14, మే 2014, బుధవారం

పద్య రచన – 560 (పిల్లలతో రైలు ప్రయాణము)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
ఈ చిత్రాన్ని పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

8 కామెంట్‌లు:


 1. ఛుక్ ఛుక్ బండి
  ఎక్కెదము రండి
  అటావల ఎల్లుండి
  వచ్చెదము రండి !!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. శంక రార్యుడ !మీకుగా శంకరుండు
  రుగ్మతను దరిమి యిక యా రోగ్యవంతు
  జేయు గావుత !మిమ్ముల , యీ య దనున
  వేడు కొం దును నేనును విశ్వవిభుని

  రిప్లయితొలగించండి
 3. వేసవి సెలవులందున ప్రీతితోడ
  పోవుచుండిరి యాత్రకు పొగశకటము
  నందు పిల్లలఁ దోడ్కొని యర్థి తోడ
  సెలవులన్నియు గడపంగఁ స్వేచ్చ గాను

  రిప్లయితొలగించండి
 4. పయన మయ్యెను రైలుపై పగటి పూట
  కాకి నాడకు సోమయ్య కాంత తోడ
  పిల్ల లిద్దరు తోడైరి పేచి పెట్టి
  తిరిగి వత్తురు మఱి రెండు దినము లకట

  రిప్లయితొలగించండి
 5. అబ్బో! రైలు ప్రయాణము
  యిబ్బందుల పాలుజేయు నీ వేసవిలో
  అబ్బబ్బ పిల్లలేమో
  యుబ్బుదురు ప్రయాణ మనిన నుద్వేలముగా.

  రిప్లయితొలగించండి
 6. అల్లరి చేసెడు పిల్లల
  మెల్లగ సముదాయపరచి"మెయిలు"కు పోగా
  యెల్లలెరుంగని సంతస
  ముల్లములనుగోచరించె మోహనరీతిన్

  రిప్లయితొలగించండి
 7. సెలవులు పాఠశాలలకు జెప్పిరి వేసవి కాలమంచు పె
  ద్దలు తమ పిల్లలె ల్లరును దూరపు వింతలు గాంచ వేడ్కతో
  గలసియు బోవ నిర్ణయము గైకొని జేతురు రైలు యాణమే
  స్థలమునుగాంచినన్ జనుల సందడె సందడి యుండునిత్తరిన్

  రిప్లయితొలగించండి
 8. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈ నాటి పద్యములు అన్నియును అలరించుచున్నవి. అందరికి అభినందనలు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి