24, మే 2014, శనివారం

పద్య రచన – 569 (పచ్చబొట్టు)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7 కామెంట్‌లు:

  1. తరగని ప్రేమకు చిహ్నము
    చెరగని ముద్రనుచు జనులు చేడియ కొఱకై
    పెరగదు ప్రేమని తెలియక
    వరమని తమతనువు పైన పచ్చని బొట్టున్

    రిప్లయితొలగించండి
  2. పచ్చ బొట్టును బొ డి పింత్రు పడతు లకట
    యొకరు నొకరును బ్రేమగా నుండు కొఱకు
    పల్లె టూ ళ్ళలో నిప్పటి కెల్లవారు
    పొడుచు కొందు రీ పచ్చని బొట్టు గనుము

    రిప్లయితొలగించండి
  3. మదిలో నీ రూపంబే!
    ముదముననది పచ్చ బొట్టై మేనిన్
    చెదరక నిలిచె ప్రియతమా!
    వదలను నను చేర రార వారిజ నయనా!

    రిప్లయితొలగించండి
  4. మెచ్చిన బొమ్మల, పేరుల
    ముచ్చటగా మేనిపైన మోజును బడుచున్
    పచ్చను బొడిపింతురుగద
    చిచ్చున గాలేంతవరకు చెరగదు గాదా !

    రిప్లయితొలగించండి
  5. సొంపు నందంబు ననుచు నింపు గొలుప
    దైవచిహ్నాలు మేలను ధ్యాసతోడ
    పచ్చబొట్టిడు కొందురు పావనమని
    అదియె కేన్సరుకారి యంచరయ రెవరు

    రిప్లయితొలగించండి
  6. పడతి హృదయాన ప్రియుడెగా పచ్చబొట్టు
    భర్త హృదయాన భార్యయౌ పచ్చబొట్టు
    బాల హృదయాన తల్లియౌ పచ్చబొట్టు
    తెచ్చిపెట్టును కేన్సరు పచ్ఛబొట్టు


    రిప్లయితొలగించండి
  7. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘ముదమున నది మేటి పచ్చబొట్టై నిలిచెన్’ అందామా?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ (మాధురి గారి ద్వారా),
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘సొంపు నందంబు నని పల్కి యింపు గొలుప’ అందామా?
    *
    రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి