18, మే 2014, ఆదివారం

పద్య రచన – 563 (వర్షంలో పిల్లలు)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24 కామెంట్‌లు:


 1. యే దిల్ మాంగే మోర్
  వర్షా కీ ఝుంకార్
  అబ్ కి బార్ ఆనే వాలీ
  పీడీ కి హుంకార్ !!


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. వానలు కురవాలి వాన దేముడ యని
  పరవసించి పాట పాడ గానె
  బాల వాక్కు బ్రహ్మ వాక్కనిమేఘుడు
  వర్షమిడె చిఱుతలు పాడి యాడ

  రిప్లయితొలగించండి
 3. జల్లుల తడిసెడి వేళల
  పిల్లల నేత్రంబులందు వెలుగులు చిమ్మున్
  చల్లని హర్షపు జల్లులు
  మెల్లగ నా వర్షమందు మేలుగ కలియున్.

  రిప్లయితొలగించండి
 4. వర్షము వర్షము వర్షము
  వర్షములో పిల్లలచట పాటల తోడన్
  హర్షము నొందుచు గంతులు
  వర్షములో వేయుచుంట బాగున్నది గా !

  రిప్లయితొలగించండి
 5. తొలకరి జల్లులు చేసెను
  బులకింపగ పిల్లలెల్ల ముదము ప్పొంగన్
  జలజల రాలెడి చినుకుల
  జలములలోనాడుచుండ్రి సంగడి కాండ్రై.

  రిప్లయితొలగించండి
 6. జల్లుల తడియుచు నాడెడి
  పిల్లల హర్షమ్ముజూడ వేడుక కలిగెన్
  చల్లగ మారెను వేసవి
  మల్లెలు మామిళ్ళతోడ మనసులు దోచెన్

  రిప్లయితొలగించండి
 7. వానల రాకడ కోరిన
  కూనలు, పులకించి గెంతి కోలాహలమున్
  మేనులు మురియగ జేసిరి
  వానల తడవగ దలవని ప్రాణులు గలవే?

  రిప్లయితొలగించండి
 8. మిత్రుల ఛందోబద్ధమైన పద్యాలు బాగున్నవి

  మబ్బులదొ చిన్కులను మల్లెలుగ నాహా!
  యబ్బురమునంతటను హాసములు చిల్కెన్.
  పబ్బమిదె యంచు తడి బట్టలను వారల్
  నిబ్బరముతోడనట నిల్చిరి భళారే!

  రిప్లయితొలగించండి
 9. మొదటి పాదము సవరణ. అన్వయము కొరకై.
  మబ్బు చినుకుల్ కురిసె మల్లెలుగ నాహా!

  రిప్లయితొలగించండి
 10. నెలకొనియున్న యెండలకు నీరస మొందుచు నుక్కపోతతో
  తలచుచు నుండి రందరును దాహము తీరక వానరాకకై
  యలసిన లోకులందరకు హాయిని గూర్చగ నొక్కసారిగా
  తొలకరి వానజల్లు పడ దూలుచు పిల్లలు చిందులేయుచున్
  అలసట మర్చిపోయిరి విహారము జేయుచు వీధులందునన్!

  రిప్లయితొలగించండి
 11. మెల్లమెల్లగ భూమి చల్లగ మేఘమాలిక లేర్పడెన్
  చల్లచల్లగ మేను జల్లన సందడించెను చిన్కులున్
  పిల్లలెల్లరు వానరా యని పేర్మి పొంగుచు నానగా
  నుల్లమల్లన నాడిపాడిన దొక్క సారిగ బాల్యమై.

  రిప్లయితొలగించండి
 12. ముందువెనుకలఁ జూడక మూర్ఖతనము
  తోడ వర్తిలు వారలు తొందరపడు
  ఫలితమునుఁ గని యెల్లరు బాగుపడిన
  సంతసమ్మదె తెలియుము జనులకెల్ల.

  నేతలుగా నిల వెలుగుచు
  నీతిని న్యాయమ్మును మననీయక స్వార్థం
  బే తగుననుచును నా యవి
  నీతుల బోధించువారె నీచులు ధాత్రిన్.

  కనులను తెఱవక, విరహము
  మనమును బాధించువేళ మౌనము దాల్చెన్,
  మునిఁ గనక యున్న నేరము
  చిన దానిని పెక్కుగతుల శిక్షించె గదా!

