భాగవతుల కృష్ణారావు గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. దయచేసి మీ దగ్గర ఆకాశవాణి వారి సమస్యలేమైనా ఉంటే పంపించండి. shankarkandi@gmail.com * పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.... సవరణకు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదముల తో... =============*================= కకవిక లైనట్టి విపణి,కంఠ పాశము వలె నుండ సకల జీవుల శాంతి కొఱకు సంఘ జీవనమున జనుల కు కులతత్వ మెరింగి యున్న గూడును సుఖములు,నేటి మకిల మకరముల మధ్య మత్యము వోలె దిరుగగ !
శైలజ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * కందుల వరప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మత్స్యము... టైపాటువల్ల మత్యము అయినట్టుంది. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు. మల్లెల సోమనాథ శాస్త్రి గారిని బ్లాగుకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు సంతోషంగా స్వాగతం పలుకుతున్నది. మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.
పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.వైద్యుని దగ్గరకు వెళ్ళే హడావిడిలో కందము పూరించి నాను. తమరు చూచి నట్టులేరు. మూడు రక్త నాళమ్ములు పూడి పోవ కోయుటయొ లేక స్టంటుల నేయుటౌనొ తెలిసి కొనుటకై సుతునితో కలసి నేడు వెళ్ళుచున్నాను వెజ్జుకై భీతితొడ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, నిజమే! మీ పూరణ నా దృష్టికి రాలేదు. మీ ‘సభికుల’ పూరణ బాగుంది. అభినందనలు. మీ అస్వస్థత గురించి తెలిసి బాధపడుతున్నాను. ఇంతకూ డాక్టరుగారు ఏమన్నారు?
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. ఈ రోజు సోమరాజు గారిని కలిశాను. ఏంజియోగ్రాము సి.డి పరిశీలించారు. సర్జనులతో మాట్లాడి మూడు రోజులలో అభిప్రాయం తెలియ జేస్తామన్నారు.
కులపథము ననుసరించుచు
రిప్లయితొలగించండిజలజము లారిటిని దాటి సాధకులు మహా
జలజాటవి జేరెదెరట
కులతత్త్వ మెరింగియున్న గూడును సుఖముల్
కులమత భేదము లెంచక
రిప్లయితొలగించండికులతత్వ మెఱింగి యున్న గూడును సుఖముల్
మలినము మనసును వీడిన
ఫలితము లభియించు ననగ పాప హరంబౌ
కలుషితవాతావరణము
రిప్లయితొలగించండిపలు రుగ్మత లందఁజేయుఁ బర్యావరణం
బిలఁ గాపాడు మనెడి పలు
కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.
రిప్లయితొలగించండిలేదు మరి కులము మతము అనుట కల్ల
వద్దు మరి కులము మతము అనుట డొల్ల
లౌక్యమున సమయానుసారముగ జనులెల్ల
కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్
జిలేబి
జిలేబీ గారి భావానికి పద్యరూపం....
రిప్లయితొలగించండికులమతభేదము వలదని
పలుకుట మఱి కల్ల గాదె పలువురు తమ కో
ర్కెల సాధించుటకొఱకై
కులతత్త్వ మెఱింగియున్న గూడును సుఖముల్.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఆధ్యాత్మికభావంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వెలుగొందె వాస్త్రుశాస్త్రము
రిప్లయితొలగించండిఫలితమ్ములనొసఁగి జనుల భయమును ద్రుంచున్
కలియుగమున తప్పదు, ది
క్కులతత్త్వమెఱింగియున్నఁ గూడునుసుఖముల్.
ఇల వృత్తి ధర్మము వెలసె
రిప్లయితొలగించండికులతత్వంబై, కులానుగుణమా గుణముల్ ?
తెలియన్ లౌక్యంబులు నా
కులతత్వ మెఱింగి యున్నఁ గూడును సుఖముల్
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ వివిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చెలిమిని నటించి వెనుకన్
రిప్లయితొలగించండికలుషితమగు బుద్ధిజూపి కయ్యము జేయన్
ఖలులై వర్తించెడి పా
కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.
( ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన సమస్యా పూరణ కార్యక్రమమునకు తే19/03/1972 దీ నాటి సమస్యకు ఇది నా పూరణము)
నేటి పూరణ :--
కలిమిని గడించ కొందరు
బలిమిని పదవులను పొంద వాయసములవన్
కలలను గన నేతలు , కా
కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.
కలతలు రావుగ యెప్పుడు
రిప్లయితొలగించండికుల తత్త్వమెరింగి యున్న, గూడును సుఖము
ల్గలుగును శివు నర్చించిన
మెలకువగా నుండు మెపుడు మేదిని యందున్
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
దయచేసి మీ దగ్గర ఆకాశవాణి వారి సమస్యలేమైనా ఉంటే పంపించండి. shankarkandi@gmail.com
*
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండికులములు నాల్గని నయ్యవి
జలజాక్షుని యంగములని జ్ఞాతమ్మయి పూ
జలు సేతురు పదముల కీ
కులతత్వ మెరింగి యున్న గూడును సుఖముల్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
‘నాల్గని యయ్యవి’ అని యడాగమం రావాలి.
