సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘మురియుచున్న/ పిల్లలను...’ అనండి. * శైలజ గారూ, మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు. చివరి పాదంలో ఒక అక్షరం లోపించి గణభంగం. ‘వరమౌను’ అంటే సరి. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మంచి భావంతో పద్యాన్ని చెప్పారు. అభినందనలు. అభినందనలు. మీ పద్యంలో స్వల్పసవరణలు...... ఆట లనినచో పిల్లల కధిక ప్రేమ మట్టి యాటలో తల్లినే మరఛి యుంద్రు పిల్లలను బడికి బలిమిఁ దల్లి ,దండ్రి పంపుటకు సిద్ధ పడుదురు పాడియౌన? * లక్ష్మీదేవి గారూ, చక్కని పద్యాన్ని పరుగెత్తించారు. బాగుంది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘పిల్లలు + ఇసుకపై’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘పిల్లలా యిసుకపై’ అనండి. * పండిత నేమాని వారూ, అద్భుతమైన పద్యాన్ని అందించారు. అభినందనలు, ధన్యవాదాలు. * మిస్సన్న గారూ, బాల్యపు మాధుర్యాన్ని వర్ణించిన మీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘చే’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘చేష్టలను’ అని తృతీయార్థంలో ద్వితీయను వాడవచ్చు.
పసిడి మొగ్గల యాటలు బహు విధమ్ము
రిప్లయితొలగించండిచేతి క్రిందను దాచితి చెప్పు కొనుము
నెండ గొలిచితి చూడంచు పండు బాబు
వెలుగు నీడల కొలతలు నేల పైన
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘బహువిధములు’ అంటే బాగుంటుందేమో?
ఆట లాడుచు నుండిరి యచట చూడు
రిప్లయితొలగించండిచిన్న పిల్లలు చక్కగ చెన్ను మీ ర
ముద్దు లొలికించు మోముతో మురియు చుండె
పిల్ల లనగను నిట్లుండ నుల్ల మలరు
కల్ల లెరుగని పిల్లలు పుల్లలాట
రిప్లయితొలగించండిలాడుచుండిరి యిసుకలో వేడుకగను
మరచి పోయిన యాటల చేరె నిదియె
పసితనమ్మొక వరమౌ బాలలకును
ఆట లంటెనే పిల్లల కధిక ప్రేమ
రిప్లయితొలగించండిమట్టి యాటంటె తల్లినే మరఛి పోయె
పిల్లలను బడ్కి బలిమిన తల్లి ,దండ్రి
పంపుటకు సిద్ధ పడుదురు పాడియేన?
కల్ల కపటమెఱుగరోయి కలలు గాంచు చుందురీ
రిప్లయితొలగించండిపిల్లవాండ్ర భవిత తీర్చి ప్రేమ మీర పెంచుమా!
మెల్ల మెల్ల మంచి చెడుల మేళవింపటంచు తా
మెల్ల సంగతులను తెలియ నేమి చేయనేర్తురో?
చిన్న పిల్లలు యిసుకపై చేరినారు
రిప్లయితొలగించండిపిచుకగూడులు గట్టుచు నిసుకలోన
నాట లాడుచు నుండిరి యర్థి తోడ
చిఱుత గురుతు కొచ్చి మనసు చెంగలించె
మురియుచు నున్నవా రిసుక ప్రోవులు చేయుచు నాటలాడుచున్
రిప్లయితొలగించండిసరస విలాస చిత్తులయి చక్కని బాలురు బాలికల్ బళా!
చిరు చిరు మొగ్గలయ్యు నతిచిత్రముగా వెలుగొందుచుండిర
బ్బురము గదయ్య! వారికివె పొల్పుగ గూర్తు శుభాశిషమ్ములన్
ముచ్చట గొల్పు నిచ్చటను ముద్దుల మూటల గట్టుచుండి యీ
రిప్లయితొలగించండిపిచ్చుక గూళ్ళు కట్టుకొను పిల్లల జూచిన, పాల బుగ్గలన్
గిచ్చిన పాలు గారు, పరికించిన గానవు చీకు చింతలున్,
నచ్చిన రీతి హాయిగను నవ్వుచు సాగును బాల్య మేరికిన్.
కల్లాకపటమెఱుంగని
రిప్లయితొలగించండిపిల్లలఁ జూడంగఁ గలుగు ప్రేమాతిశయం
బెల్లెడల ముదమునొందుచు
నల్లరి చేష్టలచె మనలనలరింతురుగా.
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మురియుచున్న/ పిల్లలను...’ అనండి.
*
శైలజ గారూ,
మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
చివరి పాదంలో ఒక అక్షరం లోపించి గణభంగం. ‘వరమౌను’ అంటే సరి.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మంచి భావంతో పద్యాన్ని చెప్పారు. అభినందనలు. అభినందనలు.
మీ పద్యంలో స్వల్పసవరణలు......
ఆట లనినచో పిల్లల కధిక ప్రేమ
మట్టి యాటలో తల్లినే మరఛి యుంద్రు
పిల్లలను బడికి బలిమిఁ దల్లి ,దండ్రి
పంపుటకు సిద్ధ పడుదురు పాడియౌన?
*
లక్ష్మీదేవి గారూ,
చక్కని పద్యాన్ని పరుగెత్తించారు. బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘పిల్లలు + ఇసుకపై’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘పిల్లలా యిసుకపై’ అనండి.
*
పండిత నేమాని వారూ,
అద్భుతమైన పద్యాన్ని అందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
బాల్యపు మాధుర్యాన్ని వర్ణించిన మీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘చే’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘చేష్టలను’ అని తృతీయార్థంలో ద్వితీయను వాడవచ్చు.
శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
రిప్లయితొలగించండిపద్య సవరణకు ధన్యవాదములు
పిల్ల పాపలు యిసుకలో వేడుకగను
రిప్లయితొలగించండిపిచుక గూళ్ళను గట్టెడు విధము తోనె
వారి సృజనాత్మకత వెల్గు భూరి గాను
ఆట పాటలే పెంచును పాటవమ్ము