4, మే 2014, ఆదివారం

పద్య రచన – 586 (కుకవి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“కుకవి”

10 కామెంట్‌లు:

  1. రామా యణభార తములు
    ప్రామా ణికగ్రంధ ములవి పౌరాణికమున్
    సామాన్య మైన కుకవులు
    నేమార్చ గవ్రాసి రంట నిగరపు రచనల్

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. అంగడిన బెట్టి వాణిని నమ్మనన్న
    సుకవులును పుట్టినట్టి వసుధననేడు
    ధనముకోసమై కలవారి దాసులైన
    కుకవులు జనన మొందిరి కొల్లలుగను

    రిప్లయితొలగించండి
  4. పుట్ట గొడుగుల వలెనను బుట్టుదు రట
    కుకవు లెందరో పుడమిని కోరి వారు
    తప్పు భావాలు బోధింతు రిప్పుడమి జ
    నులకు ,నమ్మ వలదు వారి నోటి మాట

    రిప్లయితొలగించండి
  5. చెల్లని కవులెందరొ కో
    కొల్లలుగను వెలసినారు కుంభిని లోనన్
    చెల్లెడి కవులే స్థిరముగ
    నుల్లంబున నిలచియుందు రుండరు కుకవుల్

    రిప్లయితొలగించండి

  6. నిన్నటి తలిరాకు కవి
    నేటి చిగురాకు కవి
    రేపటి కారాకు కవి
    వెరసి తెలిమ్రాకు కవి !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. కుకవులని విడిచి పెట్టక
    సుకవులుగా దీర్చి దిద్దు సుస్వాంతుండే
    సుకృతియగు శంకరార్యుం
    డకలుష మతి గూర్తు వాని కాశీస్సుమముల్

    రిప్లయితొలగించండి
  8. సుందర సాహిత్య సభను
    చిందర వందరగజేసి చేటును దెచ్చున్
    నిందారోపణ జేయుచు
    కొందరు కుకవులుగనుండె కుహ్వరి లోనన్

    రిప్లయితొలగించండి
  9. జన బాహుల్యపు సేమము
    తన సాహిత్య పరమార్థతనుచున్ సుకవుల్
    దనరగ, కుకవుల్ భ్రమలన్
    జనులకు గలిగించు రీతి సాగెదరిలలో!

    రిప్లయితొలగించండి
  10. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    _/\_
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి