25, మే 2014, ఆదివారం

పద్య రచన – 570

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

 1. పండ్లును కూరలు నారల
  నిండ్లను గట్టెడు విధంబు నివ్విధి గంటిన్
  కండ్లకు విందుగ నాయెను
  పండ్లతొ కొరకంగ బోక పరికించుడయా !

  రిప్లయితొలగించండి
 2. పెండ్లి మండపమయ్యది పండ్ల తోడ
  కాయ లాకులు రెమ్మలు కలిపి వారు
  చురుకు గా నలం కరణపు సొంపు జూడ
  బళిర యనిపించు నిజమది భామ !చూడు

  రిప్లయితొలగించండి
 3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పండ్లతొ’ అన్నచోట ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. అక్కడ ‘పండ్లకు కొరకంగరావు..’ అనండి.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. లోకంబున నత్వ గుణము
  శాకంబుల దినిన గల్గు సత్యము దిలుపన్
  మీకందరకున్, గృహమా
  శాకంబుల దీరె నేమొ? సన్మతి గనుమా!

  రిప్లయితొలగించండి
 5. విందు వినోదము లకుప
  సందుగ వండితిన గోరు శాకము లెన్నో
  తొందర బడికొన కున్నను
  అందదు గదమంచి ఫలము నానం దించన్

  రిప్లయితొలగించండి
 6. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

  సుగంధి వృత్తం:
  నేటి కాలమందు కోట్లనింపుగాగ పూలు,తా
  వాటమైన పండ్లు,కూర,బాగుగా నమర్చియున్
  మేటి రేట్లకమ్ముచుంద్రు,మేలునంచు లోకులున్
  లోటులున్న వాటికొంచు,లోభమందు మున్గరే

  రిప్లయితొలగించండి
 7. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. కవిమిత్రులకు మనవి..
  రేపటినుండి నాలుగైదు రోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. సమస్యలను మాత్రం షెడ్యూల్ చేస్తున్నాను. ఈ నాలుగైదు రోజులు నేనెక్కడ ఉంటానో నాకే తెలియని పరిస్థితి.. అవకాశముంటే పూరణలపై స్పందిస్తాను. స్తిమితపడ్డాక మళ్ళీ మీ పద్యాలపై స్పందిస్తాను. అప్పటివరకు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 10. కూరగాయలుకొనుటయె జోరు తగ్గె
  కర్రిపాయింట్ల కేగుట వెర్రియాయె
  చూచుటకు నైన,కూరలు సొంపు నమరె
  ధరలు చూడంగనింగిని వరలుచుండె

  రిప్లయితొలగించండి
 11. మాస్టరుగారూ ! చక్కని సవరణ చూపిన మీకు ధన్యవాదములు..
  ఇలా మార్చితే...


  పండ్లును కూరలు నారల
  నిండ్లను గట్టెడు విధంబు నివ్విధి గంటిన్
  కండ్లకు విందుగ నాయెను
  పండ్లన్ కొరుకంగ బోక పరికించుడయా !

  రిప్లయితొలగించండి