  శిలనెత్తంగల వారలు
  బలముఁ గలిగినట్టి పెక్కు వానర వీరుల్
  గలగల చేసెడు హల్లో
  హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్.
  శిలలను చేతఁ బట్టి కడు చేవనుఁ జూపెడు వానరమ్ములన్
  పలువురఁ జేర్చి శత్రువును పట్టుకొనంగ మహా బలిష్ఠుడై
  యిలసుతఁ గావ వచ్చె; ధనువే తన యాయుధమౌను గానదే
  హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్?
  పాత పద్యాలను పొస్ట్ చేస్తున్నానండి

  రిప్లయితొలగించండి
 13. జిలేబీ గారూ,
  ‘పిడి’....?
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ వనమయూరం బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. లక్ష్మీదేవి గారూ,
  అనారోగ్యం కారణంగా మీరు చేసిన వివిధ పూరణలను, పద్యాలను ప్రస్తుతం సమీక్షించలేకపోతున్నాను. కాస్త కుదుట పడగానే వాటిపై నా స్పందన తెలియజేస్తాను. మన్నిస్తారని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 15. గురువు గారు, ఎంతమాట?
  మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం.
  వీటికేం తొందర లేదు. వీలు చిక్కినపుడు వ్రాసి పెడుతున్నానంతే.
  లోకహితవు కొఱకు లోహసమమయిన
  చిత్తవృత్తి తోడ చేతులార
  తనదు మేనిలోని యస్థులనొసగగ
  దైత్యుదునిమె సురుల దండు నేత.

  రిప్లయితొలగించండి
 16. అమ్మా! లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము ..
  "లోక హితము ''''''''" గురించి:
  పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  కొన్ని సూచనలు:
  3వ పాదములో యతిని గమనించలేదు.
  4వ పాదములో సురులు అన్నారు కదా - సురలు అనండి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. వానను తడిసిన పిల్లలు
  తేనెను అరవిరిసినట్టి తెల్లని పువ్వుల్
  మానవ జీవిత వృక్షపు
  కానుకగా దేవుడొసగు కమ్మని ఫలముల్

  రిప్లయితొలగించండి
 18. మిత్రులారా! శుభాశీస్సులు.
  సుమారు ఉగాది నుండి వచ్చిన శారీరిక బాధలతో సతమత మగుచున్నాను. కుడి ప్రక్క ఎముకల నొప్పి భుజపు నొప్పి గురించి ఇప్పటికే ఇద్దరు డాక్టర్లను కలిసేను. ఆర్థోపెడిక్ డాక్టర్ని ఆయన ఎప్పుడు అప్పోయింట్మెంట్ ఇస్తే అప్పుడు కలియాలి. ప్రతి నిత్యము నిరంతరముగా బాధ మందులు వాడుట మాత్రము జరుగుచున్నవి. అందుచేత మన బ్లాగులో మునుపటివలె పాల్గొన లేకుండా ఉన్నాను. పద్యములను వ్రాయుట లేదు.

  రిప్లయితొలగించండి
 19. పూజ్యశ్రీ నేమని పండితవర్యులకు మరియు శంకరార్యుల వారికి శీఘ్రమే పరాత్పరుడు స్వస్థత గూర్చాలని ప్రార్థన

  రిప్లయితొలగించండి
 20. పూజ్యులు పండిత నేమాని వారూ,
  మీకు అన్ని విధాల స్వస్థత చేకూరాలని ఆ పరాత్పరుని వేడుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 21. గురువుగారు,
  మీ ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా పరిశీలించి తగు సూచనలనిచ్చినందుకు ధన్యవాదాలు.
  మీ ఆరోగ్యం బాగుపడాలని మా గురువుగారితో సహా మేమందరం ఆశిస్తున్నాము.

  సవరణ.
  మేని యెముకలిచ్చి మేలుజేసె గనుడు.
  దైత్యుదునిమె సురల దండు నేత.

  రిప్లయితొలగించండి
 22. గురు పండితులకు త్వరగా స్వాస్థ్యము చేకూరాలని కాంక్షిస్తున్నాను.

  రిప్లయితొలగించండి