6, మే 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1404 (వానపాముకాటు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వానపాముకాటు ప్రాణహరము.

17 కామెంట్‌లు:

 1. వ్యాళ మనగ గరము వాలమందున గాక
  తలను మెండు గాను తనరు చుండు
  విషము సాజ మనగ పీయూష మెటులుండు
  వాన పాము కాటు ప్రాణ హరము

  రిప్లయితొలగించండి
 2. పాము కాటు వలన ప్రాణ హాని యనుచు
  భయమునొందు నట్టి వారి కెపుడు
  గుండెలోన దడయు గూడ, నా భయపు భా
  వాన, పాము కాటు ప్రాణ హరము

  రిప్లయితొలగించండి
 3. కుట్టి విషము వదలి పుట్టలో దూరెడి
  పాము గోరునెపుడు పాల ధార
  సార మైన మట్టి సర్పమొకటి గోరు
  వాన; పాముకాటు ప్రాణహరము.

  రిప్లయితొలగించండి
 4. కాటు వేసి పిదప కన్నములో దూరు
  పాములెపుడు త్వరగ పరుగులిడును
  మట్టి తినెడి పాము మరి మరి కోరును
  వాన ; పాముకాటు ప్రాణహరము.

  రిప్లయితొలగించండి
 5. భూమి పెల్ల గించు బోర్ల, వే యదెపుడు
  వానపాము కాటు ప్రాణ హతము
  త్రాచు పాము కాటు తలిరు బోడి కనుము
  విషము కలుగు నోటి వెనుక వైపు

  రిప్లయితొలగించండి
 6. వాన పాము కాటు ప్రాణహరముకాదు
  హాని చేయ లేదు వాన పాము
  పైరు పంటలనివి సారవంతముజేసి
  చాల మేలు జేయు సస్యమునకు

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
  నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.
  ============*==========
  వీదులందు దొరకు వింత వంటకములు
  పొట్ట నిండుగ దిని పొరలు నట్టి
  నడువ లేని నేటి నరలోక వాసికి
  వాన పాము కాటు ప్రాణ హరము!

  రిప్లయితొలగించండి
 8. పడగనెత్తి లోన ఫణియాడుచుండును
  ముఖము విరిచి దిగుచు మూలదాగి
  ప్రజ్ఞ పైన బోక ప్రతినిద్రలో పరు-
  పాన, పాము కాటు ప్రాణ హరము

  రిప్లయితొలగించండి
 9. వాన పాముకాటు ప్రాణహరముకాదు
  మట్టి పాము మనల కుట్ట దెపుడు
  కాల నాగు పాము కాటేయ బ్రతకరు
  కొన్ని యగము లందు సున్న విషము.

  రిప్లయితొలగించండి
 10. రాజేశ్వరి అక్కయ్యా,
  పద్యం బాగుంది. అభినందనలు.
  కాని వానపాము అసలు కాటు వేయదు కదా|
  మొదటిపాదంలో చిన్న సవరణ.... ‘వ్యాళ మన గరళము వాలమందున గాక...’
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలు (ముఖ్యంగా రెండవ పూరణ) బాగున్నవి. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు (?) పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  హరము టైపాటువల్ల హతము అయినట్టుంది.
  *
  శైలజ గారూ,
  మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  కందుల వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  ಚಂದ್ರಮೌಳಿ ಗಾರೂ,
  ಬಹುಕಾಲ ದರ್ಶನಂ. ಸಂತೋಷಂ!
  ಮೀ ಪೂರಣ ಬಾಗುಂದಿ. ಅಭಿನಂದನಲು.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శ౦కరయ్య గారికి వందనములు
  పంట లొసగ మనకు వరుణు డేమిచ్చును?
  చావ శృంగి యేమి శాపమిడె ప
  రీక్షితునకు?తెలుప రే ఛాత్ర వరులార
  వాన ,పాముకాటు ప్రాణ హరము
  2.చవిటినేల యౌను సారవంతముగను
  వసుధ పొరల దూర వానపాము
  కాటు ప్రాణ హరము గాబోవ దేనాడు
  తెలిసి కొనుము నీవు తెలుగు బిడ్డ

  రిప్లయితొలగించండి
 12. నాగ చవితి యనుచు నాతి నీవా పాల
  బుట్ట లోన బోసి మ్రొక్కు లిడగ
  పాల త్రాగ బోవు పాము లన్నను విన-
  వాన పాము కాటు ప్రాణ హరము

  రిప్లయితొలగించండి

 13. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శ౦కరయ్య గారికి వందనములు
  మల్లెలసోమనాధ శాస్త్రిగారి పూరణలు
  1.కనగ లోకమందు పంట కలుగువాన కుర్వగా
  ఘనపువాన యదియె కురియ కాలమందు మేలునౌ
  చెనకు నది,యకాలమందు చెరచు పంట నె౦త యో
  కన,నకాల వాన ,పాముకాటు ప్రాణ హరములౌ
  2.నదిమి వేసవ౦దు నడతెంచు మట్టిదౌ
  వాన,పాముకాటు,ప్రాణహరము
  వరపు వాన యైన పైరున కురవగా
  వాన యమృత మగును పంట పండ

  రిప్లయితొలగించండి
 14. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శ౦కరయ్య గారికి వందనములు
  పి.మాధవ శర్మ గారి పూరణ [పిఠాపురం]
  పంట భూములందు ఫలమును జేకూర్చు
  రైతు బాంధవు౦డు,రక్ష ఎవరు?
  నాగజాతి గరవ నరులకునేమౌను ?
  వానపాము,కాటు ప్రాణ హరము

  రిప్లయితొలగించండి
 15. గురువులకు నమస్కారములు
  అవును కదా ! పాము అనగానే రకరకాల పాములు గుర్తు కొచ్చాయి గానీ , పంటకు ఎరువైన వాన పాము అస్సలు గుర్తుకు రాలేదు .ఎంత హాస్యాస్పదం ? పోనీ లెండి అందరు హాయి గా నవ్వుకుంటారు ఆరోగ్యానికి మంచిది ఇక్కడ చైనా వారు వానపాముల్ని తింటారంటారు ఎంత నిజమొ తెలియదు

  రిప్లయితొలగించండి
 16. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మన్నించండి. నేను అందరి పూరణలను సమీక్షించానని పొరబడి మళ్ళీ ఆ పోస్ట్ చూడలేదు. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  ‘వినవు + ఆన’ అని పదవిభాగమా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  ‘అకాలవాన’ దుష్టసమాసం కదా! ‘కనగ నట్టి వాన...’ అందామా? ముందే అన్నారు కదా ‘అకాలమందు చెరచు పంట’ అని.
  *
  పి. మాధవశర్మ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి