15, మే 2014, గురువారం

పద్య రచన – 561 (దధీచి)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. దేవకార్యమ్ము కొరకు దధీచి మౌని
    త్యాగ మొనరింప తనువు నాతని యెముకల
    దీసి వజ్రాయుధము జేసి తీవ్ర సంగ
    రమున వృత్రాసురుని గూల్చె నమరనేత

    రిప్లయితొలగించండి
  2. దేవ దానవు లనిలోన దేవతలకు
    యోటమి భయము గల్గగ నొయ్యన చని
    బ్రహ్మ కడకు తెల్పగ వారి భయము నెల్ల
    నంపెను దధీచి సంయమి నాశ్రయించ
    దేవతల కోర్కె నెఱిగి తా దివ్య ధృష్టి
    దేహమును వీడె విధి కోర్కె దీర్చ మౌని
    వజ్రమును జేసి యెమ్ముతో వాసి గాను
    రక్కసుల జంపె గోపతి రయము గాను
    దుష్ట వృత్రాసురునిహరి తున్మె నపుడు

    రిప్లయితొలగించండి
  3. తనువును మునులకు ముదమున
    మునియౌ మఱి యా దధీచి మునులకు నీ యన్
    నెనరుగ నెముకల తోడను
    ననువుగ వజ్ర్రా యుధంబు నమర్చి రి మునుల్

    రిప్లయితొలగించండి
  4. సురలున్ దధీచిఁ గోరగ
    వెరయక వజ్రాయుధమగు వెన్నునొసంగెన్
    సురపతి యసురున్ గూల్చగ
    పరోపకారార్థము విడె ష్రాణము మునియే!

    రిప్లయితొలగించండి
  5. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాటి పద్యములు అన్నియును బాగుగ నున్నవి.
    అందరికి అభినందనలు.
    కొన్ని సూచనలు:

    శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    మొదటి పాదములో అన్వయము కొంచెము ఇబ్బందిగా నున్నది. దేవ దానవ సమరాన అంటే కొంచెము మెరుగు.
    2వ పాదము మొదటలో యడాగమమునకు బదులుగా నుగాగమమును జేయండి.

    శ్రీ సుబ్బా రావు గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    ఆఖరి పాదము చివరిలో గణభంగమును సరిజేయండి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణలకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  7. ఘన దధీచి కీర్తి గంభీరమూర్తిగా
    తనదు వెన్నెముకను దానమిచ్చె
    భావి మారెనదియె వజ్రాయుధమ్ముగా
    శత్రువులను దునుమ శాశ్వతముగ

    రిప్లయితొలగించండి
  8. లోకహితవు కొఱకు లోహసమమయిన
    చిత్తవృత్తి తోడ చేతులార
    తనదు మేనిలోని యస్థులనొసగగ
    దైత్యుదునిమె సురుల దండు నేత.

    రిప్లయితొలగించండి