భూమి నంతయును జయింప బుద్ధి పుట్టి సాగరుడు సల్పె యజ్ఞ మున్ సంతసముగ విడిచె యజ్ఞాశ్వమును చన వివిధ దేశ ములకు,రక్షణ మొనరించ పుత్రులెల్ల చనిరి దాని వెంటను చాల ఘనము గాను అశ్వ రాజమున్ కనలేక నడవి నందు చేరి కపిల మౌని కడకు, చింత లేక గోల చేయుచు నుండగ, కోపమడరి మౌని భస్మము గన్ జేసె, రేని సుతుల
శ్రీ లక్ష్మీనారాయణ గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. కొన్ని సూచనలు:
"తప్పిపోయినో యడవిలోన" -- ఒక బదులుగా ఓ అని వాడేరా? సవరించండి. 4వ పాదము: కడకు - టైపు పొరపాటు బడినది. వద్ద కన్గొని అందాము - గణభంగము సరిజేయుటకు. ఖలుల కిటుల అందాము - కలుల కిటులకి బదులుగా.
శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. కొన్ని సూచనలు:
2వ పాదములో గణభంగము కలదు - సరిజేయండి. 16వ పాదము: తల్చి కి బదులుగ యెంచి అందాము.
ఈనాటి పద్యరచన శీర్షికకు చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు.... సుబ్బారావు గారికి, అన్నపరెడ్డి సత్యనారాయణ గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, శైలజ గారికి, రెండు చింతల రామకృష్ణ మూర్తి గారికి, అభినందనలు. * పండిత నేమాని వారూ, మిత్రుల పూరణలను, పద్యాలను సమీక్షించినందుకు ధన్యవాదాలు.
శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. మీరు వేసిన 1,2,4 పాదములలో ప్రాసయతులన్నియూ లక్షణమునకు విరుద్ధముగా నున్నవి. ప్రాస యతి నియమములను జాగ్రత్తగా అధ్యయనము చెయ్యండి. బూడిదయ్యిరి అను ప్రయోగము కూడా బాగు లేదు.
సగర పుత్రులు దెచ్చిన సలిలములకు
రిప్లయితొలగించండిసాగరంబని నుడివిరి సకల జనులు
సలిల మందున నిత్యము స్నాన మాడ
పుణ్య లోకాల గమనము బొంద వచ్చు
భూమి నంతయును జయింప బుద్ధి పుట్టి
రిప్లయితొలగించండిసాగరుడు సల్పె యజ్ఞ మున్ సంతసముగ
విడిచె యజ్ఞాశ్వమును చన వివిధ దేశ
ములకు,రక్షణ మొనరించ పుత్రులెల్ల
చనిరి దాని వెంటను చాల ఘనము గాను
అశ్వ రాజమున్ కనలేక నడవి నందు
చేరి కపిల మౌని కడకు, చింత లేక
గోల చేయుచు నుండగ, కోపమడరి
మౌని భస్మము గన్ జేసె, రేని సుతుల
శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
అడవి + అందు = అడవియందు అగును - నుగాగమము రాదు.
స్వస్తి.
సగర మహారాజు సకల రాజులు మెచ్చ
రిప్లయితొలగించండినద్భుతముగ జేసే నశ్వ మేధ
యజ్ఞమా యభిషవ హయమును విడువగా
నది తప్పిపోయెనో యడవిలోన
సగర పుత్రులు దాని జాడను దెలియక
వనము జంతుతతిని వదలకుండ
గాల్చివేసిరి వారు కడుకు కపిలమౌని
వద్ద కనుగొని ''దొంగ వాడ వీవు ''
యనుచు నిందించ మౌని తా కనులు తెరవ
మాడి పోయిరెల్లరు తపో మహిమచేత
గర్వమున దోషమొనరించు కలులకిటుల
జరుగు నాశము తప్పక జగతిలోన
సగరు డశ్వ మేధము తుష్టి సలుప దలచి
రిప్లయితొలగించండివిడిచె నశ్వమున్ మరల విశ్వమంత
దేవతల పతి యశ్వమున్ దొంగిలించె
రక్కసునివేషమున వచ్చి రయము గాను
యజ్ఞ భంగము గాకుండ నాజ్ఞ నిచ్చె
సగరు డాతని సుతులకు జగతి వెదక
పుత్రులరువది వేలును పూని చనిరి
భూమి నంతయున్ ద్రవ్వుచు భూరి శక్తి
బ్రహ్మ కడకేగి దేవతల్ బాధ జెప్ప
కల్పమంతరించు తఱిన కపిలునిగను
శౌరి యుద్భవించె భువిని, తాను విధిగ
సగర పుత్రులన్ రయమున సంహరించు
ననుచు వారలన్ గృహముల కంపె నతడు
సగర పుత్రులు వెదకుచు చనిరి తుదకు
కపిలు కడకు నశ్వమచట కాను పించ
దొంగ యాతడే యని తల్చి దుష్టబుద్ది
మౌనిపై కాలు ద్రువ్విరి మదము తోడ
కనలి వారి భస్మము జేసె కపిల మౌని
పిదపను భగీ రథుడుతాను పితరులకును
స్వర్గ ప్రాప్తిని కల్గించ సల్పి తపము
దివ్య గంగను భూమికి తెచ్చె నపుడు
శ్రీ లక్ష్మీనారాయణ గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
కొన్ని సూచనలు:
"తప్పిపోయినో యడవిలోన" -- ఒక బదులుగా ఓ అని వాడేరా? సవరించండి.
4వ పాదము: కడకు - టైపు పొరపాటు బడినది.
వద్ద కన్గొని అందాము - గణభంగము సరిజేయుటకు.
ఖలుల కిటుల అందాము - కలుల కిటులకి బదులుగా.
శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. కొన్ని సూచనలు:
2వ పాదములో గణభంగము కలదు - సరిజేయండి.
16వ పాదము: తల్చి కి బదులుగ యెంచి అందాము.
స్వస్తి.
యాగ కురుటిని వెదకుచు జగతినందు
రిప్లయితొలగించండిసగర కొమరులు వెడలిరి వేగముగను
కపిల మౌనికోపమునకు కాలిపోయి
బూడిదయ్యిరి సగరుని కొడుకులంత
శ్రీ పండిత నేమాని గురువరులకు నమస్కారములు
రిప్లయితొలగించండిమీ అమూల్య సవరణలకు ధన్యవాదములు
కపిలుడను ముని కోపాన కాలినట్టి
రిప్లయితొలగించండిసగరపుత్రుల ముక్తికై సాగినాడు
పేరు గాంచిన పట్టు భగీరధుండు
సార్ధకంబయ్యె పేరున సాగరంబు
ఈనాటి పద్యరచన శీర్షికకు చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిసుబ్బారావు గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
శైలజ గారికి,
రెండు చింతల రామకృష్ణ మూర్తి గారికి,
అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మిత్రుల పూరణలను, పద్యాలను సమీక్షించినందుకు ధన్యవాదాలు.
శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
మీరు వేసిన 1,2,4 పాదములలో ప్రాసయతులన్నియూ లక్షణమునకు విరుద్ధముగా నున్నవి. ప్రాస యతి నియమములను జాగ్రత్తగా అధ్యయనము చెయ్యండి. బూడిదయ్యిరి అను ప్రయోగము కూడా బాగు లేదు.
ముందువెనుకలఁ జూడక మూర్ఖతనము
రిప్లయితొలగించండితోడ వర్తిలు వారలు తొందరపడు
ఫలితమునుఁ గని యెల్లరు బాగుపడిన
సంతసమ్మదె తెలియుము జనులకెల్ల.