పలువిధ కార్యము లందున
రిప్లయితొలగించండికలసిమెలసియె పనులన్ని కావింపవలెన్
పలువురు కూడినచో సభి
కుల తత్వమెఱింగి యున్న గూడును సుఖముల్
ఇలకున్ గాలికి నీటికి
రిప్లయితొలగించండికులమన్నదిలేనెలేదు కువలయమందున్
కలుషితమతి వలదను కవి
కులతత్త్వ మెరింగియున్న గూడును సుఖముల్
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో....
రిప్లయితొలగించండిసవరణకు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదముల తో...
=============*=================
కకవిక లైనట్టి విపణి,కంఠ పాశము వలె నుండ
సకల జీవుల శాంతి కొఱకు సంఘ జీవనమున జనుల
కు కులతత్వ మెరింగి యున్న గూడును సుఖములు,నేటి
మకిల మకరముల మధ్య మత్యము వోలె దిరుగగ !
చెలిమే కలుగును నిజముగ
రిప్లయితొలగించండికులతత్త్వ మెరింగియున్న, గూడును సుఖముల్
పలువురి మంచిని గోరిన
జలశయనుడు మెచ్చు గాదె జన్మతరించున్
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిమరియొకపూరణ:బలమొక్కటి చాలదు తన
బలగము నధికార బలము పార్టీ బలమున్
కులభేదము లేదను బొం
కుల తత్వ మెరింగి యున్నగూడును సుఖముల్
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిమల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు
1.కులమన సమూహమగుగా
కులవృత్తులు లేకయున్న కువలయమందున్
కలుగదు జీవన సరళి యె
కులతత్వ మెరింగి యున్న గూడును సుఖముల్
2.కులమేదైనను మానవ
కులమది యొకటే,కనుగొన గొప్పది లేదే
కులమున,సమాజమందీ
కులతత్వ మెరింగి యున్న గూడును సుఖముల్
బలహీనత వీడిన నీ
రిప్లయితొలగించండిదలచిన కార్యమున జయము దక్కుననెడు గో
కుల కృష్ణుని గీతా వా
క్కుల తత్వమెఱింగియున్నఁ గూడును సుఖముల్!
పలు రుగ్మతలకు హేతువు
రిప్లయితొలగించండిచల చిత్తము, దాని గట్టి సంయమనమునన్
మెలగుట మేలు, మనోవ్యా-
కులతత్త్వ మెరింగియున్న గూడును సుఖముల్.
పలుకుల కలుపుచు, మంచిగ
నలువురిలో గానబడుచు, నయవంచకులై
వలపన్నుచుండు పలుగా-
కులతత్త్వ మెరింగియున్న గూడును సుఖముల్.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
కందుల వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మత్స్యము... టైపాటువల్ల మత్యము అయినట్టుంది.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.
మల్లెల సోమనాథ శాస్త్రి గారిని బ్లాగుకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు సంతోషంగా స్వాగతం పలుకుతున్నది.
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ వ్యాకుల, పలుగాకుల పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు.
కలకాలము మావవ ఈ
రిప్లయితొలగించండికులమత వైరమును గలిగి కుజనునిరీతిన్
ఇల మనుదువెన్ని యేడులు
కులతత్వమెరింగి యున్న గూడును సుఖముల్
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రీతిన్ + ఇల’ అని విసంధిగా వ్రాయరాదు కదా! ‘కుజనుని వలె నీ / యిల...’ అనండి.
పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.వైద్యుని దగ్గరకు వెళ్ళే హడావిడిలో కందము పూరించి నాను. తమరు చూచి నట్టులేరు.
రిప్లయితొలగించండిమూడు రక్త నాళమ్ములు పూడి పోవ
కోయుటయొ లేక స్టంటుల నేయుటౌనొ
తెలిసి కొనుటకై సుతునితో కలసి నేడు
వెళ్ళుచున్నాను వెజ్జుకై భీతితొడ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండినిజమే! మీ పూరణ నా దృష్టికి రాలేదు. మీ ‘సభికుల’ పూరణ బాగుంది. అభినందనలు.
మీ అస్వస్థత గురించి తెలిసి బాధపడుతున్నాను. ఇంతకూ డాక్టరుగారు ఏమన్నారు?
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. ఈ రోజు సోమరాజు గారిని కలిశాను. ఏంజియోగ్రాము సి.డి పరిశీలించారు. సర్జనులతో మాట్లాడి మూడు రోజులలో అభిప్రాయం తెలియ జేస్తామన్నారు.
రిప్లయితొలగించండిసత్యనారాయణ రెడ్డిగారూ! స్వస్థత చేకూరుతుంది. చిన్తపడకండి.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
రిప్లయితొలగించండిమీ సవరణకు ధన్యవాదములు
నీ /యిల అనడానికికంటె నీ /విల అంటె భాగుంటుందేమో నని నా సందేహము
ఇల జీవన యానములో
రిప్లయితొలగించండిపలు పలు విధముల నుడివిన పథముల గతిలో
అలవేమన చెప్పిన పలు
కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్.
కులములు పలుపలు రకములు
రిప్లయితొలగించండివెలమలు కాపులు రజకులు బెస్తలు బోయల్
జిలిబిలి కోటా కొఱకై
కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్
రిప్లయితొలగించండివిలవిల లాడకు రమణీ
విలువల మరువక జగత్తు వివరంబిదియే
చెలువము మీర మృదుల పలు
కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్!
జిలేబి
అలవోకగ గెల్చుటకై
రిప్లయితొలగించండియెలమంచిలి సీటునందు నేడవకుండన్
పిలిచిన పలికెడు వోటరు
కులతత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్