13, మే 2014, మంగళవారం

పద్య రచన – 595 (పేను)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. గొల్ల భామవు నీదట గోకు లమ్ము
    చల్ల జేసెడి గృహనున యుల్ల మలర
    కనుల విందుగ దిరుగుచు కాచి యుండ
    లక్ష్మి నెలకొని యుండును లక్ష ణముగ

    రిప్లయితొలగించండి

  2. కాలం కలిసి వచ్చి న కలం కలిసి వచ్చిన
    'శంకరుని' కొలువులో చేరి పేను కూడా
    పేనా చేత బట్టి నాజూకుగా నవ్య భవ్య
    కామెంటు కోణంగి అయి ముచ్చట్లాడింది !!

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. తలపేను తిరుగుచుండెడి
    తలపే మహ చెడ్డగుండు తలలోనున్నన్
    నెలతల గోటికి చిక్కుచు
    నలుగునుగా దాని బ్రతుకు నాల్గుదినాలే !

    రిప్లయితొలగించండి
  4. మొక్క మీద పేను మెఱియుచునున్నది
    పంట పాడు జేయు పాడు జీవి(పార సైటు)
    రైతులకును చేటు రయముగా తాదెచ్చు
    నాకునుండు రసము నారగించి

    రిప్లయితొలగించండి
  5. అక్క శిరము నందు లెక్కలే నన్ని పే
    నులు గలవట యెట్లు దొలగు ననిన
    శిరము లోని పేను జితుకును గోటితో
    కనుక చంపుము మఱి కనిన తోడ

    రిప్లయితొలగించండి
  6. మిత్రులకు శుభాశీస్సులు.
    ఈ నాటి పద్యములు అలరించు చున్నవి. అందరికి అభినందనలు.
    కొన్ని సూచనలు:
    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. మహ చెడ్డ గుండు అను ప్రయోగమును మార్చితే బాగుంటుంది.

    శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది.
    1వ పాదములో యతి మైత్రి లేదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సలహాకు కృ తజ్ఞతలు.సవరించిన పద్యము పంపుచున్నాను.
    మొక్క మీద పేను ముట్టి యుండె గనుడు
    పంట పాడు జేయు పాడు జీవి(పార సైటు)
    రైతులకును చేటు రయముగా తాదెచ్చు
    నాకునుండు రసము నారగించి

    రిప్లయితొలగించండి
  8. పేనులు చిన్నవైన మరి పెత్తనముంగొని చేటుగూర్చుగా
    తానిటు నష్టకర్మలను తద్దయుచేయగ నిట్లనంగనౌ
    మానవ శీర్షమందుబడి మాటికి గోకిన తీపుపెంచుచూ
    ప్రాణముతీయబూనుగద పట్టినతగ్గవు వృద్ధిచెందుగా!

    రిప్లయితొలగించండి
  9. అలమట మదిలో బెంచును
    దలలో గల చిన్న పేను దలగొరిగించున్
    మలినాన్విత స్త్రీ వృద్ధుల
    తలలను దిరుగాడుచుండు దలచిన భయమౌ

    రిప్లయితొలగించండి
  10. శ్రీ రామకృష్ణమూర్తి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    3వ పాదములో తీపు పెంచుచున్ అందామా?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ లక్ష్మీనారాయణ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    మలినాన్విత స్త్రీ వృద్ధుల - అనుటలో స్త్రీకి ముందున్న త గురువు అగును కదా. గణ భంగము,
    మలినము గలిగిన వారల అంటే హాయిగ నుంటుంది. ఎవరినీ ఎత్తి చూపించ నక్కరలేదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. నమస్కారములు
    అందరికీ పేనులా కనబడితే నాకు ,ఎత్తెత్తి కాళ్ళు పెద్దగా కనబడి గొల్లభామ అనుకున్నాను

    రిప్లయితొలగించండి
  13. మా మామగారు శంకరయ్య గారికి జ్వరం ఎక్కువగా ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు సమాధానాలు ఇవ్వలేక పోతున్నందుకు, రేపు పోస్ట్ పెట్టలేరేమో అని బాధ పడుతున్నారు.

    రిప్లయితొలగించండి
  14. చిరంజీవి సౌభాగ్యవతి కల్పన గారూ 1 ముందు మావయ్యగారి ఆరోగ్యం బాగా చూసుకో మనండి
    కాదు మీరేదగ్గరుండి చూడాలి మరి . ఎందుకంటేమాకు గురువులు , మీకు తండ్రి వంటివారు. మామరదల్ని అడిగానని చెప్పండి .సమస్యా పూరణలు అంత ముఖ్యం కాదు. సరేనా ?
    మా సోదరులు త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ

    రిప్లయితొలగించండి
  15. శ్రీ పండిత నేమాని గురువరులకు నమస్సులు
    మీ సవరణకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరార్యుల అరోగ్యము త్వరగా కుదుట బడవలెనని కోరుకొనుచున్నాను...ఆర్యా ! కొంత విశ్రాంతి తీసుకొనండి
    శ్రీ నేమాని వారూ ! ధన్యవాదములు..
    చిన్న సవరణ చేయుచున్నాను...



    తలపేను తిరుగుచుండెడి
    తలపే బాధించుచుండు, తలలోనున్నన్
    నెలతల గోటికి చిక్కుచు
    నలుగునుగా దాని బ్రతుకు నాల్గుదినాలే !

    రిప్లయితొలగించండి
  17. నేమాని గురువర్యులకు... ముందర వచ్చిన "చున్"నే "చూ" గా మార్చి పంపాను. ఏదేమైనా నా ఆలోచనా మీసవరణా ఒకటే అయినందుకు కృతజ్ఞతలు...

    రిప్లయితొలగించండి