంబు ప్రేలుట విని రైలుబండిలోన
  నెంత కాలమీ బాధలు చింత లనుచు
  నించుక నిదుర రాక యో చించు చుండ
  రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె.

  రిప్లయితొలగించండి
 13. రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె
  నిజము , నిద్ర లే కపవలు నిదుర వోవ
  పవలు మెలకువ మఱి రాత్రి పడక మంచి
  దెల్ల వారల కునుమరి యింతు లార !

  రిప్లయితొలగించండి
 14. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  పవలు నుపవాస మొనరించిభక్తి మీర
  శివుని పూజించి జాగారము విధి యుతము
  రాత్రి గావించి మరునాడు బ్రాహ్మణునకు
  భోజనాదుల నిడి తాను బువ్వ తినగ
  రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె

  రిప్లయితొలగించండి
 15. పొట్టకూటి కొరకునేడు పుట్టి నూరు
  వదలి పోవుచు నున్నారు పట్నములకు
  పొరుగుదేశాల సేవకు మరిగినారు
  రాత్రి సేవలు జేసెడి రంగమందు
  రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రి యయ్యె
  రిప్లయితొలగించండి
 16. కవన బృందావనమ్ములో కవివరుండు
  భావ రసమయ దీప్తుల పరగుచుండ
  చారు సాహిత్య చంద్రికల్ జాలు వారి
  రాత్రి పవలయ్యె పవలెల్ల రాతిరయ్యె

  రిప్లయితొలగించండి
 17. వెన్నెలల వాన కురిసిన వేళ నిన్న
  రాత్రి పవలయ్యె; పవలెల్ల రాత్రి యయ్యె
  నేడు మబ్బుల పడకల నిద్దుర విడ
  నాడలేని సూర్యుని కరుణ కురియకను.

  రిప్లయితొలగించండి
 18. నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డ్ సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ కవిహృదయాన్ని ఆవిష్కరించారు. అందమైన పూరణ. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
  నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.
  ============*==================
  ఆశ సంద్రము నింకించు నగ్ని లేక
  పాప మండూకముల దిను బాము లేక
  రాత్రి పవలయ్యె; పవలెల్ల రాత్రి యయ్యె
  కలియుగ మున కలిమి గల ఖలుల కెల్ల!

  రిప్లయితొలగించండి
 20. భాగవతుల కృష్ణారావు గారి పూరణ అమోఘం.

  రిప్లయితొలగించండి
 21. గురువుగారికి నమస్సులు. సమస్యను పరిశీలిస్తే "అంచనాలు తారుమారు" అనే భావం స్పురిస్తుంధి. ఆ భావనతో..... ఒక రాజకీయనాయకుని స్తిథి ఎన్నికల ఫలితాల రోజున......

  తన మనోరథమందితురనుచు జనుల
  కెన్ని వాగ్దానములజేసెనెన్నికలకు,
  తీర్పు వెలువడ చూడగా తెల్లబోయె
  రాత్రి పవలయ్యె పవలెల్ల రాత్రులయ్యె.

  రిప్లయితొలగించండి
 22. కందుల వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘ఆశ సంద్రము’ను ‘ఆస సంద్రము’ అనండి.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. ఎదురు చూచిన భామతో ఎదను పంచు
  శోభనపు రాత్రి సరసాల సోలి నట్టి
  ముద్దు మురిపాల తేలిన బుధ వరునకు
  రాత్రి పవలాయె పవలెల్ల రాత్రి యయ్యె

  రిప్లయితొలగించండి