పండిత నేమాని వారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * సహదేవుడు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * జిలేబీ గారూ, ☺ * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * మాధురి ఆర్. ఎల్. గారూ, మల్లెల సోమనాథ శాస్త్రి గారి పూరణలను, పద్యాలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు. * మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * మిస్సన్న గారూ, ఈనాటి మీ సీసపద్యం కడుంగడు ప్రశంసనీయం. నేమాని వారి ప్రశంస నందుకొన్నందుకు అభినందనలు.
సరదాగా చిన్నారులు
రిప్లయితొలగించండిధరించిరి విచిత్రమనగ దంపతుల వలెన్
దరహాసోజ్జ్వల ముఖులై
సరియగు వేషములు బహు ప్రశంసల గనుచున్
మన సాంప్రదాయ మెన్నడు
రిప్లయితొలగించండికనుమరుగవనీయ కుండ కాపాడుటకే
చినతనము నుండి వారికి
మనదే యగు కట్టు బొట్టు మరి నేర్పదరే
మన సాంప్రదాయ మెన్నడు
రిప్లయితొలగించండికనుమరుగవనీయ కుండ కాపాడుటకే
చినతనము నుండి వారికి
మనదే యగు కట్టు బొట్టు మరి నేర్పదరే
రిప్లయితొలగించండిమోహనులాలు మీనా జోడి
'దృశ్యం'మళయాళ చిత్రము
ఈ తెలుగు 'చిత్రము' వారిని
తలపించు అమోఘ బ్లాగ్చిత్రము !!
జిలేబి
బాలా వృద్ధ సమాన
రిప్లయితొలగించండిమ్మౌలాగున బాలలిచట మాన్యతనిపుడే
మేలగు వస్త్రపు ధారణ
లీలలు చూచుటకు కన్నులింతలు కావా!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ
రిప్లయితొలగించండిఉల్లము నందున పెద్దలు
పిల్లల భవితను కలగని,పెద్దలు కాగా
నెల్లరు తలతురు.వారలు
చెల్లుదు రెట్టులొ కనగను చెప్పగతరమా!!
చిన్న పిల్లల జూడుడు చిలిపిగాను
రిప్లయితొలగించండిమొగుడు పెళ్ళాల మాదిరి మోహనముగ
నుండి ముద్దులు గలిగించు చుండి వారు
మనకు నాదర్శ దంపతు లనగ నొప్పు
వస్త్ర ధారణ పోటికే వన్నె దెచ్చు
రిప్లయితొలగించండిపిల్ల లిరువురు వేసిరి పల్లెటూరి
జంటవలె వేష ధారణ జక్కగాను
వచ్చె బహుమతి వారికే మెచ్చిరంత.
కన్నుల విందుగ నుండెను
రిప్లయితొలగించండిపిన్నల వేషములుగనగ ప్రీతినొసంగెన్
చిన్నారులుదంపతులుగ
మిన్నగు వస్త్రములలోన మెప్పును బొందెన్
పసిడి నవ్వుల రువ్వు బాల బుజ్జమ్మలూ
రిప్లయితొలగించండి......చీర కట్టేలనే చిన్న నాట
బులిబుల్లి బుగ్గల బుజ్జి తండ్రీ నీకు
......పంచె కట్టేలయా బాల్యముననె
గంప పైకెత్తుట ఘనమైన క్రీడయా
......పకపకా నవ్వగా పాప నీకు
తలపాగ ఠీవిగా తనరార నిశితమౌ
......దృక్కుల కెటు దారి చక్కనయ్య
తెలుగు సంప్రదాయమ్ముల దెలుపనెంచి
యిట్టి దుస్తుల దాల్చిరా యింపుమీర
కాయకష్టము జేసిన కలుగు సుఖము
లనెడు సూక్తిని బోధించు ఘనత మీదె.
శ్రీ మిస్సన్న మహాశయా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ సీసము సెహ్బాస్
స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
జిలేబీ గారూ,
☺
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
మాధురి ఆర్. ఎల్. గారూ,
మల్లెల సోమనాథ శాస్త్రి గారి పూరణలను, పద్యాలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
ఈనాటి మీ సీసపద్యం కడుంగడు ప్రశంసనీయం. నేమాని వారి ప్రశంస నందుకొన్నందుకు అభినందనలు.
శ్రీ మిస్సన్నగారికి నమస్సులు..బాలలపై మీ సీసపద్యం,అలాగే వేదమాతపై మీ సీసపద్యం చాలా చాలా బాగున్నాయి..
రిప్లయితొలగించండినేమాని పండితార్యులకు, గురువుగారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశైలజ గారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి