9, మే 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1407 (పావకకీలికలు చల్లబడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పావకకీలికలు చల్లబడె నాజ్యముతోన్.

33 కామెంట్‌లు:

  1. శ్రీవరుడని గుర్తించెను
    కావించెను స్తోత్రములను కాకుత్స్థునికిన్
    వేవే భార్గవ రాముడు
    పావక కీలికలు చల్లబడె నాజ్యముతోన్

    రిప్లయితొలగించండి
  2. జేవడి పరుషపు మాటలు
    పావని సీతకు నగ్ని పరిశో ధనమున్
    న్నవనిని యశమును గూర్చగ
    పావక కీలికలు చల్లబడె నాజ్యము తోన్

    జేవడి - చాకలి

    రిప్లయితొలగించండి
  3. ఆ వనజాక్షిని సీతను
    పావని యని రుజువు చేయ భర్తయె గోరన్
    పావని పావకుని బొగడ
    పావకకీలికలు చల్లబడె నాజ్యముతోన్.

    పావని = పవిత్రురాలు
    పావని = హనుమంతుడు

    రిప్లయితొలగించండి
  4. మల్లెల సోమనాధ శాస్త్రి గారి మరొక పూరణ

    పావన యాగము చేయగ
    పోవును పాపాలవియును పుణ్యము కలుగున్
    త్రోవయు నిదియగు. ఆశా
    పావక కీలికలు చల్లబడె నాజ్యముతోన్

    రిప్లయితొలగించండి
  5. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

    మావిడి, కారము, ఉప్పును,
    ఆవయు, నూనెయు, కలిపిన నగుగదరుచియౌ
    చేవగు పచ్చడి. ఆవను
    పావక కీలికలు చల్లబడె నాజ్యముతోన్

    రిప్లయితొలగించండి
  6. ఏవముగల్గెడు తాంత్రిక
    భావముచే భోగకాంక్షపాయగవిరతిన్
    చావగ పంచ మకారము
    పావకకీలికలు చల్లబడె నాజ్యముతోన్.

    రిప్లయితొలగించండి
  7. రావణుని లంక నందున
    పావని సీతకు పరీక్ష ప్రతిపాదించన్
    పావకుని జేరె జానకి
    పావక కీలికలు చల్లబడె నాజ్యముతోన్

    రిప్లయితొలగించండి
  8. పావన జలములు గ్రోలగ
    పావక కీలికలు చల్లబడె, నాజ్యముతోన్
    చావుకు దగ్గర మార్గము
    చేకుఱు నిజముగ జనులకు చేటును కనుడీ

    రిప్లయితొలగించండి
  9. పావన జలములు వోయగ
    పావన కీ లికలు చల్ల బడె నాజ్యముతో
    న్నావహ కీలిక లెగసెను
    లావుగ మఱి మింటి వరకు లైలా !కనుమీ

    రిప్లయితొలగించండి
  10. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్యకు మంచి పూరణలు వచ్చినవి. అందరికి అభినందనలు.
    కొన్ని సూచనలు:

    శ్రీమతి రాజేశ్వరి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. 2వ పాదములో గణములు సరిగా లేవు.
    3వ పాదములో ప్రాస నియమము పాటింపబడ లేదు.


    స్రీ అనపరెడ్డి సత్యనారయణ రెడ్డి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది.
    4వ పాదములో ప్రాసను మరిచేరు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణలకు సలహాలకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  12. పావన క్రతు సమయంబున
    పావక కీలికలు చల్లబడె, నాజ్యముతోన్,
    దేవుని దయతో మరలను
    జీవించియు మండి యగ్ని జయమును గూర్చెన్.

    రిప్లయితొలగించండి
  13. సేవించ మంచి నీటిని
    పావక కీలికలు చల్లబడె, నాజ్యముతోన్
    చావుకు దగ్గర మార్గము
    సేవించ నధికముగాను చేటును గనుడీ

    రిప్లయితొలగించండి
  14. ఆ విందులోన నొక భూ
    దేవుఁడు భక్ష్యములఁ బ్రీతిఁ దిను నా వేళన్
    భావింపఁగ జఠర మహా
    పావకకీలికలు చల్లబడె నాజ్యముతోన్ !

    రిప్లయితొలగించండి
  15. గురువులకు ప్రణామములు
    పొరబాట్లు తెలిపి నందులకు గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  16. చేవను జూపెడు ధారల
    పావకకీలికలు చల్లబడె; నాజ్యముతోన్
    జీవుల యుదరంబు నిలచు
    పావక కీలికలురెచ్చిపడె సాజముగా!

    రిప్లయితొలగించండి
  17. జీవించియు మండె యగ్ని జేజే లనగన్
    నాల్గవ పాదమును ఈ విధంగా సవరించాను

    రిప్లయితొలగించండి
  18. నివురున కప్పుకొనంగా
    పావక కీలికలు చల్లబడె, నాజ్యముతో
    న్నావహ్ని మిత్రముతో, మర
    ల వెలిగినట్టులనె మాయ లవించు నెరుకన్

    రిప్లయితొలగించండి
  19. 4 వ గణము జ వచ్చినది. సరి చూస్తాను.

    రిప్లయితొలగించండి
  20. మొన్నటి సమస్యకు నా పూరణ...


    కొడుకే వైద్యుడు, తల్లికి
    మిడిమేలపు కడుపునొప్పి మిక్కుట మవగా
    పొడిమందునీయ చక్కని
    కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్.

    రిప్లయితొలగించండి
  21. మిత్రులారా! శుభాశీస్సులు.
    అందరి పద్యములు చాలా బగుగ నున్నవి. అందరికి అభినందనలు.
    కొన్ని సూచనలు:

    శ్రీమతి సుమలత గారు:
    మీరు ప్రాస నియమమును పాటించుట లేదు. ప్రాస గురించి అధ్యయనము చేయండి. పద్యములో ప్రతిపాదములో 2వ అక్షరము ప్రాస అక్షరము. దాని ముందరి అక్షరము కూడా నిబంధనల ప్రకారమే ఉండాలి. పాదములో మొదటి అక్షరము హ్రస్వము అయితే అన్ని పాదములలో మొదటి అక్షరము హ్రస్వమే ఉండాలి.
    మీ పద్యము 3వ పాదములో గణములు సరిగా లేవు. అలాగే 4వ పాదములో 7వ గణము జగణము ఉండకూడదు - మీరు జగణమును వేసేరు. సరిజేయండి.

    రిప్లయితొలగించండి
  22. ఆవను పప్పున గలుపుచు
    జావగ నేనేయిగలిపి చక్కగ తినగా
    బావా ! నాయీ కడుపున
    పావక కీలికలు చల్లబడె నాజ్యముతోన్.

    రిప్లయితొలగించండి
  23. మావి వలె నివురు కప్పగ
    పావక కీలికలు చల్లబడె, నాజ్యముతో
    న్నావహ్నిమిత్రమమరగ
    కావిగొని వెలుంగు రీతి గనుమా గరిమా!

    ధన్యవాదములు గురువు గారు. సమయము ఎక్కువ వుండదని, అధ్యయనము సేయకనె, ఆలోచించకనె రాస్తాను. మీ సలహాలు ఎంతో ఉపయోగము. కొంత అలసత్వము కూడ కూడెనేమొ. సవరించుకుంటాను.


    రిప్లయితొలగించండి
  24. కవిమిత్రులకు నమస్కృతులు.
    మొన్న మా అమ్మాయికి ఆపరేషన్ జరిగింది. కూతురు పుట్టింది. తల్లీబిడ్డలు బాగున్నారు. ఈ రెండు రోజులు నేను హైదరాబాదులో ఆసుపత్రిలో ఉండడం వలన బ్లాగును చూసే అవకాశం లభించలేదు.
    సమస్యను చక్కగా పూరించిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    నాగరాజు రవీందర్ గారికి,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
    చంద్రమౌళి గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    సుబ్బారావు గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    డా. విష్ణునందన్ గారికి,
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి,
    మాజేటి సుమలత గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    అనారోగ్యంతో బాధపడుతూ కూడా మిత్రుల పూరణల గుణదోష సమీక్ష చేసిన గురువర్యులు పండిత నేమాని వారికి కృతజ్ఞతలు. వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  25. ఈ వేసవితో విసిగియు
    నావేదనతోడ వరుణ యాగము సలుపన్
    ప్రోవుకొనెను మేఘమ్ములు
    పావక కీలికలు చల్లబడె నాజ్యముతోన్.

    రిప్లయితొలగించండి
  26. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. కెంబాయి తిమ్మాజీ రావు గారి పూరణ....

    భూవరు శత హవనమ్ముల
    పావక కీలికలు చల్లబడె నాజ్యముతోన్
    దావాగ్ని ఖాండవమ్మును
    సేవింప నజీర్తి తొలగె సృగ్జిహ్వునకున్

    రిప్లయితొలగించండి
  28. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. గురువు గారు,
    చాల సంతోషము. శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. భావనలద్భుతముగ కవి
    తావనమందున విరియుచు తనివిని యొసగెన్.
    హా! విధి! నెయ్యెడ నివ్విధి
    పావకకీలికలు చల్లబడె నాజ్యముతోన్?

    రిప్లయితొలగించండి
  31. ఆవపొడి మిరప పొడులను
    నూవుల నూనెన కలుపుచు నోరూరంగన్
    మావిడి ముక్కలు తిన, క్షు
    త్పావకకీలికలు చల్లబడె నాజ్యముతోన్

    రిప్లయితొలగించండి
  32. శ్రావణ మందున తినగా
    బావయు నక్కయు నొసగిన బంగరు గుంటూర్
    చేవగు నావపు కాయల
    పావకకీలికలు చల్లబడె నాజ్యముతోన్

    రిప్లయితొలగించండి