22, మే 2014, గురువారం

వేదమాత


వేదమాత

రచన :

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

నమామి వర్ణరూపిణీం

నమామి భావశోభితామ్ |

నమామి సత్ఫలప్రదాం

నమామి వేద మాతరమ్ ||



నమామి మంజుభాషిణీం

నమామి హంసవాహనామ్ |

నమామి భద్రకారిణీం

నమామి వేద మాతరమ్ ||



నమామి జాడ్యనాశినీం

నమామి హర్షవర్ధినీమ్ |

నమామి విశ్వవందితాం

నమామి వేద మాతరమ్ ||



నమామి వాక్సుధామయీం

నమామి వాగ్వివర్ధినీమ్ |

నమామి వాగ్వినోదినీం

నమామి వేద మాతరమ్ ||



నమామి విశ్వకారిణీం

నమామి విశ్వధారిణీమ్ |

నమామి విశ్వమాతరం

నమామి వేద మాతరమ్ ||

7 కామెంట్‌లు:

  1. పూజ్య గురువులకు ప్రణామములు
    వేదమాత పాదపద్మ ములకు శిరసాభి వందనములు
    ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ మిస్సన్న మహాశయా! శుభాశీస్సులు.
    మీరు వేదమాతపై చెప్పిన సీస పద్యము బాగుగ నున్నది. వాహిని శబ్దమునకు నది అనియు సేన అనియు అర్థములు గలవు. అందుచేత హంసవాహిని అనరాదు. హంసవాహన అనుటయే సాధువు. అలాగ సరిచేయండి.
    నా శ్లోకముల గురించి మీరు చేసిన స్పందనకు మీకు, శ్రీమతి రాజేశ్వరి గారికి మరియు శ్రీ కంది శంకరయ్య గారికి అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. ప్రణామములు గురువుగారు.. మీరు రచించిన వేదమాత స్తుతి అద్బుతంగా వుంది...

    రిప్లయితొలగించండి
  4. నేమాని పండితార్యా! ధన్యవాదములు.
    తప్పును సరిజేసినాను.


    ఋక్కుల నిలయమై ఋషుల కారాధ్యమౌ
    ......ఋగ్వేద భాషిణి ప్రీతి దలతు
    కర్మకాండల కెన్న కల్పవృక్షంబైన
    ......యజురాఖ్య రూపిణి నాదరింతు
    గానస్వరూపమై ఖట్వాంగి హృదయమౌ
    ......సామవేదాత్మికన్ సన్నుతింతు
    తంత్రరహస్యాల ధామమై విలసిల్లు
    ......ఘన యధర్వణమును వినుతిజేతు

    నాల్గు వేదాల రూపమై వెల్గు దేవి!
    పంచవర్ణాల వదనాల మించు తల్లి!
    హంస వాహన!భద్రద! అమరవినుత!
    వేదమాత! పరాత్పరీ! వేల నతులు

    రిప్లయితొలగించండి