29, మే 2014, గురువారం

పద్య రచన – 574

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:


 1. అయ్యవారలు ఇచ్చిరి ఆశీర్వచనములు
  బొమ్మల పెండ్లికి బ్లాగు లోకమున ;
  రండి రారండి, మీరూ ఆశీర్వదించి
  జిలేబి గైకొనండి వేడి వేడి చాయ తోడన్ !!  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి

 2. జిలేబి గారు మీ కవితకు నా పద్యరూపం

  ఇమ్ముగ నయ్యవారలట హృద్యముగాను పఠింప మంత్రముల్
  బొమ్మల పెండ్లి జూచుచు ప్రమోదము నొందగ బ్లాగు వీక్షకుల్
  రమ్ము జిలేబి తీపి రుచి క్రమ్మున గొందము భోజనమ్ములో
  కమ్మని చాయి నందెదము కన్నుల నిండుగ పెండ్లి గాంచుచున్!

  రిప్లయితొలగించండి
 3. వేద మంత్రాలు జదువంగ విబుధ వరులు
  జరుగు చుండెను బొమ్మల జంటల కట
  వైభవంబుగ పెండ్లిండ్లు వైజ యంతి !
  చూడు మచట యా చిత్రము చూడ్కు లలర

  రిప్లయితొలగించండి
 4. చిన్న పిల్లలు పల్లెలన్ చెన్నుగాను
  బొమ్మ లన్నియు నొకచోట నిమ్ము జేర్చి
  వివిధ పాత్రలు ధరియించి వేడ్క తోడ
  నమ్మ నాన్నల యాటల నాడు చుంద్రు
  పరిణయములను జేయుచు ప్రతిమలకును

  రిప్లయితొలగించండి
 5. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

  బొమ్మల పెండిలి లోనను
  నిమ్ముగ పిల్లలె యగుదురు నేర్పున పెద్దల్
  కమ్మని యాటకు పెద్దలు
  నెమ్మనమందున నిసుగుల నేర్పును పొగడన్

  రిప్లయితొలగించండి
 6. బొమ్మల కొలువుల లోపల
  బొమ్మలపెళ్ళిళ్ళు జరగ బోలెడు సరదా!
  కమ్మని యాశీర్వచనము
  నెమ్మిని యిరుపక్షములకు నిత్యము శుభమౌ!

  రిప్లయితొలగించండి
 7. Shankaraiah Boddu గారూ మీ పద్యం బాగుంది.
  ------------------------------------------------------------
  ఇమ్ముగ నయ్యవారలట హృద్యముగాను పఠింప మంత్రముల్
  బొమ్మల పెండ్లి జూచుచు ప్రమోదము నొందగ బ్లాగు వీక్షకుల్

  రిప్లయితొలగించండి
 8. పెళ్లి బొమ్మలకొలువు వీడియోలు లేని రొజుల్లో......

  పరిణయ మాడిన వారికి
  సరస స్మృతులంద జేయు సాధన మిదియే!
  పరిణయ మాడని వారికి
  మురియగ మధురోహలిచ్చు బొమ్మలకొలువే!

  రిప్లయితొలగించండి
 9. చందనమును పూసిన తన
  అందమయిన గుండు ఎంత హాయిగొలిపెనో
  డెందమునానందముతో
  సుందర మైన తనరూపు చూడగ తరమా!

  రిప్లయితొలగించండి
 10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి