21, మే 2014, బుధవారం

పద్య రచన – 566

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(జ్యోతి వలబోజు గారికి ధన్యవాదాలతో...)

20 కామెంట్‌లు: 1. నవ నవలా బ్లాగ్జ్యోతిర్మయి
  e-జిలేబి నవ్య కథకళీ న
  స్వప్న లోకాల సుందరీమణుల్
  జిగేలు మనిపించెదరు బ్లాగ్లోకమున్ !!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. ప్రేమ లేఖను వ్రాయను బ్రియము తోడ
  నెటుల వ్రాసిన సంతోష మినుమ డించు
  దనదు భర్తకు ననుచును దలిరు బోడి
  చేయ సాగుచు చింతన చివర కామె
  వ్రాయుచుండెను జూడుడు భామ యచట

  రిప్లయితొలగించండి
 3. జిలేబీ గారూ,
  మీ భావం బాగుంది. దానికి పద్యరూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. ప్రియని తలపున మురియుచు ప్రేయసచట
  ప్రేమ లేఖను వ్రాయుచు ప్రీతి గాను
  స్వప్న మందున గాంచిన సంగతులను
  వలపు మీఱగ తెలుపుచు వ్రాయు చుండె

  రిప్లయితొలగించండి
 5. శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘ప్రేయసి + అచట’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘ప్రేయసి యట’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 6. కవయత్రి నవభావములదేల మానసో
  ద్భవ దృశ్యములు నాట్యమాడుచుయ్యలలూగి
  కవనించు నన్ను నన్నని వేడుచున్నటుల
  వివిధ చిత్రములెల్ల చిత్తమున నిండేనా?
  (మాత్రాగణ ఖండగతి చౌపది)

  రిప్లయితొలగించండి
 7. ప్రియునకు లేఖ వ్రాయఁ దల పెట్టగ రెక్కలు పూచి డెందమున్
  రయమున నాకసంబుగొని లాలన జేయగ చంద్రవంకపై,
  ప్రియతము జేరు మార్గమును పేనిచి రుక్మిణి బోలునట్లుగా
  నయనము లాగెనో కలము నాట్యము జేయగ కాగితంబుపై

  రిప్లయితొలగించండి
 8. అవధాన మందునతివలు
  కవనము లనువ్రాయ గలరు గణనీ యంబౌ
  నవనిని మెరుపుల వలయము
  నవలా మణికలము నందు నవరస భరితం

  రిప్లయితొలగించండి
 9. అయ్యా శ్రీ మిస్సన్న గారూ! స్శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  వయసు ప్రభావమువలన కాబోలు మీరు ఆ పాదములో యతిని గమనించ లేదు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

  మొల్ల వెంగమాంబ ముద్దుపళని యాది
  కావ్య రాశినిచ్చి గణ్యులైరి
  నవల నేడు దిట్ట నవలలు వ్రాయగా
  నింతివాద రచనల లెన్నిజేయ

  రిప్లయితొలగించండి
 11. మిస్సన్న గారూ,
  మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
  మొదటి పాదంలో యతిదోషం తొలగడానికి ఇలా అందామా? ‘వయసు ప్రభావ మియ్యది కృపన్ తన శక్తిని జూపి డెందమున్’
  *
  చంద్రమౌళి గారూ,
  బాగుంది మీ కవనం. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘భరితం’ అని వ్యావహారిక పదంతో పద్యాన్ని ముగించారు. ‘నవరసయుతమై’ అనండి.

  రిప్లయితొలగించండి
 12. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘ముద్దుపళని యాది’ అన్నచోట ‘ముద్దుపళని శ్రేష్ఠ/ కావ్యరాశి నిచ్చి’ అంటే బాగుంటుందేమో?

  రిప్లయితొలగించండి
 13. రచనలు చేయగా తగును రమ్యపు యూహల సుందరీ మణుల్
  రచయిత యన్న నంతెగద రాశిగ పోయుచు ముందువెన్కకున్
  ప్రచలితమైన భావనలు పత్రము పైన సుకల్పనంబుగా
  ప్రచురణ చేయగావలయు భావి సమాజపు మేలుకోరుచున్

  రిప్లయితొలగించండి
 14. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘రమ్యపు టూహల’ అనండి.

  రిప్లయితొలగించండి
 15. మహిళ నిశ్శబ్ద విస్ఫోట మహిమ రన్న!
  తల్లి,చెల్లియు వదినగ తలను వంచు
  కష్ట కాలము నందున కరుణ జూపు
  చితికి బోవుచు చిర్నవ్వు చెదరనీదు!
  వనితా తాపట్టు బట్టెనా వదలదింక!
  తలను తుంచేటి శక్తిగ తాను మారు!
  నాట్య, సంగీత, రచనల, నటన యందు
  రంగ మేదైన రాణించి రాజ్య మేలు

  రిప్లయితొలగించండి
 16. జ్యోతి గారూ,
  మీరు ఛందోబద్ధంగా ఇంత చక్కని కవిత్వం వ్రాస్తారని నేను ఊహించలేదు సుమా! అద్భుతంగా ఉంది. సకలశాస్త్రపారీణతాజ్యోతి వనిపించుకున్నారు. అభినందనలు.
  ‘తుంచేటి’ అనే గ్రామ్యపదమొక్కటే పానకంలో పుడకలా బాధించింది. అక్కడ ‘త్రుంచెడి’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 17. నేమాని పండితార్యా! మంచి హాస్యస్ఫోరకమైన చురక వేశారు. నవ్వాగడం లేదంటే నమ్మండి. సవరిస్స్తున్నాను. ధన్యవాదాలు.

  వయసు మహత్తు గొప్పది ప్రభావము జూపును నీదు డెందమున్
  రయిరయి మంచు ద్రిప్పు సరిరాని మనోహరమైన యూహలన్,
  మయి మరపించు లోకముల మానిని! పగ్గము వేయుమీ మనో
  హయమునకున్ శుభమ్ములగు హాయిగ జీవన నౌక సాగెడిన్.

  రిప్లయితొలగించండి
 18. గురువుగారూ మీ సూచన ఇప్పుడే చూశాను. మీ సవరణ బాగుంది. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి