కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
ఒకానొక అవధానంలో గరికిపాటి వారికి ఇచ్చిన సమస్య ఇది...
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
ఒకానొక అవధానంలో గరికిపాటి వారికి ఇచ్చిన సమస్య ఇది...
స్థంభము చాటుగా నిలచి సంతస మందున కన్నుగీ టుచున్
రిప్లయితొలగించండిసంభవ మౌనుకా దనక సాకులు జెప్పక వేగ రమ్మికన్
దంభము తోనప్రేయసిని దాగుడు మూతల యాటలాడగన్
రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగ కేళికిన్
అక్కయ్యా,
తొలగించండిపద్యం బాగుంది. కాని సమస్య సమర్థంగా పూరింపబడినట్లు లేదు. రాఘవుడు రంభను పిలిచినట్లే ఉంది.
రిప్లయితొలగించండిరంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్
రామవినాశముం గనుచు సీతయు రాక్షసాదులు నవ్వెన్ హలమున రాఘవుడు రాక్షసాదులన్ జంపెన్
లంకేశుఁడు రాముఁ జంపె లలనేచ్ఛ మెయిన్.!!
ఉల్టా పుల్టా
బిలేజి
_/\_
తొలగించండిసంభవ మెట్టులయ్య ! తన సామర సాక్షిని సీత నేలగా
రిప్లయితొలగించండికుంభిని రావణా సురుని గూల్చి విభీషణు రాజుజేసియా
రంభము నుండి జానకినె రాణిగ దల్చిన ప్రేమమూర్తియా
రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్?
రంభను బోలు జారిణిని రాజును నేనని బొంకి యేలుచున్
సంభవమంచు రాఘవుడు శంకరుడాదిగ మిత్రవర్గమున్
దంభములాడి బిల్వగని తన్మయుడై తనుగూడదల్చు సం
రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్.
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
సామరసాక్షి...? తామరసాక్షి ఉంది కానీ సామరసాక్షి అంటే?
జృంభన మైన కోరికల చేతను'రాఘవు' డన్నవాడు సం
రిప్లయితొలగించండిరంభముతోడ యవ్వనపు ప్రాయములోన ప్రభావిడయ్యెనో
స్తంభము వంటి మానవుడు సంభలినే తన రంభయంచు నా
రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్!
శంకరయ్య గారూ,
తొలగించండిమంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
జృంభణము టైపాటు వల్ల జృంభనము అయింది. ‘ప్రభావిడు’ ? ‘ప్రభావితుడు’ సరియైన పదం కదా!
శంభు ప్రసాదితంపు ఘన జాపము గూల్చగ మోదియై నిరా
రిప్లయితొలగించండిడంబరు పెళ్లి జేసుకు విలాసము మారగ ప్తేమతో ప్రయా
ణంబున సీత రాగమయి నవ్వెడు నాథు సమాగమంపు సం
రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగ కేళి కిన్.!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘శంభు ప్రసాదమైన’, ‘పెండ్లియాడియు’ అనండి.
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. నిన్న సాయంత్రము యింటికి వచ్చాను.శంకరా భరణం బ్లాగు చూడటము సంతోషంగా వున్నది.
రిప్లయితొలగించండిసత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిసంతోషకరమైన వార్త చెప్పారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది?
సత్యనారాయణ రెడ్డిగారూ సంతోషం.
రిప్లయితొలగించండినిన్నటి సమస్యకు నా పూరణ:
రిప్లయితొలగించండిభారత మంత్రి మండలి సభాస్థలి పూనిక జేయుచుండగా
పేరును బొందినట్టి పలు వేదిక లందున, చిత్రసీమలో
వీరులు, నాయకీమణులు, వేడుక సల్పగ వచ్చిచేరి రా
తారల కాంతిచే పగలు తళ్కులు చిందియు తెల్లబోయెగా!
శంకరయ్య గారూ,
తొలగించండిఈ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారూ!
తొలగించండిరవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
రంభాఫలము సరైన రూపం.
గురుదేవులకు నమస్కారములు, దోషములను చూపినందులకు ధన్యవాదములు, సవరణతో
రిప్లయితొలగించండిజృంభణమైన కోరికల చేతను రాఘవు డన్నవాడు సం
రంభముతోడ యవ్వనపు ప్రాయములోన ప్రభావమొందుచున్
స్తంభము వంటి మానవుడు సంభలినే తన రంభయంచు నా
రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్!
శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు సంతోషం
రిప్లయితొలగించండిమల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ
రిప్లయితొలగించండిశంభుని వింటినెక్కిడియు,సత్వర మాతడు జానకీసతిన్
దంభము మీఱ పెండ్లిగొన,తద్గుణశీలను,మంగళాంగనల్
బంభరవేణి నంతరము బంపగ,లాలితధర్మబద్ధితా
రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్
సోమనాథ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిసంభవమిద్ది గాదనుచు సందియమందక నెంచి చూడగన్
శంభుని విల్లు వంచి ఘన జానకి బట్టెను నొక్క రాత్రి తా
స్తంభము ప్రక్కనుండ - మది దల్పక నూర్వసి మేనకన్ మరిన్
రంభను- జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాస్టరుగారూ ! ధన్యవాదములు.
క్రమాలంకారము
రిప్లయితొలగించండిజృంభిత కేశపాశులిట చేయుతపస్సులు జారు దేనిచే?
బంభర వేణి సీతనిటు భార్యగజూచుచు పిల్చునెవ్వరో?
సంభరితాత్ముడై మదన సాయక మేయును కంతుడేలొకో?
రంభనుజూచి; రాఘవుడు రమ్మనిబిల్చె; ననంగకేళికిన్
రామకృష్ణ మూర్తి గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగుంది. అభినందనలు.
guruvu gaariki dhanyavaadamulu. tamari suucita savaraNatoa padyam:
రిప్లయితొలగించండిశంభు ప్రసాదమైన ఘన జాపము గూల్చగ మోదియై నిరా
డంబరు పెండ్లియాడియు విలాసము మారగ ప్తేమతో ప్రయా
ణంబున సీత రాగమయి నవ్వెడు నాథు సమాగమంపు సం
రంభను జూచి రాఘవుడు రమ్మని బిల్చె ననంగ కేళి కిన్.!
బ - భ లకు ప్రాస చెల్లునా?
రిప్లయితొలగించండిదంభము మీర రావణుడు దారిని తప్పుచు శాపమొందెనే
రిప్లయితొలగించండిరంభను జూచి;...రాఘవుడు రమ్మని బిల్చె ననంగకేళికిన్,
(శంభుని తోడు!) సీతనట చల్లని రాత్రినయోధ్యనందునన్
కుంభము కొట్టి చెప్పెదను! కొద్దిగ గూడను శంకలేకయే
తోడు = ఆన (ఒట్టు)